Monday, September 21, 2015

నా సరిత కధ

రేడియోలో యధావిధిగా జనరంజని. అమ్మ వంటచేస్తుంది. నాన్న బాయిలర్  పొగకు దగ్గుతూ వేన్నీళ్ళకు పుల్లలేస్తున్నారు. చదువురాని మా బామ్మ న్యూస్ పాపర్ను కళ్ళ కద్దుకోని మా తాతయ్య గారికి చదవటానికి సిధ్ధం చేస్తుంది. మా తాత గారు సెకండ్ ఫ్లోర్ ఎత్తునుండి కాఫీ గొంతులో పోసుకుంటున్నారు. చెల్లి చదువుకుంటుంది. నేను, పుస్తకం వెనకాల కుక్కకరిస్తే ప్రధమ చికిత్స ఏం చెయ్యాలో రాసుంటే ఆ బొమ్మాలూ గట్రా చూస్తున్నా.  

ఇంతలో మా నాన్నగారు తగలెట్టాల్సినవన్నీ తగలెట్టేసి చేతులు కడుక్కుంటుండంగా, మా చెల్లి పరిగెత్తుకెళ్ళి కాళ్ళకు నీళ్ళందించి, తర్వాత కాఫీ అందించి, వినమ్రతతో నమస్కరిస్తూ అన్నయ్యనైన నన్ను చూస్తూ అందరికీ చూపిస్తూ మా తాతగారు చూసేవరకు రెండు నిమిషాలు ఆగి, నాన్నగారు 
సిరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్ - ఆంటే ఏంటండీ అని అడిగింది. 

నేను వెంటనే మా నాన్నగారేంచెప్తారా అని పుస్తకం పెన్నూ తీసుకుని రాసుకోటాని సిధ్ధంగా ఉన్నా. మా అమ్మ వంటాపేసి మా నాన్న మా నాన్నగారు ఏం చెప్తారా అని చూస్తుంది. మా తాత గారు కూడ అమేజాన్ కాఫీ ఫాల్స్ ఆపేసి మా నాన్న వంక చూశారు, అలాగే మా బామ్మ, సందులో వాళ్ళు, విజయవాడ వాళ్ళు, అటుగా వెళుతున్న గహ్రాంతర వాసులు వాళ్ళ వాళ్ళ పనులాపేసి మానాన్న ఏంచెప్తారా అని ఆశక్తి గా చూస్తున్నారు. 

మా నాన్న ఒకరకమైన కాన్ఫిడెన్స్ తో నవ్వుతూ...మా చెల్లితో కొబ్బరికాయలో నీళ్ళెలావాస్తాయ్ చెప్పు ? అనడిగారు
మా చెల్లి  : అవును నాన్నగారండోయ్ ఎలా వస్తాయి ?
నాన్న : కదా, అదే మరి కొబ్బరి కాయలో నీళ్ళెలావస్తాయో ఎక్కడనుండి వస్తాయో ఎవ్వరికీ తెలుయదు. అలానే జీవితంలో డబ్బుకూడా కొబ్బరికాయలో నీరు మాదిరి వస్తుంది అలానే పోతుంది. డబ్బేకాదు అది ఏదన్నా సరే మనం దేనినన్నా బలంగా కోరుకుంటే ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అదే వచ్చేస్తుంది. అలా కోరుకోవటాన్నే 'సంకల్పం' అంటారు. అన్ని బలాలకన్నా సంకల్ప బలం చాల గొప్పది - అని స్పీచ్ అయిన CMలా శ్రోతలందరిని ఒకసారి చూశారు. అందరూ ఉత్తేజితులై ఆనందంతో ఐదు నిమిషాలు చపట్లు కొట్టారు.
----------------------- 
ప్రతి మనిషి బాల్యం లో ఒక దశ ఉంటుంది. మొదటి సారి సినిమా చూసినప్పుడు, మొదట్లో సినిమాలు చూస్తున్నప్పుడు అదంతా నిజం అని నమ్మే ఆ దశ. నా ఆ దశను  మా జనకులు హనుమంతం గారు ఏలా హాండిల్ చేశారో అన్నదే ఈ రోజు ఈ కధ.
---------------------
నేను పెరిగిన వాతావరణానికి ఐదో తరగతి వరకు అసలు సినిమానే చూడలేదు. చూడాలన్న కోరిక కూడా ఏరోజూ కలగలేదు. ఏదో అప్పుడప్పుడు  సాయంత్రం ఏడింటికి టై కట్టుకునే అంకుల్ మా టివి లో కొచ్చి వార్తలు చదివేవారు. ఆయన్ని చూడటానికి కూడా రెండిబ్బందులుండేవి 
1) మా బామ్మ సారెలో తెచ్చిన గడియారం సరిగా టైం చూపించాలి.
2) మా ముత్తాత గారికి కోపం రాకూడదు ( మా ముత్తాత గారు చనిపోయి కాకయ్యారని, కోపం వచ్చినప్పుడల్లా కొట్టడానికి మా యాంటీనా కర్ర లాగుతారని మా తాతగారు చెప్తుండేవారు. ) 
పొద్దున్నే స్కూలు, సాయత్రం శ్రీకాంత్ వాళ్ళింటికెళ్ళి వైకుంఠపాళో, వామనగుంటో ఆడుకుంటూ ఉండేవాడిని.

అలా రోజులు గడుస్తున్నా రోజుల్లో ఆ రోజు శివరాత్రి వచ్చింది. జాగరనకు మా ఇంటిదగ్గర నాలుగు కుటుంబాల వాళ్ళు మూకుమ్మడిగా చందాలేసుకుని  VCR తెచ్చారు. మా ఇంట్లో సినిమా వేసేందుకు కమిటీ నిర్ణయించింది. మా ఇంట్లో వాళ్ళు, బంధువర్గం, పేటలో ని వాళ్ళు అందరూ వచ్చేసరికి సుమారుగా ఒక వంద మందికి పైగా అయ్యారు.  పుష్కరాల్లో నిర్వహణాధికారి 'పచ్చచొక్కా అటువెళ్ళాకూడదు. అది లోతట్టు ప్రాంతం, ఈ రోజు నది పోటు మీదున్నది. అందరూ జాగ్రత్తగా ఉంటూ కోపరేట్ చెయ్యాలి' - అని మైకు పట్టుకుని అరుస్తున్నట్టు  మా నాన్నగారు సినిమా చూట్టానికి వచ్చిన వాళ్ళందరినీ అరుస్తూ హడావిడి చేస్తూ ఆర్గనైజ్ చేస్తున్నారు.  ఇల్లు మాదే అయ్యేటప్పటికి నాదే ముందు సీటు. నెమ్మిదిగా సినిమా మొదలైంది. ఆ సినిమా పేరు 'అంతులేని కధ'. నేను చూసిన మొదటి సినిమా. అది సినిమా కాదు నిజమైన నిజం అన్న భ్రమ లో తీక్షణంగా చూస్తున్నా. ఒకమ్మాయి ఇంటి భారం అంతా తనపైన వేసుకుని ఏన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది. తన పేరు 'సరిత'.  ఆ పేరు వినగానే  నాలో తెలియని వైబ్రేషన్స్ మొదలయ్యాయి. అసలు సరిగా గమనిస్తే సరిత అన్న పేరు లోనే మత్తుంది, ష్టైలుంది, వైబ్రేషన్స్ ఉన్నాయని నాకప్పుడే తెలిసిపోయింది. ఎన్నో ఎన్నెన్నో కష్టాలు తనకు. పనికి మాలిన అన్న. పనికి రాని నాన్న. తనకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. సినిమా చూస్తున్నంత వరకు నన్ను నేను మరచిపోయి తన కోసం నేను ఏడవటం మొదలపెట్టాను. ఒక్కొక్కరు నెమ్మిదిగా నిద్రలోకి జారుకున్నారు. నేను మాత్రం అదే ధ్యాసగా రెప్పార్పకుండా చూశా. ప్రతి సీను ప్రతి ఫ్రేము అమాంతం బుర్రలోకెలిపోతున్నాయి. సరిత గురించి తెలిసేకొద్దీ తెలుసుకోవాలనిపించింది.  చివరకు కమల్ హాసన్ తనను పెళ్ళి చేసుకుంటాడు అని తెలిసి ఆనందపడ్డా.  కానీ ఆ రాస్కేల్ కమల్ హాసన్ సరిత గురించి ఆలోచించకుండా సరిత చెల్లి సుమతిని చేసుకోవటం చూసి తట్టుకోలేక పోయా. సినిమా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు కానీ సరిత మాత్రం నన్నొదిలివెళ్ళిపోలేదు. రాత్రంతా అసలు సరిత ఎలా బతుకుతుంది. కమల్ హాసల్ ఎందుకు అలా చేశాడు అని రాత్రంతా తన కోసం వెక్కి వెక్కి ఏడిచా. తెల్లారి ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా శ్రీకాంత్ వాళ్ళింటికెళ్ళా.

శ్రీకాంత్ తెలివైనవాడు సమర్ధుడు లోకజ్ఞానం కలవాడు. ఒక సారి మా క్లాస్ కి లిల్లీ టీచర్ వచ్చి 'మీ క్లాస్ ఫస్ట్ ఎవరు ?' - అని అడిగితే. వాడు వెంటనే మా క్లాస్ ఫస్ట్ జొన్నలగడ్డ జ్యోతి కానీ, తెలివిగలవాడు మాత్రం అశ్విన్ అని సభాముఖంగా చెప్పి నా మనసు చూరగొన్నాడు.

లెక్కల H.W మధ్యలో జరిగిందంతా శ్రీకాంత్ కు చెప్పా. అంతా తీరిగ్గా విని, 
రేయ్ ఈ రోజు నుండి నువ్వు నా స్నేహితుడవని ఎవ్వరికీ చెప్పకు. ఈ రోజు నుండి నా పక్కన కోర్చోకు అన్నాడు. నేను నీకు 'ఠీ' కొట్తేస్తున్నా.
నేను : ఏమైంద్రా ?  'ఠీ' ఎందుకుకొడుతున్నావ్ ? అంత తప్పు నేనేం చేశా చెప్పు ?
వాడు : మరేంట్రా ? ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉంటే నీపాటికి నువ్వు ఆరో ఎక్కం ఇంపోజిషన్ చేస్తున్నావా ? నీకు బుధ్ధుందా ?
నేను : ప్రేమేంట్రా ?
వాడు : మరదే నీకు తెలియంది. సరిత బాధ పడితే నువ్వు బాధపడ్డావా లేదా ?
నేను : అవును
వాడు : సరిత నవ్వితే నువ్వు నవ్వావ్ కదా ?
నేను : అవును
వాడు : సరిత నీకిష్టమే కదా.
నేను : ఇష్టం అంటే...తను హాపీగా ఉండాలిరా అంతే.
వాడు : అదేరా నేనూ చెప్పింది దాన్నే ప్రేమంటారు. అదే ప్రేమంటే. అయినా జొన్నలగడ్డ జ్యోతికన్నా నువ్వు తెలివి కలవాడివి నీకామాత్రం అర్ధంకాలేదా ?
నేను : నిజం చెప్పనా నాకు ముందే తెలుసురా, కానీ నీకు వెంటనే చెప్పటానికి సిగ్గుపడ్డా. సరేరా ఇప్పుడేంచెయ్యాలి.
వాడు : ముందు నీ హోమ్ వర్క్ చేసెయ్ తరవాత నాది కూడా చేసెయ్.  తొరాగా పెద్దైపో. ఉద్యోగం సంపాదించు ఈ లోపు నేను మా బాబయ్ ని అడిగి సరిత అడ్రస్ కనుక్కుంటా.  నువెళ్ళి తనకు తోడుగా ఉండి తన కష్టాలు తీరుద్దువుగాని. ఈ కమల్ హాసన్ గాడి సంగతి నాకొదిలెయ్. మస్తాన్ తో మాట్లాడి వాడికి స్కెచ్ నేను వేస్తా.
నేను సరే అన్నా
వాడు నా కన్నీళ్ళు తుడిచాడు
నేను వాడికి H.W చేశా.మరసటిరోజు మా అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా మొన్న సినిమా చూశాం కదా నేను పెద్దయ్యాక ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అని మా అమ్మకు చెప్పేశా. మా అమ్మ మురిసి పోయి 'సరేలేరా చేసుకుందువు' అని అనేటప్పటికి ఇక నాకు హద్దుల్లేకుండా పోయింది. ఇక ఆరోజు నుండి నాకు నూతనోత్సాహం మొదలైంది. సంకల్పం గురించి చెప్పిన మా నాన్నగారు 'Goals' గురించి కూడా చెప్పరు. అప్పటి నా Goals  
1) సరితను పెళ్ళిచేసుకుని తన కష్టాలు తీర్చాలి 
2) కమల్ హాసన్ ని చంపెయ్యాలి.

బాగా చదవాలి చదవాలి అని ప్రతి రోజు నా హోమ్‌వర్క్ తో పాటు శ్రీకాంత్ ది, వాళ్ళ చెల్లిది, వాళ్ళ అన్నది అందరి హోమ్‌వర్క్ నేనే చేసేవాడిని. వాడు కూడా నాకోసం సరిత ఆడ్రస్ కోసం, కమల్ హాసన్ ని ఎలా చంపాలి అని తెగాలోచిస్తుండేవాడు. నేను అదే ఊపులో జొన్నలగడ్డ జ్యోతిని ఓడ్చుకొట్టేసి 1st రాంక్ కూడా కొట్టేశా. 

మా పేటలో మా నాన్న గారికి పెదరాయుడుకున్నంత ఇమేజ్ ఉండేది. ఆపండ్రా అని గట్టిగా అరిచారంటే ఊరుచివర ఒంటేలు కెలుతున్న ఒంటికన్ను రాక్షసుడైనా మధ్యలో ఆపితీరాస్సిందే. పద్దతి, పిల్లల్ని పెంచేవిధానాం, మేనేజ్మెంట్ ఇలాంటి విషయాలలో ఎంతో మందికి మా నాన్నగారు ఆదర్శం. అలా ఆదర్శంగా తీసుకున్న వాళ్ళలో మా మామయ్య ఒకడు. ఆ సంవత్సరం మా మమయ్యకు కూతురు, నాకు మరదలు పుట్టింది. పుట్టీ పుట్టగానే అందరూ 'అస్సి గాడి పెళ్ళాం పుట్టేసింది' అని హడావిడి చేస్తున్నారు.  ఇంతలో మా మామయ్య వచ్చి 'ఏరా పెద్దయ్యాక మా అమ్మాయిని చేసుకుంటావా'- అని ఆడిగారు.  నాకు చాల కోపం వచ్చింది. నేను వెంటనే ఖరాఖండీగా లేదు మామయ్య నేను అల్రెడీ సరిత అనే అమ్మాయిను  ప్రేమిస్తున్నను, తననే పెళ్ళిచేసుకుంటా అని తేల్చిచేప్పేశా. మా మామయ్య బుర్ర బ్లాస్టయ్యి స్లోమొషన్ లో మా అమ్మ వంక చూశారు. మా అమ్మ అదే స్లోమొషన్ లో మా నాన్న వంక చూసింది. మా నాన్న కోపంతో ఊగిపోయారు. లుంగీ పైకట్టారు. చొక్కా చేతులు మడిచారు. నలుపుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మా నాన్నగారు కోపం వల్ల ఎర్రగా మారిపోయారు. 

అప్పటిదాకా విర్రవీగి పోయాడు Mike Kasprowicz(నేనే). తనకు ఇంకెవరూ అడ్డం లేరనుకున్నాడు. అదే బలుపుతో ఇష్టమొచ్చినట్టు మాచ్ కు ముందు నోరుజారి మాట్లాడాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరికేస్తున్నాడో తెలియక  మంచి లెంగ్త్ లో బాలేశాడని ఫీలయ్యాడు. తీరా వేశాక తెలిసింది తను బాల్ వేసింది సచిన్ టండుల్కర్ కని( మా నాన్న ) . సచిన్  మాంఛి దమ్ములాగి, ఎడం కాలితే దాన్ని నలిపేసి, క్రేన్ ఒక్కపొడి వేసుకుని ఫ్రంట్ ఫుట్ కొచ్చి, మరింత వేగంగా, మరింత బలంగా,  మరింత దృఢంగా ప్రపంచం కనీవినీ ఎరుకగని ఒక్కే ఒక్క షాట్. అంతే !! బాల్ ఎక్కడ పడిందో అని రవి శాస్త్రికి ఎతుక్కోవటం మొదలపెట్టాడు. నేను మాత్రం మూడు నెలలు మరో మాట మాట్లాడలేదు.

మూనెళ్ళ తరవాత.

శ్రీకాంత్ ఆయాస పడుతూ మాఇంటికొచ్చాడు. ఆ ఆయాసం పరిగెట్టటం వల్ల వచ్చింది కాదు నాకేదో చెప్పాలని తొందర పడటం వల్ల వచ్చిందని నాకర్ధమైంది. వచ్చీరాగానే నన్ను మస్తాన్ దగ్గరకు తీసుకెళ్ళాడు.  మటన్ మస్తాన్ మా స్కూల్లో 8th class B section. వాడు మాస్కూల్ కు ఎలాగోలా చదుకోవటానికి రాలేదు అందరికీ ఉచ్చ పోయించటానికి వచ్చాడు.
శ్రీకాంత్ > మస్తాన్ భయ్య చెప్పా కదా, వీడే అశ్విన్. ఒకన్నేసెయ్యాలి. 
మస్తాన్ > ఫొటో ఉందా ? 
శ్రీకాంత్ వెంటనే టేబుల్ మీద ఈ ఫొటో వేశాడు.

మస్తాన్ > వీడా ?
శ్రీకాంత్ > వీడు నీకు మందే తెలుసా ? 
మస్తాన్ > నాకెందుకు తెలియదు. వీడు మన కాళేశ్వర రావు మార్కెట్ కి రెగులర్ గా కూరలు కొంటానికి వస్తుంటాడు.
నా వంక తిరిగి చూశావా మస్తాన్ అంటే ఏంటో అని అర్ధం వచ్చేటట్టు కళ్ళెగరేశాడు శ్రీకాంత్
శ్రీకాంత్ > అయితే వీడిని కూడా వెసెయ్యాలి అని టేబుల్ మీద ఈ కింద ఫొటో వేశాడు. 
నేను > రేయ్ వీడెవడు ? 
శ్రీకాంత్ > నువ్వు నోరు మూసుకోని గమ్మున కూర్చోమన్నానా. నీ సరితను వేరే సినిమాలో పిర్ర మీద పిచ్చకొట్టుడు కొట్టాడు. ఇన్నాళ్ళూనీకు చెపితే హర్టవుతావని చెప్పలేదు. పనిలో పని వీడూ అయిపోతాడు.  ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
నేనేం మాట్లాడలేదు. 
మస్తాన్ >ఇద్దరికీ కలిపి ఏడొందలు అవుతుంది. 
నేను > రేపు సరస్వతీ మిస్ పిరియడ్ అవ్వగానే నేనొచ్చిస్తా.
రాత్రంతా ఎంచెయ్యలో అర్ధం కాలేదు. ఏడొందలంటే పెద్దమాటే. అప్పట్లో మా ఇంట్లో ఒక ఆవుండేది దాని పేరు కామధేనువు.  కామధేనువును ఏమడిగినా ఇస్తుందని ఎక్కడో విన్నట్టు గుర్తు. వెళ్ళి కామధేనువును ఆడిగా అది మా నాన్న పర్స్ ఇచ్చింది. అందులోంచి డబ్బులు తీసి లెక్కపెడుతుండగా మా అమ్మ చూసేసింది. మా అమ్మ స్లోమొషన్ లో మా నాన్న వంక చూసింది. మా నాన్న కోపంతో ఊగిపోయారు. లుంగీ పైకట్టారు. చొక్కా చేతులు మడిచారు. నలుపుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే మా నాన్నగారు కోపం వల్ల  మళ్ళీ ఎర్రగా మారిపోయారు. 

Mike Kasprowicz కు ఇంకా సిగ్గు రాలేదు. అల్రెడీ సచిన్ మొదటి స్పెల్ లో చావ కొట్టిన సంగతి మరచిపోకముందే మరో దుశ్శాహసానికి పూనుకున్నాడు. ఈ సారి కొంచం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని బాల్ వేశాడు. అయినా సచిన్ ఊరుకోలేదు. ఎప్పటిలాగే సచిన్  మాంఛి దమ్ములాగి, ఎడం కాలితే దాన్ని నలిపేసి, క్రేన్ ఒక్కపొడి వేసుకుని ఫ్రంట్ ఫుట్ కొచ్చి, మరింత వేగంగా, మరింత బలంగా,  మరింత దృఢంగా పిచ్చా కొట్టుడు కొట్టాడు.  రవి శాస్త్రికి మళ్ళీ బాలెతుక్కోవటం మొదలపెట్టాడు. నేను మాత్రం మరో మూడు నెలలు మరో మాట మాట్లాడలేదు.

మూనెళ్ళ తరవాత.
శ్రీకాంత్ ఆయాస పడుతూ మాఇంటికొచ్చాడు. ఆ ఆయాసం పరిగెట్టటం వల్ల వచ్చింది కాదు నాకేదో చెప్పాలని తొందర పడటం వల్ల వచ్చిందని నాకర్ధమైంది. వచ్చీరాగానే 'రేయ్ నీ సరిత అడ్రస్ దొరికింది' - అన్నాడు.  ఆ మాటకు నాకు ప్రాణం లేచ్చొచ్చినట్టైంది. ఆత్రం తట్టుకోలేక ఎలా కనుక్కున్నావనడిగా. చాలా సింపుల్ రా సరిత ప్రతిరోజు బసెక్కగానే 'జింఖానా ప్లీస్' అంటుంది. బస్ మీద మద్రాసు అని రాసుంది. నువ్వు మద్రాసుకి వెళ్ళి జింఖాన బస్టాండ్ లో వెయిట్ చేస్తే పట్టేయచ్చు అన్నాడు. 

ఆ రాత్రంతా ఆలోచించా, మా నాన్నగారి దగ్గరుంటూ సరితను పెళ్ళి చేసుకోవటం కష్టమని నాకర్ధమైపోయింది. మద్రాసు పారిపోదామని నిర్ణయించికున్నా. కామధేనువుని అడిగి డబ్బుతీసుకుని పొద్దున్నే పినాకిని ఎక్కేశా. ట్రైన్ లో సరితను గుర్తుకు తెచ్చుకుంటూ నాలో నేను ఏడుస్తున్నా, నాలో నేను నవ్వుకుంటున్నా. ఇంతలో ఎవరో నామీద చెయ్యేశారు.
'బాబూ నువ్వు హనుమంతంగారబ్బాయివి కదా' అని అడిగాడు. కేశవరావుగారు, ఈయన కూడా మానాన్నను ఆదర్శంగా తీసుకున్నవాళ్ళలో మరొకతను. 

సీన్ కట్ చేస్తే ఇంట్లో అందరి ముందు ఉన్నా. అమ్మ ఏడుస్తుంది. చెల్లి వినమ్రతతో వణికిపోతుంది. పక్కింటివాళ్ళు, ఎరదిరింటి వాళ్ళు అటుగా వెళుతున్న గ్రహాంతరవాసులు అందరూ మాఇంట్లోకి తొంగి చూస్తున్నారు. ఇరవై నిమిషాల నిశబ్దం తరవాత ఒక్కసారిగా నాన్న 'ఒరేయ్ వెర్రి నాకొడకా ఎన్ని సార్లు చెప్పాలి ? ఏమని చెప్పాలి. నువ్వు దాన్ని పెళ్ళిచేసుకోవటం ఏంట్రా ? అందంతా సినిమారా నిజం కాదు ' అని అరిచారు
నేను > ఏమో నాన్న నాకవన్నీ తెలియదు. నేను పెరిగి పెద్దయ్ సరితను పెళ్ళి చేసుకోవాలి. తనకు అండగా ఉండాలి
నాన్న > సరితేంట్రా సరిత దాని పేరు జయప్రద. అదంతా యాక్టింగ్, నిజం కాదురా. తనకు నువ్వండగా ఉండటమేంట్రా నీ పిండాకూడు. ఏంటే వీడేంమాట్లాడుతున్నాడు.
మా అమ్మ ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.

నేను > నాకవన్నీ తెలియదు. నేను తనని పెళ్ళిచేసుకోవాల్సిందే.
నాన్న > ఇంకో మాటమాట్లాడావంటే చంపేస్తా.
నేను > ఆ రోజు కూడా అంతే నీవల్లే కమల్ హాసన్ కూడ తప్పించుకు పారిపోయాడు. లేకుంటే ఈ పాటికి ఆ కమల్ హాసన్ నాచేతులో ఛచ్చుండేవాడు.
ఈ డయలాగ్ కి మా నాన్న ఏం మాట్లాడలేక తెలియక మా అమ్మతో పాటు ఏడవటం మొదల పెట్టారు. 
రెండు మూడు నిమిషాల తరవాత. నాన్న కోపం తగ్గించుకోని నాదగ్గరకు వచ్చారు.
నాన్న >అది కాదు నాన్నా. అసలెలా చెప్పు మనది విజయవాడ, తను మద్రాసు. ఎక్కడుంటుందో తెలియదు. నీకన్నా చాల పెద్దది. నువ్వు పెద్దైయ్యేటప్పటికి తను ఇంకా పెద్దదైపోతుంది కాదా. అదంతా సినిమా నాన్నా అంతా యాక్టింగు. 

నాకు వెంటనే మా నాన్నాచెప్పిన పాఠం గుర్తోచ్చింది. సంకల్పం నాన్న సంకల్పం మనం దేనన్నా బలంగా కోరుకుంటే ఎక్కడ నుండి వస్తుందో ఎలా వస్తుందో తెలియదు అది వచ్చేస్తుంది అంతే నువ్వే చెప్పావ్ గా అని. అసలు పద్యం లోనుండి 'సిరితా' తీసేసి 'సరితా' చేర్చి. 
సరితా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్ - అన్నా

అది వినంగానే మా నాన్న పిచ్చి పీక్స్ చేరుకుంది. బిపి బాయిలింగ్ పాయింట్ దాటిపోయింది. శివుడు తాండవం చేస్తాడని తెలుసు కానీ ఎవరూ చూడలేదు. ఆ రోజు మాఇంట్లో వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు, పక్కింటివాళ్ళు, గ్రహాంతరవాసులు కళ్ళారా చూశారు. అప్పటి దాకా One day మాత్రమే రుచిన చూసిన నాకు TestMatch అంటే ఏంటో చూపించారు. మా నాన్న కోపావేశాన్ని ఆపేవారు లేకపోయారు. దెబ్బకు నాకు జరమొచ్చేసింది.

జ్వరంలో కూడా 'సరితా సరితా' అని కలవరించేటప్పటికి అందరికీ హడలు పుట్టింది. మా నాన్న డాక్టర్ల చుట్టూ, సైకాలిజ్ట్ లు చుట్టు తిప్పటం మొదల పెట్టారు.  మా అమ్మైతే తాయిత్తులు, పూజలు, గాలేమన్న పట్టిందేమో అని క్షుద్రమాంత్రికులును తీసుకొచ్చి రకరకాల చేష్టలు చేసింది. ఇంక చేసేదేమిలేదనుకునే సమయంలో మా బామ్మ ఊరునుండి తిరిగొచ్చింది. మా నాన్న మా బామ్మ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి బాధపడ్డాడు. 
బామ్మ > ఓరి హనుమంతు దీనికా నువ్వింత డీలా పడిపోయింది. ఇంతజరుగుతుంటే నాకు ముందే చెప్పొదంట్రా ? 
నాన్నా > కొంపముంచి నీ దగ్గర ఐడియా గట్రా లాంటివి ఏమన్న ఉన్నాయంటావటే అమ్మా ?
మా బామ్మ  ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టింది. నీ తలకాయ్ తొందరపడకు ముందు చెప్పింది విను. అస్సిగాడివన్నీ నీ పోలికల్రా. చిన్నప్పుడు నువ్వూ అంతే అంజలి దేవిని చూసి ఇలానే గోల గోల చేశావు. చూస్తుంటే ఇదేదో వంశాచారంలా ఉంది అని మా బామ్మ చెప్పగానే  మా అమ్మ అదోలా మొహం పెట్టి చిరాగ్గా మా నాన్న వంక చూసింది. మా నాన్న మా అమ్మ వంక చూసి 'హి హి హి' అని నవ్వారు. అయినా అస్సిగాడి బాధల్లా ఏంటి ? జయప్రదను పెళ్ళి చేసుకోవాలి.ఎందుకు ? ఎందుకంటే అంతులేని కధ సినిమాలో జయప్రద చివరకు పెళ్ళి చేసుకోకుండా ఒక్కతే ఉండిపోయింది కాబట్టి. నువ్వేం చేస్తావంటే రామా టాకీస్ లో 'సీతా కళ్యాణం' సినిమా నడుస్తుంది. దానికి అస్సిగాడికి తీసుకెళ్ళు. ఆ సినిమాలో జయప్రద సీతమ్మ వారి వేషం వేసింది. చివరికి చక్కగా రాముని వారిని చేసుకుని పట్టాభిషేకం జరుగుతుంది. ఆ సినిమా ఒకటికి రెండుసార్లు చూపించు. జయప్రద పెళ్ళై హాపీగా ఉందని వాడే సర్ధుకుంటాడు అని చురకత్తిలాంటి ఐడియా ఇచ్చింది.
నాన్నా > నువ్వు చెప్తుంటే ఇదేదో వర్కయ్యేటట్టుందే. అయినా నాకీ ఖర్మంటే అమ్మా. పెదరాయుడులాంటి వాడిని నాకీ పిచ్చగోలేంటి చెప్పు.
బామ్మ >  చూడు హనుమంతు జీవితంలో అంతా మన మంచికే అనుకోవాల్రా
నాన్నా > ఇందులో మంచేముంది నా బొంద.
బామ్మ > నీ కొడుకు జయప్రదను పెళ్ళి చేసుకుంటా అన్నాడు కాబట్టి సరిపోయింద్రా. ఈ సినిమాలోనో  ఆ సినిమాలోనో పెళ్ళి చేసుకుంది. అదే ఏ జయమాలినినో జ్యోతిలక్ష్మినో ప్రేమిస్తే అప్పుడు కనపడేవి నీకు చుక్కలు. వాళ్ళు ఏ సినిమాలో పెళ్ళి చేసుకున్నట్టు దాఖాలు లేవు. చివరకు నువ్వే ఆస్తులమ్మి వాళ్ళతో తియ్యాల్సొచ్చేది. వాళ్ళు పెళ్ళి చేసుకున్నట్టు సినిమాలో ఉంటే ఖచ్చితంగా నీ సినిమా ఫ్లాపై చచ్చేది.  దానికన్నా ఇందెంతో ఉత్తమం. కాబట్టి ఏది జరిగినా మన మంచికే. 

మా నాన్న మరసటి రోజే మా బామ్మ చెప్పినట్టు చేశారు. అందరూ అనుకున్నట్టుగానే నా ఆత్మారావు శాంతించాడు.
-----------
ఇది జరిగి ఇన్నేళ్ళైనా ఇప్పటికీ ఎప్పుడన్నా నేను మా నాన్నా టివి చూస్తున్నప్పుడు జయప్రదొస్తే బాధతో నాన్నో, సిగ్గుతో నేనో అక్కడ నుండి లేచెలిపోతాం.

Friday, February 14, 2014

Love You శ్వేత

ప్రియమైన శ్వేతకు,

ఈ ప్రేమికుల రోజున

కొందామనుకున్నానే కాంతామణి kohinoor వజ్రమంట అదేదో, 
తీరా కొన్నాక Koti సరుకనుకొని కాలదన్నేస్తావని కలవరపడ్డా...

నగలు, బట్టలు కొందామనుకున్నా, 
కానీ నా ప్రేమకు ఖరీదుకన్నా quality  ఎక్కువని calm అయిపోయా...

మా ఆస్తి అమ్మి Taj Mahal  కడదామనుకున్నా, 
కానీ మా నాన్న తాట తీస్తాడని drop అయిపోయా.

Chocolates, Teddy Bear లు కొందామనుకున్నా, 
నా cheap  ఆలోచనలు చూసి నాకే చిరాకేసింది.

నీపై ఒక ప్రభంజన కావ్యమైనా రాద్దామనుకున్నా, 
కానీ ఈ ఉత్తరంలో ఎన్ని అక్షర దోషాలున్నాయొ మూడు సార్లు చదివినా అర్దం కాని నాకు ఆ అర్హత లేదనిపించింది.

కవిత్వమైనా రాద్దామనుకున్నా, 
పదో తరగతి లో ఉన్న పద్యాలను ఉన్నది ఉన్నట్లుగా చదవలేని నాకు కవిత్వం చాలా ఎక్కువనిపించింది.

చివరకు ఈ నాల్గు ముక్కలకు ధైర్యం దక్కింది.

మందు కొట్టి మద్య కుట్టు చించి, మూడు ముక్కలు వ్రాసి నీ మొహాన పడేశాననుకోకు. నీపై ప్రేమ ఎంతుందో లోతు తెలియని నా గుండె మధ్య నుంచి వచ్చిని మాటలివి. (వహ్ వా-వహ్ వా)

ఇలా ఉత్తరాలు రాయటం old concept అని నా అలోచనలను అటకెక్కించెయ్యకు. Vodafone లేనప్పుడు ఆ వాలెంటైనుడు కూడ ఇలా ఉత్తరాలే రాసుండచ్చు. ఆ Valentine old కానప్పుడు ఈ Valentines day old కానప్పుడు, ఈ ఉత్తరం concept కూడా old కాదు. ఇంతకీ విషయంలోకొస్తే ఈ ప్రేమికుల రోజు సంధర్భాన నా మనసు విప్పి మళ్ళీ మరోసారి "I LOVE YOU". ఇది సాదా సీదా పదమని మరీ సింపుల్‌గా తీసుకోకు. ఈ సమాజంలో వాడకం ఎక్కువై value పోయినట్టు కనిపిస్తుంది కానీ...

అలసిన మనసుకు ఉత్తేజం ఆ పదం,
ఒంటరి జీవితానికి తోడు ఆ పదం,
భయపడే మనసుకు ధైర్యం ఆ పదం,
భాధలో ఉన్న మనసుకు బుజం ఆ పదం,
గెలిచిన మనసుకు గోల్డ్ మెడల్ ఆ పదం,
నా ఈ జీవితానికి నువ్వే ఆ పదం.  ( మళ్ళీ వహ్ వా-వహ్ వా )

ఈ రోజు Valentines day కాబట్టి నువ్వు చెప్పావే, ప్రతిరోజు ఎందుకు చెప్పవ్ అని నువ్వు అడగచ్చు. నా దగ్గరా ఇలాంటి  ప్రశ్నలకే కాదు

మొగలిరేకులు సీరియల్ climax ఏంటి ?
రాంగోపాల్ వర్మ అడవి సినిమాలో విలన్ ఎవరు ?
బాగా ఏడ్చినప్పుడు కంట్లో నుంచే కాక ముక్కులోనుండి కూడా నీళ్ళెందుకొస్తాయ్ ఇలాంటి కచ్చా పిచ్చా ప్రశ్నలకు సమాధానాలు లేవు. But I love you

-------------------------------------
సర్ మీరు ఇక్కడ కూర్చోని suicide note రాస్తున్నారని barrer చెపుతున్నారు, ఎం రాస్తున్నారు sir 
మనమొహానికి అంత సీన్ లేదుకానీ ఒక Turbong Strong చెప్పండి.
వాడు: Snacks ఏమన్న చెప్పమంటారా ? చిల్లి చికెన్, చికెన్ 65
నేను: నేను వెజిటేరిన్, బీర్ మాత్రం చిల్డ్ గా ఉండాలి 
-------------------------------------
చివరకు దీన్ని ప్రేమ లేఖ అంటారా అని ఆడగకు, బహుశ ఆ ప్రేమ లేఖ template ఇలా ఉండదేమో కానీ ఇది ప్రేమతో రాసిన లేఖ. 

ఈ materialistic మనిషికి 1,0 మాత్రమే అర్ధం అయ్యే computer తో గడిపే మనిషికి, నువ్వనుకునే మనసులేని మనిషికి ఈ ఉత్తరం రాయటానికి అరగంట పట్టింది. కానీ నువ్వనుకునేది నిజమేమో నా ఈ అనుభవానికి ఆరున్నర ఏళ్ళు పట్టింది.

ఈ రోజు కూడ లేటుగా ఆఫీస్ నుండి వచ్చినా latest గా వచ్చానని ఆశిస్తూ ...

వెఱ్రిబాగులోడిని ప్రేమించటం కన్నా నాలా కూసింత వెఱ్రి ఎక్కువున్నవాడిని ప్రేమించటం చాలా కష్టం. ఆ నీ ప్రేమకు దాసోహం. 

Irrespective of Valentines day
 నిరంతరం నిన్ను ప్రేమించే 
నీ 
అస్సి

P.S
ఇలాంటి పిచ్చొత్తరాలు ప్రతి సంవత్సరం ఆశించకు. ఈ సారి
ముందు టైం ఉంది
బార్ లో బీరుంది
బుర్రలో ఐడియా ఉంది
జేబులో కాషుంది

P.P.S

శ్వేతా,
భార్యా భర్తల అనుభందం గురించి పెదరాయుడు సినిమాలో మొహన్ బాబు ఎమన్నాడో తెలుసా...

The relationship between wife and husband should be like fish and water, but it should not be like fish and a fisher man.

ఈ ఉత్తరంలో తప్పులుంటే మన్నించు,
ఈ ఉత్తరమే తప్పనుకుంటే క్షమించు.

Sunday, July 21, 2013

అమ్మా-నాన్నా- ఓ అరటి చెట్టు

ప్రియమైన రమ్యకు. ( ఇక్కడ కామా పెట్టాలని మా తెలుగు మాష్టారు చెప్పారు. కానీ నా  కీబోర్డులో  కామా ప్రస్తుతానికి పనిచెయ్యటం లేదు)

మొన్న  మన ప్రేమ సంగతి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మీ అమ్మగారు 'అరటికాయ చిప్స్ తిను బాబు' అనగానే అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా మీ అమ్మగారినెత్తుకుని డాబా మీద నుండి విసిరేయాబోయానని నన్నుతప్పుగా అర్ధం చేసుకుంటావేమోనని ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు అరటికాయ కూరంటే ఫిజికల్‌గా ఎలర్జీ అన్న విషయం నాకు తెలుసు కానీ మెంటల్‌గా కూడా ఎలర్జీ అన్న విషయం నాక్కూడా అప్పుడే తెలిసింది అది కూడా శ్రీకాంత్ గాడు నాజర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు కాబట్టి.  అసలు ఏమి జరిగిందంటే...

------------------------------

1995 ఆగష్టు నేను ఐదవ తరగతి చదువుతన్న రోజులలో 

భారత దేశ మొదటి ప్రధాని ఎవరు ? --  నెహ్రూ గారు
భారత దేశ మొదటి ప్రధాని ఎవరు ? --  నెహ్రూ గారు
భారత దేశ మొదటి ప్రధాని ఎవరు ? --  నెహ్రూ గారు

అని మా చెల్లి ఎప్పటిలాగే ఎదో ఒకటి చదువుతూనే ఉంది చండాలంగా . నేను మా ఇంటి గోడపై ఉన్న బల్లి తో 'నీకు తెలుసటే మన దేశ మొదటి ప్రధాని ఎవరో ?'-అని అసమర్ధుని జీవితయాత్రలో సీతారామారవు లాగా మాట్లాడుతున్నా. ఇంతలో శ్రీకాంత్ వచ్చి రేయ్ మా soldtire TV లో సచిన్ సెంచరీ కొట్టాడు మీ Dyanora TV లో కొట్టాడేమో చూడు అంటే TV పెట్టా. అవును సచిన్ సెంచరీ కొట్టాడు, ఆ టైమ్ లో TV పెట్టినందుకు మా అమ్మ నన్ను చచ్చేటట్టు కొట్టింది. నా పాటికి నేను కన్నీళ్ళు కారుస్తుంటే, నా కన్నీళ్ళు తుడవటానికి మా నాన్న వచ్చారు. నా కన్నీళ్ళు తుడవాలంటే నాకేమన్నా కొనిపెట్టాలని మా నాన్నకు తెలుసు. ఏం కావాలమ్మా అనడిగారు. నాకు బోలెడు అరటిపళ్ళు కావాలి అన్నా. వెంటనే తన గరుత్మంతునిపైయేగి అరటిపళ్ళ కోసం విజయవాడంతా తిరిగారు. ఆ రోజసలు ఎక్కడా అరటి పళ్ళు దొరకలేదు. అలసి ఓ చెట్టు నీడన కూర్చుండగా వేంకటేశ్వర శ్వామి సుమన్ వేషం లో వచ్చి చిన్న అరటి పిలకనిచ్చారు. మా నాన్న దాన్ని పెరట్లో నాటారు. దాని సంరక్షణా భాధ్యతలను నాకప్పగించారు. నేను కూడా అది పెరిగితే దాని అరటి పళ్ళన్నీ నావే అన్న ఆశతో, ఉద్దేశంతో, ప్రేమతో, కోరికతో  ప్రతి రోజు లేచి నీళ్ళు పోసి జాగ్రత్త గా చూసుకుంటుండేవాడిని.

ఇలా కొన్నాళ్ళ తరువాత మా తాత గారు ఓ రోజు మా చెల్లికి వారాల కధలు చెప్పటం మొదలెట్టారు.
ఆదివారం నాడు అరటి మొలిచింది. నేను పెరట్లోకి వెళ్ళి  చూసుకున్నా, అవును మొలిచింది మొలిచింది. మా ఇంట్లో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు
సోమవారం నాడు సుడివేసి పెరిగింది. నేను పెరట్లోకి వెళ్ళి చూసుకున్నా, అవును పెరిగింది పెరిగింది. మా ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు
మంగళవారం నాడు మారాకు తొడిగింది, అవును తొడిగింది, తొడిగింది.
బుధవారం నాడు పొట్టి గెల వేసింది, అవును వేసింది వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది, అవును దాగింది దాగింది
శుక్రవారం నాడు చకచకా గెలకోసి అందరికీ పంచితిమి

ఏంటి గెలకోసి పంచేది అప్పుడే ? పండాలిగా అన్నా నేను. పండాలంటే గురువారానికి శుక్రవారానికి మధ్యలో మరో వారం ఉండాలి అన్నారు మా తాత గారు. లేదు తాతయ్యా అవి పండి తీరాలి, అంటే గురువారానికి శుక్రవారానికి మధ్యలో ఇంకో వారం ఉండాలి. ఒక సారి గుర్తుచేసుకో గురువారం తరవాత వెంటెనే శుక్రవారమేనా మధ్య లో ఇంకేమన్న వారముందేమో అలోచించు అడిగానేను. మా తాతల కాలం నుండీ గురువారం తరవాత శుక్రవారమే కాబట్టి కాయలు కోసేసుకోవచ్చు అని డంఖా పధంగా తేల్చి చెప్పాడు. మరి కాయలు పండాలేదే అనడిగా. తీక్షణంగా అరటి  చెట్టు పరిశీలించి మా తాత గారు ఇది పండదు ఎందుకంటే ఇది 'కూరరటి' చెట్టు అన్నారు. దాంతో ఎక్కడో ఏ మూలనో భాధేసింది. శ్రమ వృధా అయ్యిందని. అయినా ధోని లా పెద్దగా పట్టించుకోలా.

ఆ రోజు సోమవారం.
కూరల తాతయ్య రాలేదు.  మా అమ్మ నన్ను లేపి 'రేయ్ అస్సిగా, కూరల తాత ఇంకా రాలేదు. బడికీ, మీనాన్నాఫీసుకూ టైమౌతుంది. నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు, ఒక పని చెయ్యి నువ్వు పక్కింట్లో నిచ్చెనడిగి అరటిచెట్టు నుండి రెండు కాయల కోయరా అరటి కూర చేస్తా'-అంది. ఆ రోజు మా ఇంట్లో అరటికాయ కూర.ఆ రోజు కూరలకని అట్టిపెట్టిన డబ్బులను డిబ్బీలో వేసింది మా అమ్మ.

మరుసటి రోజు మంగళవారం.
కూరల తాతయ్య మళ్ళీ రాలేదు. మా అమ్మ నన్ను లేపి 'రేయ్ అస్సిగా, కూరల తాత ఇంకా రాలేదు. బడికీ, మీనాన్నాఫీసుకూ టైమౌతుంది. నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు, ఒక పని చెయ్యి నువ్వు పక్కింట్లో నిచ్చెనడిగి అరటిచెట్టు నుండి రెండు కాయల కోయరా అరటి కూర చేస్తా'-అంది. ఆ రోజు కూడా మా ఇంట్లో అరటికాయ కూర. ఆ రోజు కూడా కూరలకని అట్టిపెట్టిన డబ్బులను డిబ్బీలో వేసుకుంది మా అమ్మ.బుదవారం,
మా అమ్మ నన్ను లేపగానే ఏం అమ్మా ఈ రోజు కూడా తాత రాలేదా? బడికీ నాన్నాఫీసుకు టైమౌతుందా ? నీ కాళ్ళు చేతులు ఆడటం లేదా ? ఏం ఖంగారు పడకు అరటికాయా కూర చేద్దువుగాని అని ఆ రోజు కూడా అరటికాయలు కోసిచ్చా.

గురువారం 
మూడు రోజులనుండి ఒకే కూర తినీ తిని విసుగెక్కి ఆ రోజు అమ్మ కన్నా ముందే లేచి తాతా ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి సైకిల్ మీద ఎక్కించుకుని మరీ ఇంటికి తీసుకొచ్చా. అమ్మా ఈ రోజు కూరల తాత వచ్చాడు. ఇక నువ్వేం ఖంగారు పడక్కర్లేదు అన్నాను. దానికి అమ్మ తాతను పంపేయ్ రేపటి నుండి కూడా రావద్దని చెప్పు అంది. 'ఏ ??'-అనడిగా. 'ఏ ఏంట్రా పిచ్చ సన్నాసి పెరట్లో అరటిచెట్టుండగా బయటెందుకు కొనటం. అసలు అరటికాయ న్యూట్రీషన్ వ్యాల్యూస్ గురించి నీకేం తెలుసు ? అరటికాయలో proteins, vitamins A C E K B6 B12, potasium, manganeese, copper, seleinum, phospohorus, Folic, Thamin, Calcium, Iron, Fiberaturated Fat, Polyunsaturated Fat, Zinc అన్నీ ఉంటాయి తెలుసా ? అసలు నువ్వేం పేపర్ చదువుతునావ్ ? నిన్న గాక మొన్న జపాన్ లో ఆ చుంగ్ గాడికి అదేదో రోగం వస్తే ఏవోవో మందులు వాడారంట చివరకు అరటికాయ కూర చేసిపెడితే తగ్గిందంట. మనకేమో మన ఇంటి పెరట్లో కాస్తే కూరొండుని తినటానికి నామోషీ. 

అమ్మా, అది జపాన్ లో అమ్మా చాలా దూరం ఆ రోగాలు ఇండియాకు రావు. నోర్ముయ్ జపాన్ ఏమాత్రం దూరం ? flight ఎక్కితే 40 minutes అంటే ఇంకో అరగంటలో వచ్చేస్తాయి. నోర్మూసుకుని నేను చెప్పింది విను అని నా చేతే తాతను రావద్దని చెప్పించింది. 

అసలు కారణం ఏంటంటే ? ఎన్నాళ్ళ నుండో మా అమ్మ ఆర్ధిక స్వాతంత్రం కోసం మా నాన్న దగ్గర పోరాడుతున్న పోరాటాలకు ఒక మార్గం ఈ అరటికాయల ద్వరా ఏర్పడినట్ట్లు తనకర్ధమైంది.  ప్రతి రోజు అరటికాయ కూర చెయ్యటం ఆ నాలుగు రూపాయిలు దాయటం. నాలుగు పదులు నలభై, ఐదు నలభైలు ఒక చీర అదీ మా అమ్మ ప్లాన్. ఏ రోజు మధ్యాహ్నం బాక్స్ తీసి చూసినా అరటికాయ కూరే. ఒక రోజు నాకు తిక్క లేచి నేను చెట్టెక్కికోయనన్నా. ఆనాడు బాలభారతంలో అర్జునుడు ఐరావతం కోసం భూమ్మీద నుండి ఆకాశానికి నిచ్చేనేసినట్టు మా అమ్మ కూడా మా నాన్న చేత వంటింట్లో నుండి అరటి పొదల్లోకి ఒక శాస్వత నిచ్చెనొకటి వేయించుకుంది దాంతో అరటి కాయలేం ఖర్మ ఐరావతం తోక కూడ అందేది మా అమ్మకు. ఇదేదో బెండకాయో, దొండకాయో అయితే బావుండేది ఈరోజు కాయలన్నీ కోసేస్తే మళ్ళీ వారం పట్టేది. అదే అరటి చెట్టైతే గెలేసిందంటే 2 నెలలు చచ్చామన్నమాటే. ఎదో హైబ్రిడ్  చెట్టు పెరిగినట్టు టపా టపా మని గెలెల కాసేవి. మూడు నెలల్లో సునాయాసంగా నాలుగైదు గెలలు. కాల క్రమేపి మా అమ్మకు నిచ్చెన అవసరం కూడా లేకుండా పోయింది. పెళ్ళి సందడి సినిమా లో రవళి-జామ చెట్టూ ఫ్రండ్స్ అయినట్టు.మా అమ్మా అరటి చెట్టూ ఫ్రండ్స్ అయిపోయాయి. పెరట్లోకెళ్ళి చప్పట్ట్లు కొడితే చాలు అవే రాలి పడేవి. గెల తరవాత గెల, గెల తరవాత గెల ఇలా తెక్కాసేవి.  ఒకరోజు నాలో కమ్యూనిష్టు నిద్రలేచాడు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాగా 'ఇక చాలు' అని అరిచా సీన్ కట్ చేస్తే దశావతారం సినిమాలో కమల్ హసన్ ని వేలాడతీసినట్టు అరటి చెట్ట్లుకు వేలాడ తీసి పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇక నా వల్ల కాదని తెలిసి మా చెల్లి ని పురమాయించా. అంబేద్కర్ విగ్రహం ఎప్పుడూ ఎడం చేతిలో పుస్తకం పట్టుకున్నట్టు మా చెల్లి చేతిలో ఎప్పుడూ నెహ్రూ చరిత్ర ఉంటూ ఉండేది . మా చెల్లి అమ్మ దగ్గరకు వెళ్ళి నా బాధ ను తన బాధగా వెళ్ళడించింది. వెంటనే మార్కెట్ కి వెళుతుందనుకున్నా, కానీ బుక్ స్టోర్ కి వెళ్ళింది. అక్కడ ఉన్న అన్ని పిండి వంటలు పుస్తకాల్లోఅరటికాయ చాప్టర్లు మాత్రమే xerox తీయుంచుకుని వచ్చి మా ప్రయోగాలతో ప్రళయ తాండవం చేసింది. 

స్కూల్లో పిల్లలందరూ నన్నేడిపించేవారు. సభ్య సమాజం నన్ను చూసి వెక్కిరించేది. కానీ నేను ఏం చెయ్యలేని నిస్సహాయతలో ఉండేవాడిని. 'నిజంగా ఆ జగన్నాధ రధ చక్రాలొస్తాయంటావా ?'- అని ఆ బల్లితో మాట్లాడేవాడిని. అమ్మ మాత్రం ఇవేం పట్టుంచుకోకుండా రూపాయ్ రూపాయ్ దాచి ఆ యేడు జిల్లా చిన్న మొత్తాల పొదుపు సంస్ధ కార్యదర్శి కూడా అయ్యింది. మా అమ్మ లోని ఈ పొదుపు కోణం చూసిన మా నాన్న మురుసి ముక్కల్లైయ్యేవారు. ఇంతకముందు మా అమ్మ ఏమన్నా కొనమంటే,


భార్యామణి
నా వసంత జీవితపు ఆమని,
నేనేంచెప్పినా వినే శ్రావణి,
మృదు కోమలి,
పావని,
You have to understood that I don't have money. 

అని కవిత్వం చెప్పే మా నాన్న, మా అమ్మ పొదుపు చూసి 

అరటి వంటి కూర
పంకజ ముఖి కళ్యాణి వంటి భార్యయు గలదె!! 

అని చంధస్సుని చండాలం చేసి మరీ చెలరేగిపోయేవారు.

ఆ రోజు నేను మరచిపోలేని రోజు మా అరటి చెట్టుకు గెలలు మీద గెలు వేస్తుందని నేను బాధ పడుతుంటే. మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణి మన అరటి చెట్టు పక్కన  మరో పిలక మొలిచింది అని అరిచారు. ఇంటిల్లిపాది పెరట్లోకెళ్ళి చూసాం. మా ఇంట్లో ఒక అలవాటు ఉంది పట్టరాని సంతోషం వస్తే అందరూ వాళ్ళ అనందాన్ని చప్పట్లు కొట్టి వ్యక్త పరుస్తారు. అందరూ ఆనందంతో ఒక అరగంట చప్పట్ట్లు కొట్టారు. ఆనందంతో మా నాన్న హోలీ చేసుకుందాం అన్నారు. మా అమ్మ అరటి పాయసం చేసింది. పాయసం తింటూ అన్నయ్యా నెహ్రూ గారు ఎంచెప్పారన్నయ్యా పిలకలు గురించి ? అడిగింది మా చెల్లి.  నేటి అరటి పిలకలే రేపటి అరటి చెట్లూ అని చెప్పారమ్మా నెహ్రూగారు అని జాలిగా చెప్పా తన వంక చూస్తూ. మరుసటిరోజు ఇంటిల్లిపాది బయటకు వెళ్ళి మా అమ్మకు బాంకెకౌంట్ ఓపెన్ చేశాము. 

ఇలా సంవత్సరం గడిచింది. మా ఇంటి వెనకాల 12 అరటి చెట్లు 12X2 ఎప్పుడూ live అరటి గెలలతో  తరతరాలు తిన్నా తరగని అరటి ఆస్తి ఏర్పడింది. అరిటాకులలో భోజనాలు, స్నాక్స్ గా అరటి చిప్స్, పూతాంబూలం పండుతాంబూలం నోములలో అరటికాయలు, అరటి పువ్వు కూర, అరటి బెరడు కూర ఇలా ఎన్నో రూపాంతం చెందాయి.

ఇక్కడొక నేను రాసుకున్న బూతు సామెత ఒకటి చెప్తా. ఏడుగురు భార్యలు, ఏడు రాజ్యాలు, ఏడుగురు కొడుకులూ అన్నీ పోగొట్టుకున్న ఒక దరిద్రుడు ఆరుబయట డొక్క(mug) పట్టుకుని దొXకి కూర్చుంటున్నాడంట. దాన్ని చూసిన ఒక డేగ ఎదురుకుండా వచ్చి వాలింది. అప్పుడు రాజు ఇంకా నాకేముందే నీకివ్వటానికి కనీసం ఒంటిపై నూలి పోగు కూడా లేదు అన్నాడట. డేగేం మాట్లాడల. తీరా కార్యం అయ్యి ముX కడుక్కునే సమాయానికి డేగ డొక్కెత్తికెళ్ళిందంట. అందుకే అంటా నేను దరిద్రుడు  దొXకి వెళితే డొక్క డేగెత్తి కెళ్ళిందని. నా పరిస్ధితీ అలానే తాయారయ్యింది. ఎందుకంటే ?

సరిగ్గా ఈ సమయంలోనే మా నాన్నకు జగదాంబ చౌదరి గారు వ్యాపారంలో కలిసొస్తుందని చెప్పారు. మనకు ఏం వ్యాపారం చేస్తే బావుండు అని పెరట్లో అలోచిస్తుండగా అరటికాయ తలమీద పడింది. దాని తారతమ్యమేమని చౌదరి గారిని ప్రశ్నించగా 'చూడు హనుమంతు, ఇది దైవ సందేశం. ఇలా నాకు తెలిసి ఇద్దరి మీదే పడింది. ఒకడు Newton అనే ఆంగ్లేయుడు. రెండోది నువ్వు. ఇంకేమాలోచించకు ఎక్కడన్నా ఇంత ధీటుగా అరటి చెట్లు పెరగటం నువ్వు విన్నావా ? అదే నీ పెట్టుబడి అసలు రాహువు 11వ ఇంట్లో ఉండగానే వెధవది నాకు తెలుసయ్యా నీకు కలిసివస్తుందని అని మా నాన్నని ఉత్తేజ పరిచాడు. 

ఇప్పుడు మా నాన్న ఏం చేస్తాడో అర్ధం కాక తెగ టెంషన్ పడుతున్నా. మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళినట్టే వెళ్ళి రాజీనామా చేసి ఇంటికి వస్తూ వస్తూ నరసింహా ఆడియో కాసెట్ తెచ్చారు. లుంగీ పైకి కట్టారు, తలకు పాగా చుట్టారు పెరట్లో కెళ్ళారు. ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు మా  అమ్మ మరో 20 అరటి పిలకలు సిద్ధం చేసింది. కాసెట్ లో పాట మొదలైంది. ఏక్కూ తొలిమెట్టూ కొండను కొట్టూ ఢీకొట్ట్టూ కొండలు రెండుగ పగిలేట్టూ తలపడు నరసింహా దాని కి మా నాన్న నరసింహ సినిమాలో రజనికాంత్ ని ఊహించుకుంటూ మొక్కలు నాటి, పాదులేసి, నీరు పోసి పెరడంతా  రచ్చ రచ్చ చేశారు. మధ్యలో చెమట పడితే మా అమ్మ సౌందర్యలా చెమటలు తుడిచేది. ముఖ్యంగా పాటలో నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువ్వు రుషి వయ్యా అన్నప్పుడు తెగమురిసిపోయేవారు. నేను ఆ విచిత్రం చూడలేక తలకాయ గోడకేసి బాదుకునేవాడిని. మా చెల్లి మాత్రం నెహ్రూ చరిత్ర చదువుకుంటూ ఉండేది.

నెమ్మిదిగా మా నాన్న వ్యాపార ఐస్కాంతం అవతారం ఎత్తారు. హనుమంతు ఇంపోర్ట్స్ & ఎక్స్‌పోర్ట్స్. మా పెరడను తోట చేశారు. ఇల్లంతా అరటి మయం. రాఘవేంద్రరావు సినిమాలలో ద్రాక్షగుత్తులు వేలాడినట్లు మా ఇల్లంతా అరటి గెలలు వేలాడుతుండేవి. ఓరోజు నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక కృంగి కృసించి నసించి క్షీణించి అలసి పడుకున్నా. 

అప్పుడు  కలలో సుత్తి వీరభద్రరావ్ బ్రహ్మానందం కనపడ్డారు. సుత్తి గారు ఇలా అంటున్నారు.'నువ్వు చెపుతున్న కధలో ఏదో లోపముందయ్యా కవి. ఈ కధను నేను సినిమా తీస్తే ఒక ఊరు ఊరంతా పస్తుండి నాకు ముష్టి వేస్తారు. నేను చెపుతా విను విజయవాడలో ఒక గుంటడు అమ్మా ఆకలేస్తుంది అంటాడు. అప్పుడు వాళ్ళమ్మా ఏ ఏ కూరలు చేస్తుందో తెలుసా ? అరటికాయ కూర, అరటికాయ ఉల్లికారం, అరటికాయ అల్లం పెట్టి కూర, అరటికాయ పులుసు, అరటికాయ వడ, అరటికాయ బజ్జీ, అరటికాయ పొడి కూర, అరటికాయ కొబ్బరేసి కూర, అరటికాయ ఇగురు, అరటికాయ మసాల కూర, అరటికాయ పెరుగు పచ్చడి, అరటికాయ పొడి, అరటికాయ ఉల్లికారం, అరటికాయ ఆవ కూర, అరటికాయ పచ్చి కొబ్బరి కూర, అరటికాయ ఫ్రెంచ్ ఫ్రైసు, అరటికాయ పోపు , అరటికాయ కోవా లడ్డు, అరటికాయ పెసరపప్పు కూర, కాల్చిన అరటికాయ పొడి కూర, అరటికాయ మెంతి కూర, అరటికాయ టమోట కూర, అరటికాయ పప్పు, అరటావకాయ, అరటికాయ టిక్కి, అరటికాయ బెల్లం పులుసు కూర, అరటికాయ పాలకూర, అరటికాయ మసాల వెపుడు, అరటికాయ మంచూరియా, అరటికాయ నిమ్మకాయ కూర, అరటికాయ అలసందుల పకోడి, అరటికాయ తొక్క పచ్చడి,  అరటికాయ సెనగల కూర, అరటికాయ వెల్లుల్లి కారం, అరటికాయ కొఫ్తా కర్రీ, అరటికాయ ముద్ద కూర, అరటికాయ చిప్స్, అరటికాయ వేపుడు, అరటి పకోడి, అరటి 65, క్రిస్పీ బనానా, అరటిరైస్, అరటి పువ్వుతో కొబ్బరి పచ్చడి, అరటి అప్పడం............................ - అని రెచ్చిపోతుంటే 

ఇక చాలు మహప్రభో అని గట్టిగా అరుస్తూ ఉలిక్కి పడి లేచా. జరిగింది ఎవ్వరికి చెప్పు కోవాలో తెలియక డేవిడ్ కి చెప్పా ప్రభువును తలుచుకుని పడుకో ఇలాంటి కలలు రావు అని ఒక శిలువిచ్చాడు.  ఆ రోజు రాత్రి పడుకునే ముందు ప్రభువుకు దణ్ణం పెట్టుకుని పడుకున్నా.  కలలో మిదాస్ రాజు వచ్చాడు. ఆ మిదాస్ రాజు ఎవరో అనుకునేరు అది కూడా నేనే. మనకు తెలిసిన కధలో మిదాస్ రాజు ఏది పట్టుకుంటే అది బంగారమైపోయేది కానీ నా కలలో ఏది ముట్టుకుంటే అది అరటి కాయ లా మారిపోతుంది. మా అమ్మా, నాన్న, మా చెల్లి, అందరూ మారిపోయారు. నా వేళ్ళు కూడా పచ్చాగా మారిపోయి అరటికాయల్లాగా ముందుకు ఒంగిపోయాయి.  ఏం చెయ్యాలో తెలియక గుక్కపెట్టి ఏడుస్తుండగా..

 'ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి,  ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్త్మూర్తి,  ఏ మూర్తి జగదేక చక్రవర్తీ" అంటూ శ్రీకాంత్ గాడు కలలో ANR లా గడ్డం వేసుకుని పాడుతూ కనపడ్డాడు.

నేను:: రేయ్ లఫూట్ గా నీవల్లేరా ఇదంతా నేను 5 నిమిషాలలో లేస్తా నువ్వు నాముందుండాలి అని ఆర్డర్ వేసి కళ్ళు తెరిచా.

చెప్పరా అన్నాడు.
బోరునేడ్చి విషయం బోర్లించా.
వాడు విని ఇంతేనా, నేనున్నాను రాజా నీకోసం. నేను చెప్పినట్టు చెయ్యి.  నువ్వు మీ నాన్న గారి దగ్గరకు వెళ్ళి business expand చెద్దామనుకుంటున్నాను. మన కీర్తి ఖండాంతరాలు దాటిద్దామనుకుంటున్నాను దానికి నేను MBA చెయ్యాలి. MBA అంటే ముందు BBA చెయ్యాలి. BBA అంటే Inter బా మార్కులు రావాలి. Inter లో మంచి మార్కులు రావాలంటే  హాస్టల్ లో జాయిన్ అవ్వాలని చెప్పు.  మూడు నెలల్లో పదో తరగతి పరిక్షలు అయిపోతాయి కాబట్టి నువ్వు జెండా ఎత్తైయచ్చు అని సలహా ఇచ్చాడు. మా నాన్నకు విషయం చెప్పగానే ఆయిన 'ఓ యస్' అన్నారు.

--------------------------------------------------------------------------------

అది రమ్యా జరిగింది. మీ ఇంటికొచ్చినప్పుడు  నేను కావాలని అలా చెయ్యలేదు, అలా జరిగింది. పాలు నీళ్ళూ లాంటి మన మధ్యలో అరటికాయ కూరెందుకు చెప్పు ? నాకరటికాయ కూరంటే అసహ్యం ఎంతంటే చివరకు నేనాడే ఆటల్లో అరటి పండ్లుండవ్. ఇంకా నమ్మకపోతే ఈ క్రింద్ర స్కాన్ రిపోర్ట్ చూడు.Sunday, June 17, 2012

కొత్త ఆంద్రజ్యోతి సంచికలో నా పాత కధ

ఈ రోజు ఆంద్రజ్యోతి ఆదివారాం సంచికలో నా ఏడవ తరగతి ప్రేమ కధ  ఆంద్రజ్యోతి యాజమాన్యం వారు ప్రచురించారు. 

నేను అప్పుడప్పుడు రాస్తున్నా, గుర్తుపెట్టుకుని చదువుతున్న వాళ్ళందరికీ, మిత్రులకు, ప్రశంస విమర్శాకారులకు, ఎలాట్రానిక్ మరియు ప్రింటు మిడియా వారికీ,రాష్ట్ర, కేంద్ర మంత్రులకు, తెలుగు బ్లాగర్లకు, ఆంధ్రులకు, పిల్లలకు,పెద్దలకు  ప్రవాసాంధ్రులకు,ముఖ్యంగా ఆంద్రజ్యోతి వాళ్ళకు, మరీ ముఖ్యంగా మా బాబుకు ( Happy Father Day నాన్న గారు ) నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.


 పూర్తి లింకు http://aswinbudaraju.blogspot.in/2008/12/blog-post_08.html

( కధ పూర్తిగా రాలేదు )Sunday, February 26, 2012

సమర్ధుడి సాఫ్ట్వేర్ యాత్ర

ఈ మధ్య కళ్ళు సరిగా కనిపించటం లేదని కళ్ళ డాక్టర్ దగ్గరకు వెళితే, కళ్ళకు పెద్దగా exercise లేదు Indian census board లో పార్ట్ టైమ్ చెయ్యమని రాసిచ్చారు. ఆ పనిమీదే ఆ వారం నేను, నటరాజ్ పంజాగుట్టా సెంట్రల్ లో అమ్మాయిల కౌంట్ చేస్తున్నాం. తియ్యటి రోగాలు కమ్మటి మందులు కల్పితాలు అని కొట్టిపడేశాను, దోచేవాడే డాక్టర్ అని విశ్వసించి వాళ్ళను ఎంతగా అవుమానించానో నాకు ఆనాడే తెలిసొచ్చింది. Excersice అయ్యి excalator ఎక్కితే, నా వెనుకే ఒక ఐరావతం iPod పెట్టుకుని అదే Escaltor ఎక్కటంతో escalator తో పాటు ఎక్కడి గ్రహాలు అక్కదే ఆగిపోయాయి.

కిందకు చూస్తే 20 మంది అమ్మాయిలు ఆగిపోయినా ఎస్కలేటర్ మీదే ఏడువారాల నగల గురించి మాట్లాడుకుంటున్నారు. వెనక్కి చూశా ఆ ఐరావతం ఐపాడ్ లో అరవ సినిమా పాటలు ఎంజాయి చేస్తున్నాడు.

ఏ దిక్కు బావుంటుందో అని దిక్కులు చూస్తుంటే, ఎదురుకుండా ఒక పెద్ద కటౌట్ - సమర్ధుడి సాఫ్ట్వేర్ యాత్ర : సాఫ్త్వేర్ పరమ పద సోపానం by safi for safi of safi, బై బ్రదర్ బూదరాజు, for tickets call 9866xxxxxx అని రాసుంది.  వెంటనే ఫోన్ తీశా. బాలెన్స్ లేదు. దేవుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాడని ఆనందిచేలోపు బాలెన్స్ లేదని గుర్తు చేసి భాద పెడతాడు. అర్జంటుగా అంబులెన్స్ కి ఫోన్ చెయ్యాలని ఐరావతం దగ్గర ఐఫోన్ అద్దెకు తీసుకున్నా.

నేనుః రేయ్ కాంతు ..
శ్రీకాంత్ : చెప్పరా ...
నేనుః ఆ కటౌట్ ఎంట్రా ?
శ్రీకాంత్ : మహేష్ బాబు కటౌట్ మీదే కుమ్మేశాడహే,
నేనుః మహేష్ బాబుది కాదు, నేను ఆదుగుతున్నది, ఈ బాబుది.
శ్రీకాంత్ : ఏ సెంట్రల్ దగ్గర కటౌట్ సెంటర్ లో లేదా ?
నేనుః జోకా,  ఆ సొల్లేంటని ?
శ్రీకాంత్ : ఏంలేదు రా, నీ సాఫ్ట్వేర్ experience అంతా రంగరించి, నీ అనుభవాలన్నీ మేళవించి, ఉప్పూ కారం కలిపి, ఉడిపి ఉప్మా చేసి సాఫ్ట్వేర్ జీవితాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు, ఆన్సైట్ అవకాశాలు మీద ఒక లెక్చర్ తీసుకోరా. మొన్న మనం తీర్ధం పుచ్చుకున్నప్పుడు మన జూనియర్స్ కు నువ్వు చెప్పిన సలహాలకు వాళ్ళు మంత్ర ముగ్ధులై అరవీర భయకరులై రెచ్చిపోతున్నారు. నాకు అప్పుడే వచ్చింది ఈ ఆలోచన. సెమినార్ లాంటిది పెడితే పెద్ద హిట్టైయ్ ప్రజల్లో హీటు పెంచుతుందని.

నేనుః అప్పుడేదో అలా చెప్పాను. కానీ వీటికి ఎవరొస్తార్రా?

శ్రీకాంత్ : అలా అనమాకా, అసలే ఈ మధ్య సినిమాలు తక్కువా రివ్యూలు ఎక్కువైన రోజుల్లో  ప్రజలు కొత్తదనం కోరుకుంటూన్నారు. దానికి తోడు చానెల్స్ ఎక్కువా న్యూస్ కూడా తక్కువైపోయాయి. ప్రజలు ఉత్తేజాన్ని కోరుకుంటున్నారు. అందులోనూ మన వాళ్ళు మరీనూ. బోర్ద్ పెడితే బోలెడు మంది జనం. ఇప్పటికే సగం  పైన టిక్కెట్లు అయిపోయాయి తెలుసా. నా మాట వినా రా  నీకూ ఒక రూపాయి వస్తుంది. ఎన్నాళ్ళని బాలెన్స్ లేని ఫోను వాడతావు చెప్పు. ఎప్పుడో ఇంజినీరింగ్ సెకండ్ యియర్ లో పది రూపాయిలు పెట్టి చోటా రీచార్జ్ చెయ్యించినట్టు గుర్తు. నీ పేరు చెప్పి నేను ఒక రూపాయి సంపాదించి పెట్టుకుంటా. నీ ఫోను కంటూ ఒక బాలెన్సూ నా ఏకౌంట్ లో కొంత బాలెన్సూ వద్దా చెప్పు"- అని వివరాలు వెళ్ళగక్కాడు.

నేనుః నువ్వన్నది కరక్టే , అయినా మన టీమ్ లో చాలా మంది ఇంటెలిజెంట్స్ ఉండగా మన లాంటి ఎధవతో ఎందుకురా ప్లాన్ చేసావ్?

శ్రీకాంత్ : ఇంటెలిజెంట్స్  చెపితే వాడు ఇంటెలిజెంట్  కాబట్టి అలా చెప్పాడు అనుకుంటారు, వెధవ అయితే వీడు మన లాంటి వెధవే కాబట్టి అని వింటారు. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ఇదే. నువ్వు వెధవవే కావచ్చు కానీ ఆ వెధవతానికి కూడా ఒక అర్ధం కల్పిస్తావురా. అర్ధరూపాయ్  పీచు మిఠాయి నయినా ఆరుసార్లు ఐదు రూపాయిలకు అమ్మగలవ్. నీకా టాలెంట్ ఉంది.

వాడి మాటలకు నా మనసు, ఎస్కలేటర్ ఒక సారి కదిలించాయి.

నేనుః అయినా నాకా అర్హత ఉందంటావా ?

శ్రీకాంత్ : ఈ ఊర్లో మొదట సాఫ్ట్వేర్ జాబ్ చేసింది మీ తాత, ఆన్సైట్ కెళ్ళింది మీ తాతే. దాని కన్నా అర్హత కావాలంటావా ?

నేనుః సరేరా నేను రెడీ, అయినా బ్రదర్ బూదరాజు ఎంట్రా ? మా బాబు విన్నాడంటే బెతలహామ్ తీసుకెళ్ళి బ్రాందీ బాటిల్ పెంకులమీద భరతనాట్యం చెయ్యిస్తాడు.

శ్రీకాంత్ : అది నా క్రియేటివిటికి పరాకాష్ట అనుకో కానీ నువ్వు కుమ్మేయ్యాలి మామ ఏమంటావ్

నేనుః ఏమంటా నీ మాటకు 'ఉ' అంటా... ఇంతకీ సాఫీ ఏంటి ?

శ్రీకాంత్ : stephan speilberg avataar lo ఒక కొత్త జాతి వాళ్ళను నాజి అన్నాడు. నేను మన సాఫ్ట్వేర్ జాతికి కొత్తగా  సాఫీ అని పేరు పెట్టా.

నేనుః బావుంది. ఇంతకీ టార్గ్ట్ట్ ట్ ఎవరు ?

శ్రీకాంత్ : స్టూడెంట్స్, టైనీస్, ఇంజినీర్స్,

ఎప్పుడు ?

ఎళ్ళుండి

----

||  సమయం 6:30 వేదికః రమ్యా గ్రౌండ్స్ కూకట్ పల్లి ||వందల్లో జనాలు ఎగిరి ఎగిరి నన్నే చూస్తున్నారు. పంజాబీ పాగాలు, తమిళ తంబీలూ రావటంలో కాంతు గాడు ఒక అనువాదకుడికూడా ఎరేంజ్ చేసాడు. నెమ్మిదిగా స్టేజెక్కా..
"ఇప్పుడు నేను చెప్పేది రహస్యం కాదు. అదే నిజమని గుర్తించలేకపోయి రహస్య మని భ్రాంతి చెందుతున్నా సామాన్య విషయం. "-అన్నా
దానికి అనువాదకుడు "Mr Aswin is saying Good Morning, ఆమెన్ "-అన్నాడు.
అందరూ లేచి Good Morning aswin అన్నారు.
భాయాందోళనల మేఘాలు కమ్ముకున్న వాడినై శ్రీకాంత్ వంక చూశా.వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మైక్ ఎడ్జస్ట్ చేస్తున్నట్టు నటిస్తూ
"రేయ్ నువ్వు ఈ తెలుగులో చెపితే కష్టం. మామూలు తెలుగులో చెప్పు " అన్నాడు.
"అశ్విన్ బూదరాజు యుద్ధం లో ఓడిపోయినా వాడు. మీరు యుద్ధానికి వెళుతున్నట్టివారు. ఇది ఒక సేనాధిపతి మరొక సేనాధిపతితో చెప్పే రహస్యం. ఒక వెధవ పది మంది వెధవలతో చెప్పే వేదం",
అంతే ఈలలు, చప్పట్లు, గోలలు, కేరింతలు. ఆహా వెధవా, ఈడియట్ అన్న పదాలకు ఇంత రెస్పాన్స్ ఉంది కాబట్టే   బహుశ  పూరీ జగన్నాద్ ఇలాంటి టైటిల్స్ పెడతాడు కాబోలు అని ఇలా మొదల పెట్టా...

స్టూడెంట్స్...

సాఫీ జీవితాల్లో ఇది ముఖ్యమైన దశ. ఇదే ముఖ్యమైన దశ అని గుర్తించలేనీ దశ కూడా ఇదే.ఈ కాలంలో ఇంజినీరింగ్ జాయిన్ అవ్వగానే irrespective of branch కంప్యూటర్ కొనటం అటు స్టూడెంట్స్ కి ఇటు పేరెంట్స్ కి అలవాటైపోయింది.కేబుల్ tv తో పాటు internet కామన్ అయిపోయింది. Internet రాగానే గూగుల్ ఓపెన్ చేసి వెంటనే మీరు కొట్టేది  'bipaasha basu latest hot pics'. ఆల్రెడీ మీ కంప్యూటర్ లో bipaasha basu hot pics ఉంటాయి, కానీ మీకు latest hot pics కావాలి. ఆ ప్రయత్నం లో గంటలు తరబడి సమయాన్ని వృధా చేస్తారు. ఆ సమయంలో పదో వంతు protocol handlers మీద చూపిస్తే ఈపాటికి ఐపాడ్ అనకాపల్లిలో ఎప్పుడో తయారయ్యేది. మీలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విధ్యార్ధులు ఉంటే ఇప్పుడన్నా మారండి.

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మూడు రకాలు. అతి గాళ్ళు, ఆల్చిప్పల్లు, ఆనామకలు. అతిగాళ్ళు : వీళ్ళు మొదటి రెండు బెంచీలలో కూర్చునే వారు. అయిన దానికి కాని దానికి నేను చెపుతా నేను చెపుతా అంటూ చెతులెత్తుతుంటారు. మిగతా వాళ్ళకు, టీచర్స్ కి చిరాకు తెప్పిస్తుంటారు. అబద్ధం చెప్పటం పాపం అని భావిస్తారు. ఎదగనటువంటివారు.   వాళ్ళేదో చెప్దామనుకునే వారు కాని వాళ్ళకు చెప్తే వినే రకం కాదు. ఆల్చిప్పలు :  లెక్చరర్ ఏదన్నా అడిగితే ఆల్చిప్పల్లా నోరు తెరచి మన్మోహన్ సింగ్ లా ఎక్ప్రెషన్ లెస్ ఫేస్ చూపిస్తారు. వీళ్ళకు కావల్సిందల్లా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కింగ్ ఫిషర్ బీరు. వీళ్ళకు అబద్దాలు చెప్పాలని ప్రయత్నించినా చెప్పే తెలివి తేటలు ఉండవు.ఉత్తినే దొరికిపోతారు. వీళ్ళకు చెప్పినా వేస్టు. మొదటి  బెంచ్ వాళ్ళు చివరి బెంచ్ వాళ్ళు కాకుండా మధ్యలో ఉండే వారు యోగ్యులు.  వీళ్ళు దేశానికి చాలా ఉపయోగ పడతారు. ఎంత పెద్ద సమస్య నైనా తెలివి తేటలతో, అబద్దాలతో అల ఓకగా సాల్వ్ చేస్తుంటారు. వాళ్ళ నరనరాల్లో అబద్దాలు, తెలివి తేటలు ఇంకిపోయుంటాయి ఎలాగంటే నిద్దరలో లేపి పడుకున్నావా అని అడిగితే ఠక్కని లేదని చెప్తారు. పన్నీరు లాంటి వీళ్ళ పస ని బూడిద లాంటి లవ్వు లో పోసి టైమ్ వేస్టు చేసుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కే టైమ్ వేస్టు చేసుకుని కాంపస్ లో జాబ్ కొట్టి కలర్ సినిమా చూసే చాన్స్ మిస్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఏ ఏ విభాగాల్లో ఉన్నారో తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీ అనామకులైతే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.

ట్రైనర్స్ ...

కాంపస్ ప్లేస్మెంట్ ద్వరానో, ఫేక్ యక్పీరియన్స్ ద్వారానో, మీరు కంపెనీ లోకొచ్చేస్తారు. మీకు PL వర్కిస్తాడు. వర్క్ చక చక 10 నిమిషాలలో పూర్తి చేస్తే PL దండేసి చప్పట్లు కొడతాడు అనుకుంటారు. చత్తనా .... (బూతూ..బూతూ..బూతూ ) అప్పుడు PL నీకు చిన్న వర్క్ ఇచ్చానని తను ఫీల్ అయ్యి ఇంకొంచెం వర్కిస్తాడు లేక పోతే తను చెయ్యాల్సిన వర్క్ నీకిస్త్రాడు తప్ప తమిళ్ సినిమల్లో లాగా సడన్ గా నవ్వు రావటం,ఏడవటం, చావటం లాంటి ట్విస్టులుండవు.  మరెలా  అనుకుంటున్నారా ? PL పని ఇవ్వగానే.. స్టేషనరీకి వెళ్ళండి. ఒక నోట్సు, రెండు పెన్నులు తీసుకోండి ఒక బ్లూ పెన్నూ, వైట్ పెన్నూ. ఇంతలో ఎవరో చెయ్యెత్తారు.
నేనుః చెప్పమ్మా..
'సార్, వైట్ పెన్ను ఏంటి సార్ ?'.
నేనుః మీది విజయవాడా ?
'అవునండి,మీకెలా తెలుసు ? "
'విజయవాడ వాడికి వోల్టేజ్ ఎక్కువ, పూర్తిగా వినకుండానే డౌట్లడుగుతుంటాడు, అబ్బా సుబ్బారావ్  వైట్ పెన్ను  అంటే పెన్ను వైటని , సరేనా.."
PL ఎదో కష్టమైన పని ఇచ్చాడాని పేపర్లన్నీ తెగ నింపేసి, నోట్లో పెన్ను పెట్టుకుని ఎదో అలోచిస్తున్నట్లు నటిస్తూ, ఓ గూగుల్‌లొ పెతికేస్తూ, టెంషన్ పడుతున్నట్టు బిల్డప్  ఇస్తూ.. ఎవరన్నా ఫోన్ చేస్తే బిజాగా ఉన్నాను అని PL కి వినపడేలా చెప్తూ తెగ నటించాలి. PL కన్నా ముందే  రావాలి. PL వెళ్ళిన తరవాత గానీ మనం వెళ్ళ కూడదు. బయట PL కనపడితే  విష్ చెయ్యాలి. అలా మూడు రోజులు నటించి డెడ్ లైన్ ముందురోజు PL ని పొగిడి వర్క్ సబ్మిట్  చెయ్యాలి. అలా చేస్తే మీకు 100/100/

అంతే కాకుండా PL హెల్ప్ చెయ్యటం. తనే మీ ప్రొఫిషన్ లో రోల్ మొడల్ అని పబ్లిగా ప్రకటించటం లాంటి మళయాలి మంత్ర విద్యలు ప్రదర్శిస్తే ప్రాజెక్ట్ లో మీ గ్రోత్ త్వరగా ఉంటుంది.

అదే మీ PL ఆడ లేడీస్ అయితే మరింత జాగ్రత్త గా వ్యవహరించాలే తప్ప, మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే అయితే ప్రత్యేకించి ఉమెన్స్ డే ఎందుకు అన్నటువంటి physco thriller questions ఎట్టి పరిస్తితిలో వెయ్యకూడదు.

----
నేను తరవాత ఘట్టం మొదలు పెడుతుండగా, ఎవరో అమ్మాయి సడన్ గా స్టేజ్ మీద ప్రత్యక్షమైంది, నేను వెంటనే 'మా పేస్టులో ఉప్పుందండి, ప్లీజ్ ప్లీజ్ నన్నేంచెయ్యద్దు నన్నేంచెయ్యద్దు అని బతిమిలాడటం మొదల పెట్టాను'. శ్రీకాంతు గాడు పక్కకు లాగి  నీ బొంద ఇది వ్యాపార ప్రకటన 7:30 కి టి బ్రేక్ అని చెప్పాను గా అన్నాడు.

అప్పటి దాకా నా స్పీచ్ వింటూ నిద్రాపోతున్న వాళ్ళందరూ నిద్ర లేచి ఆ అమ్మాయిని చూస్తూ సొంగ కారుస్తున్నారు. ఆ అమ్మాయి.

హాయ్, నా పేరు షైలఝా, మీరు online లో టెలుఘు రాయలంఠే వాఢంఢీ e పలక e పలక e పలక 
వెంటనే రేయ్ ఎవరన్నా తెలుగు లేడీ యాంకర్ ని పెట్టచ్చు కదరా...
"ఆ అమ్మాయి తెలుగు తెలిసిన లేడీ యాంకరే ఇలా మాట్లాడితేనే ట్రెండ్...కావాలంటే చూడు అందరూ చప్పట్లు కొడతారు"- అన్నాడు
అందరూ విపరీతంగా చప్పట్లు కొట్టారు.
నాకు  బుర్ర బ్లాస్ట్ అయ్యింది.
'ఇప్పుడు స్మాల్  ఠీ బ్రేఖ్'  ... అని అమ్మాయి మాయం అయిపోయింది.

<<  టి బ్రేక్ తరవాత >>

ఎక్పీరియన్స్డ్ 

ఒక సాఫీ కంపెనీలో జాయిన్ అవ్వగానే 25మార్కులు తెచ్చుకుంటాడు. మొదటి సారి జీతం తీసుకున్నప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటాడు. ఆ తరవాత రేంటింగ్ వచ్చి జీతం పెరిగినప్పుడు 75  మార్కులు తెచ్చుకుంటాడు. చివరకు ఆన్సైట్ కి వెళ్ళినప్పుడు నూటికి నూరు మార్కులు తెచ్చుకుని పరిపూర్ణమైన సాఫీ గా సాఫీ గుర్తింపు పొందుతాడు.

ఎక్పీరియంస్డ్ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టైతే వాళ్ళకు ఈపాటికే 75 మార్కులు వచ్చుంటాయి. చాలా మంది అనుకుంటుంటారు నేను కష్టపడి పనిచేస్తే కంపెనీ వాళ్ళు ఆన్సైట్ కి పంపిస్తారు అని. కానీ వాస్తవం వింతగా ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర రెండు కుక్కలున్నాయనుకోండి. మీరు బంతి విసిరేశారు. ఒక కుక్క వెళ్ళి తీసుకొచ్చింది. మళ్ళీ విసిరేశారు మళ్ళీ తీసుకొచ్చింది.మళ్ళీ విసిరేశారు మళ్ళీ తీసుకొచ్చింది. మీరెన్ని సార్లు విసిరేసినా అది తీసుకొస్తునే ఉంది. మరి రెండో కుక్క, మీ మీద పడి ఓ నాకేస్తుంది. మీ కాళ్ళ దగ్గరే కూర్చోని ఎంటర్ టైన్ చేస్తుంది. నవ్విస్తుంది. మీ దగ్గర ఒక బిస్కెట్ ఉందనుకోండి. మీరు ఆ రెండు కుక్కల్లో ఎవరికన్న వేద్దామనుకున్నారు. మీరెవరికి వేస్తారు ?

ఒకడు లేచి నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పమ్మా  ఏ కుక్కకు వేస్తావు ?
మూతి నాకుతున్న కుక్క వేస్తాను సార్ అన్నాడు
ఎందుకు ? - అన్నా నేను
ఎందుకంటే మొదటి కుక్కకు వేస్తే అది మళ్ళీ నా దగ్గరకే తీసుకుని వస్తుంది కాబట్టి అన్నాడు
"బాబూ నీ పేరేంటి ? "
"ఉత్తరాషాడ అండి "
"మీది తెనాలా ? "
"అవునండి, మీకెలా తెలుసు ? ఏం నాలో కాన్ఫిడెన్స్ చూసి కనుక్కున్నారా ?"
"ఇంచుమించు అలాంటిదే కానీ, మనం తరవాత మాట్లాడుకుందాం  "

చూడండి ఉత్తరాషాడ గారి మాటల్లో సగం నిజం ఉంది. మొదటి కుక్క తన కు బాల్ మాత్రమే కావాలని ఇంప్రషన్ క్రియేట్ చేసింది where as రెండో కుక్క బిస్కెట్ కావాలన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అదే మొదటి కుక్క రెండు సార్లు బాల్ తీసుకొచ్చి నాకు బిస్కెట్ ఇస్తేనే బాల్ తీసుకొస్తానని చెప్పిందనుకోండి కచ్చితంగా బిస్కెట్ ఇవ్వాల్సిందే. పని చెయ్యాలి, మనకు కావాల్సింది అడగాలి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. కొందరూ ఆన్సైట్ చాన్స్ రావట్లేదని ప్రాజెక్ట్/కంపెనీ మారుతారు. అది చాలా తప్పు. పెళ్ళి కొడుకుకి అది రెండో పెళ్ళైనా, అత్తింట్లో కొత్తళ్ళుడే అంటారు, కొత్త ప్రాజెక్ట్ లో మిమ్మల్ని fresher అనే అంటారు.

ఒక్కోసారి మనం ఎంత చేసినా  కష్టపడినా ఆన్సైట్ చాన్స్ రాదు. ఆన్సైట్ చాన్స్ అనేది లాటరీ టిక్కెట్ లాంటిది. కొంటం మన చేతుల్లోనే ఉంటుంది తగలటం అన్నది తలరాత డిసైడ్ చేస్తుంది.

ఓపికా, saatisfaction కూడా చాలా important. ఉన్నదానితో satisfy అవ్వలేని వాడు, వాడి దగ్గర ఏదున్నా, ఎంతున్నా satisfy అవ్వలేడు.

----

చివరిగా, యమగోల సినిమాలో  NTR నరకలోక కార్మిక సంఘం చూసి ఇంస్పైర్ అయ్యి మా స్నేహితుడు శ్రీకాంత్ ప్రోత్సాహంతో నేనొక సాఫీ సంఘం అమీర్ పేట్ లో ఏర్పాటు చేసానని మీ ముందు సవినయంగా తెలియచేసుకుంటున్నాను. మనలో సాంఘిక చైతన్యం కోసం, విప్లవ శక్తి కోసం, మన బాధలు పంచుకోటానికి ఈ సంఘం ఏర్పాటు చెయ్యటం జరిగింది. ప్రతి ఆదివారాం ఆరింటికి అక్కడకు వచ్చి మీ భాదలను సాటి సాఫీ లతో పంచుకోవచ్చు. 

ఇంక సెలవ్ 

--- 
వారం రోజుల తరవాత, సెమినార్ తాలూకూ ప్రాఫిట్ కోసం శ్రీకాంత్ కు మెయిల్ చేశా... వాడు వెంటనే ఈ విధంగా రిప్లై చేశాడు. 

మన డీల్ ప్రాఫిట్ తాలుకు వివరాలు ఇవి. ఇంత పెద్దమొత్తమైన నీ డబ్బు ఏ బాంకులో వెయ్యలో అర్ధం కాక,  Airtel 333  Full Talk Time ఆఫర్ ఉంటే నీ మొబైల్ కి రీచార్జ్ చెయ్యించా. ఓ 20 సంవత్సరాలు దర్జాగా వాడుకుంటావని ఆశిస్తూ 

నీ శ్రీకాంత్.