Friday, February 14, 2014

Love You శ్వేత

ప్రియమైన శ్వేతకు,

ఈ ప్రేమికుల రోజున

కొందామనుకున్నానే కాంతామణి kohinoor వజ్రమంట అదేదో, 
తీరా కొన్నాక Koti సరుకనుకొని కాలదన్నేస్తావని కలవరపడ్డా...

నగలు, బట్టలు కొందామనుకున్నా, 
కానీ నా ప్రేమకు ఖరీదుకన్నా quality  ఎక్కువని calm అయిపోయా...

మా ఆస్తి అమ్మి Taj Mahal  కడదామనుకున్నా, 
కానీ మా నాన్న తాట తీస్తాడని drop అయిపోయా.

Chocolates, Teddy Bear లు కొందామనుకున్నా, 
నా cheap  ఆలోచనలు చూసి నాకే చిరాకేసింది.

నీపై ఒక ప్రభంజన కావ్యమైనా రాద్దామనుకున్నా, 
కానీ ఈ ఉత్తరంలో ఎన్ని అక్షర దోషాలున్నాయొ మూడు సార్లు చదివినా అర్దం కాని నాకు ఆ అర్హత లేదనిపించింది.

కవిత్వమైనా రాద్దామనుకున్నా, 
పదో తరగతి లో ఉన్న పద్యాలను ఉన్నది ఉన్నట్లుగా చదవలేని నాకు కవిత్వం చాలా ఎక్కువనిపించింది.

చివరకు ఈ నాల్గు ముక్కలకు ధైర్యం దక్కింది.

మందు కొట్టి మద్య కుట్టు చించి, మూడు ముక్కలు వ్రాసి నీ మొహాన పడేశాననుకోకు. నీపై ప్రేమ ఎంతుందో లోతు తెలియని నా గుండె మధ్య నుంచి వచ్చిని మాటలివి. (వహ్ వా-వహ్ వా)

ఇలా ఉత్తరాలు రాయటం old concept అని నా అలోచనలను అటకెక్కించెయ్యకు. Vodafone లేనప్పుడు ఆ వాలెంటైనుడు కూడ ఇలా ఉత్తరాలే రాసుండచ్చు. ఆ Valentine old కానప్పుడు ఈ Valentines day old కానప్పుడు, ఈ ఉత్తరం concept కూడా old కాదు. ఇంతకీ విషయంలోకొస్తే ఈ ప్రేమికుల రోజు సంధర్భాన నా మనసు విప్పి మళ్ళీ మరోసారి "I LOVE YOU". ఇది సాదా సీదా పదమని మరీ సింపుల్గా తీసుకోకు. ఈ సమాజంలో వాడకం ఎక్కువై value పోయినట్టు కనిపిస్తుంది కానీ...

అలసిన మనసుకు ఉత్తేజం ఆ పదం,
ఒంటరి జీవితానికి తోడు ఆ పదం,
భయపడే మనసుకు ధైర్యం ఆ పదం,
భాధలో ఉన్న మనసుకు బుజం ఆ పదం,
గెలిచిన మనసుకు గోల్డ్ మెడల్ ఆ పదం,
నా ఈ జీవితానికి నువ్వే ఆ పదం.  ( మళ్ళీ వహ్ వా-వహ్ వా )

ఈ రోజు Valentines day కాబట్టి నువ్వు చెప్పావే, ప్రతిరోజు ఎందుకు చెప్పవ్ అని నువ్వు అడగచ్చు. నా దగ్గరా ఇలాంటి  ప్రశ్నలకే కాదు

మొగలిరేకులు సీరియల్ climax ఏంటి ?
రాంగోపాల్ వర్మ అడవి సినిమాలో విలన్ ఎవరు ?
బాగా ఏడ్చినప్పుడు కంట్లో నుంచే కాక ముక్కులోనుండి కూడా నీళ్ళెందుకొస్తాయ్ ఇలాంటి కచ్చా పిచ్చా ప్రశ్నలకు సమాధానాలు లేవు. But I love you

-------------------------------------
సర్ మీరు ఇక్కడ కూర్చోని suicide note రాస్తున్నారని barrer చెపుతున్నారు, ఎం రాస్తున్నారు sir 
మనమొహానికి అంత సీన్ లేదుకానీ ఒక Turbong Strong చెప్పండి.
వాడు: Snacks ఏమన్న చెప్పమంటారా ? చిల్లి చికెన్, చికెన్ 65
నేను: నేను వెజిటేరిన్, బీర్ మాత్రం చిల్డ్ గా ఉండాలి 
-------------------------------------
చివరకు దీన్ని ప్రేమ లేఖ అంటారా అని ఆడగకు, బహుశ ఆ ప్రేమ లేఖ template ఇలా ఉండదేమో కానీ ఇది ప్రేమతో రాసిన లేఖ. 

ఈ materialistic మనిషికి 1,0 మాత్రమే అర్ధం అయ్యే computer తో గడిపే మనిషికి, నువ్వనుకునే మనసులేని మనిషికి ఈ ఉత్తరం రాయటానికి అరగంట పట్టింది. కానీ నువ్వనుకునేది నిజమేమో నా ఈ అనుభవానికి ఆరున్నర ఏళ్ళు పట్టింది.

ఈ రోజు కూడ లేటుగా ఆఫీస్ నుండి వచ్చినా latest గా వచ్చానని ఆశిస్తూ ...

వెఱ్రిబాగులోడిని ప్రేమించటం కన్నా నాలా కూసింత వెఱ్రి ఎక్కువున్నవాడిని ప్రేమించటం చాలా కష్టం. ఆ నీ ప్రేమకు దాసోహం. 

Irrespective of Valentines day
 నిరంతరం నిన్ను ప్రేమించే 
నీ 
అస్సి

P.S
ఇలాంటి పిచ్చొత్తరాలు ప్రతి సంవత్సరం ఆశించకు. ఈ సారి
ముందు టైం ఉంది
బార్ లో బీరుంది
బుర్రలో ఐడియా ఉంది
జేబులో కాషుంది

P.P.S

శ్వేతా,
భార్యా భర్తల అనుభందం గురించి పెదరాయుడు సినిమాలో మొహన్ బాబు ఎమన్నాడో తెలుసా...

The relationship between wife and husband should be like fish and water, but it should not be like fish and a fisher man.

ఈ ఉత్తరంలో తప్పులుంటే మన్నించు,
ఈ ఉత్తరమే తప్పనుకుంటే క్షమించు.

23 comments :

 1. హ్హ హ్హ .. సూపరండీ .. భలే రాసారు !

  ReplyDelete
 2. brilliant! Glad to see your wit continue to flourish even after marriage :)

  ReplyDelete
 3. Mukeshhhh.........super :):)

  ReplyDelete
 4. Aswin.. Chaalaa baagaa rasaaru.. :-):-)

  ReplyDelete
 5. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

  ReplyDelete
 6. మీ ఇద్దరికీ దండాలు సామే ;))

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. ప్రేమ లేఖ template ఇలా ఉండదేమో కానీ ఇది ప్రేమతో రాసిన లేఖ. ...
  Nice Lines but kavitwam anthaa baavundi

  ReplyDelete
 9. అద్భుతం, వర్ణణాతీతం, అమూల్యం (ఈ-పలక సౌజన్యంతో)

  ReplyDelete
 10. హహహహ సూపర్బ్ అశ్విన్ :-))

  ReplyDelete
 11. super pedarayudu dialogue tho ending inka super boss...

  ReplyDelete
 12. almost half an hour nunchi navthunna sir....but really osm thoughts :) RAMRAJ

  ReplyDelete
 13. First line chadivina tarvatha padu nimushalu pattindi next line chadavatanikiiii.......

  Super Ashwinnnn...

  Inta variety ga, ye Valentine letter undadu

  ReplyDelete
 14. చాలా బాగున్నది మీ ఆడ పిల్ల , అగ్గి పుల్ల , సబ్బు బిళ్ళ

  ReplyDelete
 15. సూపరు...(ఎందుకంటే మా నాన్నారు పోస్టాఫీసులొ పనిచెసేవారు).


  బాధ లేక భాధ? వెధవ!...Post చేసే ముందు check చేసుకో!

  ముందు కాదురా...మందు...  చివరిగా క్షమించా!


  నీ మమ

  ఆనీల్ చీమలమఱ్ఱి (aceanil.blogspot.com)

  ReplyDelete
 16. తమాషా ప్రేమలేఖైనా , తన్మయత్వంతో రాసారు కాబట్టి బాగుంది సార్...మీ ప్రేమ కలకాలం వర్థిల్లు గాక ...:)

  ReplyDelete
 17. అమెరికా లో ఉంటున్న నేను వీకెండ్ ఎలా టైమ్ పాస్ చెయ్యాలో తెలియక జస్ట్ గూగల్ సర్చ్ చేస్తే మీ బ్లాగ్ దొరికింది ... మట్టిలో మాణిక్యం లా.. చాలా బావుంది మీ బ్లాగ్ & టపా... వః వాహ్.....

  ReplyDelete
 18. Good one. Looks like all love stories with a happy ending will get to listen to similar lectures on Valentine's Day after couple of years. Could relate to the P.P.S part.😀

  ReplyDelete