Sunday, July 21, 2013

అమ్మా-నాన్నా- ఓ అరటి చెట్టు

ప్రియమైన రమ్యకు. ( ఇక్కడ కామా పెట్టాలని మా తెలుగు మాష్టారు చెప్పారు. కానీ నా  కీబోర్డులో  కామా ప్రస్తుతానికి పనిచెయ్యటం లేదు)

మొన్న  మన ప్రేమ సంగతి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి వచ్చినప్పుడు మీ అమ్మగారు 'అరటికాయ చిప్స్ తిను బాబు' అనగానే అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా మీ అమ్మగారినెత్తుకుని డాబా మీద నుండి విసిరేయాబోయానని నన్నుతప్పుగా అర్ధం చేసుకుంటావేమోనని ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు అరటికాయ కూరంటే ఫిజికల్గా ఎలర్జీ అన్న విషయం నాకు తెలుసు కానీ మెంటల్గా కూడా ఎలర్జీ అన్న విషయం నాక్కూడా అప్పుడే తెలిసింది అది కూడా శ్రీకాంత్ గాడు నాజర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు కాబట్టి.  అసలు ఏమి జరిగిందంటే...

------------------------------

1995 ఆగష్టు నేను ఐదవ తరగతి చదువుతన్న రోజులలో 

భారత దేశ మొదటి ప్రధాని ఎవరు ? --  నెహ్రూ గారు
భారత దేశ మొదటి ప్రధాని ఎవరు ? --  నెహ్రూ గారు
భారత దేశ మొదటి ప్రధాని ఎవరు ? --  నెహ్రూ గారు

అని మా చెల్లి ఎప్పటిలాగే ఎదో ఒకటి చదువుతూనే ఉంది చండాలంగా . నేను మా ఇంటి గోడపై ఉన్న బల్లి తో 'నీకు తెలుసటే మన దేశ మొదటి ప్రధాని ఎవరో ?'-అని అసమర్ధుని జీవితయాత్రలో సీతారామారవు లాగా మాట్లాడుతున్నా. ఇంతలో శ్రీకాంత్ వచ్చి రేయ్ మా soldtire TV లో సచిన్ సెంచరీ కొట్టాడు మీ Dyanora TV లో కొట్టాడేమో చూడు అంటే TV పెట్టా. అవును సచిన్ సెంచరీ కొట్టాడు, ఆ టైమ్ లో TV పెట్టినందుకు మా అమ్మ నన్ను చచ్చేటట్టు కొట్టింది. నా పాటికి నేను కన్నీళ్ళు కారుస్తుంటే, నా కన్నీళ్ళు తుడవటానికి మా నాన్న వచ్చారు. నా కన్నీళ్ళు తుడవాలంటే నాకేమన్నా కొనిపెట్టాలని మా నాన్నకు తెలుసు. ఏం కావాలమ్మా అనడిగారు. నాకు బోలెడు అరటిపళ్ళు కావాలి అన్నా. వెంటనే తన గరుత్మంతునిపైయేగి అరటిపళ్ళ కోసం విజయవాడంతా తిరిగారు. ఆ రోజసలు ఎక్కడా అరటి పళ్ళు దొరకలేదు. అలసి ఓ చెట్టు నీడన కూర్చుండగా వేంకటేశ్వర శ్వామి సుమన్ వేషం లో వచ్చి చిన్న అరటి పిలకనిచ్చారు. మా నాన్న దాన్ని పెరట్లో నాటారు. దాని సంరక్షణా భాధ్యతలను నాకప్పగించారు. నేను కూడా అది పెరిగితే దాని అరటి పళ్ళన్నీ నావే అన్న ఆశతో, ఉద్దేశంతో, ప్రేమతో, కోరికతో  ప్రతి రోజు లేచి నీళ్ళు పోసి జాగ్రత్త గా చూసుకుంటుండేవాడిని.

ఇలా కొన్నాళ్ళ తరువాత మా తాత గారు ఓ రోజు మా చెల్లికి వారాల కధలు చెప్పటం మొదలెట్టారు.
ఆదివారం నాడు అరటి మొలిచింది. నేను పెరట్లోకి వెళ్ళి  చూసుకున్నా, అవును మొలిచింది మొలిచింది. మా ఇంట్లో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు
సోమవారం నాడు సుడివేసి పెరిగింది. నేను పెరట్లోకి వెళ్ళి చూసుకున్నా, అవును పెరిగింది పెరిగింది. మా ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు
మంగళవారం నాడు మారాకు తొడిగింది, అవును తొడిగింది, తొడిగింది.
బుధవారం నాడు పొట్టి గెల వేసింది, అవును వేసింది వేసింది
గురువారం నాడు గుబురులో దాగింది, అవును దాగింది దాగింది
శుక్రవారం నాడు చకచకా గెలకోసి అందరికీ పంచితిమి

ఏంటి గెలకోసి పంచేది అప్పుడే ? పండాలిగా అన్నా నేను. పండాలంటే గురువారానికి శుక్రవారానికి మధ్యలో మరో వారం ఉండాలి అన్నారు మా తాత గారు. లేదు తాతయ్యా అవి పండి తీరాలి, అంటే గురువారానికి శుక్రవారానికి మధ్యలో ఇంకో వారం ఉండాలి. ఒక సారి గుర్తుచేసుకో గురువారం తరవాత వెంటెనే శుక్రవారమేనా మధ్య లో ఇంకేమన్న వారముందేమో అలోచించు అడిగానేను. మా తాతల కాలం నుండీ గురువారం తరవాత శుక్రవారమే కాబట్టి కాయలు కోసేసుకోవచ్చు అని డంఖా పధంగా తేల్చి చెప్పాడు. మరి కాయలు పండాలేదే అనడిగా. తీక్షణంగా అరటి  చెట్టు పరిశీలించి మా తాత గారు ఇది పండదు ఎందుకంటే ఇది 'కూరరటి' చెట్టు అన్నారు. దాంతో ఎక్కడో ఏ మూలనో భాధేసింది. శ్రమ వృధా అయ్యిందని. అయినా ధోని లా పెద్దగా పట్టించుకోలా.

ఆ రోజు సోమవారం.
కూరల తాతయ్య రాలేదు.  మా అమ్మ నన్ను లేపి 'రేయ్ అస్సిగా, కూరల తాత ఇంకా రాలేదు. బడికీ, మీనాన్నాఫీసుకూ టైమౌతుంది. నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు, ఒక పని చెయ్యి నువ్వు పక్కింట్లో నిచ్చెనడిగి అరటిచెట్టు నుండి రెండు కాయల కోయరా అరటి కూర చేస్తా'-అంది. ఆ రోజు మా ఇంట్లో అరటికాయ కూర.ఆ రోజు కూరలకని అట్టిపెట్టిన డబ్బులను డిబ్బీలో వేసింది మా అమ్మ.

మరుసటి రోజు మంగళవారం.
కూరల తాతయ్య మళ్ళీ రాలేదు. మా అమ్మ నన్ను లేపి 'రేయ్ అస్సిగా, కూరల తాత ఇంకా రాలేదు. బడికీ, మీనాన్నాఫీసుకూ టైమౌతుంది. నాకు కాళ్ళూ చేతులు ఆడటం లేదు, ఒక పని చెయ్యి నువ్వు పక్కింట్లో నిచ్చెనడిగి అరటిచెట్టు నుండి రెండు కాయల కోయరా అరటి కూర చేస్తా'-అంది. ఆ రోజు కూడా మా ఇంట్లో అరటికాయ కూర. ఆ రోజు కూడా కూరలకని అట్టిపెట్టిన డబ్బులను డిబ్బీలో వేసుకుంది మా అమ్మ.బుదవారం,
మా అమ్మ నన్ను లేపగానే ఏం అమ్మా ఈ రోజు కూడా తాత రాలేదా? బడికీ నాన్నాఫీసుకు టైమౌతుందా ? నీ కాళ్ళు చేతులు ఆడటం లేదా ? ఏం ఖంగారు పడకు అరటికాయా కూర చేద్దువుగాని అని ఆ రోజు కూడా అరటికాయలు కోసిచ్చా.

గురువారం 
మూడు రోజులనుండి ఒకే కూర తినీ తిని విసుగెక్కి ఆ రోజు అమ్మ కన్నా ముందే లేచి తాతా ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి సైకిల్ మీద ఎక్కించుకుని మరీ ఇంటికి తీసుకొచ్చా. అమ్మా ఈ రోజు కూరల తాత వచ్చాడు. ఇక నువ్వేం ఖంగారు పడక్కర్లేదు అన్నాను. దానికి అమ్మ తాతను పంపేయ్ రేపటి నుండి కూడా రావద్దని చెప్పు అంది. 'ఏ ??'-అనడిగా. 'ఏ ఏంట్రా పిచ్చ సన్నాసి పెరట్లో అరటిచెట్టుండగా బయటెందుకు కొనటం. అసలు అరటికాయ న్యూట్రీషన్ వ్యాల్యూస్ గురించి నీకేం తెలుసు ? అరటికాయలో proteins, vitamins A C E K B6 B12, potasium, manganeese, copper, seleinum, phospohorus, Folic, Thamin, Calcium, Iron, Fiberaturated Fat, Polyunsaturated Fat, Zinc అన్నీ ఉంటాయి తెలుసా ? అసలు నువ్వేం పేపర్ చదువుతునావ్ ? నిన్న గాక మొన్న జపాన్ లో ఆ చుంగ్ గాడికి అదేదో రోగం వస్తే ఏవోవో మందులు వాడారంట చివరకు అరటికాయ కూర చేసిపెడితే తగ్గిందంట. మనకేమో మన ఇంటి పెరట్లో కాస్తే కూరొండుని తినటానికి నామోషీ. 

అమ్మా, అది జపాన్ లో అమ్మా చాలా దూరం ఆ రోగాలు ఇండియాకు రావు. నోర్ముయ్ జపాన్ ఏమాత్రం దూరం ? flight ఎక్కితే 40 minutes అంటే ఇంకో అరగంటలో వచ్చేస్తాయి. నోర్మూసుకుని నేను చెప్పింది విను అని నా చేతే తాతను రావద్దని చెప్పించింది. 

అసలు కారణం ఏంటంటే ? ఎన్నాళ్ళ నుండో మా అమ్మ ఆర్ధిక స్వాతంత్రం కోసం మా నాన్న దగ్గర పోరాడుతున్న పోరాటాలకు ఒక మార్గం ఈ అరటికాయల ద్వరా ఏర్పడినట్ట్లు తనకర్ధమైంది.  ప్రతి రోజు అరటికాయ కూర చెయ్యటం ఆ నాలుగు రూపాయిలు దాయటం. నాలుగు పదులు నలభై, ఐదు నలభైలు ఒక చీర అదీ మా అమ్మ ప్లాన్. ఏ రోజు మధ్యాహ్నం బాక్స్ తీసి చూసినా అరటికాయ కూరే. ఒక రోజు నాకు తిక్క లేచి నేను చెట్టెక్కికోయనన్నా. ఆనాడు బాలభారతంలో అర్జునుడు ఐరావతం కోసం భూమ్మీద నుండి ఆకాశానికి నిచ్చేనేసినట్టు మా అమ్మ కూడా మా నాన్న చేత వంటింట్లో నుండి అరటి పొదల్లోకి ఒక శాస్వత నిచ్చెనొకటి వేయించుకుంది దాంతో అరటి కాయలేం ఖర్మ ఐరావతం తోక కూడ అందేది మా అమ్మకు. ఇదేదో బెండకాయో, దొండకాయో అయితే బావుండేది ఈరోజు కాయలన్నీ కోసేస్తే మళ్ళీ వారం పట్టేది. అదే అరటి చెట్టైతే గెలేసిందంటే 2 నెలలు చచ్చామన్నమాటే. ఎదో హైబ్రిడ్  చెట్టు పెరిగినట్టు టపా టపా మని గెలెల కాసేవి. మూడు నెలల్లో సునాయాసంగా నాలుగైదు గెలలు. కాల క్రమేపి మా అమ్మకు నిచ్చెన అవసరం కూడా లేకుండా పోయింది. పెళ్ళి సందడి సినిమా లో రవళి-జామ చెట్టూ ఫ్రండ్స్ అయినట్టు.మా అమ్మా అరటి చెట్టూ ఫ్రండ్స్ అయిపోయాయి. పెరట్లోకెళ్ళి చప్పట్ట్లు కొడితే చాలు అవే రాలి పడేవి. గెల తరవాత గెల, గెల తరవాత గెల ఇలా తెక్కాసేవి.  ఒకరోజు నాలో కమ్యూనిష్టు నిద్రలేచాడు ఛత్రపతి సినిమాలో ప్రభాస్ లాగా 'ఇక చాలు' అని అరిచా సీన్ కట్ చేస్తే దశావతారం సినిమాలో కమల్ హసన్ ని వేలాడతీసినట్టు అరటి చెట్ట్లుకు వేలాడ తీసి పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇక నా వల్ల కాదని తెలిసి మా చెల్లి ని పురమాయించా. అంబేద్కర్ విగ్రహం ఎప్పుడూ ఎడం చేతిలో పుస్తకం పట్టుకున్నట్టు మా చెల్లి చేతిలో ఎప్పుడూ నెహ్రూ చరిత్ర ఉంటూ ఉండేది . మా చెల్లి అమ్మ దగ్గరకు వెళ్ళి నా బాధ ను తన బాధగా వెళ్ళడించింది. వెంటనే మార్కెట్ కి వెళుతుందనుకున్నా, కానీ బుక్ స్టోర్ కి వెళ్ళింది. అక్కడ ఉన్న అన్ని పిండి వంటలు పుస్తకాల్లోఅరటికాయ చాప్టర్లు మాత్రమే xerox తీయుంచుకుని వచ్చి మా ప్రయోగాలతో ప్రళయ తాండవం చేసింది. 

స్కూల్లో పిల్లలందరూ నన్నేడిపించేవారు. సభ్య సమాజం నన్ను చూసి వెక్కిరించేది. కానీ నేను ఏం చెయ్యలేని నిస్సహాయతలో ఉండేవాడిని. 'నిజంగా ఆ జగన్నాధ రధ చక్రాలొస్తాయంటావా ?'- అని ఆ బల్లితో మాట్లాడేవాడిని. అమ్మ మాత్రం ఇవేం పట్టుంచుకోకుండా రూపాయ్ రూపాయ్ దాచి ఆ యేడు జిల్లా చిన్న మొత్తాల పొదుపు సంస్ధ కార్యదర్శి కూడా అయ్యింది. మా అమ్మ లోని ఈ పొదుపు కోణం చూసిన మా నాన్న మురుసి ముక్కల్లైయ్యేవారు. ఇంతకముందు మా అమ్మ ఏమన్నా కొనమంటే,


భార్యామణి
నా వసంత జీవితపు ఆమని,
నేనేంచెప్పినా వినే శ్రావణి,
మృదు కోమలి,
పావని,
You have to understood that I don't have money. 

అని కవిత్వం చెప్పే మా నాన్న, మా అమ్మ పొదుపు చూసి 

అరటి వంటి కూర
పంకజ ముఖి కళ్యాణి వంటి భార్యయు గలదె!! 

అని చంధస్సుని చండాలం చేసి మరీ చెలరేగిపోయేవారు.

ఆ రోజు నేను మరచిపోలేని రోజు మా అరటి చెట్టుకు గెలలు మీద గెలు వేస్తుందని నేను బాధ పడుతుంటే. మా నాన్న పరిగెత్తుకుంటూ వచ్చి కళ్యాణి మన అరటి చెట్టు పక్కన  మరో పిలక మొలిచింది అని అరిచారు. ఇంటిల్లిపాది పెరట్లోకెళ్ళి చూసాం. మా ఇంట్లో ఒక అలవాటు ఉంది పట్టరాని సంతోషం వస్తే అందరూ వాళ్ళ అనందాన్ని చప్పట్లు కొట్టి వ్యక్త పరుస్తారు. అందరూ ఆనందంతో ఒక అరగంట చప్పట్ట్లు కొట్టారు. ఆనందంతో మా నాన్న హోలీ చేసుకుందాం అన్నారు. మా అమ్మ అరటి పాయసం చేసింది. పాయసం తింటూ అన్నయ్యా నెహ్రూ గారు ఎంచెప్పారన్నయ్యా పిలకలు గురించి ? అడిగింది మా చెల్లి.  నేటి అరటి పిలకలే రేపటి అరటి చెట్లూ అని చెప్పారమ్మా నెహ్రూగారు అని జాలిగా చెప్పా తన వంక చూస్తూ. మరుసటిరోజు ఇంటిల్లిపాది బయటకు వెళ్ళి మా అమ్మకు బాంకెకౌంట్ ఓపెన్ చేశాము. 

ఇలా సంవత్సరం గడిచింది. మా ఇంటి వెనకాల 12 అరటి చెట్లు 12X2 ఎప్పుడూ live అరటి గెలలతో  తరతరాలు తిన్నా తరగని అరటి ఆస్తి ఏర్పడింది. అరిటాకులలో భోజనాలు, స్నాక్స్ గా అరటి చిప్స్, పూతాంబూలం పండుతాంబూలం నోములలో అరటికాయలు, అరటి పువ్వు కూర, అరటి బెరడు కూర ఇలా ఎన్నో రూపాంతం చెందాయి.

ఇక్కడొక నేను రాసుకున్న బూతు సామెత ఒకటి చెప్తా. ఏడుగురు భార్యలు, ఏడు రాజ్యాలు, ఏడుగురు కొడుకులూ అన్నీ పోగొట్టుకున్న ఒక దరిద్రుడు ఆరుబయట డొక్క(mug) పట్టుకుని దొXకి కూర్చుంటున్నాడంట. దాన్ని చూసిన ఒక డేగ ఎదురుకుండా వచ్చి వాలింది. అప్పుడు రాజు ఇంకా నాకేముందే నీకివ్వటానికి కనీసం ఒంటిపై నూలి పోగు కూడా లేదు అన్నాడట. డేగేం మాట్లాడల. తీరా కార్యం అయ్యి ముX కడుక్కునే సమాయానికి డేగ డొక్కెత్తికెళ్ళిందంట. అందుకే అంటా నేను దరిద్రుడు  దొXకి వెళితే డొక్క డేగెత్తి కెళ్ళిందని. నా పరిస్ధితీ అలానే తాయారయ్యింది. ఎందుకంటే ?

సరిగ్గా ఈ సమయంలోనే మా నాన్నకు జగదాంబ చౌదరి గారు వ్యాపారంలో కలిసొస్తుందని చెప్పారు. మనకు ఏం వ్యాపారం చేస్తే బావుండు అని పెరట్లో అలోచిస్తుండగా అరటికాయ తలమీద పడింది. దాని తారతమ్యమేమని చౌదరి గారిని ప్రశ్నించగా 'చూడు హనుమంతు, ఇది దైవ సందేశం. ఇలా నాకు తెలిసి ఇద్దరి మీదే పడింది. ఒకడు Newton అనే ఆంగ్లేయుడు. రెండోది నువ్వు. ఇంకేమాలోచించకు ఎక్కడన్నా ఇంత ధీటుగా అరటి చెట్లు పెరగటం నువ్వు విన్నావా ? అదే నీ పెట్టుబడి అసలు రాహువు 11వ ఇంట్లో ఉండగానే వెధవది నాకు తెలుసయ్యా నీకు కలిసివస్తుందని అని మా నాన్నని ఉత్తేజ పరిచాడు. 

ఇప్పుడు మా నాన్న ఏం చేస్తాడో అర్ధం కాక తెగ టెంషన్ పడుతున్నా. మరుసటి రోజు ఆఫీస్ కు వెళ్ళినట్టే వెళ్ళి రాజీనామా చేసి ఇంటికి వస్తూ వస్తూ నరసింహా ఆడియో కాసెట్ తెచ్చారు. లుంగీ పైకి కట్టారు, తలకు పాగా చుట్టారు పెరట్లో కెళ్ళారు. ముందే ప్లాన్ చేసుకున్నట్టున్నారు మా  అమ్మ మరో 20 అరటి పిలకలు సిద్ధం చేసింది. కాసెట్ లో పాట మొదలైంది. ఏక్కూ తొలిమెట్టూ కొండను కొట్టూ ఢీకొట్ట్టూ కొండలు రెండుగ పగిలేట్టూ తలపడు నరసింహా దాని కి మా నాన్న నరసింహ సినిమాలో రజనికాంత్ ని ఊహించుకుంటూ మొక్కలు నాటి, పాదులేసి, నీరు పోసి పెరడంతా  రచ్చ రచ్చ చేశారు. మధ్యలో చెమట పడితే మా అమ్మ సౌందర్యలా చెమటలు తుడిచేది. ముఖ్యంగా పాటలో నిన్నటి వరకు మనిషివయా నేటి మొదలు నువ్వు రుషి వయ్యా అన్నప్పుడు తెగమురిసిపోయేవారు. నేను ఆ విచిత్రం చూడలేక తలకాయ గోడకేసి బాదుకునేవాడిని. మా చెల్లి మాత్రం నెహ్రూ చరిత్ర చదువుకుంటూ ఉండేది.

నెమ్మిదిగా మా నాన్న వ్యాపార ఐస్కాంతం అవతారం ఎత్తారు. హనుమంతు ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్. మా పెరడను తోట చేశారు. ఇల్లంతా అరటి మయం. రాఘవేంద్రరావు సినిమాలలో ద్రాక్షగుత్తులు వేలాడినట్లు మా ఇల్లంతా అరటి గెలలు వేలాడుతుండేవి. ఓరోజు నా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేక కృంగి కృసించి నసించి క్షీణించి అలసి పడుకున్నా. 

అప్పుడు  కలలో సుత్తి వీరభద్రరావ్ బ్రహ్మానందం కనపడ్డారు. సుత్తి గారు ఇలా అంటున్నారు.'నువ్వు చెపుతున్న కధలో ఏదో లోపముందయ్యా కవి. ఈ కధను నేను సినిమా తీస్తే ఒక ఊరు ఊరంతా పస్తుండి నాకు ముష్టి వేస్తారు. నేను చెపుతా విను విజయవాడలో ఒక గుంటడు అమ్మా ఆకలేస్తుంది అంటాడు. అప్పుడు వాళ్ళమ్మా ఏ ఏ కూరలు చేస్తుందో తెలుసా ? అరటికాయ కూర, అరటికాయ ఉల్లికారం, అరటికాయ అల్లం పెట్టి కూర, అరటికాయ పులుసు, అరటికాయ వడ, అరటికాయ బజ్జీ, అరటికాయ పొడి కూర, అరటికాయ కొబ్బరేసి కూర, అరటికాయ ఇగురు, అరటికాయ మసాల కూర, అరటికాయ పెరుగు పచ్చడి, అరటికాయ పొడి, అరటికాయ ఉల్లికారం, అరటికాయ ఆవ కూర, అరటికాయ పచ్చి కొబ్బరి కూర, అరటికాయ ఫ్రెంచ్ ఫ్రైసు, అరటికాయ పోపు , అరటికాయ కోవా లడ్డు, అరటికాయ పెసరపప్పు కూర, కాల్చిన అరటికాయ పొడి కూర, అరటికాయ మెంతి కూర, అరటికాయ టమోట కూర, అరటికాయ పప్పు, అరటావకాయ, అరటికాయ టిక్కి, అరటికాయ బెల్లం పులుసు కూర, అరటికాయ పాలకూర, అరటికాయ మసాల వెపుడు, అరటికాయ మంచూరియా, అరటికాయ నిమ్మకాయ కూర, అరటికాయ అలసందుల పకోడి, అరటికాయ తొక్క పచ్చడి,  అరటికాయ సెనగల కూర, అరటికాయ వెల్లుల్లి కారం, అరటికాయ కొఫ్తా కర్రీ, అరటికాయ ముద్ద కూర, అరటికాయ చిప్స్, అరటికాయ వేపుడు, అరటి పకోడి, అరటి 65, క్రిస్పీ బనానా, అరటిరైస్, అరటి పువ్వుతో కొబ్బరి పచ్చడి, అరటి అప్పడం............................ - అని రెచ్చిపోతుంటే 

ఇక చాలు మహప్రభో అని గట్టిగా అరుస్తూ ఉలిక్కి పడి లేచా. జరిగింది ఎవ్వరికి చెప్పు కోవాలో తెలియక డేవిడ్ కి చెప్పా ప్రభువును తలుచుకుని పడుకో ఇలాంటి కలలు రావు అని ఒక శిలువిచ్చాడు.  ఆ రోజు రాత్రి పడుకునే ముందు ప్రభువుకు దణ్ణం పెట్టుకుని పడుకున్నా.  కలలో మిదాస్ రాజు వచ్చాడు. ఆ మిదాస్ రాజు ఎవరో అనుకునేరు అది కూడా నేనే. మనకు తెలిసిన కధలో మిదాస్ రాజు ఏది పట్టుకుంటే అది బంగారమైపోయేది కానీ నా కలలో ఏది ముట్టుకుంటే అది అరటి కాయ లా మారిపోతుంది. మా అమ్మా, నాన్న, మా చెల్లి, అందరూ మారిపోయారు. నా వేళ్ళు కూడా పచ్చాగా మారిపోయి అరటికాయల్లాగా ముందుకు ఒంగిపోయాయి.  ఏం చెయ్యాలో తెలియక గుక్కపెట్టి ఏడుస్తుండగా..

 'ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి,  ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్త్మూర్తి,  ఏ మూర్తి జగదేక చక్రవర్తీ" అంటూ శ్రీకాంత్ గాడు కలలో ANR లా గడ్డం వేసుకుని పాడుతూ కనపడ్డాడు.

నేను:: రేయ్ లఫూట్ గా నీవల్లేరా ఇదంతా నేను 5 నిమిషాలలో లేస్తా నువ్వు నాముందుండాలి అని ఆర్డర్ వేసి కళ్ళు తెరిచా.

చెప్పరా అన్నాడు.
బోరునేడ్చి విషయం బోర్లించా.
వాడు విని ఇంతేనా, నేనున్నాను రాజా నీకోసం. నేను చెప్పినట్టు చెయ్యి.  నువ్వు మీ నాన్న గారి దగ్గరకు వెళ్ళి business expand చెద్దామనుకుంటున్నాను. మన కీర్తి ఖండాంతరాలు దాటిద్దామనుకుంటున్నాను దానికి నేను MBA చెయ్యాలి. MBA అంటే ముందు BBA చెయ్యాలి. BBA అంటే Inter బా మార్కులు రావాలి. Inter లో మంచి మార్కులు రావాలంటే  హాస్టల్ లో జాయిన్ అవ్వాలని చెప్పు.  మూడు నెలల్లో పదో తరగతి పరిక్షలు అయిపోతాయి కాబట్టి నువ్వు జెండా ఎత్తైయచ్చు అని సలహా ఇచ్చాడు. మా నాన్నకు విషయం చెప్పగానే ఆయిన 'ఓ యస్' అన్నారు.

--------------------------------------------------------------------------------

అది రమ్యా జరిగింది. మీ ఇంటికొచ్చినప్పుడు  నేను కావాలని అలా చెయ్యలేదు, అలా జరిగింది. పాలు నీళ్ళూ లాంటి మన మధ్యలో అరటికాయ కూరెందుకు చెప్పు ? నాకరటికాయ కూరంటే అసహ్యం ఎంతంటే చివరకు నేనాడే ఆటల్లో అరటి పండ్లుండవ్. ఇంకా నమ్మకపోతే ఈ క్రింద్ర స్కాన్ రిపోర్ట్ చూడు.67 comments :

 1. soooooooooperooo.... soooper.... inthaki aa arati tho chesina kurallanni...taste chesaraaa... :)

  ReplyDelete
 2. brilliant. you haven't lost your touch

  ReplyDelete
 3. చాలా బాగుంది

  ReplyDelete
 4. superb......Aswin.......... All the best.............

  ReplyDelete
 5. You missed Banana Ice cream! Super!

  ReplyDelete
 6. చూడబ్బాయ్! అశ్వినూ తెగ నవ్వించావయ్యా!! నేనూ అరటి మొక్కలేశా దొడ్డినిండా!

  ReplyDelete
 7. Lol...nehru garu em cheppaaru....neti pilakale......gattigaa navvesaa...and arati tho anni cheyacha aswin ..?? Finally scan report...ROFL:-D

  ReplyDelete
 8. బాగుంది మీ అరటి చరిత్ర..........

  ReplyDelete
 9. జీవితానికో అరటిచెట్టు...........

  ReplyDelete
 10. జీవితానికో అరటిచెట్టు

  ReplyDelete
 11. Super like, i have never read such a good story :)

  ReplyDelete
 12. హహ్హహ్హ్హ.. బాగా నవ్వించారు అశ్విన్ గారు. మీరు రాసిన విధానం చాలా బావుంది :)
  అరటికాయ మీద మీకున్నంత అసహ్యం, భయం లేవు గాని నాకూ చిరాకే.

  ReplyDelete
 13. అరాచకం... ఆక్రందనలే... ఇరక్కుమ్మి ఇత్తడి చేసేశారు అశ్విన్ గారూ..

  డొక్కు - డేగ (ఇది ఎప్పటి నుండో రాద్దామనుకుంటున్నా.. ఎలా రాయాలో తెలియక ఊరుకున్నా.. మీరు చాకచక్యంగా రాసిపారేశారు) పడీ పడీ నవ్వా ఆ పేరా కి ;) ;)

  ఆదివారం నాడూ అరటిమొలచిందీ, మిడాస్ కధ భలే జ్ఞాపకాలు తట్టిలేపారండీ. సూపర్

  ReplyDelete
 14. >>
  వేంకటేశ్వర శ్వామి సుమన్ వేషం లో వచ్చి...
  మా చెల్లి మాత్రం నెహ్రూ చరిత్ర చదువుకుంటూ ఉండేది..
  >>
  సూపర్ అండి..

  ReplyDelete
 15. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక పెట్టించారు మాష్టారు :)))))))

  ReplyDelete
 16. aswin gaaru keka post, enni rojulugaa mi post kosam eduruchusi chusi unna maaku vindu bojanam laanti post ichharu, padi padi navvuthonte maa vaallandaru emo ayyindani chusthunnnaru, keka

  ReplyDelete
 17. aswin gaaru entaa comedy andi,
  diva sandeshama, iddarimide padindaa, okaru newton 2 mi naannaaraa

  kevvu keka, chala chala chala chalaa navvincharu
  nijanga chala chala thanks miku

  ReplyDelete
 18. Super Aswin...great creativity...God bless your creativity/..

  ReplyDelete
 19. నా దగ్గర 3500 తెలుగు సామెతలు ఉన్నాయ్
  దీనితో కలిపి 3501
  దరిద్రుడు దొ ... కెళితే డొక్కు డేగ ఎత్తికేల్లిన్దంట

  ReplyDelete
 20. అంతా బావుందండీ...కానీ వొక అరటి చెట్టు ఒక్క గెలే వేస్తుందండీ...నాకు తెలుసున్నంతవరకూ...:)

  ReplyDelete
 21. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

  ReplyDelete
 22. nice aswin...keep writing...

  awaiting 4 ur nxt stry..

  ReplyDelete
 23. Maa chinnappudu Maa intlo Kooda aratitota undedi. Maa ammamma chese arati kaya prayogala badhitulame! Ela tappinchukovala ani plans chesavallamu. Kanee no use!
  Memu Kooda mee groupe! Chala baga Vrasaru.

  ReplyDelete
 24. మాటల్లేవ్ అశ్విన్ అన్నీ నవ్వులే :-D... ఇన్నాళ్ళ తర్వాత పలకరించినా మీకలంలో పదును ఏమాత్రం తగ్గలేదు :-) అద్యంతం నవ్వులు పూయిస్తూనే ఉన్నారు సూపర్బ్ :-)

  ReplyDelete
 25. annaya...fb lo ramya vadina page like chesthe yentaa ani chadiva. superb undhi annaya. meeru blogs lo raastaru ani telidhu. eppatnunchi nenu kuda follow avtha. maa aayanaki telugu chadavatam raadhu. motham chadivi vinipincha. full navvukunnam. :-) especially,, amma (soundarya) n naana(rajinikanth) style arati pilakalu naatuthunte meeru thala godakesi kottukotam...n chellelu yeppatilaage nehru charitra chadavatam...!! imagine cheskuni navvu le navvu lu

  ReplyDelete
 26. అద్భుతం. అంతకన్నా మాటలు లేవు.
  మీ అరటి పురాణం అష్టాదశ పురాణాల సరసన చేర్చాలి. ఈ అరటి పురాణం చదివిన వారికీ, విన్న వారికీ అరటి దోషం పోయి, అరటి దరిద్రాలు తీరి సుఖ శాంతులను పొందగలరు.

  ReplyDelete
 27. the ultimate comedy write up..excellent

  ReplyDelete
 28. అద్భుతః

  ReplyDelete
 29. RAMARAJ : ahaaa oh kavi meee samyapurthi, sahityam mariyu cinema pandithyam mariyu aratikaya drukpadamtho rasina ee kadha chdivi krungi krusunchi nasimchi kshininchi alasi tholasi raya lekha navvalekha..... meeku aratikaya gela antha dayyvadhamulu.

  ReplyDelete
 30. చాలా బావుంది. ముఖ్యంగా నాన్నగారు నరసింహ కేసెట్టు పెట్టుకొని తోట నాటడం, అమ్మ సౌందర్యలా చెమటలు తుడవటం. భలే నవ్వించాయి మీ కబుర్లు.

  ReplyDelete
 31. అరటి మీద కూడా ఇంత అరాచకం చెయ్యొచ్చని ఇప్పుడే తెలిసిందండోయ్. అయినా పెరట్లో అరటి కాయలు కాస్తే మీకు వాటి విలువ తెలియలేదు కానీ అరవై రోజుల క్రితం కాసిన అరటికాయని కూరల బండి వాడు ఫ్రెష్షు గా తెచ్చి మా మొహాన పడేస్తే అది బెడ్డ ముక్కల్లా ఎంతకీ వేగక వేగినా తిన్నవాళ్ళ దంతాలని పరీక్షిస్తుంటే జీవితంలో ఎప్పుడైన లేత అరటికాయ కూర తింటామా అని మొహం వాచిపోయినా మాలాంటి వాళ్ళ గతేమి కాను చెప్పండి.

  ReplyDelete
 32. అబ్బబ్బబ్బ.. ఎమ్మన్నా రాసారా!!!! కేవ్వ్వవ్వ్వ్వవ్వ్వ్ కేకంతే..

  ReplyDelete
 33. అదరగొట్టేశావోయ్ బామ్మర్దీ !

  ReplyDelete
 34. హహ్హా... అరటిచెట్టుపై ఏకంగా అరెకరం థీసిస్ సబ్మిట్ చేసిపారేశారే... జపాన్లో ఉన్న ఆ చుంగ్ గాడికి ఈ విషయం తెలిస్తే అమాంతం మిమ్మల్ని కిడ్నాప్ చేసుకెళ్లి ఘనంగా సన్మానం చేసి పారేస్తాడు కాబోలు :)

  ReplyDelete
 35. బాగుంది అశ్శిగా :)

  ReplyDelete
 36. This comment has been removed by the author.

  ReplyDelete
 37. --నేటి అరటి పిలకలే రేపటి అరటి చెట్లూ అని చెప్పారమ్మా నెహ్రూగారు అని జాలిగా చెప్పా తన వంక చూస్తూ.--
  అరటి ఐస్‌క్రీము, అరటి కిళ్ళీ మిస్ అయ్యాయి కానీ చాలా వంటలే కనిపెట్టావు మొత్తానికి.
  ఎప్పటిలాగే కుమ్మేసావు అశ్విన్.

  ReplyDelete
 38. Iragadeesarandi... naaku kooda aratikaya antha istam vundadud... degree lo NCC lo join ayya... rendu gantalu parigettinchi, rendu aratikayalu chethilo pettaru... appudu na badha choodali... aakali ga vundi kani avi thinalenu.... malli inko rendu gantalu parigettali thondaraga thinandi ani chepthe, athi kastam meeda okati thini rendodi ma frnd ki ichanu...

  ReplyDelete
 39. Keka navvaleka chatchanu babu

  ReplyDelete
 40. ma amma ki chupinchanu andi anthaa bane undi kaaani oka arati chettuki okate gela vastundi andi aswin gaaruuuu...

  ReplyDelete
 41. సూపర్ గా వ్ర్రాశారు.... పడి పడి నవ్వాను ..

  కిషొర్ బిట్రా..

  ReplyDelete
 42. మొదటగా అభినందనలు,(నా కీ బోర్డ్ లో కామా ఉంది),
  చాలా కాలం తరువాత ఓ మంచి కథ చూశాను.

  ReplyDelete
 43. sir, mee arati kathanu sunday andhra jyothi book (22.12.13) lo kontha tagginchi prachuristunnam. Tq.
  - sunday desk

  ReplyDelete
 44. sir, mee arati kathanu sunday andhra jyothi book (22.12.13) lo kontha tagginchi prachuristunnam. Tq.
  - sunday desk

  ReplyDelete
 45. sir, mee arati kathanu sunday andhra jyothi book (22.12.13) lo kontha tagginchi prachuristunnam. Tq.
  - sunday desk

  ReplyDelete
 46. sir, mee arati kathanu sunday andhra jyothi book (22.12.13) lo kontha tagginchi prachuristunnam. Tq.
  - sunday desk

  ReplyDelete
 47. @no:: Please dont publish if you are going to edit my story

  ReplyDelete
 48. చక్ర కేళి లా తియ్యగా వుంది...

  ReplyDelete
 49. మీ కధ...
  అక్కడ...ఇక్కడ...ఎక్కడ
  చూసినా...
  ఎందెందు వెదికిన...
  అందందే అరటి...అరటి...
  అయ్యా బాబోయ్ అరటి...

  ReplyDelete
 50. Adirindi anna. Navvi, navvi kallalonchi neellu vastunnai

  ReplyDelete
 51. amma arati aswin

  ReplyDelete
 52. అయ్యబాబోయ్ మీ అరటి పోస్ట్ తో భయపెడుతున్నారండి.కొంప్దీసి ఇప్పుడు మా పెరడంతా అరటి మయం ఐపోదుకదా :)

  ReplyDelete
 53. Hai aswin how are you..

  Today I am very much presteated in at office work...

  Just now I read your story ..I am very much refreshed from today office burden...thank you and please continue..

  ReplyDelete
 54. Mee story lo villain arati kaya aite na story lo sorakaya...

  ReplyDelete
 55. అరతికాయ కధను ఇలా సాగదీయచ్చు అని తెలీదు.

  ReplyDelete