Sunday, February 26, 2012

సమర్ధుడి సాఫ్ట్వేర్ యాత్ర

ఈ మధ్య కళ్ళు సరిగా కనిపించటం లేదని కళ్ళ డాక్టర్ దగ్గరకు వెళితే, కళ్ళకు పెద్దగా exercise లేదు Indian census board లో పార్ట్ టైమ్ చెయ్యమని రాసిచ్చారు. ఆ పనిమీదే ఆ వారం నేను, నటరాజ్ పంజాగుట్టా సెంట్రల్ లో అమ్మాయిల కౌంట్ చేస్తున్నాం. తియ్యటి రోగాలు కమ్మటి మందులు కల్పితాలు అని కొట్టిపడేశాను, దోచేవాడే డాక్టర్ అని విశ్వసించి వాళ్ళను ఎంతగా అవుమానించానో నాకు ఆనాడే తెలిసొచ్చింది. Excersice అయ్యి excalator ఎక్కితే, నా వెనుకే ఒక ఐరావతం iPod పెట్టుకుని అదే Escaltor ఎక్కటంతో escalator తో పాటు ఎక్కడి గ్రహాలు అక్కదే ఆగిపోయాయి.

కిందకు చూస్తే 20 మంది అమ్మాయిలు ఆగిపోయినా ఎస్కలేటర్ మీదే ఏడువారాల నగల గురించి మాట్లాడుకుంటున్నారు. వెనక్కి చూశా ఆ ఐరావతం ఐపాడ్ లో అరవ సినిమా పాటలు ఎంజాయి చేస్తున్నాడు.

ఏ దిక్కు బావుంటుందో అని దిక్కులు చూస్తుంటే, ఎదురుకుండా ఒక పెద్ద కటౌట్ - సమర్ధుడి సాఫ్ట్వేర్ యాత్ర : సాఫ్త్వేర్ పరమ పద సోపానం by safi for safi of safi, బై బ్రదర్ బూదరాజు, for tickets call 9866xxxxxx అని రాసుంది.  వెంటనే ఫోన్ తీశా. బాలెన్స్ లేదు. దేవుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఇచ్చాడని ఆనందిచేలోపు బాలెన్స్ లేదని గుర్తు చేసి భాద పెడతాడు. అర్జంటుగా అంబులెన్స్ కి ఫోన్ చెయ్యాలని ఐరావతం దగ్గర ఐఫోన్ అద్దెకు తీసుకున్నా.

నేనుః రేయ్ కాంతు ..
శ్రీకాంత్ : చెప్పరా ...
నేనుః ఆ కటౌట్ ఎంట్రా ?
శ్రీకాంత్ : మహేష్ బాబు కటౌట్ మీదే కుమ్మేశాడహే,
నేనుః మహేష్ బాబుది కాదు, నేను ఆదుగుతున్నది, ఈ బాబుది.
శ్రీకాంత్ : ఏ సెంట్రల్ దగ్గర కటౌట్ సెంటర్ లో లేదా ?
నేనుః జోకా,  ఆ సొల్లేంటని ?
శ్రీకాంత్ : ఏంలేదు రా, నీ సాఫ్ట్వేర్ experience అంతా రంగరించి, నీ అనుభవాలన్నీ మేళవించి, ఉప్పూ కారం కలిపి, ఉడిపి ఉప్మా చేసి సాఫ్ట్వేర్ జీవితాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు, ఆన్సైట్ అవకాశాలు మీద ఒక లెక్చర్ తీసుకోరా. మొన్న మనం తీర్ధం పుచ్చుకున్నప్పుడు మన జూనియర్స్ కు నువ్వు చెప్పిన సలహాలకు వాళ్ళు మంత్ర ముగ్ధులై అరవీర భయకరులై రెచ్చిపోతున్నారు. నాకు అప్పుడే వచ్చింది ఈ ఆలోచన. సెమినార్ లాంటిది పెడితే పెద్ద హిట్టైయ్ ప్రజల్లో హీటు పెంచుతుందని.

నేనుః అప్పుడేదో అలా చెప్పాను. కానీ వీటికి ఎవరొస్తార్రా?

శ్రీకాంత్ : అలా అనమాకా, అసలే ఈ మధ్య సినిమాలు తక్కువా రివ్యూలు ఎక్కువైన రోజుల్లో  ప్రజలు కొత్తదనం కోరుకుంటూన్నారు. దానికి తోడు చానెల్స్ ఎక్కువా న్యూస్ కూడా తక్కువైపోయాయి. ప్రజలు ఉత్తేజాన్ని కోరుకుంటున్నారు. అందులోనూ మన వాళ్ళు మరీనూ. బోర్ద్ పెడితే బోలెడు మంది జనం. ఇప్పటికే సగం  పైన టిక్కెట్లు అయిపోయాయి తెలుసా. నా మాట వినా రా  నీకూ ఒక రూపాయి వస్తుంది. ఎన్నాళ్ళని బాలెన్స్ లేని ఫోను వాడతావు చెప్పు. ఎప్పుడో ఇంజినీరింగ్ సెకండ్ యియర్ లో పది రూపాయిలు పెట్టి చోటా రీచార్జ్ చెయ్యించినట్టు గుర్తు. నీ పేరు చెప్పి నేను ఒక రూపాయి సంపాదించి పెట్టుకుంటా. నీ ఫోను కంటూ ఒక బాలెన్సూ నా ఏకౌంట్ లో కొంత బాలెన్సూ వద్దా చెప్పు"- అని వివరాలు వెళ్ళగక్కాడు.

నేనుః నువ్వన్నది కరక్టే , అయినా మన టీమ్ లో చాలా మంది ఇంటెలిజెంట్స్ ఉండగా మన లాంటి ఎధవతో ఎందుకురా ప్లాన్ చేసావ్?

శ్రీకాంత్ : ఇంటెలిజెంట్స్  చెపితే వాడు ఇంటెలిజెంట్  కాబట్టి అలా చెప్పాడు అనుకుంటారు, వెధవ అయితే వీడు మన లాంటి వెధవే కాబట్టి అని వింటారు. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ ఇదే. నువ్వు వెధవవే కావచ్చు కానీ ఆ వెధవతానికి కూడా ఒక అర్ధం కల్పిస్తావురా. అర్ధరూపాయ్  పీచు మిఠాయి నయినా ఆరుసార్లు ఐదు రూపాయిలకు అమ్మగలవ్. నీకా టాలెంట్ ఉంది.

వాడి మాటలకు నా మనసు, ఎస్కలేటర్ ఒక సారి కదిలించాయి.

నేనుః అయినా నాకా అర్హత ఉందంటావా ?

శ్రీకాంత్ : ఈ ఊర్లో మొదట సాఫ్ట్వేర్ జాబ్ చేసింది మీ తాత, ఆన్సైట్ కెళ్ళింది మీ తాతే. దాని కన్నా అర్హత కావాలంటావా ?

నేనుః సరేరా నేను రెడీ, అయినా బ్రదర్ బూదరాజు ఎంట్రా ? మా బాబు విన్నాడంటే బెతలహామ్ తీసుకెళ్ళి బ్రాందీ బాటిల్ పెంకులమీద భరతనాట్యం చెయ్యిస్తాడు.

శ్రీకాంత్ : అది నా క్రియేటివిటికి పరాకాష్ట అనుకో కానీ నువ్వు కుమ్మేయ్యాలి మామ ఏమంటావ్

నేనుః ఏమంటా నీ మాటకు 'ఉ' అంటా... ఇంతకీ సాఫీ ఏంటి ?

శ్రీకాంత్ : stephan speilberg avataar lo ఒక కొత్త జాతి వాళ్ళను నాజి అన్నాడు. నేను మన సాఫ్ట్వేర్ జాతికి కొత్తగా  సాఫీ అని పేరు పెట్టా.

నేనుః బావుంది. ఇంతకీ టార్గ్ట్ట్ ట్ ఎవరు ?

శ్రీకాంత్ : స్టూడెంట్స్, టైనీస్, ఇంజినీర్స్,

ఎప్పుడు ?

ఎళ్ళుండి

----

||  సమయం 6:30 వేదికః రమ్యా గ్రౌండ్స్ కూకట్ పల్లి ||వందల్లో జనాలు ఎగిరి ఎగిరి నన్నే చూస్తున్నారు. పంజాబీ పాగాలు, తమిళ తంబీలూ రావటంలో కాంతు గాడు ఒక అనువాదకుడికూడా ఎరేంజ్ చేసాడు. నెమ్మిదిగా స్టేజెక్కా..
"ఇప్పుడు నేను చెప్పేది రహస్యం కాదు. అదే నిజమని గుర్తించలేకపోయి రహస్య మని భ్రాంతి చెందుతున్నా సామాన్య విషయం. "-అన్నా
దానికి అనువాదకుడు "Mr Aswin is saying Good Morning, ఆమెన్ "-అన్నాడు.
అందరూ లేచి Good Morning aswin అన్నారు.
భాయాందోళనల మేఘాలు కమ్ముకున్న వాడినై శ్రీకాంత్ వంక చూశా.వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మైక్ ఎడ్జస్ట్ చేస్తున్నట్టు నటిస్తూ
"రేయ్ నువ్వు ఈ తెలుగులో చెపితే కష్టం. మామూలు తెలుగులో చెప్పు " అన్నాడు.
"అశ్విన్ బూదరాజు యుద్ధం లో ఓడిపోయినా వాడు. మీరు యుద్ధానికి వెళుతున్నట్టివారు. ఇది ఒక సేనాధిపతి మరొక సేనాధిపతితో చెప్పే రహస్యం. ఒక వెధవ పది మంది వెధవలతో చెప్పే వేదం",
అంతే ఈలలు, చప్పట్లు, గోలలు, కేరింతలు. ఆహా వెధవా, ఈడియట్ అన్న పదాలకు ఇంత రెస్పాన్స్ ఉంది కాబట్టే   బహుశ  పూరీ జగన్నాద్ ఇలాంటి టైటిల్స్ పెడతాడు కాబోలు అని ఇలా మొదల పెట్టా...

స్టూడెంట్స్...

సాఫీ జీవితాల్లో ఇది ముఖ్యమైన దశ. ఇదే ముఖ్యమైన దశ అని గుర్తించలేనీ దశ కూడా ఇదే.ఈ కాలంలో ఇంజినీరింగ్ జాయిన్ అవ్వగానే irrespective of branch కంప్యూటర్ కొనటం అటు స్టూడెంట్స్ కి ఇటు పేరెంట్స్ కి అలవాటైపోయింది.కేబుల్ tv తో పాటు internet కామన్ అయిపోయింది. Internet రాగానే గూగుల్ ఓపెన్ చేసి వెంటనే మీరు కొట్టేది  'bipaasha basu latest hot pics'. ఆల్రెడీ మీ కంప్యూటర్ లో bipaasha basu hot pics ఉంటాయి, కానీ మీకు latest hot pics కావాలి. ఆ ప్రయత్నం లో గంటలు తరబడి సమయాన్ని వృధా చేస్తారు. ఆ సమయంలో పదో వంతు protocol handlers మీద చూపిస్తే ఈపాటికి ఐపాడ్ అనకాపల్లిలో ఎప్పుడో తయారయ్యేది. మీలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విధ్యార్ధులు ఉంటే ఇప్పుడన్నా మారండి.

ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మూడు రకాలు. అతి గాళ్ళు, ఆల్చిప్పల్లు, ఆనామకలు. అతిగాళ్ళు : వీళ్ళు మొదటి రెండు బెంచీలలో కూర్చునే వారు. అయిన దానికి కాని దానికి నేను చెపుతా నేను చెపుతా అంటూ చెతులెత్తుతుంటారు. మిగతా వాళ్ళకు, టీచర్స్ కి చిరాకు తెప్పిస్తుంటారు. అబద్ధం చెప్పటం పాపం అని భావిస్తారు. ఎదగనటువంటివారు.   వాళ్ళేదో చెప్దామనుకునే వారు కాని వాళ్ళకు చెప్తే వినే రకం కాదు. ఆల్చిప్పలు :  లెక్చరర్ ఏదన్నా అడిగితే ఆల్చిప్పల్లా నోరు తెరచి మన్మోహన్ సింగ్ లా ఎక్ప్రెషన్ లెస్ ఫేస్ చూపిస్తారు. వీళ్ళకు కావల్సిందల్లా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కింగ్ ఫిషర్ బీరు. వీళ్ళకు అబద్దాలు చెప్పాలని ప్రయత్నించినా చెప్పే తెలివి తేటలు ఉండవు.ఉత్తినే దొరికిపోతారు. వీళ్ళకు చెప్పినా వేస్టు. మొదటి  బెంచ్ వాళ్ళు చివరి బెంచ్ వాళ్ళు కాకుండా మధ్యలో ఉండే వారు యోగ్యులు.  వీళ్ళు దేశానికి చాలా ఉపయోగ పడతారు. ఎంత పెద్ద సమస్య నైనా తెలివి తేటలతో, అబద్దాలతో అల ఓకగా సాల్వ్ చేస్తుంటారు. వాళ్ళ నరనరాల్లో అబద్దాలు, తెలివి తేటలు ఇంకిపోయుంటాయి ఎలాగంటే నిద్దరలో లేపి పడుకున్నావా అని అడిగితే ఠక్కని లేదని చెప్తారు. పన్నీరు లాంటి వీళ్ళ పస ని బూడిద లాంటి లవ్వు లో పోసి టైమ్ వేస్టు చేసుకుంటారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా కే టైమ్ వేస్టు చేసుకుని కాంపస్ లో జాబ్ కొట్టి కలర్ సినిమా చూసే చాన్స్ మిస్ చేసుకుంటారు. కాబట్టి మీరు ఏ ఏ విభాగాల్లో ఉన్నారో తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా మీ అనామకులైతే మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.

ట్రైనర్స్ ...

కాంపస్ ప్లేస్మెంట్ ద్వరానో, ఫేక్ యక్పీరియన్స్ ద్వారానో, మీరు కంపెనీ లోకొచ్చేస్తారు. మీకు PL వర్కిస్తాడు. వర్క్ చక చక 10 నిమిషాలలో పూర్తి చేస్తే PL దండేసి చప్పట్లు కొడతాడు అనుకుంటారు. చత్తనా .... (బూతూ..బూతూ..బూతూ ) అప్పుడు PL నీకు చిన్న వర్క్ ఇచ్చానని తను ఫీల్ అయ్యి ఇంకొంచెం వర్కిస్తాడు లేక పోతే తను చెయ్యాల్సిన వర్క్ నీకిస్త్రాడు తప్ప తమిళ్ సినిమల్లో లాగా సడన్ గా నవ్వు రావటం,ఏడవటం, చావటం లాంటి ట్విస్టులుండవు.  మరెలా  అనుకుంటున్నారా ? PL పని ఇవ్వగానే.. స్టేషనరీకి వెళ్ళండి. ఒక నోట్సు, రెండు పెన్నులు తీసుకోండి ఒక బ్లూ పెన్నూ, వైట్ పెన్నూ. ఇంతలో ఎవరో చెయ్యెత్తారు.
నేనుః చెప్పమ్మా..
'సార్, వైట్ పెన్ను ఏంటి సార్ ?'.
నేనుః మీది విజయవాడా ?
'అవునండి,మీకెలా తెలుసు ? "
'విజయవాడ వాడికి వోల్టేజ్ ఎక్కువ, పూర్తిగా వినకుండానే డౌట్లడుగుతుంటాడు, అబ్బా సుబ్బారావ్  వైట్ పెన్ను  అంటే పెన్ను వైటని , సరేనా.."
PL ఎదో కష్టమైన పని ఇచ్చాడాని పేపర్లన్నీ తెగ నింపేసి, నోట్లో పెన్ను పెట్టుకుని ఎదో అలోచిస్తున్నట్లు నటిస్తూ, ఓ గూగుల్లొ పెతికేస్తూ, టెంషన్ పడుతున్నట్టు బిల్డప్  ఇస్తూ.. ఎవరన్నా ఫోన్ చేస్తే బిజాగా ఉన్నాను అని PL కి వినపడేలా చెప్తూ తెగ నటించాలి. PL కన్నా ముందే  రావాలి. PL వెళ్ళిన తరవాత గానీ మనం వెళ్ళ కూడదు. బయట PL కనపడితే  విష్ చెయ్యాలి. అలా మూడు రోజులు నటించి డెడ్ లైన్ ముందురోజు PL ని పొగిడి వర్క్ సబ్మిట్  చెయ్యాలి. అలా చేస్తే మీకు 100/100/

అంతే కాకుండా PL హెల్ప్ చెయ్యటం. తనే మీ ప్రొఫిషన్ లో రోల్ మొడల్ అని పబ్లిగా ప్రకటించటం లాంటి మళయాలి మంత్ర విద్యలు ప్రదర్శిస్తే ప్రాజెక్ట్ లో మీ గ్రోత్ త్వరగా ఉంటుంది.

అదే మీ PL ఆడ లేడీస్ అయితే మరింత జాగ్రత్త గా వ్యవహరించాలే తప్ప, మగవాళ్ళు ఆడవాళ్ళు సమానమే అయితే ప్రత్యేకించి ఉమెన్స్ డే ఎందుకు అన్నటువంటి physco thriller questions ఎట్టి పరిస్తితిలో వెయ్యకూడదు.

----
నేను తరవాత ఘట్టం మొదలు పెడుతుండగా, ఎవరో అమ్మాయి సడన్ గా స్టేజ్ మీద ప్రత్యక్షమైంది, నేను వెంటనే 'మా పేస్టులో ఉప్పుందండి, ప్లీజ్ ప్లీజ్ నన్నేంచెయ్యద్దు నన్నేంచెయ్యద్దు అని బతిమిలాడటం మొదల పెట్టాను'. శ్రీకాంతు గాడు పక్కకు లాగి  నీ బొంద ఇది వ్యాపార ప్రకటన 7:30 కి టి బ్రేక్ అని చెప్పాను గా అన్నాడు.

అప్పటి దాకా నా స్పీచ్ వింటూ నిద్రాపోతున్న వాళ్ళందరూ నిద్ర లేచి ఆ అమ్మాయిని చూస్తూ సొంగ కారుస్తున్నారు. ఆ అమ్మాయి.

హాయ్, నా పేరు షైలఝా, మీరు online లో టెలుఘు రాయలంఠే వాఢంఢీ e పలక e పలక e పలక 
వెంటనే రేయ్ ఎవరన్నా తెలుగు లేడీ యాంకర్ ని పెట్టచ్చు కదరా...
"ఆ అమ్మాయి తెలుగు తెలిసిన లేడీ యాంకరే ఇలా మాట్లాడితేనే ట్రెండ్...కావాలంటే చూడు అందరూ చప్పట్లు కొడతారు"- అన్నాడు
అందరూ విపరీతంగా చప్పట్లు కొట్టారు.
నాకు  బుర్ర బ్లాస్ట్ అయ్యింది.
'ఇప్పుడు స్మాల్  ఠీ బ్రేఖ్'  ... అని అమ్మాయి మాయం అయిపోయింది.

<<  టి బ్రేక్ తరవాత >>

ఎక్పీరియన్స్డ్ 

ఒక సాఫీ కంపెనీలో జాయిన్ అవ్వగానే 25మార్కులు తెచ్చుకుంటాడు. మొదటి సారి జీతం తీసుకున్నప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటాడు. ఆ తరవాత రేంటింగ్ వచ్చి జీతం పెరిగినప్పుడు 75  మార్కులు తెచ్చుకుంటాడు. చివరకు ఆన్సైట్ కి వెళ్ళినప్పుడు నూటికి నూరు మార్కులు తెచ్చుకుని పరిపూర్ణమైన సాఫీ గా సాఫీ గుర్తింపు పొందుతాడు.

ఎక్పీరియంస్డ్ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టైతే వాళ్ళకు ఈపాటికే 75 మార్కులు వచ్చుంటాయి. చాలా మంది అనుకుంటుంటారు నేను కష్టపడి పనిచేస్తే కంపెనీ వాళ్ళు ఆన్సైట్ కి పంపిస్తారు అని. కానీ వాస్తవం వింతగా ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర రెండు కుక్కలున్నాయనుకోండి. మీరు బంతి విసిరేశారు. ఒక కుక్క వెళ్ళి తీసుకొచ్చింది. మళ్ళీ విసిరేశారు మళ్ళీ తీసుకొచ్చింది.మళ్ళీ విసిరేశారు మళ్ళీ తీసుకొచ్చింది. మీరెన్ని సార్లు విసిరేసినా అది తీసుకొస్తునే ఉంది. మరి రెండో కుక్క, మీ మీద పడి ఓ నాకేస్తుంది. మీ కాళ్ళ దగ్గరే కూర్చోని ఎంటర్ టైన్ చేస్తుంది. నవ్విస్తుంది. మీ దగ్గర ఒక బిస్కెట్ ఉందనుకోండి. మీరు ఆ రెండు కుక్కల్లో ఎవరికన్న వేద్దామనుకున్నారు. మీరెవరికి వేస్తారు ?

ఒకడు లేచి నేను చెప్తాను సార్ అన్నాడు. చెప్పమ్మా  ఏ కుక్కకు వేస్తావు ?
మూతి నాకుతున్న కుక్క వేస్తాను సార్ అన్నాడు
ఎందుకు ? - అన్నా నేను
ఎందుకంటే మొదటి కుక్కకు వేస్తే అది మళ్ళీ నా దగ్గరకే తీసుకుని వస్తుంది కాబట్టి అన్నాడు
"బాబూ నీ పేరేంటి ? "
"ఉత్తరాషాడ అండి "
"మీది తెనాలా ? "
"అవునండి, మీకెలా తెలుసు ? ఏం నాలో కాన్ఫిడెన్స్ చూసి కనుక్కున్నారా ?"
"ఇంచుమించు అలాంటిదే కానీ, మనం తరవాత మాట్లాడుకుందాం  "

చూడండి ఉత్తరాషాడ గారి మాటల్లో సగం నిజం ఉంది. మొదటి కుక్క తన కు బాల్ మాత్రమే కావాలని ఇంప్రషన్ క్రియేట్ చేసింది where as రెండో కుక్క బిస్కెట్ కావాలన్న ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అదే మొదటి కుక్క రెండు సార్లు బాల్ తీసుకొచ్చి నాకు బిస్కెట్ ఇస్తేనే బాల్ తీసుకొస్తానని చెప్పిందనుకోండి కచ్చితంగా బిస్కెట్ ఇవ్వాల్సిందే. పని చెయ్యాలి, మనకు కావాల్సింది అడగాలి. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. కొందరూ ఆన్సైట్ చాన్స్ రావట్లేదని ప్రాజెక్ట్/కంపెనీ మారుతారు. అది చాలా తప్పు. పెళ్ళి కొడుకుకి అది రెండో పెళ్ళైనా, అత్తింట్లో కొత్తళ్ళుడే అంటారు, కొత్త ప్రాజెక్ట్ లో మిమ్మల్ని fresher అనే అంటారు.

ఒక్కోసారి మనం ఎంత చేసినా  కష్టపడినా ఆన్సైట్ చాన్స్ రాదు. ఆన్సైట్ చాన్స్ అనేది లాటరీ టిక్కెట్ లాంటిది. కొంటం మన చేతుల్లోనే ఉంటుంది తగలటం అన్నది తలరాత డిసైడ్ చేస్తుంది.

ఓపికా, saatisfaction కూడా చాలా important. ఉన్నదానితో satisfy అవ్వలేని వాడు, వాడి దగ్గర ఏదున్నా, ఎంతున్నా satisfy అవ్వలేడు.

----

చివరిగా, యమగోల సినిమాలో  NTR నరకలోక కార్మిక సంఘం చూసి ఇంస్పైర్ అయ్యి మా స్నేహితుడు శ్రీకాంత్ ప్రోత్సాహంతో నేనొక సాఫీ సంఘం అమీర్ పేట్ లో ఏర్పాటు చేసానని మీ ముందు సవినయంగా తెలియచేసుకుంటున్నాను. మనలో సాంఘిక చైతన్యం కోసం, విప్లవ శక్తి కోసం, మన బాధలు పంచుకోటానికి ఈ సంఘం ఏర్పాటు చెయ్యటం జరిగింది. ప్రతి ఆదివారాం ఆరింటికి అక్కడకు వచ్చి మీ భాదలను సాటి సాఫీ లతో పంచుకోవచ్చు. 

ఇంక సెలవ్ 

--- 
వారం రోజుల తరవాత, సెమినార్ తాలూకూ ప్రాఫిట్ కోసం శ్రీకాంత్ కు మెయిల్ చేశా... వాడు వెంటనే ఈ విధంగా రిప్లై చేశాడు. 

మన డీల్ ప్రాఫిట్ తాలుకు వివరాలు ఇవి. ఇంత పెద్దమొత్తమైన నీ డబ్బు ఏ బాంకులో వెయ్యలో అర్ధం కాక,  Airtel 333  Full Talk Time ఆఫర్ ఉంటే నీ మొబైల్ కి రీచార్జ్ చెయ్యించా. ఓ 20 సంవత్సరాలు దర్జాగా వాడుకుంటావని ఆశిస్తూ 

నీ శ్రీకాంత్.

39 comments :

 1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్

  ఇరగదీశారు... సెటైర్స్ కుమ్మేశారు
  మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా?? హిహిహిహి ;)

  ReplyDelete
 2. హ హ సూపర్ ఉందండి , మరీ ముఖ్యం గా ఆ కుక్కల example హ హ ఏమి చెప్పారండి :D

  ReplyDelete
 3. సూపర్..! నవ్వలేక చచ్చాను. అయినా ఆపకుండా మూడు సార్లు చదివేశాను. ఉపన్యాసం సూపర్. కానీ ఈ డైలాగ్ దగ్గర మాత్రం పది నిమిషాలు ముందుకు కదలలేకపోయాను. :D


  "అశ్విన్ బూదరాజు యుద్ధం లో ఓడిపోయినా వాడు. మీరు యుద్ధానికి వెళుతున్నట్టివారు. ఇది ఒక సేనాధిపతి మరొక సేనాధిపతితో చెప్పే రహస్యం. ఒక వెధవ పది మంది వెధవలతో చెప్పే వేదం."

  ReplyDelete
 4. Very good one, After a long time....

  ReplyDelete
 5. నాకు తెలీకడుగుతాను కోల్గేట్ వాడు మీకేం అన్యాయం చేశాడండీ ;) అసలా టూత్ పేస్ట్ లో ఉప్పుని మాత్రం వదలట్లేదుగా.. ఎంత నవ్వించారో అంతే నిజాలు చెప్పారు :-)) పోస్ట్ చాలా బాగుంది.

  ReplyDelete
 6. Supero....super....

  'విజయవాడ వాడికి వోల్టేజ్ ఎక్కువ, పూర్తిగా వినకుండానే డౌట్లడుగుతుంటాడు...'

  "మీది తెనాలా ? "

  ======================
  Note: Tomorrow is sunday. Can I join your weekly program @ Ameerpet ?

  ReplyDelete
 7. హహహ..సూపర్..
  చోటా రీచార్జ్, కుక్కల కాన్సెప్ట్, 222 రీచార్జ్...సూపర్
  ఉత్తరాషాడ..అసలు పేరే కేక.. :)
  ఆన్సైట్ విషయంలో మీరు బాగా పగబట్టినట్టు ఉన్నారు.. :), ofcourse మీరు చెప్పినవన్నీ నిజలే.. super narration.

  ReplyDelete
 8. ఏదో ఒకరోజు నీకు కూడ ఆన్సైట్ ఆఫర్ వస్తుంది అష్విన్ వస్తుంది.

  సాటి సాఫి గ, నీ బాధ నేను అర్ధం చెసుకోగలను...!

  ReplyDelete
 9. Pichi kekalu...

  "Mr Aswin is saying Good Morning" anta :)

  N bezawada, tenali and onsite kukka examples kummayi!

  ReplyDelete
 10. Asual you rock buddy,
  " నీ మొబైల్ కి రీచార్జ్ చెయ్యించా. ఓ 20 సంవత్సరాలు దర్జాగా వాడుకుంటావని ఆశిస్తూ "

  be a regular entertainer

  ReplyDelete
 11. tooooooooo good :):):)

  ReplyDelete
 12. "ఇప్పుడు నేను చెప్పేది రహస్యం కాదు. అదే నిజమని గుర్తించలేకపోయి రహస్య మని భ్రాంతి చెందుతున్నా సామాన్య విషయం." Iraga teesavu mama..!

  ReplyDelete
 13. సూపరో సూపర్... అదరగొట్టారుగా:-)

  ReplyDelete
 14. chala bagundi
  sai kumar m

  ReplyDelete
 15. kukka concept keka.....:)annayya and meedi vijayawada amma...:):)

  ReplyDelete
 16. And u r bak again!!!
  'తనే మీ ప్రొఫిషన్ లో రోల్ మొడల్ అని పబ్లిగా ప్రకటించటం లాంటి మళయాలి మంత్ర విద్యలు ప్రదర్శిస్తే ప్రాజెక్ట్ లో మీ గ్రోత్ త్వరగా ఉంటుంది'.. Ha ha ha naaku mee badha arthamaindi aswin garu.;)

  Sushma K

  ReplyDelete
 17. chala bavundi ..
  assi...

  ReplyDelete
 18. keka
  ఉన్నదానితో satisfy అవ్వలేని వాడు, వాడి దగ్గర ఏదున్నా, ఎంతున్నా satisfy అవ్వలేడు.
  baga chepparu

  ReplyDelete
 19. hii.. Nice Post Great job. Thanks for sharing.

  Best Regarding.

  More Entertainment

  ReplyDelete
 20. కస్టపడి మొత్తం చదివా.

  ReplyDelete
 21. హాయిగా బోల్డుసేపు నవ్వుకున్నా. థాంక్యూ.

  "ఆ సమయంలో పదో వంతు protocol handlers మీద చూపిస్తే ఈపాటికి ఐపాడ్ అనకాపల్లిలో ఎప్పుడో తయారయ్యేది." ఇది బ్రిలియంట్ లైన్.

  అన్నట్టు, అవతార్ లో నీలం మనుషుల పేరు నూవి. నాజి కాదు.

  ReplyDelete
 22. nenu fresher ni freepool lo(Bench lo)undi mee postlu chaduvutunna baaga navvistunnaru ee post chala related ga undi kasta kalakshepam ichinanduku thanks.పెళ్ళి కొడుకుకి అది రెండో పెళ్ళైనా, అత్తింట్లో కొత్తళ్ళుడే అంటారు,...keka

  ReplyDelete
 23. atigallu,aalchippalu,supereheeeeeeeeee

  ReplyDelete
 24. Good Good Aswinji.............

  ReplyDelete
 25. మరి మిగిలిన రూపాయి కాకి ఎతుకేల్లిందా

  ReplyDelete
 26. Super anna.... Just awesome. Memu inka e-palaka vadatledu. Anduke eng lo comment pedutunna

  ReplyDelete
 27. This comment has been removed by the author.

  ReplyDelete
 28. కుక్కల ఉదాహరణ అద్దిరిపోయింది !!! ఈ సారి ఉప్పే కాకుండా నిమ్మకాయ ,పోపు కూడా వాడండి !!
  ధన్యవాదాలు

  ReplyDelete