Thursday, May 19, 2011

You are not a legend

All characters appearing in this work are fictitious. Any resemblance to real persons, living or dead, is purely coincidental.

మొన్న కార్తీక మాసం లో నా పుట్టిన రోజు నాడు పొద్దున్నే లేచి, వ్యాయామం తదనంతరం గుర్రపుస్వారీ చేసి, స్ట్రాబెర్రీలు తిని, పాస్ పోర్టు సంకలో పెట్టూకుని, రెండు పూల దండలు కొని ఒకటి మొళ్ళో వేసుకుని ఆఫీస్ కు వెళ్ళా. ఇంతకీ ఈ అతంతా ఎందుకంటే రోసయ్య గారు CM గా ఉన్నప్పుడు మా PM గారు వెంకట రమణ అండ్ కో కాలెండర్ చూసి కార్తీక మాసం కాగానే నా ఇరవై ఐదవ యేటన, నేను మా ప్రాజెక్టులో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్భంలో నిన్ను కెనడాకు ఆన్సైట్ ఛాన్స్ ద్వారా కంపెనీ నుండి పంపిస్తా  అన్నారు. ఆ విషయం మాట్లాడదామని  వర్జ్యం  లేకుండా చూసుకుని సక్కగా సెంటు కొట్టుకుని మా PM దగ్గరకు బయలు ద్యేరా. PM అంటే మా ప్రాజెక్ట్ మానేజర్ ఉత్తరాషాడ ఇప్పటి దాకా నేను అతి చేస్తే, వాగ్దానం చేసిన మా ఉత్తరాషాడ ఉడత మొహం వేసుకుని "ఏంటయ్యా రా రా ఎంటి సంగతులు ?" అన్నాడు. 
ఏంటి సంగతులంట్రావేంట్రా నాలుగెంట్రుకల వెధావా అని మనసులో అనుకుని "అదే ఉత్తరాషాడ గారు కార్తీక మాసం కాగానే కెనడా పంపిస్తారన్నారని" 
"ఓహ్ అదా ?, నేను నీకే ఇద్దమనుకున్నానయ్యా, కానీ మన సుబ్రమణ్యం లేడూ ఆయినకిమ్మని మిగtaa మానేజర్స్ డిసైడ్ చేసారు"
"ఏం నాకెందుకు కివ్వరూ ?" అని గట్టిగా అరిచా 
"ఏందుకంటే యౌ ఆర్ నాటే లెజెండ్ ...నువ్వు పాజెక్ట్ లో ఇంకా ఒక సెలబ్రిటివే ",అని నన్ను హర్ట్ చేశాడు. 

పాత సినిమాలో వాణిశ్రీ లాగా చీర కొంగు నోట్లో పెట్టుకుని పరిగెత్తు కుంటూ ఇంటికొచ్చి మంచం మీద పడి ఏడవ సాగాను. ఇదంతా గమనించిన మా శ్రీకాంత్ గాడు నా వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ రోజు కాలర్ బటన్ పెట్టుకున్న శ్రీకాంత్ గాడిని చూస్తే సూపర్ స్టార్ కృష్ణ గుర్తు కొచ్చాడు. వెంటనే వాణిశ్రీ కృష్ణకు  తనకు ప్రాజెక్ట్ లో జరిగిన ఘోరాన్ని వివరించింది. అన్నీ విన్న శ్రీకాంత్ గాడు రేయ్ ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే 

నెంబర్ 1.నువ్వు వాణిశ్రీవి కాదు, అస్సిగాడివి 
నెంబర్ 2.నువ్వు చీరలు కట్టుకోవు, 

ఇందాక నువ్వు ఏడవటానికి నోట్లో పెట్టుకున్న చీర నీది కాదు మన ప్రాజెక్ట్ లో సరోజది. నువ్వు ఆ పాత సినిమాలు చూడటం మానెయ్. నువ్వు మన ప్రాకజెక్ట్ లో లెజెండ్ వే ..  ఆ సుబ్బు గాడు మన ఉత్తరాషాడకు బామ్మరిది అందుకే వాడికి కెనడా నీకు కూకట్ పల్లి.  

ఈ  ముక్క వినగానే నాకు తిక్క లేచింది. నాకు తిక్కలేస్తే తాండావం చేస్తా. వెంటనే మంచం కింద నుండి మగధీర కట్టి తీసా.  అది గమనించిన శ్రీకాంత్ గాడు,

"రేయ్ అస్సిగా... ఇప్పుడు నువ్వేం గొడవ చెయ్యొద్దు, ఎల్లుండి టౌన్ హాల్ లో పెద్ద మీటుంగ్ ఉంది,మన clients వస్తున్నారు .అక్కడ రెచ్చిపో",  అని వాడు  మొహన్ బాబు కు వజ్రోత్సవం నాడు తయారు చేసిన స్పీచ్ స్కిప్ట్ చేతికిచ్చాడు. ఇస్తూ ఇస్తూ ఒక మాట చెప్పాడు 

"బాబు లందు మోహన్ బాబులు వేరయా, 
ఇది బట్టి కొట్టి ఉత్తరాషాడను ఉతికారయ్యరా మామా"  అన్నాడు. రెండు రోజు ఆ స్క్రిప్ట్ బాగా ప్రాక్టీసు చేశా 


॥ రెండు రోజుల తరవాత ॥

మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ఒక 300 మంది దాకా వచ్చారు. ఉత్తరాషాడకు ఏంమాట్లాడాలో తెలియక నన్ను మాట్లాడమని కోరాడు.  ఇలా మొదలు పెట్టా...

ఇప్పుడే మొన్న నేను చీరలాగిన సరోజ గారడిగారు. వయసెంతాని. ఇరవై ఐదూ అన్నాను. ఆయాసం. సభకు నమస్కారం.రెండున్నర సంవత్సరాల సాఫ్ట్వేర్ జీవితంలో ఒకటిన్నర సంవత్సరం పాటు tester, developer అంటే నాలుఫు సంవత్సరాల ఈ ప్రాజెక్టు లో రెండు సంవత్సరాల జీవితం నాది. ఎవరూ ఎక్కడ వాడిని ఎలా వచ్చానో చెప్పాలి. ఎన్నో ఆటుపోట్లు. మరణం దగ్గరకు వచ్చి వెళ్ళిన సంధర్భాలూ ఉన్నాయి. క్లుప్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే సాధ్యం కాదు ఎందుకంటే this is the stage to tell who I am, what am I. 

శ్రీలంకాకు, చైనా కు మధ్యలో ఒక చిన్న ఊరు అక్కడ నుండి నడిచి వెళితే ఒక చిన్న ద్వీపం, చుట్టూరా water మధ్యలో పల్లెటూరు. నాన్న గారు ఇండియన్ యక్స్ ప్రెస్ లో టైపిస్టు గా పనిచేసేవారు. నా ఇంటర్ మీడియేట్ అవ్వగానే నాన్నగారన్నాను. రేయ్ నువ్వు కూడా ఒక టైప్ మిషన్ కొనుక్కోరా ఇద్దరం కలిసి కొట్టుకోవచ్చుని. నేను వినలేదు. సరే మామయ్య సలహా మీద ఇంజినీరింగ్ చదివితే బావుండునని విజయవాడ సిధ్ధార్ధాలో ఇంజినీరింగ్ 
చదవటం. అక్కడ మంచి మార్కుల రావటం వల్ల ఫయనల్ యియర్ లో చిన్న కంపెనీలో internship రావాటం జరిగింది. ఆ కంపనీలోనే అజిమ్ ప్యార్ జి పరిచయం అవ్వటం. నిరోసిస్ అధినేత నారాయణగారు పరిచయం అవ్వటం. సత్యం మంత్రి  గారు పరిచయం అవ్వటం జరిగింది. అక్కడే నాకు నాకు సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా జన్మను ప్రాసాదించిన రతన్ బాబా గారు పరిచయం అయ్యారు. మనం అనుకుంటాం మన జీవితంలో ఎవ్వరి సహాయం   అక్కరలేదూ  అను నుకుంటాం కనీసం మనిషికి భూమి సహాయం అన్నా కావాలి నుంచోటానికి. నేను పని చేస్తున్న ప్రాజెక్ట్ కి రతన్ బాబా గారు ప్రాజెక్ట్ మేనేజర్. 

ఆరు మాసాలు పనిచేసిన తరవాత ఆ కంపెనీ వాళ్ళు 500 రూపాయలిచ్చారు, స్టైపెండ్ గా. అదేంటి సార్ 500 ఇచ్చారు అన్నా. 

ఏం ?  ఉదయాన్నే వస్తున్నవ్, నువ్వెన్ని సార్లు అడిగితే అన్నిసార్లు కాఫీ టీ, మధ్యన్నం భోజనం, సాయంత్రం టిఫెను. ఎంటాయ్యా కలెక్టర్ కి కూడా ఇవ్వరు అన్నీ. క్లైంట్ దగ్గరకు కు తీసుకెళ్ళామా లేదా ? తీసుకెళ్ళారు సార్. నువ్వెప్పుడన్న క్లయింట్ ని చూడగలవా ? లేదు సార్. అందుకే 500 ఇచ్చా అన్నారు.

అలా ప్రారంభమైంది నా జీవితం. ఇంజినీరింగ్ అయ్యిందని తెలిసి, రతన్ బాబా గారు కలవమన్నారని కబురు చేశారు. సరే వెళ్ళాను. ఆయిన లేరు. టెస్ట్ పెట్టారు రాశాను. అక్కడ మిసెస్ రతన్ బాబా గారు ఆ కుర్రవాడెవడో బొద్దుగా ( నేను బండగా అనే టైప్ చేసాను, అదే బొద్దుగా అని పడింది ) ఉన్నాడు ముక్కు కూడా సూటిగా ఉంది OBIEE బాగాచేస్తాడేమో అని నన్ను రికమండ్ చెయ్యటం, నన్ను బాబాగారు వాళ్ళ కంపెనీలోకి తీసుకోవటం జరిగిపోయింది. 

ఆ తల్లెవరో నాకు తెలియదు, నేనెవరో ఆ తల్లికి తెలియదు. ఎన్ని జన్మలెత్తి తీర్చుకోవాలి ఆ తల్లి రుణం. ఐడి కార్డ్ ఇచ్చారు. అశ్విన్ ని ఉంది. అసలు నా పేరు రావాణాసురుడు, పుట్టంగానే ఒకే సారి పది మంది అమ్మాయిలను చూశానని  ఆ పేరు పెట్టారు. తిన్నగా బిర్లా మందిర్ వెళ్ళాను. ఇక నుండి నాపేరు అశ్విన్ ని చెప్పి కొబ్బరికాయ కొట్టి నా సాఫ్ట్వేర్ జీవితం మొదల పెట్టాను.

ఆ రోజు నుండి ఒక టెస్ట్ర్ ర్ గా, ఒక డెవల్పర్ గా, ఒక బగ్ ఫిక్సర్ గా, ఒక కోడర్ గా, ఒక దిజైనర్ గా ... ఒరాకిల్ లో క్వెరీలు ఎలా రాయాలో కాలితో తన్ని మరీ రాయించాడు నా తండ్రి రతన్ బాబా.... నా తండ్రి. 

ఈ రోజు జార్జ్ బుష్ తరవాత జావా లో కోడ్ రాయగలుగుతున్నానంటే that credit goes to the great man, the greatest man, the legend, lengendry, greatest man in India.CEO అన్న పదానికే అర్ధం తీసుకొచ్చిన  మనిషి ప్రపం చ  సాఫ్ట్వేర్  చరిత్రలో గ్రేట్ మాన్ రతన్ బాబా చలవే నా మంచికీ  చెడ్డకూ. 


చివరిగా, మొన్న ఉత్తరాషాడ గారన్నారు. ఈ సారి onsite కి నిన్ను పంపించటంలేదు. ఎందుకంటే you are not a  లెజెండ్,  నువ్వు ప్రాజెక్ట్ లో లెజెండ్ వి కాదు. నువ్వో సెలెబ్రిటివీ అన్నారు.  సభా ముఖంగా నేను అందరినీ అడగాలనుకుంది ఏంటంటే ? అసలు లెజెండ్ అంటే ఏంటి ? సెలెబ్రిటి అంటే ఏంటి ? అని ఒక మయిల్ రాసి సెలెబ్రిటి 
అంటే ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన మూడు సంవత్సరాలకు ఆన్సైట్ కు వెళతారని. సెలెబ్రిటి అయితే ఇన్నేళ్ళు అవుతుందని చెప్పండి. 

నేననుకున్నాను మన ప్రాజెక్ట్ లో బతికున్నవాళ్ళళ్ళో client నుండి appreciation mail వచ్చింది నాకే,  అంది లెజెండ్రికాదా ?

ఒరాకిల్ కంపనీ వాడు ప్రకటించాడు ఒకప్ ఇంకా తీసుకోలా అది లెజెండ్రీ కాదా? 
ప్రాకజెక్ట్ లో వాళ్ళందరికీ కులమతాలకతీతంగా హెల్ప్ చేస్తుంటా అది లెజెండ్రీ కాదా ? 
నిద్రానికేతన్ అని బేబీ కేర్ సెంటర్ పెట్టి పిల్లలందరినీ పడుకో బెడుతుంటా అది లెజెండ్రీ కాదా ? 
ప్రాజెక్ట్ లో 500 విభిన్న పాత్రలు పోషించా అది లెజెండ్రీ కాదా ? 
ఆరు డెలివరీలు, 15 ఫిక్సులు ఇచ్చా అది లెజెండరీ కాదా?

మై డియయ్ ఫ్రండ్స్, భగవంతుడు ఉన్నాడు. మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ కి ఉంటామొ లేదో తెలియదు. నిత్యం సన్నిహితో మ్రుత్యువు కర్తవ్యో ధర్మ సంగ్రహ:  అన్నారు పెద్దలు. ప్రతీ క్షణం ముత్యువు వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు పోతామొ తెలియదు. 

కృష్ణంరాజు గారు, లెజెండ్రి కాదా ? చెప్పండీ ? కృష్ణంరాజు గారు లెజెండ్రి కాదా ? కృష్ణంరాజు   గారుని పిలిచారు. రెండు నెలలు స్టాంప్ వేశారు. కెనడాకు పంపారు. కొన్ని వందల సార్లు పంపారు పక్క ప్రాజెక్ట్ వాళ్ళు కృష్ణంరాజు గారిని. మరి ఇది న్యాయమా ? మరి విజయ నిర్మల గారు, నా తల్లి, నా వదిన, విజయ నిర్మల గారు,  క్లైంట్  అవార్డ్ ఇస్తుంటే ఫొటో తీద్దామావద్దా అని ఆలో చిస్తారటండీ ? ఆవిడకు గార్లాండ్ వేద్దామా వద్దా అని అలోచిస్తారతండీ  Yes I will ask all these questions because, project is not for one body. ఒక్కరిది కాదు ఈ ప్రాజెక్టు. ఎంతో మంది కష్టపడితేనే ఒక డెలివరీ వెళుతుంది. మన ఈ వి వి గారు ఫేమస్ బగ్ ఫిక్సర్ ఆయనకిచ్చారండి ఆన్సైట్ చాన్సు ? వాడిక్కడే ఎక్కడో ఉన్నాడు గిరి బాబు గాడు. వాడొక డెవలపర్ గా హిట్టూ, టెస్టర్ గా హిట్టూ, పి యల్ గా హిట్టూ, వాడికీ ఇవ్వలేదు ఆన్సైట్ చాన్సు... 

ఇలా ఎంతో మందిని చూసి నన్ను ఆన్సైట్ కి పంపలేదని అడుగుతామా ? క్లైంట్ అసిస్సులుండాలి, ప్రాజెక్ట్ కి మంచి పేరు రావలి, పది మందికి సహాయం చెయ్యాలి.. ఈ ఆన్సైట్ చాన్సు నాకు అక్కరలేదూ అనుకున్నాను. 

మనేజర్స్  నా మనసులో ఉన్నది చెప్పాను ఏదేమైనా ఈ రోజు నా మార్గానికీ, నా దారికీ, నేను ఇలా 
సంకనాకి పోటానికీ కారణం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియచేసుకుఉంటూ సెలవు తీసుకుంటాను అని నా స్పీచ్ ముగించాను. 

స్టేజి దిగంగానే నాకు ఫాన్స్, ఈలలు, గోలలు, కేరింతలు. క్లైంట్ నా ధైర్యాన్ని చూసి మోచ్చుకొని. I am expecting you at canada in 2 months, Could you please give your passport for Visa processing అన్నాడు ...ఆ ఆనంద సమయంలో నా పాస్పోర్ట్ ఇచ్చే సమయం లో నా ఫోన్ మోగింది. శ్రీకాంత్ గాడు. ఆహా ఏమి నా అదృష్టము. వెంటనే ఫోనెత్తా.

మామా ని ప్లాన్ వర్క్ అయ్యింది రా

ఒరేయ్ నువ్వు ముందు నిద్ర లేబే ఇంకా పడుకున్నవా ? పదిన్నర  అయ్యింది. అరగంట నుండి చేస్తున్నాను. ఈ రోజు  సుబ్రహ్మణ్యం గారు కెనడా కు వెళుతూ మనకు పార్టీ ఇస్తా అన్నాడు మరచిపోయావా, లే అని నా కలను కర్పూర హారతి చేసాడు. 


28 comments :

 1. మీరే కేకనుకున్నా.... పంచ్ డైలాగులు కొట్టడంలో శ్రీకాంత్ గారు కూడా ఉద్దండులే.... :) :)

  ReplyDelete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. srikanth's dailogues are ulti mann.. I just love your blog.. and keep checkign wether you posted any new ones..
  I just love the last senti lines of "nenu -shazwanu" , and ofcourse, "naa edava taragati prema kadha ", arundhati - anadha.. just awesome comedy
  Expecting more from you :

  ReplyDelete
 4. >>నేను ఇలా
  సంకనాకి పోటానికీ కారణం అయిన ప్రతి ఒక్కరికీ నమస్కారాలు తెలియచేసుకుఉంటూ సెలవు తీసుకుంటాను >>
  :D

  Excellent Narration Ashwin,

  The link between ur story and real scenes are amazing. keep it up

  ReplyDelete
 5. hey.. I saw a similar one
  http://www.youtube.com/watch?v=R6TR6PvJAyw

  But your story is also too good. keep writing.

  ReplyDelete
 6. హహ్హహ్హా! అదరగొట్టేసారండీ. శ్రీకాంతెవరండీ బాబూ, అంత తొందరగా నిదర లేపేసారు? కాస్త ఆ కాలనాళిక దాకా కలను సాగనివ్వవచ్చు గదా!

  ReplyDelete
 7. But you are legend Mr Aswin.!

  ReplyDelete
 8. >>>పాత సినిమాలో వాణిశ్రీ లాగా చీర కొంగు నోట్లో పెట్టుకుని పరిగెత్తు కుంటూ ఇంటికొచ్చి మంచం మీద పడి ఏడవ సాగాను.
  >>>ఆ సుబ్బు గాడు మన ఉత్తరాషాడకు బామ్మరిది అందుకే వాడికి కెనడా నీకు కూకట్ పల్లి.

  ఇలాంటివి చాలా ఉన్నాయి. టపా సూపరు.మగధీర కత్తి అంతే.

  ReplyDelete
 9. >>ఇందాక నువ్వు ఏడవటానికి నోట్లో పెట్టుకున్న చీర నీది కాదు మన ప్రాజెక్ట్ లో సరోజది. <<
  సరోజకీ న్యాయం జరగాలి
  సరోజకీ న్యాయం జరగాలి
  అశ్విన్ డౌన్ డౌన్
  ఓ ఆడదాని చీరని జర్రున లాక్కెళ్ళిన అశ్విన్ డౌన్ డౌన్
  ౨నాగార్జున౨.౨ డౌన్ డౌన్

  ReplyDelete
 10. nice post..expecting more from you...

  ReplyDelete
 11. hi ashwin garu..... sorry to ask this with out reading your post. i have a problem in designing blog with follower gadget. it shows as experimental. if you have solution please send me. my blog is bangaraiahh.blogspot.com

  email. bangaraiah.g@gmail.com

  ReplyDelete
 12. మనం అనుకుంటాం మన జీవితంలో ఎవ్వరి సహాయం అక్కరలేదూ అను నుకుంటాం కనీసం మనిషికి భూమి సహాయం అన్నా కావాలి నుంచోటానికి. ;-)

  ReplyDelete
 13. బావుందండి! మీ వాణిశ్రీ ఏడుపు నవ్వ లేక చచ్చా! ఇంతకూ సరోజ చీర కొంగు పట్టినపుడు కొట్టలేద
  manosri

  ReplyDelete
 14. బాగుందండి ఆనాటి సంఘటన కళ్ళముందు మెదిలింది .ఇంతకూ మోహన్బాబు లేజండా ? కాదా?

  ReplyDelete
 15. నువ్వు కేక బాసు!

  ReplyDelete
 16. chala bavundi... chala bavundi.. sri sri kavithanu utcharincharante............

  nashodhana.blogspot.com

  ReplyDelete
 17. మోహన్ బాబు తెలుగు సినిమా స్వర్ణోత్సవాల్లో ఏదో గొడవ చేసాడని విన్నా కానీ, ఏం చెప్పాడో తెలీదు. ఇప్పుడు మీ స్పీచ్ విన్నాకా మోహన్ బాబు ఘోషేంటో పూర్తిగా అర్థమైపోయింది. చక్కటి పోస్టు. Keep rocking.

  ReplyDelete
 18. relationship between you and PM should be like water and sea not like water and fisherman. eppudo chinnapudu choosina cinema lo dialogue... meaning thappaithe kshaminchu meaninge lekapotE nee ishtam em cheskuntavo

  ReplyDelete
 19. చాల బావుంది.బాగా వ్రాసారు.

  ReplyDelete