Tuesday, July 20, 2010

అరుంధతి వెడ్స్ అనాధ


జాతకం బాలేదని మా బామ్మ జగ్గూ దగ్గరకు తీసుకుని వెళితే మీ మనమడు జాతికుక్కను పెంచితే కానీ జామైన గ్రహాలన్నీ మళ్ళీ జనరల్ గా తిరగవన్నాడు. పైగా జాతి కుక్క ఎంపికలో పలు జాగ్రత్తలు అవసరమని ఈ విధముగా రాసిచ్చాడు.
 • కుక్క మాంసహారి అయ్యుండకూడదు.
 • ముందున్న కుడికాలి చిటికిన వేలు కన్నా , వెనకున్న ఎడం కాలి చిటికిన వేలు చిన్నదై ఉండాలి.
 • పుబ్బా నక్షత్రం, మిధున లగ్నంలో పుట్టిన ఆడ కుక్కకు  మీ వాడు అరుంధతి అని నామకరణం చేసి పెంచినట్టైతే, జంక్షన్ లో అందరికీ అడ్డుపడుతున్న జూపిటర్ పక్కకు జరిగి మీవాడు పట్టిందల్లా బంగారమౌతుంది. అని జోస్యం పలికాడు.

శంకర్ కొట్టుకు వెళ్ళి శెనగపిండి తీసుకుని రా అన్నంత సింపుల్ గా మా బామ్మ మా నాన్నను పిలిచి ఇలాంటి కుక్క ఎక్కడున్నా తీసుకుని రా అని ఆర్డర్ వేసింది.

ఓ శనివారం తరవాతి ఆదివారం

ఈ మోగ్లీ గాడు ఇంత చిన్న నిక్కరు వేసుకుని స్కూల్ కు ఎలా వెళతాడబ్బా అని అలోచిస్తుండంగా బెల్ మోగింది. మా బామ్మ పెరట్లో నుండి అస్సిగా నీకుక్కపిల్లేమో రా అని అరిచింది. వెళ్ళి చూస్తే కుక్కపిల్ల కాదు. ఆడపిల్ల
చూడటానికి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి ఐదవ తరగతి చదువుతుంటే ఇలానే ఉండేదెమో అన్నట్టు ఉంది.
'కొంచం అగ్గిపెట్టె ఉంటే ఇస్తారా ?'
నేను ఆ అమ్మాయి వంక అలానే చూస్తుండిపోయా...
'హలో...'
నాలో ఎం మార్పు లేదు.
ఈలోగా ఎక్కడినుండో ఓ వింత జంతువు నా మీద దూకి కరవ బోయింది. నేను భయంతో వెనెక్కి దూకా. ఆ అమ్మాయి 'నో సుధాకర్', అని ఆ జంతువుని వెనెక్కి లాగింది. 'ప్లీజ్ డోన్ట్ మైండ్ మా సుధాకర్ కి కొంచం దూకుడెక్కువ'  అందామె. నాకు సుధాకర్ ఎవరో అర్ధం కాక. 'ఇంతకీ సుధాకర్ ఎవరండి, మీ నాన్నగారా ?'
షటప్ సుధాకర్ మా డాగీ అని సీరియస్ గా వెళ్ళిపోయింది.
0-0

శ్రీకాంతు గాడు ఎప్పుడూ అంటూ ఉంటాడు వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి, లవ్ చేస్తే రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ నే లవ్ చెయ్యాలి అని, అలాంటిది ఆ హీరోయిన్ యే వచ్చి తలుపు తడితే మనం ఎందుకు వదిలెయ్యాలి అని ఆ రోజునుండి ఆ అమ్మాయి వెనకాలా పిచ్చి కుక్కలా తిరిగేవాడిని. సైటు కొట్టేవాడిని, సైకిలేసుకుని ఆ అమ్మాయి చుట్టూ తిరిగేవాడిని. ఆ అమ్మాయి ముందు సచిన్ లా పోజు కొట్టేవాడిని. ఆ అమ్మాయిన నా వైపు తిప్పుకోటాని ఎంచెయ్యాలో తెలియక తమిళా పుస్తకాలు చదివేవాడిని. తమిళ పుస్తకాలా అవెందుకు అని అడగద్దు.చెపానుగా ఏం చెయ్యాలో తెలియక అని. అయినా ఏం లాభం లేకపోయింది. కానీ ఆ సుధాకర్ గాడికి నా విషయం తెలిసిపోయింది. నామీద తన రెండు కళ్ళు అప్పుడప్పుడూ చెయ్యి కోడా వేసేది. కుక్క సాధారణంగా కాలు మీద కరుస్తుందని అంటారు. కానీ ఈ సుధాకర్ గాడు కాలు మీద తప్ప ఎక్కడపడితే అక్కడ కరిచేవాడు. ఆ సుధాకర్ అంటే అసహ్యం పెరిగిపోయింది. ఏం చెయ్యలేక  దాని అంతు ఎలాగన్న చూడాలనుకున్నను. కానీ నేను ఏమీ చెయ్యలేక I hate sudhakar, I hate sudhakar అని రక్తంతో గోడలమీద రాసుకునేవాడిని.

అలాంటి నా జీవితంలో కమ్ముకున్నా... చీకట్లోనా...వెలుతురల్లే వచ్చింది మా అరుంధతి. జగ్గూ అన్నట్టుగానే అరుంధతి నా జీవితంలో అడుగుపెట్టగానే  చాలా మార్పులు కనపడ్డాయి. ముఖ్యంగా మా నాన్నకు ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయారు. మా నాన్నతోపాటే మా అమ్మ,చెల్లి. ఆ సంవత్సరమే నేను ఫస్ట్ ఎటంప్ట్ లో ఐదవ  తరగతి పాస్ అయ్యా. ఆనందం తట్టుకోలేని మా బామ్మ జగ్గూ నెత్తిన రెండు కొబ్బరికాయలు కొట్టింది. దండకూడా వేద్దామనుకుంది కానీ నెత్తిన గట్టిగా తగలటంతో అందరూ మరసటి రోజు Q కట్టి మరీ వేశారు దండ.

నేను మాత్రం అరుధతిని బాగా చూసుకునేవాడిని. నాకిచ్చిన బూస్టును తనకూ పోసేవాడిని. బూస్ట్ is screat of my energy అంటే our energy అని కపిల్ దేవ్ లా కోరస్ పలికేది. దాన్నేవరరన్నా కుక్కా అని అంటే తిరిగి నేను వాళ్ళని కుక్కా అనేవాడిని. కుక్క కాపలా కాయాలి అన్న మినిమమ్ రూల్స్ కూడా దానికి పెట్టేవాడిని కాదు. పైగా దాన్నేవరన్నా ఎత్తుకు పోతారేమో అని నేనే దానికి కాపలా కాసేవాడిని. అరుంధతి మా సంస్థానానికే రాణి. కానీ మా అరుంధతి కి చిన్న వీక్నెస్ ఉంది. మా అరుంధతికి పిల్లులంటే భయం. అప్పట్లో మా ఇంటి పక్కనే ఉండే కోడిరామకృష్ణ తన సినిమాకు మా అరుధతమ్మ పేరే పెట్టాడని నామొన్ననే తెలిసింది.

విసుగ్గా ఉన్నప్పుడే విస్కీ తాగాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి అంటాడు మా శ్రీకాంత్. అందుకే ఆ రోజు నేను అరుంధతి ఇద్దరం రెడీ ఆయ్యి అమ్మాయిని కలవటానికి వెళ్ళాం. ఆ అమ్మాయి కారిడార్ లో కూర్చోని చదువుకుంటుంది. నేను వచ్చానని తెలిసినా నా వైపు కనెత్తి చూడలేదు. నాకు కోపం వచ్చి కాలింగ్ బెల్ రెండు సార్లు కొట్టా. ఆ అమ్మాయి సుధాకర్ ని పిలిచింది. ఆ సుధాకర్ నన్ను కరవటానికి నా మీదకు దూకబోయింది. నాకు భయం వేసి కళ్ళు మూసుకున్నా. కానీ  సుధాకర్ నా మీద దూకకపోవటంతో నెమ్మిదిగా కళ్ళు తెరిచా. ఆ సుధాకర్ మా అరుంధతి  వంక చూస్తున్నాడు. సుధాకర్ కళ్ళల్లో రెడ్ కలర్ లో లవ్ గుర్తులు. అవును సుధాకర్ అరుంధతిని లవ్ చేస్తున్నాడు. ఇదంతా నాతో పాటే గమనించిన ఆ అమ్మాయి. నాకు కుర్చీ వేసి నాకు అరుంధతి కి బూస్టిచ్చింది.

ఆ రోజు నుండీ అంతా విపరీతహః ఆ అమ్మాయి రెవర్స్ లో నాకు లైన్ వెయ్యటం మొదలపెట్టింది. వాళ్ళింట్లో వంటలన్నీ నాకూ అరుంధతికి తెచ్చేది. నాకు హోమ్ వర్కు లు చేసిపెట్టేది.నాతో పాటు నా సైకిల్ ఎక్కేది.ఈ అమ్మాయే ఇలా అనుకుంటే ఆ సుధాకర్ గాడైతే మరీనూ వాళ్ళ ఇంటి బదులు మా ఇంటికి కాపలా కాసేవాడు. టైమ్ దొరికితే మా ఇంటికొచ్చి అరుంధరతి ని ప్రేమిస్తూ ఉండేవాడు. చిత్రం భళారే విచిత్రం సినిమాలో లాగా ఆ అమ్మాయి మాఇంటికొచ్చి 'సుధాకర్, సుధాకర్, సుధాకర్ ఉన్నాడా అండి' అని మా తలుపు పగల కొట్టేది. 'ఎందుకు లేడండి పొద్దున్నుండీ ఇక్కడే చచ్చాడు' అని వెక్కిరించేవాడిని. నాకు స్కూల్లో హోమ్ వర్క్ ఇచ్చినా, నాకు చిరాగ్గా అనిపించినా,సచిన్ సెంచరీ కొట్టకపోయినా ఆ సుధాకర్ గాడిని పిచ్చి కొట్ట్టుడు కొట్టేవాడిని.

ఒక ఆదివారం ముందటి శనివారం

ఆ రోజు వాలెంటైన్స్ డే. ఆ అమ్మాయి, సుధాకర్ వచ్చి నా ఎదురుకుండా నుంచున్నాడు. ఆ అమ్మాయి స్కూలుకు వెళుతూ తన బాగ్ లోనుండి ఓ రెడ్ రోజ్ తీసి I LOVE YOU అని చెప్పింది. అంతే నాకు చెప్పలేని ఆనందం. నేను ఎదో మాట్లాడబోతుంటే అడ్డొచ్చి మా సుధాకర్ కూడా  మీ అరుంధతి ని లవ్ చేస్తున్నాడు. please accept our loves. అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ సుధాకర్ కూడా ఒక పువ్వు తెచ్చి  మా అరుంధతి ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అహా జీవితంలో ఇంతకన్నా అదృష్టం ఉంటుందా ? చీ కొట్టిన అమ్మాయే రోజిచ్చి రోజూ ఇస్తానంటుందే అని అరుంధతి ని ముద్దుపెట్టుకుని మా శ్రీకాంత్ గాడికి ఈ విషయం చెప్పటాని వాళ్ళింటికెళ్ళా...

విషయం అంతా శ్రీకాంత్ కి మొత్తం వివరించా.
శ్రీకాంత్ : సొ అరుధతిని సుధాకర్ కిచ్చి పెళ్ళిచేయ్యటానికి నిశ్చయించుకున్నావా ?
నేను : అవును
శ్రీకాంత్ : మరీ పెళ్ళి అరుంధతి కి ఇష్టమో లేదో కనుక్కున్నావా ?
నేను : ఇష్టం
శ్రీకాంత్ : లేదు-లేదు-లేదు ఈ పెళ్ళి అరుంధతికి ఇష్టం లేదు .
నేను : ఏ?
శ్రీకాంత్ : ఎందుకంటే అరుంధతి ఇంకొకరిని ఇష్టపడుతుంది కాబట్టి - అన్నాడు.
ఆ డైలాగ్ కి నా ప్రపంచం ఆగిపోయింది. కోపోద్రిక్తుడైన నేను 'ఓసేయ్ అరుందతి' అని అరిచా. అరుంధతి నా ఎదురుగా వచ్చి తల దించుకుంది. అరుంధతి అలా తలదించుకోవటం నేను ఎప్పుడూ చూడలేదు.
శ్రీకాంత్ : ఇందులో అరుంధతి తప్పేమీ లేదు. ఇన్నాళ్ళు ఈ విషయం నీ దగ్గర దాచుండటం నాదే తప్పు అని ఈ విధముగా చెప్పటం మొదలపెట్టాడు.

రెండు సంవత్సరాల క్రితం నేను పరిక్షలు రాసి వస్తుంటే  ఓ కుక్క మా సందు చివర చలికి ఒణుకుతూ కనపడింది. నేను వెంటనే నా చొక్కా విప్పి తనమీద కప్పి ఇంటికి వచ్చాను. ఆ మరుసటిరోజు నుండి ఆ కుక్క మా ఇంటికి రావటం మొదలపెట్టింది. ఆ కుక్కకు ఏం పేరు పెట్టాలో తెలియక 'అనాధ' అని పేరు పెట్టా. ఎంతో విశ్వాసంతో ఉండేది అనాధ. ఇంట్లో మిగిలిపోయిన అన్నం అనాధకు పెట్టేవాడిని. అలా అనాధ నేను పెంచుకోకుండానే నా పెంపుడు జంతువయ్యింది. ఒక రోజు కొత్త బెల్టు కొనుక్కున్నానని నాకు చూపించటానికి  అరుంధతి మా ఇంటికొచ్చి అన్నం తింటున్న అనాధను చూసింది. అంతే అప్పటి దాకా నాకూ తెలియదు love at first sight కుక్కలకు కూడా ఉంటుందని. అది గమనించిన నేను ఈ కుక్క ప్రేమలు అస్సిగాడికి నచ్చవని అరుంధతిని గట్టిగా హెచ్చరించా. కొన్ని రోజుల తరవాత మీ అరుంధతి మార్నింగ్ వాక్ చేస్తున్న టైమ్ లో నాలుగు పిల్లులు తనను ఎటాక్ చేశాయి. నీకు తెలుసు అరుంధతికి పిల్లులంటే భయం అని. ఇదంతా డాబాపైనుండి గమనించిన నేను వెంటనే అనాధను పంపించా. అనాధ పిల్లుల బారి నుండి అరుంధతిని కాపాడింది. దాంతో అరుంధతి పూర్తిగా అనాధ ప్రేమలో పడింది. ఇదంతా విని నువ్వేమైపోతావేమో అని నేను ఇన్నాళ్ళు నీ దగ్గర ఈ విషయం దాచానురా దాచాను.

ఇప్పుడు చెప్పరా నీ ప్రేమకోసం అరుంధతి జీవితం నాశనం చేస్తావా ? ?
నీ ప్రేమకోసం వాళ్ళా ప్రేమ పనంగా పెడాతావా ? ?
నీకు మనసు లేదా ? ?
ఆ సుధాకర్ కిచ్చి అరుంధతిని పెళ్ళి చెయ్యటం కన్నా దానికి ఇంత విషం ఇచ్చి చంపరా చంపు. అని అప్పటిదాగా సమాధానం చెపుతున్నవాడు కాస్తా ఎదురు ప్రశ్నలోకి దిగాడు.
ఇదంతా విన్న నా గుండె కరిగిపోయింది.
నేనుః మరి ఆ అమ్మాయి ?
శ్రీకాంత్: ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందనుకుంటున్నావా ?
నేను : అవును
శ్రీకాంత్: కాదు. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నిన్ను కాదు
నేను : నా డాబ్బునా ?
శ్రీకాంత్: నీ బొంద. ఆ అమ్మాయికి సుధాకర్ అంటే పంచప్రాణాలు. ఆ సుధాకర్ కి మీ అరుంధతి అంటే ఇష్టం. అరుంధతి నువ్వంటే ఇష్టం అందేకే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం. ఒక్కసారి సుధాకర్ కి అరుంధతి అంటే ఇష్టం లేదని తెలిసిందో .. నీ మొహం కూడా చూడదు.
నేనుః ఇంతకీ అనాధ సామాజిక వర్గం?
శ్రీకాంత్:   చీ నువ్వుకూడానా. చెప్తాను విను. అనాధ మనసున్న మంచి కుక్క.. అరుంధతి ఇష్టపడ్డ కుక్క. 
శ్రీకాంత్ చెప్పినదంతా నిజమే కేవలం సుధాకర్ కోసమే నన్ను లవ్ చేస్తుంది తను. అరుంధతి రాకముందు తన ప్రేమ ఎక్కడకు పోయింది అన్న ప్రశ్నను నా దగ్గర సమాధానం లేకపోయింది. వెంటానే శ్రీకాంత్ ని అనాధను పిలిపించమన్నా.

శ్రీకాంత్ 'అనాధా' అని గట్టిగా పిలిచాడు. అనాధ స్లో మోషన్ లో పరిగెత్తు కొచ్చి అరుందతిని వాటేసుకుంటుందనుకున్నా. స్లో మొషన్ లో అయితే వచ్చింది కానీ నా ముందు తోకూపుతూ నుంచుంది. అరుంధతి నా బుగ్గనాకింది. అనాధలో ని వినయం నాకు బాగా నచ్చింది. శ్రియ తరుణ్ లాంటి వాళ్ళ ప్రేమ మధ్య ప్రకాష్ రాజ్ లా ఉండటం నాకు ఇష్టం లేకపోయింది. వెంటానే అరుందతి వెడ్స్ అనాధ అని కార్ద్లు ప్రింట్ చేయించా

ఈ విషయం తెలిసిన సుధాకర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. 15 ఏళ్ళ తరవాత నా ఖర్మకాలి ఈ మధ్యనే ఆ అమ్మాయి మా ఆఫీసులో మా ప్రాజెక్ట్ లో ప్రత్యక్షమయ్యింది. ఎలా మొహం చూపించాలో తెలియక తలతిప్పుకుని తిరుగుతున్నాను. కానీ మా అరుంధతి ఆనందంగా ఉందని తెలిసినప్పుడల్లా నా మనసూ ఆనందంగా ఉంటుంది.  
Based on a true story.44 comments :

 1. విసుగ్గా ఉన్నప్పుడే విస్కీ తాగాలి. super boss ippudu mi అరుందతి ekkada undi

  ReplyDelete
 2. అబ్బ ఎన్నాళ్ళకి అశ్విన్....థాంక్యు..ఇంతకీ అరుంధతి ఎక్కడుంది? మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు కనపడలేదే...ఓ...అత్తారింటికి(కాంతు దగ్గరకి)పంపించావా! అప్పుడప్పుడూ వెళ్ళి చూసొస్తున్నావా లేదా!

  ReplyDelete
 3. అంత కామేడీ గా ఏమీలేదు...రెండు, మూడు చోట్ల మాత్రమే కాస్త నవ్వు వచ్చింది..ఖచ్చితంగా ఇది మీ పాత టపాల్లో చేర్చదగినది కాదు..

  -మీ అభిమాని

  ReplyDelete
 4. భలే వెరైటీగా రాసారు.. చాలా నచ్చింది ...బాగుంది

  ReplyDelete
 5. office lo unnappudu chadivanu...navvaleka chachanu.. :d

  ReplyDelete
 6. హా హా హా...చాలా బాగుంది Hilarious :))

  ReplyDelete
 7. Intaki.. Sudhakar evaru..?? mee boss peru kaadu ga.. anta kasiga raasaru..:D

  ReplyDelete
 8. హిహ్హిహ్హీ.. చాలా చాలా బాగుంది.

  ReplyDelete
 9. బాగుందండి. చాలా సరదాగా ఉంది. ఈ కుక్కప్రేమ నిజమే అంటే మాత్రం ...అది అబద్ధమే!!!:)

  ReplyDelete
 10. mee creativity mandiponu..adaragottesaru :)

  ReplyDelete
 11. కెవ్వు కేక... :D

  ReplyDelete
 12. ఎన్నాళ్లకు ఎన్నాళ్ళకు పోస్టు వేసారు అశ్విన్‌గారు... నిజమైన కథ నిజంగా సూపరు :))

  ReplyDelete
 13. చాలా బాగుంది అశ్విన్..నా కొత్త ల్యాప్ టాప్ లో చదివిన మీ మొదటి టపా...అదుర్స్

  ReplyDelete
 14. మీకు pellaindhaa? endhuku adiganante మీకు ammayalni చూస్తే బయం కదా?

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. hi aswin garu,
  telugu basha dinotsavam roju jarigina ryali lo miru paalgonnarani poddu lo oka tapa lo chadivamu. miku kudirithe aa visheshalatho oka tapa rayagalarani aashisthunnamu. thanks

  ReplyDelete
 17. హ హ హ...బావుంది.
  ఇంతకీ ఇది ఏ "నిజమైన (సినిమా) కథ" నుండి లేపినది బాబూ?

  ReplyDelete
 18. sry, saw it just now. I sincerely hope you never lose your touch at writing!!
  OMG - still laughing

  ReplyDelete
 19. please watch & subscribe
  http://bookofstaterecords.com/
  for the greatness og telugu people.

  ReplyDelete
 20. ఏంటి జూలై తరువాత మీ బ్లాగులో పోస్టులు లేవు? ఎందుకంత సైలెంట్ అయిపోయారు? ఎడారిలో ఎండమావుల్లా అనిపించే బ్లాగుల్లో మీ బ్లాగు ఒకటి. రాయడం ఆపకండి ప్లీజ్.

  ReplyDelete
 21. baboi ippati daaka ela miss ayya nenu asalu .. too much :) kevv kekaa

  ReplyDelete
 22. office lo chadivi ma friend ki pampinchi ,iddaram chadivi padi,padi navvukunnam...xlent

  ReplyDelete
 23. hii.. Nice Post Great job. Thanks for sharing.

  Best Regarding.

  More Entertainment

  ReplyDelete
 24. ఆ అమ్మాయి భవిష్యత్తులో మీ ప్రోజక్ట్ మేనేజర్ కాకూడదని కోరుకుంటున్నాను.

  ReplyDelete
 25. This comment has been removed by the author.

  ReplyDelete
 26. మా చిన్నిగాడు(ప్రతాప్) చెబితే చదివాను. బాగుంది

  ReplyDelete
 27. Hai Sir,

  Mee Arundhti weds anatha chalaa baagundi. maa Andhra Jyothi sunday book (22.9.13 issue) lo reprint chustunnam. dayatho anumathi isthaarani aasistoo ...
  This is for your kind infermation sir.
  - sunday desk

  ReplyDelete
 28. Hai Sir,

  Mee Arundhti weds anatha chalaa baagundi. maa Andhra Jyothi sunday book (22.9.13 issue) lo reprint chustunnam. dayatho anumathi isthaarani aasistoo ...
  This is for your kind infermation sir.
  - sunday desk

  ReplyDelete
 29. బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..బౌ..

  ReplyDelete
 30. అనాధ ఎంటరయిన దగ్గర నుండి హిలేరియస్...

  ReplyDelete