Monday, March 29, 2010

నేను - నా చదువు


ఏదన్నా జన్మ లో చేయరాని తప్పుచేస్తే నరకానికి వెళతారని తెలుసు, కానీ నరకంలో టైమ్ లేకపోయినా వీడికి మనం శిక్ష వేయలేమన్నా వాడికి చదువు రేఖ నాన్ డస్ట్ ఎరైజర్ లో తుడిచేసి చదువుకున్న వాళ్ళ మధ్య పడేస్తారు. ఇక వాడి ఖర్మ కాలినట్టే ఆ కాలుతున్న మంటల్లోనే మటర్ పన్నీర్ చేసుకుని తింటారు.

అది 1985వ సంవత్సరం. మా అమ్మా, నాన్నలకు ఒక్కగానొక్క మొదటి కొడూకుగా జన్మించా. పుట్టగానే కళ్ళు తెరవలేదని నర్స్ నాన్సి పిర్ర మీద ఒక్కటేసింది. నాకు బాగా నొప్పొచ్చి 'అమ్మా' అని ఏడిచా. నాన్సి మీద రివెంజ్ తీసుకోవాలని పించింది. అందుకనే పెద్దయ్యాక నా మొదటి లవ్ లెటర్ నాన్సి మూడవ కూతురికిచ్చా. అప్పుడు నాన్సి ఏడ్చింది. హ హ

నాన్సి బయటకు వెళ్ళి మగ బిడ్డ అని మా నాన్నకు చెప్పింది. మా నాన్న పరిగెత్తుకుంటూ స్లో మొషన్ లో వచ్చి నన్ను ఎత్తుకుని గిరగిరా తిప్పి ముద్దుపెట్టుకుంటారనుకున్నా. స్లో మెషన్ లో వచ్చారుకానీ రాగానే పండు నువ్వేమౌతావు? సివిల్ ఇంజినీరా ? మెకానికల్ ఇంజినీరా ? అన్నారు. ఆ డైలాగ్ కి వెంటనే మా అమ్మ సృహలో కొచ్చి ఇంజినీరేంటి ఇంజనీరు దరిద్రంగా వాడు డాక్టర్ అవుతాడు అని మళ్ళీ సృహ తప్పి నిద్రలోకి వెళ్ళిపోయింది. మా తాత గారు దగ్గరకు వచ్చారు. సరే ఈయనన్నా ముద్దుపెట్టుకుంటారనుకున్నా ఆయినా నన్ను ఎత్తుకుని రేయ్ మనవడా నువ్వు IAS చదివి విజయవాడకు కలక్టరవ్వరా అన్నారు. వామ్మో వార్నాయినోయ్, వీళ్ళంత నా మీద మరీ ఎక్కువ ఆశలు పెట్టేసుకుంటున్నారు. మా తాతైతే మరీనూ IAS అంట. అవన్నీ నాకు చెప్పేబదులు మీరే అయ్యుండచ్చుగా హాయిగా నేను నైట్ రైడర్స్ కి స్పాన్సర్ నన్నా అయ్యుండేవాడిని. ఇక మొదలు అని నాకర్ధమైంది.

చాలా మంది నేను పుట్టగానే నాజాతకం చూసి వారసుడు, వంశోర్ధారకుడు, అదృష్టవంతుడు. ఒక్కమగాడు, బాలకృష్ణ, పెరట్లో మొక్క అని అంటూ వుంటే ఏంటో అనుకున్నా, దాని తరవాత తెలిసింది నా జాతకం పెరట్లో మొక్క కాదు కుంపట్లో రొట్టె, కాకి రెట్ట అని

ఆ రోజు నాకు బారసాల. నాకు పేరేంపెడతారబ్బా అని నేను మా అమ్మ ఒళ్ళో పడుకుని నోట్లోవేసుకుని అందరివంకా చూస్తున్నా. ఇంతలో పంతులుగారు ఏవండి హనుమంతం గారు అబ్బాయి పేరేమనుకుంటున్నారు ? అన్నారు. మా నాన్న 'అశ్విన్' అన్నారు అశ్విన్, బానే ఉంది ఈ పేరనుకునేలోపు మా అమ్మ అదేంటండి ఒట్టి అశ్విన్ అని చివర కుమార్ ఉంటే బావుంటుంది అని 'అశ్విన్ కుమార్' అని మార్చింది . మా తాత గారువచ్చి అదేంట్రా ఇంటికివారసుడు పుడితే 'వేంకట' అని పెట్టకపోతే ఎలా అని 'వేంకట'. మా బామ్మ వచ్చి నేను కూడా ఆ సుబ్రమణ్యేశ్వరునికి మొక్కుకున్నానండి అని 'నాగ'. మా పెద్దత్త వచ్చి 'మారుతి'. మా బాబయ్ వచ్చి 'శివ శంకర'. మా తాతయ్య అన్నయ్య వచ్చి 'రామ'. నాన్సి వచ్చి 'జీసెస్' అని వచ్చిన వాళ్ళందరూ తలా ఒక పేరు తగిలించి నా పేరుని పాకిస్తాన్ దాకా సాగ తీసారు. కోపం తట్టుకోలేక నేను సుసు పోసేశా.

నా జీవితంలో చదవటం అనేది నా పేరు దగ్గర నుండే మొదలైంది. నా పేరే నాకు ఎనిమిది మార్కుల ప్రశ్న. మా అమ్మ దానికి తోడు టీచర్ రోజుకు నా పేరు మా అమ్మకు అప్పచెప్పాలి అది చెప్పలేకే రోజు ఓ పాతిక సార్లు కొట్టించుకునే వాడిని. అంత పెద్ద పేరు గుర్తుపెట్టుకోలేక, నాలిక తిరగక చాలా తంటాలు పడేవాడిని చిన్న పేరు గా మార్చి రాసినా చిన్నది చేసి ఎవరికన్న చెప్పినా మా నాన్న ఒప్పుకునేవారు కాదు. పరిక్షలలో నా పేరు రాసేటప్పటికే అరగంట పట్టేది. మొయిన్ షీట్ లో నా పేరు రాసి ఎడిషనల్ లో నుండి ప్రశ్నలకు జవాబులు రాయటం మొదల పెట్టేవాడిని. జీవితంలో A B C D లు చదవలేక చదువుతున్న రోజులలో నాకు చెల్లి పుట్టింది. పుడుతూనే 'యే..." అని ఇంగ్లీషులో ఏడ్ఛింది. ఆ ఏడుపుకు మా అమ్మ ఆనంద పడి ఛీ నువ్వూ వున్నావు LKG లో జాయిన్ అయ్యి మూడు నెలలైనా ABCD లు రాలేదు అని మా అమ్మ నన్ను రెండు మొట్టింది.

అవి నా నాల్గవ తరగతి రోజులు అప్పటికే నేను రక్త సంబంధం సినిమా ఓ ఇరవై సార్లు చూసి ఎన్టియోరు లా తెగ ఫీలైయ్యేవాడిని. మా చెల్లి చదువుతుంటే లైటెయ్యటాలు, హోంవర్క్ చేసుకుంటుంటే పెన్సిల్ చెక్కివ్వటాలు కష్టపడి చదివి నిద్రపోతే హార్లిక్స్ ఇవ్వటాలు లాంటి త్యాగాలెన్నో చేసేవాడిని. ఒక రోజు మా చెల్లి దగ్గరకు వెళ్ళి చెల్లి మనిద్దరం ఇక నుండి రక్తసంబంధం సినిమాలో ఎన్టియోరు, సావిత్రాలా ఉండాలి అన్నా. ఎమో అన్నాయ్యా నేను ఆ సినిమా చూడలేదు నేను చదువుకోవాలి నన్ను డిస్ట్రబ్ చెయ్యద్దను అని అన్నయ్యని కూడా చూడకుండా మొహం మీద చెప్పేసింది. నాలో ఎంతో వెయిట్ ఉన్న చెల్లి సెంటిమెంట్ ని లైట్ గా తీసుకుంది. దానికి నేను నాతో పాటు యన్టియార్ కూడా బాధపడ్డారు.

మా ఇంట్లో చదువంటే డిక్షనరీలు అప్పచెప్పాలి, చరిత్ర చించి మెళ్ళో వేసుకోవాలి. మా చెల్లికి క్వెశ్చన్ పాపర్ ఇచ్చారంటే ఆగకుండా రాసేస్తుంది దానిక్కారణం మా చెల్లి camlin flow gel పెన్ను వాడుతుంది. నాదేమో సాధారణ పెన్ను రెండో ప్రశ్నకే పెన్ను కదలదు. ముందు పెన్నులో తేడా అనుకున్నా తరవాత తెలిసింది ఆ తేడా వాడే పెన్నులో కాదు బుర్రలో అన. మార్కులు కూడ నేను రాసిన ప్రశ్నలకు తగ్గట్టే పదో పదహేనో వచ్చేవి. మా అమ్మ అసలే టీచర దానికి తోడు నన్ను వాళ్ళ స్కూలులోనే జాయిన్ చేయించుకుంది. ఒకసారి క్రికెట్ బాట్ తో, మరోసారి వికెట్ తో, హాకీ బాట్ తో ఒక్కొక్కసారి వరైటీ కోసం బేస్బాల్ బాట్ తో పిచ్చి కొట్టుడుకొట్టేది. ఒక్కొక్కసారి నేను కష్టపడి చదివేతే 50 మార్కులు వచ్చేవి. అయినా లాభం లేకపోయింది. ఎలా ఉంటుంది ఒక పక్క మా చెల్లి సచిన్ లా సెంచరీలు కొడుతుంటే నెమ్మిదిగా ఆడుతూ నేను ఓ 50 కొట్టినా మన్ ఆఫ్ ది మాచ్ మా చెల్లి కేగా.

చదవట్లేదు చదవట్లేదు అని అందరూ తిట్టేవారే. ఇంటి కొచ్చిన వాళ్ళతో మా అమ్మాయే బా చదువుతుంది అని మా అమ్మ చెప్పగానే మన హీరోయిన్స్ లా పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచం మీద దూకి ఏడిచే వాడిని. మా ఇంటి కొచ్చిన వాళ్ళు మా చెల్లిని, 'స్రవంతి పెద్దయ్యాక ఏమౌతావ్?', అని అడగగానే నేను IIT లో ఇంజినీరింగ్ చేద్దామనుకుంటున్నాను అనేది. వాళ్ళు నన్ను పిలిచి రేయ్ నీకు IIT అంటే ఏమిటో తెలుసా అని అవమానించేవారు. ఇక స్కూల్లో మా కావేరి టీచర్ ఏంటి కళ్యాణి  టీచర్ మీ అమ్మాయేమో అంత బా చదువుతుంది. మరి మీ అబ్బాయికేంటి అస్సలు మార్కులు రావు అని మా అమ్మకు నూరి పోసేది. దానికి ఒక కారణం ఉంది. కావేరి టీచర్ మా 4rth B సెక్షన్ కి టీచర్. 4rh B చదువుతున్నప్పుడు నేను మా కావేరి టీచర్ కి కన్ను కొట్టా. అంటే కావాలని కొట్టలేదు నేను కన్ను కొట్టటం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు ఎదురుకుండా వచ్చింది. అప్పటి నుండి నా మీద పగ పట్టింది.

మా చెల్లి 7th class చదువుతున్నప్పుడు తనకు కళ్ళ జోడు వచ్చింది. మా అమ్మ నన్ను పిచ్చి కొట్టుడు కొట్టింది. మా అమ్మ నన్ను ఎందుకు కొట్టిందో అర్ధం కాక రెండు రోజుల ఆలోచించి తరవాత మా అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా చెల్లికి కళ్ళజోడు వస్తే నన్ను ఎందుకు కొట్టావని అడిగా. దానికి మా అమ్మ చూడరా అది చదివీ చదివీ కళ్ళజోడు వచ్చింది. నువ్వూ వున్నావ్ ఎందుకు అని మళ్ళీ కొట్టింది. ఛీ ఇలా జీవితంలో చీటికీ మాటికి ఆ చదువు వల్ల మా అమ్మ చేత కొట్టించుకుంటుండేవాడిని. నెమ్మిదిగా మా అమ్మ కొట్టటం నాకు అలావాటైపోయింది.

ఇక నా పదవతరగతి కి మా నాన్న ఎంటర్ అయ్యారు. నేను మీ అమ్మలాగా బాట్లు వికెట్లతో కొట్టను. ఇదిగో ఇదేంటో తెలుసా మటన్ మస్తాన్ కత్తి. దీన్ని షోకేస్ లోనే పెడతా. దీన్ని చూసైనా సరే నువ్వు మినిమమ్ 500 దాటాలి 600 కి నీకీమార్కులు రాకపోతే పరువుపోయేది స్కూల్లో మీ అమ్మదే కాదు ఆఫీస్ లో మీ నాన్న ది అని గుర్తుపెట్టుకో అని సీరియస్ గా వెళ్ళిపోయారు. నేను అమ్మా నాన్నల పరువు కోసం రాత్రింబవళ్ళు, నిద్రాహారాలు మాని, విశ్వామిత్రుడు తపస్సు చేసినట్టు చేశాను. విశ్వామిత్రుని తప్పస్సు ఊర్వశి భగ్నం చేసినట్టు నా తపస్సును గీత భగ్నం చేసిపడేసింది. జస్ట్ మిస్ అంటారే అలాంటిది 487/600 వచ్చింది. నా మొహానికి ఇవే ఎక్కువ అని నేను అనుకుంటేంటే. మీనాన్న టార్గెట్ రీచ్ అవలేదని నిను చంపటానికి కత్తి పట్టుకుని వస్తున్నాడు అని ఆకాశరామన్న FM లో చెప్పాడు. ఏం చెయ్యాలో తెలియని నేను ను ఇంట్లో నుండి పారిపోయి మహాభారతంలో జయద్రత్తునిలా గుహలో దాక్కొన్నా. నాలుగు రోజులాగి వెళితే అన్నీ సర్దుకుంటాయని నా ప్లాన్.

నేను ఇంట్లో నుండీ పారిపోయిన రెండు గంటాలకే మా స్నేహితుల ద్వారా నేను ఎక్కడున్నానో కనుక్కున్న మా నాన్న శ్రీకృష్ణుడై సూర్యునికి సుదర్శన చక్రం అడ్డం వేశారు. మా నాన్న తెలివి తేటలు గ్రహించనివాడనై సూర్యాస్తమయం అయ్యిందని భ్రమించి బయటకు వచ్చితిని. నేను బయటకు రావటం చూసిన మా నాన్న సుదర్శన చక్రం శ్రీకృష్ణుడికి ఇచ్చేసి 'చరణములే నమ్మితీ ... నీ దివ్య చరణములే నమ్మితీ ..' అని పాటపాడుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా తాండావం ఆడి నా పుచ్చలేచేలా కొట్టారు.

మరుసటి రోజు పాపర్లో యాడ్ >> 'నా పుత్రరాయికి( 500 రాలేదని రత్నన్ని రాయిని చేశారు) పదవ తరగతిలో జస్ట్ పాస్ ( నాకు 80 % ) వీడికి EAMCET లో మంచి రాంకు తెప్పించగల కాలేజికి మంచి పారితోషకం ఇవ్వబడుతుంది' అని.

ఇక్కడ చిన్న ప్లాష్ బాక్
అది BC కి AD కి మధ్య టైం, ఏసుక్రీస్తు చివరి మాటలు. బిడ్డల్లారా నాకోసం ఏడవ వద్దు. సైతాన్ వీరవిహారం చేసినప్పుడు మీకోసం మీమధ్యే పుట్టి మిమ్మలను కాపాడుతాను. కానీ ఇవన్నీ ఒట్టిమాటలని కొట్టిపారేశా. కానీ మా ఇంటర్మీడియేట్ కాలేజ్ కు వెళ్ళిన తరవాత అవన్నీ ఒట్టిమాటలు కాదు గట్టిమాటలు అని నమ్మక తప్పలేదు.

ఈ మధ్య ప్రతీ దానికి ఓకాప్షన్ ఉండటం ఫాషన్ అయిపోయింది. మా ఇంటర్మీడియేట్ కాలేజీకి ఓ కాప్షన్ ఉంది. ఛస్తారా? ఛదువుతార ? కాప్షన్ బట్టీ లోపల యాక్షన్ మీరు కాచ్ చెయ్యగలరని నమ్మకం. చదవకపోతే దశావతారం సినిమాలో కమల్ హాసన్ ని వేలాడతీసి కొట్టినట్టు కొడతారు. ఒకపక్క మనిషి ఛస్తున్నా సెలైన్ ఎక్కిస్తూ సిలబస్ లు అవ్వకొడతారు. ఇక్కడ కొని వందల మంది ఏసు ప్రభువులను ఛవు శిలువలకు వేసి సైతాన్లు కొడుతూ వుంటారు. ప్రతి రోజు ఆరింటికి లేవటం ఏడింటికళ్ళా కాలేజ్ కి వెళ్ళటం మళ్ళీ రాత్రి తొమ్మిది పదింటికి మధ్య ఇంటికి రావటం. అలా నా రెండూ సంవత్సరాలు ఎలా గడిచాయో నాకే తెలియదు. మొత్తం మీద ఆ యమాసెట్టు గట్టెక్కి ఇంజినీరింగ్ సిద్దార్ధా కాలేజ్ లోకి అడుగుపెట్టా. నేను ఇంజినీరింగ్ కు వచ్చానంటే నన్ను కొట్టి నా రక్తం కళ్ళ చూసి, నా చేత ఒక్కొక్క ప్రశ్న కొన్ని వందల సార్లు రాయించి నన్ను వ్యాసుడిని చేసిన మా ఇంటర్ మీడియే కాలేజి యాజమాన్యానికి, ఉపధ్యాయులకు దక్కుతుంది.


ఇంజినీరింగ్ లో అడుగుపెడుతున్న రోజు మా నాన్న పిలిచి

"రేయ్ ఇంటర్ మార్కులు బా వచ్చాయ్, ఇంజినీరింగ్ మంచి మార్కులు తెచ్చుకోరా ... "
నేను: "సరే నాన్నా.."
మా నాన్న: "సరే అంటే కుదరదు.. ఒట్టేసి చెప్పు..."
దానికి నేను: ఒట్టేసి ఒకమాట వెయ్యకుండా ఒక మాట చెప్పను నాన్న అన్న
ఛత్రపతి సినిమా చూడని మా నాన్నకు ఈ డైయలాగ్ కు నామీద కాన్ఫిడెన్స్ పెరిగి ఆనంద తాండవం చేసారు.

ఇక వీడికి పెట్టిన కష్టాలు చాలనుకున్నాడేమె Mr యమ. శ్రీకాంత్ ని పరిచయం చేశాడు. చూడటానికి 7-up కార్టూన్ లా ఉన్నా Thumsup లో ఉన్నంత దమ్ము ఉంది వీడిలో. వాడిని చూస్తే నా కష్టాలన్నీ చెప్పుకోవాలనిపిచ్చింది. యన్టియార్ లా ఎడం చెయ్యి గుప్పెట నోట్లో పెట్టుకుని ఏడుస్తూ జరిగినదందా చెప్పా. దానికి వాడు


"కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది,
దుఖా:నికి తల వంచితె తెల్లివికింక విలువేది " అన్న సిరివెన్నెల మాటలు గుర్తుచేసి..
చూడు అశ్విన్ ఆకలేస్తే దోశలుపిండి రుబ్బుకుని, పెనం కాడుక్కొని, దోశలు నువ్వే వేసుకుని తినక్కరలేదు. హోటల్ కు వెళ్ళి సింగిల్ దోశ అన్నావంటే సర్వర్ స్ట్రైయట్ గా తీసుకొనొచ్చి నీ నోట్లోనేపెడతాడు.

నేను: వాహ్ వాటేనైడియా సర్ జి పదా వెళ్ళి తిందాం.

వాడు: నోర్ముయ్ వెధవా, ముందు విను. ఇక్కడ నేను మాట్లాడేది దోశగురించి కాదు. మన మెయిన్ టాపిక్ పరిక్షలు, అవి ఎలా పాస్ అవ్వాలి అని ( పళ్ళు కొరుకుతూ )

నేను : ఓ ...సారీ సారీ చెప్పు...

వాడు: ఎలా అయితే మనకు దోశలకు మరో మార్గముందో .. పరిక్షలలో కూడా అంతే...

నేను : అంటే ....

వాడు: అంటే, స్లిప్పులు, కాపీకొట్టడాలు, మార్చిపోతే సెప్టంబర్లు.

నేను : అమ్మో కాపీనా, మొన్న మా చుట్టాలబ్బాయి 2class లో కాపీ కొడుతుంటే tv16 వాళ్ళు సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసి వాడు మూడవ తరగతికి వచ్చేవరకు వేశారు. నాకు భయం బాబు, కాపీ కొట్టటం, స్లిప్పులు పెట్టటం నేరం
వాడు:చూడు ఆశ్విన్ మీ ఇంట్లో వంట చేస్తున్నారనుకో పంచదార కావల్సొచ్చింది మీ ఇంట్లో పంచదారా అయిపోయి వెంటనే మన ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు పక్కింటికెళ్ళి పిన్నిగారు కొంచెం పంచదారుంటే ఇస్తారా అని అడిగి తీసుకుంటారు మళ్ళీ మీ దగ్గర పంచదార ఉన్నప్పుడు వాళ్ళకిచ్చేస్తారు తప్ప వంటాపుకోరు కదా . పరిక్షలు, స్నేహితులు కూడా అంతే నీకో ప్రశ్న రాలేదనుకో పక్కవాడిని అడిగి రాయి. తరవాత నీకొచ్చిన ప్రశ్న పక్కన వాడు అడిగినప్పుడు చెప్పు. అసలు శ్రీకృష్ణుడు భగవద్గీత ఏమన్నాడో తెలుసా ? పరిక్షహాలులో కనపడే మూడు పాపర్లు క్వెశ్చన్ పాపర్, ఆన్సర్ పాపర్, హాల్ టికెట్టైతే కనపడని ఆనాల్గవ పాపరేర స్లిప్పు స్లిప్పు స్లిప్పు అన్నాడయ్యా. ఆయినే అన్ని సార్లు అరుస్తూ చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వటం లో తప్పేముంది చెప్పు. అయినా ఎలా కాపికొట్టాలి, స్లిప్పులు ఎన్ని రకాలు ఆ విషయాలన్నీ నేను నీకు నేర్పుతాను గాని రేపు వెళ్ళి కరాటే డ్రస్ ఒకటి కుట్టించుకో

నేను: కరాటి డ్రస్సా...అదెందుకు
వాడు ; నువ్వు కుట్టించుకుని రా....

కరాటే డ్రస్సువేసుకుని వాడి దగ్గరకు వెళ్ళా.... వాడు ఓ చిన్న టేప్రికార్డర్ లో look at my face in the mirror పాట పెట్టి నాకు జ్ఞానోదయం చెయ్యటం మొదల పెట్టాడు. అలా వాడీ జ్ఞానోదయానికి నా బుర్ర సెంటార్ లో సూర్యబల్బు వెలిగింది.

వీడెంత బాట్రైనింగ్ ఇచ్చుంటే Injneering స్పెల్లింగ్ కూడ సరిగా రాని నేను Injneering లో దిస్టింక్షన్ లో పాస్ అయ్యి, జాబ్ లో జాయినయ్యి ప్రశాంతంగా ఫస్ట్ యియర్ ఎలా కంప్లీచేస్తా చెప్పండి. So All credit goes to Mr Srikanth ( చిటికెలు ).

37 comments :

 1. As usual ...good.. all the best ... enjoy the rest...

  ReplyDelete
 2. :-) :-)

  కుమ్మేశావ్ అశ్విన్..నువ్వు ఇంకో టపా ఎప్పుడు రాస్తావా అని నేను ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను...
  నువ్వు పుట్టిన ఆ ఆస్పటల్ లో నీ పక్క బెడ్ లో నేను ఉన్నాను...మీ వాళ్ళు అన్నమాటలన్నీ విని "అచ్చి..కచ్చి.." అని చంకలు గుద్దుకున్నాన్నేను..:-):-)

  ReplyDelete
 3. హమ్మయ్య...మా అశ్విన్ అభిమాన సంఘం అంతా,మహేష్ బాబు అభిమానుల్లా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంచి నవ్వులటపా వచ్చేసిందోచ్....మీ కష్టాలు చదుతూంటే,జలజలా కన్నీళ్ళు కారిపోయాయ్(పొట్టపట్టుకు నవ్వలేక)....ఇంకో విషయం...మన శ్రీకాంత్ కి మీరు చెప్పినట్టు, చిటికెలు.....

  ReplyDelete
 4. చాలా రోజులైనా అదే వాడి అదే వేడి:)
  బాగుంది.

  ReplyDelete
 5. Great hillarious comedy script, ever read !

  -Sriram

  ReplyDelete
 6. hahaha..chala bagundi....office lo chaduvutuu gattiga navvesa...
  adigithe..telugu rani vallaku kuda mee blog url fwd chesesa.. :D

  ReplyDelete
 7. Story of my life bro ! Story of my life *Sigh* :)

  ReplyDelete
 8. :) సూపరు
  చాలా బాగుంది
  :) :) :) :) :) :) నీకు ఈలలు :)
  మొన్న ఆఫీసు కి వచ్చింది ఆ కరాటే డ్రెస్ లోనే కదా.................................

  ReplyDelete
 9. papam inkokallu bali annamata software field lo :). mi nanna nayam, ma nanna inka danger. graduation lo unapudu maths exam konchem doubt ani cheppagane natho holidays lo mottam cahdivipinchedu results rakamunde. Theera chuste pass ayya. inkosari guntur lo kcet ki ani nanu vadili veletapudu enni sarlu chepparo baga chaduvu ani. tarvata akkadi frnd annadi mi nanna anthala chepthe nuv asalu chadavavemo anukunna ani, vammo janalu ila kuda anukuntunara aayyo ani :)

  ReplyDelete
 10. Inthaki mi sister em chestundi ipudu ;)

  ReplyDelete
 11. అశ్విన్ గారు ఏంటి రూటు మార్చారు.........(అక్కడ ఏమైనా ట్రాఫిక్ జామా?)

  మీ నుంచి ఒక "బ్లాక్ బస్టర్ ప్రేమ కథ" ని ఎక్స్ పెక్ట్ చేస్తే మీరు ఇలా మనకంతగా అచ్చిరాని చదువు తో ఎంట్రి ఇచ్చారు, ఇదేం బాలేదు. కాని మీ టపా మాత్రం బాగుంది ఎప్పటి లాగే. హ....హ్హ...హ్హా....: ) :) :)

  ReplyDelete
 12. :) సూపర్ అశ్విన్.ఏమీ అనుకోకపోతే నాకొకటి తెలుసుకోవాలని వుంది.అంతలా కష్ట పెట్టిన మీ మాష్టార్ల పై మీకు కోపముందా లేక కృతజ్ఞత వుందా?అంటే టపాలో చెప్పారనుకోండి వాళ్ళ చలవే అని.కానీ అది వెటకారం గా అన్నారో,నిజం గా అన్నారో తెలియలేదు.

  ReplyDelete
 13. సూపరో సూపరు...
  పోస్టు వేయడం లేటైనా పంచ్‌ డైలాగులతొ పిచ్చెక్కించావ్ గురు, నవ్వలేకసచ్చా :) :) :) ROFL
  kevvv

  ReplyDelete
 14. హ హ మీ స్టైల్ లో అదరగొట్టేశారు అశ్విన్ :-)

  ReplyDelete
 15. అశ్విన్ గారి క్రియేటివిటి కామెంటు రూపంలో కొలిచే ధైర్యం నాకు లేదు . సూపర్. ప్రసెంట్ ఎడ్ర్యుకేషన్ ని బాగా వ్యంగ్యంగా చూపించారు. నేనైతే బాగా నవ్వుకున్నాను.

  one single word ROCKING


  - a follower

  ReplyDelete
 16. @రాధికగారు: మా మాస్టార్లంటే నాకెప్పుడూ ఇష్టామే కానీ వ్యవస్థ అంటేనే... ముఖ్యంగా ఆ ఇంటర్మీడీయేడ్, మిక్సిలో వేసి రెండూ సంవత్సరాల తరవాత తీస్తారు. నా కిప్పటికి నా 10వ తరవగతి వరకూ చదివిన పాఠాలు గుర్తు కానీ కానీ నా ఇంటర్మీడియేట్ లోవి ఒక్క ముక్క గుర్తులేదు కాని నా పర్సెంట్ 91, Andhra Intemediate colleges ( Provate ) అంటే నా దృస్టిలో మిక్సీ ...

  ReplyDelete
 17. after soo many days..chala baundi mee post

  ReplyDelete
 18. I was laughing all thru, but thinking about your situation, I left with a heavy heart.

  Really pity our education system sometimes, which sacrifices children's lives. chaduvutava, chastava - caption is very apt, funny and true at same time. I felt happy to know that you can write on topics other than love in a funny way.

  ReplyDelete
 19. లేటుగా వేసినా లేటెస్టు టపా తో వచ్చావు అశ్విన్..మీ బ్లాగు మూడు టపాలు ఆరు కమెంట్లతో వర్ధిల్లాలి అని కోరుకొంటున్నాను

  ReplyDelete
 20. aaha adi burra leka maatala putta..entha creativity.nuvvu lyricist aithe aa picture ever green comedy..chinchesaavu..all the best

  ReplyDelete
 21. chala feel to rasinatu vunaru. Manchi story writer aye chace vundi melo. All the best

  ReplyDelete
 22. adirindyya aswin......keka:)

  ReplyDelete
 23. Hi Ashwin ....
  Enti meeru TCS ah...1 yr completed ah..antey maa batchenemo...ye branch ??

  ReplyDelete
 24. bhaga navvincharu,intaku mee chelli i.a.s ayyinda?gajula

  ReplyDelete
 25. ఈ రోజు పొద్దున్నే కౌటిల్యగారి ప్రొఫైల్ లోంచి మీ బ్లాగులోకి వచ్చా. ఓహ్.. ఇంతకాలం చదవకపోయినందుకు గిల్టీగా ఫీలయ్యా.. చాలా బాగుంది. మా అబ్బాయి కూడా ఇలానే ఫీలై వుంటాడేమోనని, ఏమో ఏంటి వాడి మొఖం చూస్తే ఇప్పుడు తెలుస్తోంది. చైతన్యలో ఇంటర్, రెండు సం.ల లాంగ్ టర్మ్, ఇప్పుడు MBBS confirm అయ్యిందన్న తృప్తి, కానీ వాడిని ఎంత మిక్సీలో వేసి రుబ్బామో అని బాధగా వుంది. నవ్వుతూనే చాప్లిన్ లా ఏడుపు దాచుకోవాల్సి వచ్చింది. ధన్యవాదాలు..

  ReplyDelete
 26. too good Aswin .. !! great work :)

  ReplyDelete
 27. vammo vayyo.... asalu asalu inni kitakitalu ela vachay annayya neeku......
  super, bumper asalu keka

  ReplyDelete
 28. విపరీతో విపరీతః

  ReplyDelete
 29. మీకు 487/600 వచ్చాయా? నాకు 482 మాత్రమే వచ్చాయండీ. మా నాన్నగారు కాస్త ఫీలయినా నన్ను కొట్టలేదులెండి!!

  ReplyDelete
 30. mi sreekanth evaro chudalani vundhi

  ReplyDelete