Tuesday, October 20, 2009

నేను - నిషా కొటారి - నా ఉద్యోగం

జీవితంలో ప్రతి ఒక్కరు రెండుసార్లు సర్కస్ కు వెళతారు. మొదటి సారి తను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు, రెండవసారి తన కొడుకో/కూతురో ఐదవ తరగతిలో ఉన్నప్పుడు. కానీ, నేను మాత్రం వీటికి విరుద్ధంగా నా ఇంజినీరింగ్ అవ్వగానే వెళ్ళాసొచ్చింది. ఆడించేవాడిలా కాదు, ఆడేవాడిలా. ఆ సర్కస్ పేరు మా ఆఫీస్.

నేను ఇంజినీరింగ్ పరిక్షలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసి,గురక పెట్టి మొద్దు నిద్రపోతున్నా...అంతలోనే ఓ మంచి కల. ఆ అమ్మాయెవరండి బొత్తిగా బట్లేసుకోదు. డైరెక్టర్ వేసుకోమన్నా, మమ్మీ నేనేసుకోనని మారం చేస్తుందే.... ఛా సమయానికి పేరు గుర్తుకురావట్లేదు, ఆ... నిషా కొటారి బీచ్ వడ్డున నా వైపు స్లో మొషన్ లో పరుగెత్తుకుంటూ వస్తుంది. నేను కూడా ఆ చల్లని గాలికి నా రెండు చేతులూ చాపి తనని ఆహ్వానిస్తున్నాను. తీరా తను నా దగ్గరకు వచ్చేసరికి ఓ అమ్మాయి ఓ కెమెరామెన్ ఎక్కనుండి వచ్చారో తెలియదు కానీ సీన్ లోకి ఒక్కసారిగా వచ్చి మైక్ నా ముందు పెట్టి 'మీ పేస్టులో ఉప్పుందా ? ' - అని అడిగింది. నేను తలగోక్కోని ' మా పేష్టులో ఉప్పు సంగతి నాకు తెలియదు కానీ మా నాన్నకు మాత్రం రెండు లక్షల అప్పు మాత్రం ఉంది ' - అన్నా. ఇది విన్న నిషా కొటారి ఎలా వచ్చిందో అలానే స్లో మొషన్ లో వెనెక్కెళ్ళి పోయింది. నేను తన కోసం ఓ అరగంట వెయిట్ చేసి తీరా తను మళ్ళీ రాకపోతే నేను ఒక్కడినే అక్కడ ఏం చేస్తానని నెమ్మిదిగా కళ్ళు తెరిచా.

కళ్ళు తెరచీ తెరవగానే ఎదురుగుండా మా నాన్న కాఫీ కప్పు పట్టుకుని కనపడ్డాడు. మొదట ఖంగారు పడ్డా ఈ ఛాన్స్ మళ్ళీ రాదని ముందు కాఫీ తాగేసా.

" అస్సిగా  ఏంట్రా రేపు మీ కాలేజిలో కాంపస్ ఇంటర్వీలు ఉన్నాయని నాకు చెప్పలేదే ? "

" ఆ శ్రీకాంత్ గాడు నీకు ఫోన్ చేశాడా, నీకు చెప్పొద్దని వాడి కాళ్ళా వేళ్ళా పడ్డా, రెండొందలిస్తే చెప్పనన్నాడుగా ...."

" ఆ రెండొందలు సరిపోయినట్టులేవు అందుకే నాకు ఈ సంగతి చెప్పి ఇంకో రెండొందలు తీసుకున్నాడుగానీ మరి రేపటి సంగతేంటి ? "

" అబ్బా ఆ సాఫ్ట్వేర్ ఉద్యొగాలు మనకు రావునాన్నా. అయినా అవన్నీ అంత సులువనుకున్నావా ఎంటీ ?. ఈ కాంపసులలో సెలెక్ట్ అవ్వటం కంటే ఓ పార్టీ పెట్టి C M అవ్వటం సులువు. "

" అమ్మ పుట్టినిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు నీ తెలివితేటలు నాకు తెలియదా? అందుకే అన్ని వివరాలు సేకరించా మొత్తం రెండురౌండ్లు ఉంటాయట. మొదటి రౌండ్ written రెండవ రౌండ్ H R. నిన్ననే మీ క్లాసు పిల్లలందరికి రోల్ నెంబర్ వారిగా తలా రెండొందలు పంచిపెట్టా కబట్టీ నువ్వు ఎవరి పక్కన పడ్డా ఖచ్చితంగా చూపించి తీరతారు. అదవ్వగానే రెండవ రౌండ్ H R అంట మహాయితే tell me about yourselves అంటే నీ గురించి నువ్వు డబ్బా కొట్టుకో అని అడుగుతారు. మొన్నటిదాకా ఎన్నికలు ఫాలో అయ్యావ్ గా గమనించావో లేదో మన రాజకీయనాయకులందరూ చేసిందదే వాళ్ళను నువ్వు ఫాలో అయ్యి ఆవిధంగా నీవు ముందుకు పోవచ్చు. ఇక నావంతు కర్తవ్యంగా విజయవాడలోని గుళ్ళలో, మసీధులలో, ఆ ప్రభువు సన్నిధులలో నీ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు చేయిస్తాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అదృష్టం బావుండాలే కానీ జీవితంలో ఏదైనా జరగచ్చు.", అని మాట్లాడుతూ మాట్లాడుతూ తన పైజమాలో లోంచి చిన్న కాయితం తీసి కళ్ళజోడు సర్దుకుంటూ ...

" అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట", అని తన సొంత సామెతొకటి వినిపించారు.

ఇక్కడ ఎవరిని తిట్టారో నాకర్ధమయ్యే లోపు ఫోను మొగింది. మా కాంతుగాడు.

"ఏరా కాంతు గా మా నన్న దగ్గర బా ఇరికింవావుగా "

"ఇరికించటం ఏముందిరా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మాములు మాటాలా రా చెప్పు ఒక్కసారి ఎదోక్కంపనీలో సెలెక్ట్ అయ్యావంటే జీవితం సెటిల్ అయ్యిపోయినట్టేరా "

"ఈ సాఫ్వ్టేర్ కంపనీలంటే పెద్ద తలకాయనెప్పంట కదరా మన జీవితమంతా వాటికి ధార పొయ్యాలంట కదా మన సుధీర్ చెప్పాడు. మనకా తల నొప్పవసరమా చెప్పు ?"

" ఎవడ్రా ఆ చెప్పిన వెధవ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా ప్రశాంతమైన జీవితం మరొకటి ఉండదు. పొద్దున్నే నువ్వు రెడీ అవ్వగానే నిన్ను రిసీవ్ చేసుకోటానికి ఓ కారు వస్తుంది. ఆ కార్ లోనే తెలుస్తుంది ఆ రోజు నీ షెడ్యూల్ అంతా. నువ్వు కంపెనీలో చేరగానే నీకు రెండు లాప్ టాప్స్ ఇస్తారు ఒకటి జిమేయిల్, ఆర్కూట్ గట్రా చూసుకోటానికి రెండవది అప్పుడప్పుడూ పని చెయ్యటానికి. రెండు లాప్ టాప్స్ ఎలా మొయ్యాలా అని ఇప్పటి నుండే ఆలోచించెయ్యమాక. అవి మొయ్యటానికి అరుణాచలం సినిమాలో రజనికాంత్ కు రంభలా నీకు ఓ పరసనల్ అసిస్టెంట్ ని ఇస్తారు. తను నీ లాప్ టాప్స్, ఫైల్స్ గట్రా తను మొస్తుంది. ఆఫీసుకు మన కాలేజికి వెళ్ళినట్టు పొద్దున్నే తొమ్మిదింటికల్లా వెళ్ళక్కరలేదు పది పదకొండు మధ్యలో వెళ్ళొచ్చు. వెళ్ళాగానే పర్లేదు ఓ గంట పని చెయ్యొచ్చు. ఒంటిగంటకల్లా ఫైవ్ స్టార్ లంచ్. లంచ్ అవ్వగానే లైట్ గా కునుకు తీసి నీకు మొళుకువ వచ్చిన తరవాత ఓ గంట పని చెయ్యొచ్చు. ఒక్క నిషా కటారి ఏంట్రా తెలుగు, తమిళ, మళయాళి, హిందీ సినిమా హీరోయిన్ లాంటి వారు నీ చూట్టూ ఎప్పుడూ నవ్వుతూ కనపడుతారు. నీకు కళాపోషనుంటే వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫి. మళ్ళీ ఐదింటికల్లా మళ్ళీ కార్ లో ఇంటికి. . వీకెండ్స్ పార్టీస్ పండగలకు పబ్బాలకు స్వీట్స్, గిఫ్ట్స్ . రోడ్లపైన ఎంత ట్రాఫిక్కున్నా నీ కార్ వస్తుందనగానే అందరూ అడ్డు తప్పుకుంటారు. ఇలా ఓ ఆర్నెల్లు కష్టపడగానే ఎబ్రోడ్ ఛాన్స్. ఎబ్రోడ్ ఛాన్స్. అనగానే మళ్ళీ నీకు రెండు లాప్టాప్స్ ఇస్తారు ఎందుకంటే ఇండియాలో లాప్ టాప్స్ అమెరికాలో పనిచెయ్యవు. నీ పర్సనల్ అసిస్టెంట్ ని కూడా మారుస్తారు . ఎందుకంటే
" ఇండియా నా పర్సనల్ అసిస్టెంట్స్ అమెరికాలో పనిచెయ్యరా ? "

" నీ బొంద కొంచం ఛేంజ్ కోసం బే "

ఒక్కసారి నువ్వు ఎబ్రోడ్ కు వెళ్ళి వచ్చావంటే పోకిరి సినిమాలో బ్రహ్మానందం చూట్టూ బిచ్చగాళ్ళు పడ్డట్టు నీ చూట్టూ మిగతా కంపెనీ వాళ్ళందరూ వాళ్ళ కంపెనీలో పనిచెయ్యమని తిరుగుతారు. ఆటోమెటిగ్గా భారత్ మాట్రిమోనిస్ లో నీ రేటు కోటికి రీచ్ అవుతుంది. ఇక ఈ కంపెనీలలో ఓ పదేళ్ళు పని చేశావంటే భారత ప్రభుత్వంవారు వారు నీ సేవలను గుర్తించి ఐ.టి రత్న, ఐటి బూషణ్, ఐ. టి విరాట్, ఐ. టి జంబలకిడిపంబ వంటి గౌరవమైన పురస్కారాలతో నిన్ను సత్కరిస్తారు. కిరీటాలు, సత్కారాలు, విజయవాడ వీధివీధుల్లో నీ విగ్రహాలు. ఇప్పుడు చెప్పురా అలాంటి జీవితం నీకొద్దా ? నేను కార్లలో వెళుతుంటే నువ్వు ఎం చెయ్యలేక నాకు టాటా చెపుతావా ? ఒక్కరోజు కష్టపడలేవా ? "- అని నన్ను ఉత్తేజపరచాడు

ఇవన్నీదొంగచాటుగా విన్న మా నాన్న నన్ను సాఫ్టేవ్ ఇంజినీర్ గా ఊహించుకుని ఆనందంతో ఆనందభాష్పాలు రాల్చాడు.

అది నా మనసుకు కదిల్చింది వెంటనే జనకా ఆనాడు ఎన్టియోరు తన తలితండ్రులకోసం గులేబకావళి పువ్వు తెచ్చాడు. ఈనాడు నేను ఎలాగైన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం పీక్కోనొస్తా నన్ను దీవించండి అని అడిగా

వెంటనే మా నాన్న ఓ కత్తితో ఓ దోమను చంపి దానితో నాకు వీరదోమ తిలకం దిద్దాడు.

ఇంత చిన్న గాప్ లో కత్తెలా వచ్చిందని ఆశ్చర్యానికిలోనైన నేను ఆత్రం ఆపుకోలేకడిగేశాను.

ఇదా నువ్వు ఇంటర్వ్యూ కూ వెళ్ళవని వేషాలేస్తావేమొనని పొద్దున పాలు తేవటానికి వెళ్ళినప్పుడు మన సందు చివర మటన్ మస్తాన్ కత్తి జేబులో పెట్టుకొచ్చా. కానీ నాకిప్పుడు ఆ అవసరం లేదు రా ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు ఎన్టియారు అని వాత్సల్యంలో ఎన్టియారు లా గట్టిగా వాటేసుకున్నారు.

నేను జయప్రదలా ఊపిరాడక ఛఛ్చా

*****

ఆ రోజు కెమెరా విజయవాడలోని గుళ్ళు, మసీధులు, చర్చిలను లాంగ్ షాట్ లో చూపిస్తుంది. బాగ్రౌండ్ లో ప్రార్ధనలు అన్నీ గట్టిగా వినపడుతున్నాయి. మా నాన్న ప్లాన్ వల్ల నా పక్కన పడ్డవాళ్ళు చూపించటంతో written పూర్తి చేసా. H R రౌండ్ లో కూడా మా నాన్నగారు చెప్పిన విధంగా ముందుకు పోయా. ఇంటికెళ్ళా మా ఇంట్లో టెన్షన్ తట్టుకోలేక మాఅమ్మ గోర్లు మా చెల్లి, మా చెల్లిగోర్లు మా నాన్న, మా నాన్నగోర్లు మా అమ్మ కొరుక్కోవటం మొదల పెట్టారు. నేనెవరి గోర్లు కొరకాలో తెలియక మా బామ్మ గోర్లు కొరికితే రోకలి బండ పెట్టి ఒక్కటేసింది. సరిగ్గా సాయంత్రం ఐదింటికి ఎవరో తలుపు కొట్టారు. తీరా చూస్తే ఓ ఐదారొందలమంది అందులోనుండి మా ప్రిసిపాల్ అందరినీ నెట్టుకుంటూ ముందుకు వచ్చి నా మెడలో దండవేసి 'కంగ్రాట్స్ అశ్విన్ మొత్తం మీద నువ్వు XXX లో సెలెక్ట్ అయ్యావ్. అయినా ఇంతమంది టాపర్స్ ఉండగా దరిద్రంగా నువ్వు సెలెక్ట్ అవ్వటమేంటని ఒకటికి పది సార్లు చూశా. ఇదిగో నీ ఆర్డర్స్ ని ఆడర్స్ చేతిలో పెట్టాడు.' మా మాటలకు మా నాన్న కళ్ళుతిరిగి కింద పడిపోయాడు.."

అశ్విన్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హూ హ హూ హ అని అందరూ ఓ అరగంట పాటేసుకున్నారు. అంతలో సృహలో కొచ్చిన మా నాన్న ఓ వెయ్యిచ్చి పార్టీ చేసుకోమన్నాడు. ఆ రోజు సాయంత్రం విజయవాడ ఈగల్ లో పెద్ద పార్టీ. ఫుల్లుగా తాగొచ్చిన నేను , గురక పెట్టి మొద్దు నిద్రపోతున్నా...అంతలోనే ఓ మంచి కల. ఆ అమ్మాయెవరండి బొత్తిగా బట్లేసుకోదు. డైరెక్టర్ వేసుకోమన్నా మమ్మీ నేనేసుకోనని మారం చేస్తుందే.... ఛా సమయానికి పేరు గుర్తుకురావట్లేదు, ఆ... నిషా కొటారి బీచ్ వడ్డున నా వైపు స్లో మొషన్ లో పరుగెత్తుకుంటూ వస్తుంది. నేను కూడా ఆ చల్లని గాలికి నా రెండు చేతులూ చాపి తనని ఆహ్వానిస్తున్నాను. తీరా తను నా దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఇద్దరు గుర్రాలపైన వచ్చి ఇనుప సంకెళ్ళతో భందించి ఓ బాక్సింగ్ రింగ్ లో పడేశారు. ఆ బాక్సింగ్ రింగులో ఓ అరవీరభయంకరుడు నన్ను పిచ్చకొట్టుడు కొట్టటానికి గ్లౌజులేసుకుని సిద్దంగా ఉన్నాడు. వాడి మెడలో 'ఐ యామ్ వినాస్ బేరా' అని రాసుంది. ఎందుకొచ్చిన గొడవని పారిపోటానికి రింగు దిగి పారిపోదామనుకుంటే ఆ రింగ్ బయట ఓ సింహం నా వంకే సూస్తూ ఉంది. ఆ సింహం మెడలో 'ఐ యామ్ బైసాకి సేన్గుప్తా' అని రాసుంది. ఛఛాన్రా దేవుడా రింగులో ఉంటే ఈ వినాస్ బేర గాడు చంపేస్తాడు. రింగు దాటితే ఈ బైసాకి సేన్గుప్తా నమిలి మింగేస్తుంది. అయినా ఆ గుర్రాలమీద వచ్చిందెవరైయుంటారు అని చూస్తే మా నాన్నా, శ్రీకాంత్ గాడు. ఇంతలో ఆ వినాస్ బేరా గాడు నా మీదకు దూకి ముక్కుపై ఒక్కటేశాడు. ఉలిక్కి పడి ఒక్కసారి మెళుకువ వచ్చింది.

*******************

ట్రైనింగ్ అంతా కేరళా చూస్తూ గడిపేశా. చాలా సినిమాల్లో హీరోగారికి నిజం క్లైమాక్స్ లో తెలుస్తుంది. నాకు మాత్రం హైదరాబద్ లో మొదటరోజు ఆఫీస్ కు వెళ్ళగానే నిజం తెలిసింది. ఇక్కడ నాకు తెలిసిన నిజం మైసూర్ బజ్జీ లో మైసూర్ ఉండదని కాదు. మా కాంతు గాడు పచ్చదనం పరిశుభ్రత పేరు మీద/క్రింద నా చెవిలో ఏకంగా పెద్ద కాలీఫ్లవర్ నాటాడని. వాడు చెప్పిన దానికీ ఇక్కడ పరిస్ధితికి విక్స్ కి లక్స్ కి ఉన్నంత తేడా ఉంది.

నేను ఉషకిరణ్ మూవీస్ లో తప్ప ఎప్పుడూ ఉదయించే సూర్యూడిని చూడలేదు. చూస్తాననీ అనుకోలేదు అలాంటిది ఉద్యోగంలో జాయిన్ అయినప్పటినుండి ప్రతిరోజు ఉదయించే సూర్యుడూ నేనూ హాయ్ చెప్పుకుంటున్నాం. ఆఫీసుకు దగ్గరని నేను కూకట్ పల్లిలో ఉంటున్నాను. కూకట్ పల్లిలో కుక్కలెక్కువ ఆ కుక్కలకు నా పై మక్కువెక్కువ. ఫార్మల్స్ లో ప్రతిరోజు రెడీ అయ్యిరాగానే మా ఇంటోనర్ గాడిద కుక్క ( కవి హృదయం:: ఇక్కడ గాడిద అంటే >> మా ఇంటోనర్, కుక్క అంటే ఆ గాడిద కుక్క ) తను కొత్తగా కొనుక్కున్న డొకొమో లో 'ఎటాక్' ఓ మూడు కుక్కలకు యస్ యెమ్ యస్ పెడుతుంది. అంతే కాక ఒక్కొక్క కుక్కని మరో మూడు కుక్కలకు యస్ యెమ్ యస్ పెట్టమని చెపుతుంది. ఇలా ఓ రెండు నిమిషాలలో ఈ నెట్వర్క్ పెద్దదై కూకట్ పల్లిలోని కుక్కలన్నింటికి యస్ యెమ్ యస్ చేరుతుంది. మమ్మీ సినిమల్లో దయ్యాలులాగా అవన్నీ నా వెంబడపడతాయి. అవన్నీ పరుగెత్తేది నా సిగ్గుబిళ్ళ కోసం. కవి హృదయం :: సిగ్గుబిళ్ళ ఆంటే నా I D Card. ఈ కుక్కలకు నా I D కార్డ్ కు మధ్య ఆ డావిన్సీ కోడ్ ఎంటో నాకెంతాలోచించినా అర్ధం కాదు. అందరి ఆఫీసుల్లో లానే మా ఆఫీసులో I D కార్డ్ కంపల్సరీ. అర్జెంటుగా బాత్రూమ్ వచ్చినా సరే స్వైప్ చెయ్యనిదే బాత్రూమ్ డోర్లు కూడా తెరుచుకోవు. కాబటి నేను ఆ కుక్కలకన్నా వేగంగా పరిగెత్తుకుంటూ మెయిన్ రోడ్డుపైకొస్తా.

హైదరాబద్ లో బసెక్కటం కన్న ఎగురుతున్న విమానం ఎక్కటం చాలా సులువు అందుకే అందరూ ఆటో ఎక్కుతుంటారు. అప్పుడెప్పుడో టైమ్ మాగ్జైన్ most intelligent people on earth పోటీలలో గెలుపొందిన మన హైదరాబద్ ఆటో వాళ్ళతో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. మామూలుగా సెవెన్ సీటర్ ఆటోలో పది మందికి పైగా ఎక్కించుకునే ఇక్కడ ఆటోవాళ్ళు. పొద్దున పూట అదీ సాఫ్త్వేర్ ఇంజినీర్స్ అని తెలిస్తే ఒకే ఆటోలో ఓ 20 మందిని కుక్కేస్తాడు.

ఎలాగోలా పొద్దున 8 కల్లా ఆఫీస్ చేరుకుంటా. నాకిది రెండవ ప్రాజెక్ట్ మొదటి ప్రాజెక్ట్ లో జావా లో క్లాస్ డిక్లేర్ చెయ్యమంటే 7th క్లాస్ అని డిక్లేర్ చేసిన నా టాలెంట్ చూసి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు వారం రోజులు కోర్ కమిటితో చర్చలు జరిపి చివరకు వీళ్ళిద్దరికీ ఈ ప్రాజెక్టులో అప్పగించారు వాళ్ళే వినాస్ బేరా, బైసాకి సేన్గుప్తా. వినాస్ బేరా మా ప్రాజెక్ట్ లీడర్, బైసాకి సేన్గుప్తా మా ప్రాజెక్ట్ మానేజరు. శ్రీకృష్ణుడు భూమ్మీదున్న అందరి రాక్షసులనీ చంపుతున్నప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి మా ఆఫీస్ లో తల దాచుకున్నారు. అప్పటి నుండి వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు. వీళ్ళకు అమాయకుడైన అశ్విన్ కుమార్ దొరికాడు. పొద్దున్న ఎనిమింటినుండి రాత్రి తొమ్మిదీ తొమ్మిదిన్నరవరకు నాకున్న చిన్న బుర్రని వంటామదంలో వేయించుకుని తింటున్నారు. ఈహింసలో గూగుల్ ది కూడా కొంత పాత్ర ఉంది. నేను ప్రాజెక్ట్ లో చేరిన మొదటి రోజు ఆ బేరా గాడొచ్చి నువ్వు tickle మీద పని చెయ్యాలి గూగుల్ లో tickle అని టైపు చేసి నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను గూగుల్ లో ఎంత సేపటికీ tickle, learn tickle అని కొడుతుంటే You mean pickle ? అని అంటుందే తప్పా. సరిగ్గా సమాధానం ఇవ్వదే. ప్రతి రోజు నేను ఆఫీస్ కు రావటం నేను tickle అని కొట్టటం గూగుల్ pickle ? అని అడగటం ఇదే వారం సరిపోయింది. ఆనాడు అన్నమయ్యకు ఆ పద్మావతి దేవి భూమ్మీదకు దిగివచ్చి సహాయం చేస్తే, నా బాధ చూసి చూసీ నా పక్కన డెస్క్లో కూర్చునే పద్మావతి సిగ్గుపడుతూ అశ్విన్ tickle స్పెల్లింగ్ అది కాదు tcl అని చెప్పి నాకు సాయం చేశారు. ఇదంతా CBCID ద్వారా తెలుసుకున్న ఆ బేరా గాడు నాకు ఒకే సారి ధర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలపెట్టాడు. అప్పటి నుండి కొరడా పట్టుకుని వాడు ఆ బైసాకీ ఎప్పుడూ వెనకాలే ఉంటారు.

అయినా తప్పంతా నాదే, కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు రెండు సంవత్సరాల బాండ్ రాసిమ్మంటే

రెండు సంవత్సరాలేంటి ఖర్మ యావజ్జీవము, అహర్నిశము, విశ్వాస భద్దుడనై మీ హితుడనై ప్రవర్తింపునని సర్వ సామంత మహీపాల మండాలాధిపతులు, సమస్త ప్రజానీకము విఛ్ఛేసియున్న ఈ సభా మండపమున శపధము గావించుచున్నాను. అని రజనీ కాంత్ చేసినట్టు రెండు చేతులతో ఒకేసారి సంతకం చేసిపడేశాను.

ఇక్కడ విషయాలేవీ తెలియని మా నాన్న ఫార్మల్స్ లో నాది పెద్ద కటౌట్ చేయించి దుర్గకొండకు అవతల వైపు వేలాడదీసి తెగ మురిసిపోతున్నారు. ఆసిన్ కోసం త్రిష కోసం కావాలని చెన్నయ్ వేయించుకున్న మా కంతుగాడికి వాళ్ళు వాడికి కనపడక. వాడు నాకు కనపడక ఆరు నెలల కావస్తుంది. మా ప్రాజెక్ట్ల్ లో నిషా కటారి కాదు కదా కనీసం కన్నాంబ, కాంచనమాల కూడా లేరు. ఉన్న ఒక్కగానొక్క పద్మావతి పెళ్ళి చేసుకుని బొంబాయి వెళ్ళిపోయింది. ఆ బైసాకి సేన్గుప్తా ను ఎప్పుడో లిస్టు లో బ్లాక్ మార్కర్ తో కొట్టేశా.

మొన్న పని చేసీ చేసీ తలలో నుండి పొగలు వచ్చి తలకు నిప్పంటుకుంది. నా పైన స్మోక్ డిటెక్టర్లు ఉండటంలో పెద్దప్రమాదమేమీ జరగలేదు. ఇదే మంచి సమయం అని దీపావళి కి మూడు రోజులు సెలవడిగా ఇక మా బేరా గాడు తప్పక ఒప్పుకున్నాడు.

చాలా రోజులకు తనివితీరా గురక పెట్టి మొద్దు నిద్రపోతున్నా...అంతలోనే ఓ మంచి కల. ఆ అమ్మాయెవరండి బొత్తిగా బట్లేసుకోదు. డైరెక్టర్ వేసుకోమన్నా మమ్మీ నేనేసుకోనని మారం చేస్తుందే.... ఛా సమయానికి పేరు గుర్తుకురావట్లేదు, ఆ... నిషా కొటారి బీచ్ వడ్డున నా వైపు స్లో మొషన్ లో పరుగెత్తుకుంటూ వస్తుంది. నేను కూడా ఆ చల్లని గాలికి నా రెండు చేతులూ చాపి తనని ఆహ్వానిస్తున్నాను. తీరా తను నా దగ్గరకు వచ్చి నా ఫార్మల్స్ , నా మెడలో ID కార్డ్ చూసి ఛా ఇంకెప్పుడూ నీ దగ్గరకు రాను పో అని స్లో మొషన్ లో వెనక్కు వెళ్ళిపోయింది.

73 comments :

 1. Superb....aa ammayi evaru.....

  ReplyDelete
 2. Hillarious..
  One of the best comedies from telugu blogs..

  ReplyDelete
 3. అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట
  సూపరో సూపరూ

  ReplyDelete
 4. కూకట్ పల్లి కుక్కల సీన్ ఊహిస్తుంటే భలే నవ్వొచ్చింది. సామెత అయితే ....సూపర్. మొత్తానికి భలే నవ్వించారు

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. ప్చ్ పాపం..........
  చేజారిన జీవితం :-(

  ReplyDelete
 7. బాగుంది అశ్విన్ గారు...
  మీ ఉద్యోగం TCS లో అనుకుంట?

  kukatpally, కుక్కలు అంటున్నారు... ఆ కంబినషన్ ఉండేది బాలాజీ నగర్ లోనే కదా!

  ReplyDelete
 8. :)) బాసూ కేక పెట్టించావు కదా! అసలే రెసిషన్ టైం..ఎవడ్ని పీకుతారా అని భయపడి చస్తుంటే ఇలా ఆఫీస్లో నా చేత నవ్వించటం భావ్యమా చెప్పండీ?

  కరెక్ట్ గా చెప్పారు..కుకట్ పల్లి, కుక్కలు...అసలు మా సంగీత్ నగర్(కుకట్పల్లి) లో కుక్కలు కరెక్ట్ గా నా కలలో నిషాకొటారీ వచ్చిన టైం చూసుకుని అరుస్తాయి..దానితో ఆమె కుక్కలకి భయపడి కలలోకి రాకుండానే వెళ్ళిపోతుంది. :(

  టపా అదరగొట్టారు..

  కుకట్ పల్లిలో మీ అడ్రస్ కొంచెం చెప్తే వీకెండ్స్ ఇలాంటివి ఎలా రాయాలో నేర్చుకోడానికి మీ ఇంటికి వచ్చేస్తాను. :)

  ReplyDelete
 9. అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట... very nice dude...

  ReplyDelete
 10. మీ పేస్టులో ఉప్పుందా మా పేష్టులో ఉప్పు సంగతి నాకు తెలియదు కానీ మా నాన్నకు మాత్రం రెండు లక్షల అప్పు మాత్రం ఉంది.
  అదిరింది సార్ !.hmmmmm.....మీ పోస్ట్ లో
  sugar ఉంది.

  ReplyDelete
 11. సాప్ట్‍వేర్ ఉద్యోగం వచ్చినకొత్తల్లో నేను కూడా సేమ్ టు సేమ్ ఇలాగే కలలు కన్నా బాస్... కాకపోతే నీకు నిషా కొఠారీ, నాకు పెనిలోపీ క్రజ్ :)

  ReplyDelete
 12. వామ్మో అదర గొట్టేశారండీ బాబు!

  ReplyDelete
 13. :))..చాలా కాలానికి వ్రాసినా భలే నవ్వించారండి.

  కుకట్‌పల్లిలో నాకెక్కడా కుక్కలు కనిపించవే!!

  ReplyDelete
 14. ఎన్టియారు లా గట్టిగా వాటేసుకున్నారు.
  నేను జయప్రదలా ఊపిరాడక ఛఛ్చా

  laughed like any other thing

  ReplyDelete
 15. ఉద్యోగంలో చేరడం మీ మెదణ్ణి మొద్దుపరచలేదని ఋజువు చేస్కుంటున్నారు. ఇలాగే ప్రొసీడైపోండి.

  ReplyDelete
 16. ట్రైనింగ్ పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరారా?All the best!! ఎప్పటిలానే టపా hilarious.

  ReplyDelete
 17. వెల్కం టు ద క్లబ్ బ్రదర్ :-)

  ReplyDelete
 18. @ ప్రవీణ్ .. Which club is that? :)

  ReplyDelete
 19. @కొత్త పాళీ గారు సాఫ్వ్టేర్ క్లబ్ అనుకుంటా.. ప్రవీణ్ నేను ఈ క్లబ్ లో జాయినయ్యి ఓ సంవత్సరం డిసెంబరుకు అవ్వొస్తుంది

  ReplyDelete
 20. అరేయ్ అశ్విన్ నా హార్డ్ డిస్క్ ఫెయిల్ అందుకే నేను నీ పోస్ట్ చూడటంలో చాలా వెనక బడ్డ మాం ....

  సూపర్ ర నవ్వించడంలో నీకు నువ్వే సాటి కాని ఒక్క విషయం నా పొట్ట చేక్కలితే దానికి నీదే బాద్యత ...

  ReplyDelete
 21. అఫీసుకు ఓ మెయిల్ లో మీ సులక్షణ రెడ్డి పోస్టు వస్తే నవ్వి నవ్వి మీ బ్లాగ అడ్రస్సు గూగులో పట్టుకున్న మొత్తానికి. అసలు మీ ఆర్టికల్స్ లో ని డైలాగులకు, సామెతలకు మీ యొక్క క్రియేటివిటీకి హాట్సాఫ్ సూపర్ అండి.

  ఠాఘూర్ ముగ్గురికి కాన్సెప్ట్ సూపర్, అసలు మీ పేశ్టు లో ఉప్పుందా అంటే మా నాన్నకు అప్పుంది అన్నారే రాకింగ్ అండి మీరు చిన్నవారిలా లేదు మంచి చేయితిగిన వారిలా కనపడుతున్నారు. సింప్లీ సూపర్బ్ .

  Finally did u receive I T jamabalakidi pamba ( Just kidding dont take seriously

  ReplyDelete
 22. ఇంత పెద్ద పోస్ట్ ఎలా వ్రాసారండీ? నిషా కొఠారి భలే నిషా గా ఉంటుంది కదా!మంచి పోస్ట్ miss అయ్యేదాన్ని.చాలా బాగా వ్రాసారు.

  ReplyDelete
 23. మా పేష్టులో ఉప్పు సంగతి నాకు తెలియదు కానీ మా నాన్నకు మాత్రం రెండు లక్షల అప్పు మాత్రం ఉంది

  అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట", అని తన సొంత సామెతొకటి వినిపించారు

  ఐ.టి రత్న, ఐటి బూషణ్, ఐ. టి విరాట్, ఐ. టి జంబలకిడిపంబ

  నేను జయప్రదలా ఊపిరాడక ఛఛ్చా

  కూకట్ పల్లిలో కుక్కలెక్కువ ఆ కుక్కలకు నా పై మక్కువెక్కువ.

  కవి హృదయం:: ఇక్కడ గాడిద అంటే >> మా ఇంటోనర్, కుక్క అంటే ఆ గాడిద కుక్క

  హైదరాబద్ లో బసెక్కటం కన్న ఎగురుతున్న విమానం ఎక్కటం చాలా సులువు

  ఆనాడు అన్నమయ్యకు ఆ పద్మావతి దేవి భూమ్మీదకు దిగివచ్చి సహాయం చేస్తే, నా బాధ చూసి చూసీ నా పక్కన డెస్క్లో కూర్చునే పద్మావతి సిగ్గుపడుతూ అశ్విన్ tickle స్పెల్లింగ్ అది కాదు tcl అని చెప్పి నాకు సాయం చేశారు.

  NO MORE WORDS. SUPER

  ReplyDelete
 24. :) చాల చాల బాగుంది
  కొన్ని మాటలు (dialogues) బాగున్నాయి
  బాగా నవ్వుకున్నా

  ReplyDelete
 25. chala chala ba rasaru...navvi navvi poTTalo neppi...chala ba rastunnaru...chinchesaru...

  ReplyDelete
 26. this is hilarious and seems truly true........is this your real story :-) If not, you surely are an excellent creative guy. Couldnt stop laughing at that sontha sametha " అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట" lol.....lol

  ReplyDelete
 27. Hilarious.. funny.. Keep rocking ;)

  ReplyDelete
 28. చాలా బగున్ది.

  ReplyDelete
 29. 100/100 Comedy

  Sir,
  PLZ Give your phone number. I wann meet you

  - Siva

  ReplyDelete
 30. మీ పేస్టులో ఉప్పుందా ? ' - అని అడిగింది. నేను తలగోక్కోని ' మా పేష్టులో ఉప్పు సంగతి నాకు తెలియదు కానీ మా నాన్నకు మాత్రం రెండు లక్షల అప్పు మాత్రం ఉంది ' - అన్నా. ఇది విన్న నిషా కొటారి ఎలా వచ్చిందో అలానే స్లో మొషన్ లో వెనెక్కెళ్ళి పోయింది.
  ఇక నావంతు కర్తవ్యంగా విజయవాడలోని గుళ్ళలో, మసీధులలో, ఆ ప్రభువు సన్నిధులలో నీ పేరు మీద ప్రత్యేక ప్రార్ధనలు చేయిస్తాను
  అదృష్టం ఉన్న బోడిముండకు మంత్రిగారింటి మంగళహారతికి స్పెషల్ invitation వచ్చిందంట",
  అరుణాచలం సినిమాలో రజనికాంత్ కు రంభలా నీకు ఓ పరసనల్ అసిస్టెంట్ ని ఇస్తారు.
  ఒక్క నిషా కటారి ఏంట్రా తెలుగు, తమిళ, మళయాళి, హిందీ సినిమా హీరోయిన్ లాంటి వారు నీ చూట్టూ ఎప్పుడూ నవ్వుతూ కనపడుతారు
  నీ సేవలను గుర్తించి ఐ.టి రత్న, ఐటి బూషణ్, ఐ. టి విరాట్, ఐ. టి జంబలకిడిపంబ వంటి గౌరవమైన పురస్కారాలతో నిన్ను సత్కరిస్తారు.
  హైదరాబద్ లో బసెక్కటం కన్న ఎగురుతున్న విమానం ఎక్కటం చాలా సులువు ../.

  chaala chaala baundi post...kevvu keka katti...

  ReplyDelete
 31. అశ్విన్ గారు
  మీ బ్లాగ్ కి నేను కొత్త. మీ పోస్ట్ లు అన్ని ఇప్పుడే చూస్తున్నాను.
  నవ్వి నవ్వి కడుపు చెక్కలు అయింది. ఇప్పుడే కాసేపు బ్రేక్ ఇవ్వవలిసి వచ్చింది.
  non stop నవ్వుల్లకి నా కళ్ళళ్ళో నుండి నీరు కారి... కారి... పై ఫ్లాట్ వాడు వరదేమో అని బయపడేల చేసింది.
  అప్పుడెప్పుడో titanic cinemaలో హీరోగారు night bathroomలో కుళాయి కట్టేయడం మర్చిపోవడంతో
  ship రాత్రికి రాత్రి మునిగిపోయింది అని విన్నాను. నేను కాసేపు మీ పోస్ట్స్ చదవడానికి బ్రేక్ ఇవ్వకపోయి వుంటే మా streetలోను అంత విపత్తు జరిగివుండేది.

  ReplyDelete
 32. Hatt Off

  Kiran shesham

  ReplyDelete
 33. సూపర్...

  టికిల్ ?? నేను అందులో పనిచేసినా కానీ (ఇక్ష్వాకుల కాలంలో) నాకు దాన్ని టికిల్ అంటారని తెలీలే.

  ReplyDelete
 34. Mee manager gurinchina comments super oo super ... mee samitha + offer letter ithe keka.

  ReplyDelete
 35. chala..chala bagundi aswin garu...konni..konni google bale adugutundi.. :)...

  ReplyDelete
 36. "మొదటి ప్రాజెక్ట్ లో జావా లో క్లాస్ డిక్లేర్ చెయ్యమంటే 7th క్లాస్ అని డిక్లేర్ చేసిన నా టాలెంట్ "..
  Awesome andi..I liked this the best.. rendo rojulninchi ade talichukuni taluchukuni navvu vastondi.. good work.

  ReplyDelete
 37. chala bagundi, to day i got this link from friends. Keep continue..

  ReplyDelete
 38. chala relax ga undi , idid chadivina tharuvta office lo

  ReplyDelete
 39. Aswin it is verry naice yar, i am verry happy while reading this, keepitup.

  ReplyDelete
 40. baasu.. svooper..i saw ur blog accidentally but some accidents are always good. chala baaga raasaru... hasyanni maro mettuki teesukellaru.. keep writing..

  ReplyDelete
 41. baagundi nishakotaari imagination superb.

  ReplyDelete
 42. చాల చాల బాగుంది

  ReplyDelete
 43. చాలా చాలా బాగుంది అశ్విన్ .. :)

  - శ్రీలత

  ReplyDelete
 44. చాలా చాలా చాలా బావుంది

  ReplyDelete
 45. మీ పేస్టులో ఉప్పుందా మా పేష్టులో ఉప్పు సంగతి నాకు తెలియదు కానీ మా నాన్నకు మాత్రం రెండు లక్షల అప్పు మాత్రం ఉంది.
  wat a timing and narration...u hav gud future dude...al da best...

  ReplyDelete
 46. asalu meeru ikkada undalsina varu kadandi babu, nijamgane meeku it jambalakidi pamba birudunu ivvochu.... super.

  ReplyDelete
 47. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 48. నిషా కొటారీ అంటే ఎవరింతకీ అని సస్పెన్స్ తట్టుకోలేక గూగుల్ చేస్తే అమ్మాయి కనపడింది. అసలు పేరు ప్రియాంకా కొటారీ అట కదా? బట్టలు బానే వేసుకుందే?

  ReplyDelete
 49. కె వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ కేక.
  గణపతి రాజు
  కెజీఆర్ నూటపదహార్లు

  ReplyDelete
 50. Chala bagundi post....Please continue with your work.

  ReplyDelete
 51. super boss..pagalabadi navvanu. nuvvu vetakaramga raasina neelo entha goppa writer unnado telustundi.

  ReplyDelete