Tuesday, September 1, 2009

నేను నాన్న ఓ లూనా



మొన్న రేడియో లో FM వింటున్నా. ఓ ప్రేక్షకుడు ఫోన్ చేసి సూపర్ స్టార్ కృష్ణగారి పాట " అంతా భ్రాంతి యేన , జీవితాన సుఖమింతేనా .......", పాట వెయ్యండనడిగాడు. దానికి ఆ యాంకర్ వెంటనే "మీది తెనాలా ? "- అని అడిగింది. దానికి ఆ ప్రేక్షకుడు సిగ్గుపడుతూ మీకెలా తెలిసింది ? అన్నాడు. అది కృష్ణ గారి పాట కాదండి నాగేశ్వరరావు గారి పాట అందామె. కాదండి అది కృష్ణ గారి పాటే అన్నాడు ప్రేక్షకుడు . అందుకనే అడిగానండి మీది తెనాలా అని సరే మీకోరుకునే కృష్ణగారి పాటే విని ఎంజాయ్ చెయ్యండని "అంతా భ్రాంతి యేన , జీవితాన సుఖమింతేనా ........" అని పాట వేసింది. ఈ పాటకు నాకు తెలియని సంభందం. ఆ పాట పూర్తిగా మొదలయ్యేలోపే నేను నా ఫ్లాష్ బాక్ లోకెళ్ళిపోయాను.

అప్పట్లో సూర్యుడికన్నా ముందు లేచి కోడికి కాఫి ఇచ్చి, అది తాగగానే కుయ్యమని చెప్పి, డాబర్ లాల్ దంతమంజన్ తోపళ్ళు తోముకుని. పొద్దున ఆరింటినుండి మా లూనాను తుడవటం మొదలు పెట్టేవాడిని. అలా తుడవటం నా హాబీనో అలవాటో అనుకునేరు. అది పుత్రకామేష్టి యాగం ద్వారా నను పొందిన మా జనకుని ఆజ్ఞ. ఏడింటికి మా అమ్మ రేడియో పెట్టేది. ఏడింటికి అదే పాట వచ్చేది ఎప్పుడూ....."అంతా భ్రాంతి యేన , జీవితాన సుఖమింతేనా .......", నేను ఆ పాట వింటూ మా బండి తుడుస్తునే ఉండేవాడిని. అలా బలవంతంగా తుడవటం వల్లనో, 1980 మొడల్ లూనా అనో తెలియదు కానీ నాకు మా లూనా అంటే పరమ అసహ్యం. అలా నా రెండవ తరగతి నుండి మొదలు పెట్టి నిన్న మొన్నటి నా ఇంజినీరింగ్ ఫైనల్ యియర్ దాకా అదే పాట, అదే గుడ్డ, అదే లూనా, అదే తుడుచుడు. ఇలా నా జీవితం తుడిచి తూడిచి తెల్లారిపోతుందననుకునే టమ్ లో ఏడవ తరగతి పాస్ అయ్యానని అప్పటిదాకా బాంక్ లాకర్లో ఉన్నా మా బండి స్పేర్ తాళాన్ని మా నాన్నగారు నాకిచ్చారు. అలా ఇమ్మని మా తాతగారి అంతిమ కోరిక. నేను ఎనిమవ తరగతి నుండి పొద్దునో గంట సాయంత్రం ఓ గంట ప్రాక్టీస్ చేసి పదవ తరగతికి స్టార్ట్ చెయ్యటం నేర్ఛుకున్నా.



***
ఇక మా నాన్న గారి గురించి చెప్పాలంటే .....
Hanumantam Rao BSC( dis cont )...........
Batch Numer 4567..................
Trained at Mangalagiri ........................
Topper in the batch ....................
24 hrs Undercover.......................

Head Conistable హనుమంతరావ్ అంటే అందరికీ హడల్. నాకూ హడలే. మా నాన్న చిన్నప్పటి నుండి నన్నొక ఖైదీని చూసినట్టు చూసేవారు నేను కూడ ఓ ఖైదీ హెడ్కానిస్టేబుల్ చూసినట్టు మా నాన్నను చూసేవాడిని. మా నాన్నకు నాకన్నా ఆ లూనా అంటే చాలిష్టం. దానిక్కారణం మా నాన్న మార్గదర్శిలో చేరాకా ఎన్నాళ్ళకో కొన్నుక్కున్న మొదటి వొస్తువది. ఇంకా చెప్పాలంటే యమునికి దున్నపోతు, శివునకు నంది, వినాయకునికి ఎలుక, మా నన్నకా లూనా.

***

అది పదవ తరగతి Farewell Day శ్రావణి అశ్విన్ కు యస్ అంటుందా ? సుబ్రమణ్యానికి యస్ అంటుందా అని అందరూ ముక్కూ, మూతి, చెవులు, చేతులు కొరికేసుకుంటున్నారు. ఆ రోజు నేను నా పాటికి లూనా తుడుచుకుంటుండంగా శ్రీకాంత్ వచ్చి "రేయ్, నేను నిన్న ఆ సుబ్రమణ్యం సైకిల్ కి సీటు లేపేశా , నువ్వీ లూనామీదొచ్చేయ్ శ్రావణి మనసు దోచయ్", అని హాజ్మోలా ఐడియా ఇచ్చాడు. పందెం మొదలైంది "మన ఊరి చివరున్న కొలనులో ఉన్నగులేబకావళి పువ్వు ఎవరు ముందుగా తీసుకొచ్చి శ్రావణి చెవిలో పెడతారో వారికే శ్రావణి", అని ప్రకటించారు. అప్పటికే నేను హెల్మెట్ పెట్టుకుని లూనా మీద సిద్ధంగా ఉన్నా బాగ్రండ్ లో " ధూమ్ ... ధూమ్". అని సౌండ్. మా శ్రీకాంత్ గాడు కూడా దూరం నుండు తన రెండు వేళ్ళు చూపిస్తూ చంద్రబాబు నాయుడిలా విజయ సంకేతం చూపించాడు. ఇక వెంటనే లునా రైజ్చేశా...కొలనులోని పువ్వు ఎన్టియోర్ లా ఎగిరి పట్టుకున్నా. తీరా తిరిగివస్తుంటే మా లూనా ఠక్ మని ఆగిపోయి 'దాహం దాహం' అని అరవటం మొదలు పెట్టింది. జేబులో చూస్తే చిల్లి గవ్వకూడా లేదు ఎందుకుంటుంది ఆ చిల్లు లోంచి ఆ గవ్వెప్పుడో జారిపోయుంటుంది. ఏం చెయ్యాలో తెలియక 'హే కృష్ణా.... ...'అని గట్టిగా అరవబోతుండంగా కృష్ణుడు ప్రత్యక్షమయ్యి "దరిద్రుడా, నన్ను పిలవకు. ఓ ఆడపిల్ల అడిగితే అలా వెళ్ళిపోతావా ? అసలు గులేబకావళి పువ్వు చూసిన మొహమేనా నీది? నీకన్నా ఆ సుబ్రమణ్యం వెయ్యి రెట్లు నయం. నువ్వా పువ్వుకోసం కుమార శ్వామిలా తొందరపడీతే వాడు వినాయకుని లా బుర్ర ఉపయోగించి శ్రావణి కి దణ్ణం పెట్టి తన చూట్టూ మూడు సార్లు ప్రదిక్షణలు చేసి తన మనసు చూరగొన్నాడు. గులేబకావళి పువ్వంట గులేబకావళి పువ్వు ఆ పువ్వు నీ చెవిలోనే పెట్టుకో.." అని అమ్మనా బూతులూ తిట్టాడు.

" అబ్బా అలా తిట్టకు, సరే కానీ నాకో రెండొందలు ఉంటే అప్పీ పెట్రోల్ కొట్టించి ఇంటికెళుతా ", అన్నా

"నోర్ముయ్ యధవా , ఇందాకా నీ స్నేహితుడు చంద్రబాబు లా విజయ సంకేతం చూపించలేదు. నీ దగ్గర డబ్బులు లేవని తెలిసి Y S రాజశేఖర్ రెడ్డి లా చెయ్యంతా చూపించి ఆగమన్నాడు, నువ్వాగితేగా. నీకు తోడు ఈ లూనా ఒకటి " అని అవమానించి మాయమయ్యాడు, అలా నా పదవ తరగతి లో నేను అప్పటి దాకా కూడబెట్టుకున్న పరువంతా పోయింది.

***

ఇంజినీరింగ్ లో నేనొక గాంగ్ లీడర్, ఓ నిప్పు రవ్వ, ఓ ధర్మ చక్రం దానికి కారణం ఒక సారి మా కాలేజి లో ఎదో గొడవ జరిగితే మధ్యలో వెళ్ళి సైకిల్ ఛైన్ లాగి హడావిడి చేశా.

ఇంజినీరింగ్ లో ఓ సబ్జెక్ట్ ఉండేది మహానుభావుడు శాలివాహన్ అట ఏం రాశాడో, ఎందుకు రాశాడో, ఎలా రాశాడో తెలియదు కానీ ఓ సబ్జెక్ట్ రాసిపడేశాడు దాని పేరు EDC( Electronics Devices and Circuits ) దానికి తోడు అది చెప్పటానికి వచ్చిన వాడిపేరు "ఏంరాదు" అరవోడు. ఇందులో NPN అంటే ఏంటి? PNP అంటే ఏంటి? transistor కి ancestors కి తేడా ఏమిటి ? Oscillator కి ఆవకాయకి తేడా ఎంటి అన్న అంశాల మీద చెలరేగిపోయాడు. దిక్కుమాలిన సబ్జెక్టు ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు.

అది నేను ముచ్చటగా మూడవ సారి రాస్తున్నా, బ్రహ్మ ఘడియల వరకు చదివితే బ్రహ్మాండంగా మార్కులు వస్తాయని ఓ యధవ చెపితే (అవును ఆ శ్రీకాంతే) అప్పటిదాకా చదివి పొద్దున పదింటికి లేచా 10:45 కి పరిక్ష. ఎం చెయ్యాలో తెలియక మళ్ళీ వాడికే ఫోన్ చేశా దానికి వాడు " అస్సిగా, మీ లూనా వేసుకుని బయలద్యేరు. కరక్టుగా నువ్వెళ్ళేటప్పటికి అందరూ లోపలకు వెళ్ళీపోతారు. పరిక్ష ప్రశంతంగా రాయి. అందరూ వెళ్ళిపోగానే మళ్ళీ మీ లూనా తీసుకుని ఇంటికొచ్చెయ్. ఒకవేళ ఇంకా ఏమన్నా ఇబ్బంది గా ఉంటే. ముసుకు దొంగలా మొహానికి ఖర్చీఫ్ కట్టుకో నిన్నెవ్వరూ మన కాలేజిలో గుర్తుపట్టరు " - అని సలహా ఇచ్చాడు. నేను ముసుక్కట్టుకుని బయలుదేరాఎక్కడ ఆగిపోతుందా అని భయపడ్డా కానీ ఆ రోజు మా లూనా ఆఘమేఘాలమీద దూసుకుపోయింది. అన్నీ అనుకున్నట్టుగానే ఐదు నిమిషాల ముందు కాలేకొచ్చాఅప్పుడే అందరూ లోపలకు వెళుతున్నారు. హమయ్యా ఇక ఈ సారి పాస్ అవ్వటం ఖాయమని ఆనందంలో ఉన్న నేను మా కాలేజి ఎంట్రన్స్ లో ఉన్న స్పీడ్ బ్రేకర్ గమనించలేదు అంతే మా లూనా కాళ్ళకు ఆ స్పీడ్ బ్రేకర్ అడ్డు రావటంలో తన సైలెంసర్ నట్టు జారిపోయి ' డగడగడగడగడగడగ' అనే పెద్ద సౌండ్, వెళుతున్న వాళ్ళు అందరూ ఆగిపోయి ఒక్కసారిగా వెనెక్కి తిరిగి చూశారు. అదే సమయానికి " అదిగదిదో............అదిగదిగో .........ఆకాశం పెళ్ళున తెల్లారే, వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి ....." అంటూ నా ఫోన్ మోగటం మొదలైంది. ఆ నా ఎంట్రంస్ చూసి అందరూ నవ్వటం మొదలు పెట్టారు. ఖంగారు పుట్టి కొంచం స్పీడ్ రేజ్ చేశా అంతే దానికి నా మొహానికి కట్టుకున్న ఖర్చిఫ్ ఎగిరిపోయింది. ' ఏంటే? వాటే వాడు మన సీనియర్ అశ్వినే , ఆ లూనా ఏంటే, ఆ పాటేంటే ఆ సౌండ్ ఏంటే '- అంటూ అందరు అమ్మాయి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. షైలాభనూ తప్ప. నాకు చమటలు పట్టేశాయ్ . సిగ్గుతో మళ్ళీ రేజ్ చేశా. 'ఏంట్రా ? నీ ఇష్టమొచ్చినట్టు రేజ్ చేస్తున్నవ్? నేను హర్ట్ అయ్యా. నేను కదలా నీ దిక్కున్న చోట చెప్పుకో '- అని మా లూనా ఆగిపోయింది. అప్పుడు మా వాళ్ళు+ జూనియర్స్ నవ్విన నవ్వులు ఇప్పటికి నన్ను ఓ పీడకలలా వెంటాడుతున్నాయి.

అలా ఈ అశ్విన్ ని ఈ గాంగ్ లోడర్ , ఈ నిప్పు రవ్వ, ఈ ధర్మ చక్రం, ఈ శివ, ఇంజినీరింగ్ లో ఓ వింత వెధవ కాబడ్డాడు.--- మా లూనా వల్ల.

ఇక మా లూనా గురించి చెపితే పెట్రోల్ బంకు కనపడితే 100లో వెళుతున్నా ఠక్కుమని ఆగిపోయి 'దాహం దాహం' అని అరవటం మొదలుపెడుతుంది. అని చెప్పి ఒకటీ రెండు లీటర్లతో సరిపెట్టుకోదు. బంకులోని పెట్రోల్ అంతా బండిలోకి రావలిసిందే. అయినా సరే మళ్ళీ పట్టుమని పది కిలోమీటర్లు వెళ్ళదు. మళ్ళీ ఆగాల్సిందే. దానికి కారణం మాది మంతెన సత్యనారయణ మూర్తి గారి శిష్యరికం చేసింది. ఆయిన రోజు పది లీటర్లు నీళ్ళు తాగంటే దాన్ని ఆనువదించుకుని 10 లీటర్లు పెట్రోల్ తాగుతుంది. దానితో పాటు ఎప్పుడన్నా బయటకు వెళిటే హీణపక్షం ఐదు కిలోమీటర్లు నెట్టుకుంటూ రావల్సిందే. బెజవాడ రోడ్లపైన దీనిని నెట్టే బదులు ఓ సైకిల్ నెట్టుంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు కనీసం TDP టికెట్టన్నా ఇచ్చుండేవాడు. ఇంతా నెట్టుడూ నెట్టి ఇంటికెళ్ళి మా నాన్నకు చెపితే ' అలా జరిగిందా' అని మా లూనాకు దిష్టి తీసేవారే తప్పా. నన్ను పట్టించుకునే వారే లేరు.

ఓ సారి నాకు సహనానికి సంకెళ్ళు తెగిపోయి తిన్నగా మా నాన్నగారి దగ్గరకు వెళ్ళి " నాన్నగారు ఈ దిక్కుమాలిన బండి తుడవలేక ఛస్తున్నా దీన్నమేసి చక్కగా యే చెతక్కో కొనుక్కుందాం" - అన్నా. దానికి మా నాన్నగారు శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి పెళ్ళిచూపుల సీన్ లో 'షారదా... ..' అని అరిచినట్టు గట్టిగా 'అశ్విన్..." అని గట్టిగా అరిచారు. సీన్ కట్ చేస్తే, అదే పాట అదే గుడ్డ, అదే లూనా అదే తుడుచుడు.

ఇక మా శ్రీకాంత్ గాడు పీనాసితనం లో అహాన పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావ్ కు ఏమాత్రం తీసిపోడు. కోటాగారు కోడిని వేలాడతీసి ఒట్టి అన్నం తింటే మా వాడు Google Images లో Sprite ని కొట్టి కుండలో మంచినీళ్ళు తాగే రకం. చివరకు వాడు కూడా ఇంజినీరింగ్ ఫైనల్ యియర్ లో Yamaha RX-100 కొన్నాడు. నేను మాత్రం అదే పాట అదే గుడ్డ, అదే లూనా అదే తుడుచుడు

రేడియోలో పాటైపోవటంతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చా. గుండంతాబరువుగా అనిపించింది. నా బ్రతుకు మీద నాకే జాలేసింది. ఇప్పుడు నాకు ఆర్ధిక స్వాతంత్రం ఉందని గుర్తుకొచ్చింది. వెంటనే Buying bike Start Immediately అని మా నాన్నగారికి మైయిల్ పెట్టా. మూడవ రోజు అందరూ హైదరాబాద్ వచ్చారు (లూనాతో సహా). వచ్చినప్పటి నుండి మానాన్నగారు లూనా నాతోఏం మాట్లాడటం లేదు. అనుకున్నట్టుగానే ఎక్కడా తగ్గకుండా Pulsar 220 CC- India's Fastest Bike కొన్నా. గుడికి తీసుకెళ్ళా మా లూనా పక్కనే పెట్టా. బ్రాహ్మణుడు పూజ చేస్తున్నారు. మా లూనా ఒంక చూసి చూశావా ఎలా ఉందో అని అర్ధం వచ్చేటట్టు కళ్ళెగరేశా, దానికి నా Pulsar బాలకృష్ణ లా మీసం మెలేసింది. మా లూనా ఏం చెయ్యలేక పళ్ళుకొరికింది. పూజైపోయింది. అసలు Pulsar అంటే ఏమిటో ఇన్నాళ్ళూ లూనా నడిపిన మానాన్నగారికి చూపిద్దామని, నాన్నగారు మొదటగా మీరు అమ్మా ఓ రౌండ్ వేసిరండని నా అతి లివితేటలు ప్రదర్శించా, ఇద్దరూ ఎక్కారు , స్టార్ట్ చేశారు గేర్ వేశారో లేదో యాడ్ లో చూపించినట్టు మాయం అయ్యారు. ఎక్కడకు మాయం అయిపోయారు అని నేను అటూ ఇటూ చూస్తున్నా.....

ఓ అరగంట తరవాత.ఫోన్ మోగొంది ఎవరని చూస్తే మా అమ్మ

నేను :: అమ్మా ఎక్కడున్నారు ?
అమ్మ: అస్సిగా మేను విజయవాడ హైవేమీదున్నాం.
నేను :: విజయవాడ హైవేనా అక్కడికెందుకేళ్ళారు ???
అమ్మ: చెపుతున్నా ఈ బండి చాలాబావుందిరా. నాకు మీ నాన్నగారికీ బాగా నచ్చింది. నాకూ వెనకాల కూర్చోటానికి చాలా సౌకర్యంగా ఉంది ఇన్నాళ్ళూ ఆ లూనావెనకాల కూర్చోలేక నా ప్రాణం పోయింది. అన్నట్టు ఎప్పుడూ నిను తిట్టే మీ నాన్నగారు అయితే నిన్ను ఈ రోజు మునగ చెట్టెక్కిస్తున్నారు నిన్ను లూనా వాడుకోమన్నారు, టైంకి అన్నం తిను. ఉంటాను - అని ఫోన్ పెట్టేసింది.

ఒక్కసారిగా నాకు బుర్ర బ్లాస్ట్ అయ్యింది. మా లూనా వొంక చూసా ఇక నుండి రారా చూసుకుందాం హైదరాబాద్ రోడ్ల మీద నీపెతాపము నా పెతాపము అని గట్టిగా గర్జించి తొడకొట్టింది. నేను ఏం చెయ్యలేక తల దించుకున్నా. బాగా కోపం మీద ఉంది నేను స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదని తెలిసి స్టార్ట్ చెయ్యటానికి ప్రయత్నించకుండా స్టాండ్ తీసి నెట్టుకుంటూ వెళ్ళబోతుంటే .. ఎదురుకుండా పెద్ద కటౌట్, ప్రియాంకా చోప్రా ఓరగా చూస్తోంది పక్కన Why should boys have all the fun అని రాసుంది.

77 comments :

 1. చాలా బాగుంది.నవ్వి నవ్వి ప్రొద్దుటే కడుపు నొప్పి తెచ్చుకొన్నాను.

  ReplyDelete
 2. మాది బెజవాడే :)
  చాలా బాగా నవ్వించారు!

  ReplyDelete
 3. పొద్దున్నే మీరొకరిని నవ్వించి నవ్వించి హత్య చేశారు . Perfect Comedy. PErfect Execution. Rocking post

  ReplyDelete
 4. యాధాలాపంగా చదివటం మొదలెట్టాను. చాలా అద్భుతంగా వ్రాసారు. మంచి శైలి ఉంది. ఆ శైలి కాపాడుకోండి.

  ReplyDelete
 5. చాలా రోజుల తరువాత రాసారు. నవ్వీ నవ్వీ కళ్ళంట నీళ్ళోచ్చాయి. ఇంతకీ మీరూ మీ లూనా హైదెరాబాద్ రోడ్ల మీద క్షేమమేనా?

  ReplyDelete
 6. Supero Super!, naadi vja needi vja manadi vja. ha..ha...haa... annattu meeru ye school, ye college?

  Uma

  ReplyDelete
 7. super :) చాలా బాగా రాసారు అశ్విన్

  ReplyDelete
 8. ఎప్పట్లాగే హ హ హ. ఇలాక్కాదు గానీ అశ్విన్ గారూ, మనమో విడ్జెట్ కనిపెడదాం. మీ బ్లాగులో ఏదైనా కొత్త టపా రాగానే నాపేరు మీద ఒక కామెంట్ "సూపరు", "హ్హహ్హహ్హ", "కడుపుబ్బా నవ్వించారు" ఇలా ఆటోమాటిగ్గా వచ్చేట్లు అన్నమాట. మీ ప్రతీ టపా సూపరుగానే వుంటుంది,కానీ నాకే మాటిమాటికీ "బావుంది" అని రాయాలంటే బధ్ధకం. అలాగని బావున్న టపాని మెచ్చుకోకుండా వుండలేం కదా :)

  ReplyDelete
 9. సూపరొ సూపర్. ఫినిషింగ్ టచ్ మాత్రం అద్భుతం....

  ReplyDelete
 10. రారా చూసుకుందాం హైదరాబాద్ రోడ్ల మీద నీపెతాపము నా పెతాపము ....soopppeer

  ReplyDelete
 11. అద్భుతం అదరగొట్టారు. వింత వెధవా అన్న ప్రయోగం సూపర్. నేను నాన్న ఓ లూనా ఆ టైటిలేంటండి నవ్వలేక చస్తున్నాను.

  -Swappu

  ReplyDelete
 12. Katti kekaanthE

  ReplyDelete
 13. orey baaabooooo navvinchi navvinchi chamepddam anukuntunnav enti ??

  u become another THOTARAMUDU on blog world...

  Keep it up friend

  ReplyDelete
 14. >> ఇక మా శ్రీకాంత్ గాడు పీనాసితనం లో అహాన పెళ్ళంట సినిమాలో కోటా శ్రీనివాసరావ్ కు ఏమాత్రం తీసిపోడు. కోటాగారు కోడిని వేలాడతీసి ఒట్టి అన్నం తింటే మా వాడు Google Images లో Sprite ని కొట్టి కుండలో మంచినీళ్ళు తాగే రకం.

  Hilarious

  ReplyDelete
 15. చాలా బాగుంది బాసూ:-)

  ReplyDelete
 16. By the way, what is the relation between that song and tenali ?

  ReplyDelete
 17. మామూలుగా కాదు, హిమాలయాలంత హిల్లేరియస్! అభినందనలు అశ్విన్ గారూ.

  ReplyDelete
 18. Wonderful...! nicely written..! :)))

  ReplyDelete
 19. ఈ పోస్టు చదువుతున్నంత సేపు ప్రతీ సీనూ కళ్ళముందు కనపడింది.మీ పక్కింటి గోడ మీద కుర్చుని ఇదంతా చూసి నవ్వుకుంటున్నట్టు కూడా అనిపించింది.మీ భాషలో సీన్ కట్ చేస్తే ...కెవ్వ్వ్వ్....

  ReplyDelete
 20. మీసాలకి రంగేసుకున్న వో హెడ్‌కానిష్టేబులు గారు మొన్నటికి మొన్న బందర్రోడ్డు మీద రయ్యి రయ్యిమని పల్సార్ బండి రేజ్ చేస్తున్నారు .. ఇదా అసలు సంగతి?

  ReplyDelete
 21. Wonderful, fantastic and above all HILARIOUS!!

  ReplyDelete
 22. అప్పట్లో సూర్యుడికన్నా ముందు లేచి కోడికి కాఫి ఇచ్చి,
  గులేబకావళి పువ్వంట గులేబకావళి పువ్వు ఆ పువ్వు నీ చెవిలోనే పెట్టుకో.." అని అమ్మనా బూతులూ తిట్టాడు.
  ఇంజినీరింగ్ లో నేనొక గాంగ్ లీడర్, ఓ నిప్పు రవ్వ, ఓ ధర్మ చక్రం
  ఏంట్రా ? నీ ఇష్టమొచ్చినట్టు రేజ్ చేస్తున్నవ్? నేను హర్ట్ అయ్యా. నేను కదలా నీ దిక్కున్న చోట చెప్పుకో .....
  తొడకొట్టింది...
  katti kevvu kekaa...its tooo gud....

  ReplyDelete
 23. అశ్విన్ గారూ, ఈమధ్య కాలంలో ఇంత గొప్ప హాస్యరచన ఎక్కడా చదవలేదండి. మీరు నెలకోటి రాసినా, మూణ్ణెల్లకోటి రాసినా, ఏడాదికోటి రాసినా పర్లేదు.. ఇలాటిదొకటి మా మొహాన పడేస్తూ ఉండండి - అదే మాకో కోటి!
  .................

  కొత్తపాళీగారూ, ఆమధ్య దాకా హై.రోడ్ల మీద ఒకాయన ఎప్పుడూ ఓ లూనాను తోసుకుని వెళ్తూ కనిపించేవాడు, ఆయన నీరసంగా ఉండేవాడుగానీ, లూనా మాత్రం మాంఛి ఉషారుగా ఉండేది. ఈ మధ్య ఎంచేతో కనబడ్డంలా!

  ReplyDelete
 24. నోర్ముయ్ యధవా , ఇందాకా నీ స్నేహితుడు చంద్రబాబు లా విజయ సంకేతం చూపించలేదు. నీ దగ్గర డబ్బులు లేవని తెలిసి Y S రాజశేఖర్ రెడ్డి లా చెయ్యంతా చూపించి ఆగమన్నాడు, నువ్వాగితేగా. నీకు తోడు ఈ లూనా ఒకటి "

  Super

  ReplyDelete
 25. Yes,, why should boys have all the fun..

  ReplyDelete
 26. బాగా రాసావురా

  ఈ సారి నీ టపా అదిరిన్ది

  ReplyDelete
 27. రారా చూసుకుందాం హైదరాబాద్ రోడ్ల మీద నీపెతాపము నా పెతాపము -Soooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooper

  ReplyDelete
 28. ayyo ayithe malli miku loona ne dikka.mi pulsar mi father use chestunara, entha darunam hathavidi ;)

  ReplyDelete
 29. aswin garu!

  Mee anni posts chaalaa chaalaa baavunnaayi! oka daanini minchi marokati!!! edo cinema choosthunnattu ga chakkagaa narrate chesthaaru!!

  meeku abhinandanalu!

  ~Katyayani

  ReplyDelete
 30. hey buddy ever since i know about ur stories this is the first time i read urs.its simply fantastic wat to say i m proud to hav a buddy like u..... all the best.....

  ReplyDelete
 31. బావుంది. :)

  ReplyDelete
 32. aswin naa blog ideraa

  http://tholiadugu.blogspot.com/

  ReplyDelete
 33. ee point daggara ekkuva navvu vachindi ani cheppadaaniki veelu lekundaa vundandi. full post full comedy.

  ina priyanka chopra ala adagaka pote meeru post vraasi mammalni navvincharu kadaa...... anduke priyanka ala cheppindi

  ReplyDelete
 34. హ హ అదిరింది అశ్విన్ గారు, మొదటి నుండి చివరి వరకు నవ్వుతూనే ఉన్నా :-) ఈ మధ్య చాలా కాలం అవుతుంది మీ బ్లాగ్ చూసి...

  "మా లూనా వొంక చూసా, ఇక నుండి రారా చూసుకుందాం హైదరాబాద్ రోడ్ల మీద నీపెతాపము నా పెతాపము అని గట్టిగా గర్జించి తొడకొట్టింది."
  ఇది మాత్రం అసలు అల్టిమేట్ :-)

  ReplyDelete
 35. adbhutam aswin...meeru raayadamledani..ne mee blog chuddam maaneshaa...sooper really..off lo chaduvuthu...enthalaa navvano...abba..soopero sooper..

  ReplyDelete
 36. Brilliant post. Enjoyed it. Thanks Aswin.

  ReplyDelete
 37. This comment has been removed by the author.

  ReplyDelete
 38. Hats Off Comedy

  ReplyDelete
 39. hi...chala bagaa rasarandi
  chala rojula tarvata manchi sunnitamina hasyam....manasara navvukunna...intaki luna tone devadas pata padukuntunnara..leka balakrishna lanti pulsor konukkunnara

  ReplyDelete
 40. arey aswin ga..
  comedy tho champesthunnav raa
  devudaa.. hilers..
  --sriharsha

  ReplyDelete
 41. champestunnav boss... nijam ga nee posts chadivi nenu enta navvukuntanoo... once again thanks for such nice and hilarious comedy... keep rocking bro.

  ReplyDelete
 42. చాలా బాగా వ్రాసారు, నవ్వలేక కామెంటు పెడ్తున్నా

  ReplyDelete
 43. నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
  "బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
  కోసం ఈ కింది లంకే చూడండి.
  http://challanitalli.blogspot.com/2009/12/2009.html

  ReplyDelete
 44. అర్ధ రాత్రి చదివాను , నిదురంతా పోయింది , ఏమి లేని సీన్ లో చాల కామెడీ పండించారు , చాల గ్రేట్ , లైఫ్ లో మీ లాగా జలిగి బతికేసే అదృష్టం అందరికి రావాలి....

  శ్రీకాంత్

  ReplyDelete
 45. స్టొరీ కేక బాసు

  ReplyDelete
 46. అశ్విన్ గారు! చాలా బాగుంది. నవ్వలేక చచ్చాను. మొత్తం నవ్వించారు.

  ReplyDelete
 47. చాలా బాగుంది.

  ReplyDelete
 48. too good,maa srikanth gaadu kota srinivasarao ki yemtram tesipodu google lo sprite type chesukuni kundaloe manci neeluu tage rakam!!! comparision super

  ReplyDelete
 49. NAVVALEKA CHACHHI POYANANDI BABOYI

  ReplyDelete
 50. navvaleka chachhipoyandi baboyi

  ReplyDelete
 51. hii.. Nice Post Great job. Thanks for sharing.

  Best Regarding.

  More Entertainment

  ReplyDelete
 52. punchline బావుంది అశ్విన్. మీ పోస్ట్ లాగా వెలిగే కామెంట్ రాయలేం గానీ, చంద్రుడికో నూలుపోగు.

  ReplyDelete
 53. మీ లూనా బాగుంది

  ReplyDelete
 54. Awesome!! I really enjoyed Aswin … I can really sense the story line while reading …. Very good … kept up!!

  Raghav

  ReplyDelete
 55. superb comedy baasuu...........

  ReplyDelete
 56. sir, mee Blagotham NENU NANNA O LOONAA sankshiptanga (place leka) Andhra Jyothi sunday book ( 1.9.13) issue lo prachuristunnam. mee migatha rachanalu koodaa chalaa baagunnayi. appudappudu memu reprint chesukune anunumathi ivvagalaru pl. - editor
  - sunday.aj@gmail.com

  ReplyDelete
 57. sir, mee Blagotham NENU NANNA O LOONAA sankshiptanga (place leka) Andhra Jyothi sunday book ( 1.9.13) issue lo prachuristunnam. mee migatha rachanalu koodaa chalaa baagunnayi. appudappudu memu reprint chesukune anunumathi ivvagalaru pl. - editor
  - sunday.aj@gmail.com

  ReplyDelete
 58. Em twist icharu mee parents.... supero superu...Climax adiripoyindhi.

  "అమ్మ: చెపుతున్నా ఈ బండి చాలాబావుందిరా. నాకు మీ నాన్నగారికీ బాగా నచ్చింది. నాకూ వెనకాల కూర్చోటానికి చాలా సౌకర్యంగా ఉంది ఇన్నాళ్ళూ ఆ లూనావెనకాల కూర్చోలేక నా ప్రాణం పోయింది. అన్నట్టు ఎప్పుడూ నిను తిట్టే మీ నాన్నగారు అయితే నిన్ను ఈ రోజు మునగ చెట్టెక్కిస్తున్నారు నిన్ను లూనా వాడుకోమన్నారు, టైంకి అన్నం తిను. ఉంటాను - అని ఫోన్ పెట్టేసింది."

  ReplyDelete
 59. COMEDY KNIGHTS WITH KAPIL
  chusi kuda intala nawale boss really superb pls blog tiseyakandi
  mana telugu chirakalam khuni avakunda undalante melanti vallu tappaka kavali

  ReplyDelete
 60. క్లైమాక్స్ హిలేరియసండి...

  ReplyDelete