Monday, June 8, 2009

Wanted : Suseela @ s/w Company

March 4 2009
Office కి శ్రీకాంత్ ఒళ్ళంతా దెబ్బలతో వచ్చాడు. ఎంత మంది బతిమిలాడినా వాడు ఆ దెబ్బలకు కారణం ఏమిటో చెప్పలేదు.
------------------------------
May 9 2009
రిమోట్ లో కొత్త బ్యాటరీస్ వేసారని టీ.వి చూస్తున్న . ఇంతలో
బలమైన జుట్టుకు కావాలి ఆయిల్,
కాదు
బలమైన జుట్టుకు కావాలి షాంపూ
కాదు ఆయిల్ , కాదు షాంపు అంటూ ఓ యాడ్ లో ఇద్దరు కవల పిల్లలు కొట్టుకుంటున్నారు. నాకూ అదే డౌట్ వచ్చింది . బలమైన జుట్టుకు కావల్సిందేమిటి ? షాంపూనా లేక ఆయిలా అని. ఇంతలోపల ఆ పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్లి " అమ్మ చెప్పు నిజమైన జుట్టుకు కావల్సిందేమిటి, షాంపూ నా లేక ఆయిలా ? " ఆ పిల్లలకు ఏం
సమాధానమొస్తుందో అని నేనూ వేచిచూస్తున్న ఎందుకంటే ఇప్పుడు ఆ జవాబు తెలుసుకోవాల్సిన అవసరం నాకూ ఉంది. సమాధానం వచ్చే లోపే ఛా కరంట్ పోయింది. అసలు ఆ యాడ్ దేనిది షాంపూ దా లేక ఆయిల్ దా ? అసలు బలమైన జుట్టుకు ఏంకావాలి ? ఇలా అనేక ప్రశ్నలు నాలో తాండవిస్తున్నాయి . ఇక లాభం లేదని మా నాన్న దగ్గరకు వెళ్లి
"నాన్న బలమైన జుట్టుకు ఏం కావాలి షాంపూ నా లేక ఆయిలా ?"
పనిలేని మంగలోడు పిల్లి తల గోరిగాడన్నట్టు, ప్రాజెక్ట్లు లేక సాఫ్టవేర్ ఇంజినీర్ టీ.వి చూస్తే ఇలాంటి డౌట్లే తగలడతాయి.
షాంపూ సంగతి పక్కన పెట్టు కానీ ముందు ఈ రెండు వేళ్ళలో ఓ వేలు పట్టుకో అన్నారు తన ఉంగరం వేలుకున్న ఉంగరాన్ని జేబులో వేసుకుంటూ ...
బహుశ ఆపై వచ్చే ఎన్నికల్లో C M ఎవరో తెలుసుకోటానికేమోనని చిన్నగా ఉందని జాలేసి చిన్న వేలు పట్టుకున్న,
"ఏం నాన్న చంద్రబాబా?"
"కాదు కన్నా వాళ్ళ అమ్మాయి అరుంధతి "
"పేరు బానే ఉంది కాని అర్ధం కాలేదే "
"అర్ధంకావటానికి ఇందులో ఆర్ధికలావాదేవులేం లేవు , నా చిన్నప్పటి స్నేహితుడి ఒక్కగానొక్క అమ్మాయి అరుంధతి"
"ఓహో ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్నికల్లో నుంచోబోతుందా ? "
"ఏంటి ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎన్నికల్లో నుంచోవాలా ? "
"పెళ్ళా ???"
"సడన్ గా KCR కార్ కొన్నట్టు నాకీ పెళ్ళేంటి ?"
"ఏంలేదురా అర్జెంటుగా ఓ 4 లక్షలు కావాలి అందుకే "
"నాన్నగారు మీరు నాకు పెళ్లి చేస్తున్నట్టులేదు, తాకట్టుపెడుతున్నట్టుంది."
"అలా అంటావేంట్రా, డబ్బుకోసమే కాదులే మీమామగారి మంచి తనము చూసి ఒప్పుకున్నా. project లేక బెంచి మీద కూర్చునే వాడిని కుడా పిలిచి పీటల కుర్చోమన్నారే ఆ మంచి తనానికి నేను ఫ్లాట్ అయ్యా ."
" ఇది చూసి ఆయినను కరుణామయుడనుకునేవు. ఆయినింతకముందు బంగారం వ్యాపారం చేసేవాడు. బంగారం రేటు తగ్గినప్పుడు కొన్నట్టు ఆర్ధిక మాంద్యం లో సాఫ్టవేర్ ఇంజినీర్ ని కొనాలని రాజనాల పధకం పన్నాడు. ఒరిజినల్ ఏనాని గిల్లి రాయి కేసి రుద్దినా రుద్దుతాడు."
"నువ్వు జోకులు బావేస్తావే "
"గన్ను కుడా బాకాలుస్తా "
"అఘోరించావులే, పరకాల కబుర్లు చెప్పకు , రేపే చూపులు ఇదిగో ఫొటో ", అంటూ నాకు ఫొటో ఇచ్చారు.
తీరా ఫొటో చూస్తే అనుష్క
"నాన్నా ఇది అనుష్క"
"మీ మామగారు కె. రాఘవేంద్రరావ్ (B. A) వీరాభిమాని. హాబీ ఫోటోగ్రఫీ. అమ్మాయి అనుష్క లా ఉంటుందని సింబాలిక్ గా చూపించటం లోని ప్రయత్న లోపమే ఆ ఫొటో. ఆఫొటో లో చెయ్యొక్కటి పడింది గమనించావా? గమనించే ఉంటావులే, ఆ చెయ్యే పెళ్ళి కూతురిది , ఎలా ఉంది రా నా కోడలు ?"
"చాలా బావుంది నాన్న గారు , అసలు నిజంగా అంత అందమైన చెయ్యిని నా జీవితంలో చూడలేదు. అసలు చూపుడు వేలు కన్న మధ్య వేలు పెద్దదై ఎంతో అందం తెచ్చింది చేతికే"
"నువ్విలాంటి కబుర్లు ఎన్ని చెప్పినా, మీ అమ్మ ఊర్లో లేకపొయినా, రేపు మనం వెళ్ళితీరాల్సిందే "
*********
నేనెక్కడ పారిపోతానోనని నన్ను రాత్రంతా గొలుసులతో కట్టేసి వీరప్పన్ ని కాపలా పెట్టారు. వీరప్పన్ అంటే మొరగ లేని మా కుక్కపిల్ల. పిల్లైనా, తల్లైనా దానికి ముందు అది ఓ కుక్క. అందుకని నేను దానికి good night చెప్పి పడుకున్న.
*********
షాట్ నాట్ ఒకే, లైట్స్ ఆఫ్ అని ఎవరో కుక్కరిచిన్నట్టు అరుస్తుంటే మా విరప్పనేమో అని కళ్ళు తెరిచా. తీరా చూస్తే నా మెళ్ళో చామంతి పూలదండ, నుదుటిన బారున పెద్ద బొట్టు, సగం పగిలిన కళ్ళజోడు పై చాక్పీస్ తో ray-ban అని రాసుంది.
"కదలకండి, ఒక్క నిమిషం ", అని ఎవరో అరుస్తున్నారు.
చూస్తే దూరంగా బల్ల కిందనుంచి ఎవరో ఫొటో తీస్తున్నారు.
ఎవర్రా నువ్వు అని నేను లేవబోతుంటే... "లేచావా, ఏంలేదురా నువ్వు లేచేలోపు మీ మామగారు కొంచం ప్రాక్టీస్ చేసుకుంటా అంటేనూ దాందేముంది ఓ వెయ్యిచ్చి చేసుకోమన్నా. ఇంతలో నువ్వే లేచావు." అని మా నాన్న గారి గొంతు వినపడింది.
"మీ వెయ్యి కోసం నన్ను వింత పశువులా తయారు చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా ?"
" Man is a social animal అన్నారు కదరా, ఐనా సినిమాలో ఈ వేషం ఇస్తే వెయ్యవా ఏంటి?"
బర్రెకు మనిషికి తేడా తెలియకుండా మేకప్ వేసి మీరు బల్ల కింద దూరి ఫొటో తీస్తే ఏం పడుతుందండి నా కాళ్ళు తప్ప. ఆపుకోలేక అడిగేసా చంద్రబాబు గారిని .
అదా బాబు ఆ విషయం గమనించే మీ కాళ్ళ ఎదురుగా టిపాయ్ అడ్డం పెట్టా నెత్తిమీద వేసుకున్న గుడ్డ అడ్జెస్ట్ చేసుకుంటూ బదులిచ్చారు .
ఆయన చెప్పిన సమాధానంతో బుర్ర ఓ పది నిమిషాలు తిరిగి ఆగింది
ఇంతలో, "నేను ఎవరో చెప్పుకో బావా " అని కళ్ళు మూసాడు.
"బహుశ చంద్రబాబు గారి అబ్బయనుకుంటా"
"ఎలా చెప్పావ్ బావా ?"
"నువ్వు కళ్ళు మూసింది మా నాన్న కి నేను ఇక్కడ తగాలడ్డా"
"భలే మా నాన్న ఇలానే చెయ్యమన్నాడు. అయినా నువ్వు జోకులే భలే వేస్తావు బావా" అని ఒక్క గుద్దు గుద్దాడు (సరదాగా )
ఆ గుద్దుకు ఎవ్వరికి కనపడని అల్లా నాకు కనపడ్డాడు. ఆ దెబ్బకు నాకు సృహ తప్పినంత పనైంది.
"అల్లుడు గారు మీరు బా కో-ఆపరేట్ చేశారు.ఫొటోలు బా వచ్చాయి చూడండి.", అంటూ ఫొటోలు చేతికిచ్చారు
" అప్పుడే ఫొటోలు కుడా ..."
" ఫొటోలే వస్తాయి. అందులో మనం రావు. " , చెవిలో నిమ్మిదిగా గొణిగారు మా నాన్న
" అది నాకు నువ్వీ సంబంధం చూసినప్పుడే తెలిసింది. అయినా ఎందుకు రావు నాన్న చూడు మీ కుడి కాలు నా ఎడం చెయ్యి ఒకే ఫొటోలో ఎంత బా వచ్చిందో ...."
ఎక్కడనుండి తగలడ్డాడో తెలియదు కానీ "భలే జోకేసావ్ బావా " అని బుగ్గ మిద ఒక్కటిచ్చాడు (సరదాగా),
దానికి నా ఒంట్లో రక్తం అంతా బుగ్గద్వార బయటకు పోయి బుగ్గకు పెద్ద ప్లాస్టర్.
*******
ఇంతలో ఎవరో సడన్ గా మంచి నీళ్ళ గ్లాసుతో ప్రత్యక్షమయ్యారు
"ఇప్పుడే అనుకున్నాను మంచి నీళ్ళు అడుగుదామని ఇంతలో మీరెవరో దేవతలా వచ్చారు. ", అని మంచి నీళ్ళ గ్లాసు చేతికి తీసుకున్నాను.
"మీరెవరో అంటారేంటి అల్లుడు గారు నా పేరు కూరాడ పూర్ణ వేంకట శేష సాయి పవన రామ లక్ష్మీ అఖిల బ్రహ్మాండనాయక శివ సుబ్రమణ్య సమేత లలితా దేవి పరమేశ్వరి .." అంటూ ఇంకా ఏదో చెపుతూ ఆయాసంతో ఆగిపోయారు.
నాకు జాలేసి ఆ నీళ్ళ గ్లాసు ఆవిడకే ఇచ్చా. అయినా ఆస్త్మా, ఆయాసం పెట్టుకుని ఆ పేరు చెప్పకపోతే ఏమైందండీ ?
భలే జోకేసావ్ బావా అని ఆ నిష్ట దరిద్రుడు మళ్లీ ముక్కుమీద ఒక్కటిచ్చాడు ( సరదాగా) ఆ దెబ్బకు చచ్చిపోయిన మా బామ్మ తాతయ్యతో సహా కనబడటమే కాకుండా ఓ పది నిమిషాలు కబుర్లు కూడా చెప్పింది .
"ఏమనుకోకు బాబు నా పేరంటే నాకు చాల ఇష్టం అందుకే ఎవరడిగినా చెప్పకుండా ఉండలేను. ఇది టెస్ట్ చెయ్యండి మీకోసం స్పెషల్ గా చేసాను", అని ఓ పదార్ధాన్ని ప్లేటులో పెట్టి చేతికిచ్చారు.
"ఏమనుకోకండి నేను అసలు నేను ఇక్కడ ఉంటానని ఊహించలేదు. మా నాన్న గారు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొచ్చారు, అది కుడా నా ప్రాబ్లం కాదు కానీ నేనింకా పళ్ళు తోమలేదు."
"నాకన్నీ తెలుసు బాబు, అందుకే ఇది తయారు చేశా ఇది పళ్ళు తోముకోక ముందే తినాలి "
ఈ డైలాగ్ కి బుర్ర ఓ అరగంట తిరిగి ఆగింది. ఎలాగూ పళ్ళు తోముకోక ముందు తినటం మనకలవాటైన పనే నేనూ కొంచం రిలాక్స్ అవుతానని మొత్తం ఖాలీ చేశా.
పది నిమిషాల తరవాత కళ్ళు మంటలు, కడుపులో మంటలు, అరిచేతులు అరికాళ్ళు తిమ్మిరెక్కటం మొదలైనాయి.
"ఏం పెట్టారండి ఒంట్లో రకరకాలుగా ఉంది ? "
"దీనిపేరు Chump end of lamp with onion jam and deep fried leeks " అన్నారు ఆయాస పడుతూ
"ఏమండీ చెప్పటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, మీరిలా కన్ఫ్యూస్ చెయ్యటం ఏం బాలేదు."
" నిజంగా దీనిపేరు Chump end of lamp with onion jam and deep fried leeks. పోయిన సారి చూపులలో వెరైటీ గా ఉంటుందని బెల్లం, సగ్గుబియ్యం వడియాలు పెడితే ఫ్లాపైందని ఈ సారి ఇది ట్రై చేశా. "
"నా తద్దినం, వడియాలు ఇలాంటి దిక్కుమాలినవి పెట్టరండి పెళ్లి చూపులంటే ఎ కారప్పూసో, మైసూర్ పాకో పెడతారు."
అంటే మీరు సాఫ్ట్ వేర్ కదాని chef2chef.net లో చూసి చేసాను. ఉండండి జూస్ పట్టుకోస్తానని లోపలకి వెళ్ళారు.
"అల్లుడుగారు మీరు కొంచెం కాలు అటు జరిపితే నేను ఫొటో తీసుకుంటాను" అని ఎక్కడినుండో వినపడింది .
మిమ్మల్ని ఆపేవారెవరున్నారు కానీ ఇంతకీ మీరెక్కడున్నారు, మాటలు వినపడుతున్నాయి కాని మనిషి కనపడకడిగాను.
"నేనా, మీరు పైకి చూస్తే ఫోటో తీద్దామని ఇందాకెప్పుడో మీకుర్చీ కింద దూరాను", అన్నారు నా కాళ్ళ మధ్యనుంచి చూస్తూ ...
ఇందాకటి నుండి కెమెరా లెన్స్ ఓపెన్ చెయ్యకుండా ఫోటోలు తీస్తే సహించగాలిగాను గాని ఇక నా ఓపికకు ఉత్తరాయణం పట్టింది. అయినా చేసేది ఎం లేక కుర్చీని ఒక్క తన్ను తన్ని నేను కింద కూర్చున్నా.
ఓ పది నిమిషాల తర్వాత అదిగో అమ్మాయొస్తుందన్నారెవరో
వెంటనే మా నాన్న లేచి " అస్సిగా నువ్వు అమ్మాయితో మాట్లాడుతూ ఉండూ నేను ఓ దమ్ముకొట్టి వస్తాను" అని హడావిడి గా బయటకెళ్ళారు.
చేతిలో జుస్ తో నిలువెత్తు జేజెమ్మ లా వచ్చింది ఆమె, ఎదురుగుండా కూర్చుంది.
"ఎమన్నా అడగాలనుకుంటే అడుగు బాబు అమ్మాయిని"
"మీ పేరేంటండి ?" అనడిగా సిగ్గుతో ..
తను కోపంగా చూసింది. బహుశ తెలిసి ఎందుకడుగుతున్నావ్ అనేమో అని
" మీకు సంగీతం వచ్చా ?" అనడిగా
దానికి ఇంకా కోపంగా పళ్ళు కొరుకుతూ నా వైపు చూసింది.
ఇంకా ఏదో అడగబోతుంటే ,ఒక్కసారిగా " రేయ్ పశుపతి" అని అరిచింది.
నాకర్ధం కాక వెనకకు ముందుకు చూసుకున్నా, పశుపతి కాదండి అశ్విన్ నా పేరు.
" నాకు తెలుసురా నీగురించి మా అక్క జీవితంతో ఆడుకున్నది కాకుండా ఇప్పుడు నాతో పెళ్ళికి సిద్దం అవుతావా ? " "ఎవరు ? "
"నువ్వే "
"నేను "
" అవును నువ్వే "
" అంతే కాకుండా నాకు నాట్యం నేర్పించటానికి వచ్చిన మా గురువుగారి జీవితానికి కుడా నువ్వు అన్యాయం చెయ్య.లేదూ?"
"లేదే "
"చేశావ్"
" ఆశక్తురాలినై ఆ జన్మలో ప్రాణం విడిచాను. ఈ జన్మ లో నిను వదలను రా పశుపతి" అని జ్యూస్ నా మీద కొట్టి వీపు వెనుకాల నుండి బారున పెద్ద కత్తి తీసి నా వైపు దూకింది.
నాకు కాళ్ళు చేతులూ ఆడలేదు. టెన్షన్ తో ఒళ్ళంతా చెమటలు పట్టేసాయ్, దమ్ముకని వెళ్ళిన మా నాన్న ఇంకా రాలేదు. రారని నాకర్ధమైపోయింది. ప్రాణ భయంతో పరిగెత్తటం మొదలుపెట్టా. నేను, నన్ను చంపటానికి ఆ అరుంధతి, అరుంధతి పట్టుకోటానికి వాళ్ళమ్మ , నన్ను ఫొటో తియ్యటానికి వాళ్ళ నాన్నఓ అరగంట పాటు ఒకళ్ళ వెనుకాల ఒకళ్ళు పరుగెత్తాం . నేను పశుపతి నేమిటే పిచ్చదాన, నా కంత సీను లేదని ఎంత చెప్పినా వినలేదు.పరిగెత్తీ పరిగెత్తీ చివరకు ఓపిక లేక బాత్రూం లో దాక్కున్నా. రెండు సార్లు కత్తి వేటు పడింది కానీ తప్పించుకున్నా. మా నాన్నకు ఫోన్ చేశా switched Off అని వచ్చింది.ఆ పిచ్చదేమో నిను చంపి ఈ రోజు నా దాహం, పగ తీర్చుకుంటా అని చెవులు చిల్లులు పడేలా అరుస్తుంది. వాళ్ళ పిచ్చ నాన్నేమో బాత్రూం వెంటిలేషన్ లో నుండి కెమెరా పెట్టి అల్లుడు గారు నవ్వండి అంటున్నాడు. ఆవిడిచ్చిన ఆ చైనీస్ వంటకు ఇంకా కళ్ళు మండుతున్నాయ్, ఆ రాకాసి వెధవ బయట గ్లౌజులేసుకుని గుద్దడానికి సిద్దంగా ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఎందుకు గుర్తుకు వచ్చారో తెలియదు కానీ సడన్ గా ఇద్దరు గుర్తుకు వచ్చారు
1) K A PAUL
2) శ్రీకాంత్
వెంటనే శ్రీకాంత్ కు ఫోన్ చేశా,
జరిగినదంతా రెండు నిమిషాలలో చెప్పి కాపాడమని ప్రాధేయపడ్డా
"రేయ్, ఆ అమ్మాయి సూపర్ ఉంది కదా "
"అవున్రా కానీ పిచ్చది"
"తెలుసూ, వాళ్ళ నాన్న అంటే పొట్టిగా, నల్లగా, కెమెరా రంగులో నే ఉంటాడు కదా "
"అవున్రా బాబు విషయం చెప్పరా "
"రేయ్ ఆ కొంపకు ఎందుకు వెళ్ళావ్ రా మూడు నెలల కిందట నేను ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లి తన్నులు తిని ఎలాగో బయట పడ్డా. అప్పుడైతే ఏకంగా లక లక లక అని నా నెత్తిన పెట్రోల్ పోసి వెలిగించ బోయింది
" ఓహో ఆ మూడు నెల కిందట దెబ్బల రహస్యం ఇదా, అంటే వీళ్ళింట్లో బెల్లం, సగ్గుబియ్యపు వడియాలు తిన్న వెధవ్వీ నువ్వేనన్నమాట."
"సర్లే ఆఫై నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా ఇంకో పది నిమిషాలాగితే సీతయ్య అంటూ వాళ్ళ మామ వస్తాడు. వాడు ఎవ్వడి మాట వినడు "
"రేయ్ నువ్వే ఏదో ఒకటి చెయ్యరా ఆ బెల్లం, సగ్గుబియ్యపు వడియాలేవో నేనే పెడతా నీకు "
"సరే ఊపిరి గట్టిగా తీసుకుని తిరగపడు, నీలో నటనకు కార్య రూపం ఇవ్వు, రెచ్చిపో, ముల్లును ముల్లుతోనే తియ్యాలి, అరుంధతి సినిమాలో పశుపతి లా విరా విహారం చెయ్యి, అదే సమయంలో టైం చూసుకుని ఎలాగో బయటకు లగెత్తు" అని సలహా విసిరేశాడు. నేనేరుకున్నా
నేను అక్కడ దొరికిన చీపురు కట్ట తీసుకుని
"బొమ్మాళీ నిన్నొదల " అని భయంకరంగా అరుస్తూ బాత్రూం డోర్ తెరుచుకుని బయటకు వచ్చా, అటు పరుగెడుతూ ఇటు పరిగెడుతూ తన దగ్గర ముందు ఆ కత్తి లాక్కున్నా. ఈ సారి తను ముందు నేను వెనుక, పనిలో పని వాళ్ళ నాన్న కెమెరా పగలగొట్టా , వంటింటి సామాన్లు చిందరవందర చేశా, వాళ్ళ తమ్ముడికి తానీషా రాజును చూపించా,
ఇలా నానా హంగామా చేసి వాళ్ళింటిలో నుండి వాళ్ళ సీతయ్య వచ్చేలోపు భయట పడ్డా.
*******
తరువాత నాకు మా నాన్నగారికి పెద్ద గొడవ. నాన్నగారు నేను ఆ పిచ్చదాన్ని చేసుకోను అంటే నీకు లేదా పిచ్చా ? ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటున్నారు. ఇక తప్పక నేను సుశీల అనే ఒకమ్మాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటాను అని అబద్దమాడేసాను.
అందుకే Wanted Suseela @ Any S/W company.

45 comments :

 1. Are maa project lO vundi Suseela(Age 22). ammai baagunTundi.. kaakapote koncham mella inkoncham paLLu ettu and kaalu kunTi.. mIku OK nE ga..[:P]

  Just kidding. :)

  ReplyDelete
 2. Chaala bavundi, baa navvu kunnaa, aa photOlu maaku kooda pampamdE.

  ReplyDelete
 3. :) నిలువెత్తు జేజెమ్మ లా వచ్చింది :)

  ReplyDelete
 4. మీ పోస్ట్లు అన్నింటికీ నేను అభిమానిని ... చాల రోజుల నుంచి మీ బ్లాగ్ వైపు చూస్తూనే ఉన్నాను ... కొత్త పోస్ట్ ఎప్పుడు రాస్తారా అని ...

  ఈ పోస్ట్ కొంచెం జంధ్యాల హాస్యం నుంచి, ఈ వీ వీ అపహాస్యం లా ఉంది కొన్ని చోట్ల ... అదే పెళ్లి చూపుల్లో,మెళ్ళో పూల దండ, పగిలిన కళ్ళద్దాలు మీద rayban అని రాయటం లాంటివి .. కొంచెం artificial గా ఉండి హాస్యం పండలేదు ...

  మిగితా చోట్ల, యథావిధి గా ... మీ మార్కు చూపించారు ... "పనిలేని మంగలోడు పిల్లి తల గోరిగాడన్నట్టు, ప్రాజెక్ట్లు లేక సాఫ్టవేర్ ఇంజినీర్ టీ.వి చూస్తే ఇలాంటి డౌట్లే తగలడతాయి." Hilarious ! నా అభిమాన హాస్య రచయితల్లో మీరు ఒకరు ! తరచూ రాస్తుంటే , మీ అభిమానులం సంతోషిస్తాం ! :-)

  ReplyDelete
 5. చాన్నాళ్ళకు కనిపించారు, కడుపుబ్బా నవ్వించారు అశ్విన్ గారూ.

  ReplyDelete
 6. Glad to see that employment had not doused your blazing creativity!
  good one

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. అదేంటి ? నిన్న కామెంట్ రాశా కానీ కనపడలేదు ?
  ఎప్పటిలానే చాలా బావుంది. పేర్లు
  >> అయినా ఎందుకు రావు నాన్న చూడు మీ కుడి కాలు నా ఎడం చెయ్యి ఒకే ఫొటోలో ఎంత బా వచ్చిందో ...."
  >>నాకు జాలేసి ఆ నీళ్ళ గ్లాసు ఆవిడకే ఇచ్చా.
  >>
  1) K A PAUL
  2) శ్రీకాంత్
  >> ఆర్ధిక మాంద్యం లో సాఫ్టవేర్ ఇంజినీర్ ని కొనాలని రాజనాల పధకం పన్నాడు
  >> పనిలేని మంగలోడు పిల్లి తల గోరిగాడన్నట్టు, ప్రాజెక్ట్లు లేక సాఫ్టవేర్ ఇంజినీర్ టీ.వి చూస్తే ఇలాంటి డౌట్లే తగలడతాయి.
  ఇంతకీ బలమైన జుట్టుకు కావల్సిందేమిటి ? ఫన్నీ

  ReplyDelete
 9. ఇంకా నవ్వుతునే ఉన్నాను చాలా బాగా రాసారు అశ్విన్

  ReplyDelete
 10. This comment has been removed by the author.

  ReplyDelete
 11. Sameera said..
  Bavundi abu naku koncham bayam vesindi nuvu a paristitilo ela vunava ani kani chivariki kada ni sukantam chesavu
  hahahaa....

  ReplyDelete
 12. నవ్వొచ్చింది

  ReplyDelete
 13. ray aswin ippude ranganayakamma gari "GOPALAM PREMA KADHA" chadivi navvi nanavvi kastha relax avvudaamani net lo nee blog open chesi idi chadivitheunte paiki chadivale maa intlo andaru navvaleka poyaruraaaa.

  keep it up friend and do post like this.
  Good Luck ra.

  ReplyDelete
 14. babaoi emi navincharandi aswin garu .. nenu navvi chala rojulu ayindi ........ :-).i love ur blogs....... andi ..

  ReplyDelete
 15. very nice ra.....

  ReplyDelete
 16. Really hatsoff aswin garu.. Office lo unnaa.. navvu ni control chesukovadam naa valla kaledhu.. intha manchi hasyanni maaku andhisthunnaduku meeku thanks ela cheppalo ardham kavadam ledhu..

  My heartful thanks to u....

  ReplyDelete
 17. nenu genaralga evariki comments rayanu. kani chal baundi nee blog

  ReplyDelete
 18. Officelo chaduvutu navvaleka chachanu. Ee rojee first time mee blogs chadavadam modalupetta..mee humour adurss!!

  ReplyDelete
 19. chaala baagundi...ante thakkuvemo.

  this is really funny

  ReplyDelete
 20. Tooooooooooooo good. Excellent.

  ReplyDelete
 21. vammo naa valla kadandi babu chadavatam.... asalu inta baga ela rayagalugutunnaru meeru... too good....... i cant control laughing......

  ReplyDelete
 22. chala baguni... new post eppudu...

  ReplyDelete
 23. project లేక బెంచి మీద కూర్చునే వాడిని కుడా పిలిచి పీటల కుర్చోమన్నారే ఆ మంచి తనానికి నేను ఫ్లాట్ అయ్యా ."

  ReplyDelete
 24. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 25. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 26. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 27. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 28. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 29. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 30. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 31. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 32. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 33. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete
 34. Sir,Mee article konta tagginchi 6.4.14 andhta jyothi sunday book lo prachuristunnaam.
  This is for your kind infermation - Sunday desk

  ReplyDelete