Monday, December 8, 2008

నా ఏడవ తరగతి ప్రేమ కధ.


అవి నేను ఏడవ తరగతి కి ఎలా ఎసరుపెడతానా అని మానాన్న గారు భయపడూతున్న రోజులు. ప్రపంచంలో ఆలోచించటానికి ఎన్నో సమస్యలున్నా అందరూ నా ఏడవ తరగతి గురించే అప్పుడు ఎందుకు ఆలోచించారో మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా నా 22 రీళ్ళ స్టోరీ వినాల్సిందే.

అప్పట్లో బొంబాయిలో అల్లర్లు జరుగుతున్నాయని తెలిసి మా బామ్మ విజయవాడలో మా పక్క వీదిలో ఉన్న మా బడికి పంపలేదు. ఎవరెన్ని చెప్పినా వినేది కాదు. "పైగా ఈ ఏడు నుండే శని గాడు నీ సైడ్ పాకెట్ లోకి ఎంటర్ అవుతున్నాడని శాస్త్రం తెలిసిన శస్త్రిగారొకరు చెప్పార్రా, నా మాటిను ఒక్క పది రోజులాగెళ్ళు బడికి, అయినా ఇంకా ఏడవ తరగతి మొదలే కదా" అని నాకు సర్ది చెప్పింది. నేనూ సరేనన్నా.

నా ఆరవ తరగతి దాక బయట ప్రపంచం తెలియని మహేష్ బాబుని. నాకు మా బడి, మా పేట, శ్రీకాంత్ గాడు, ఆదివారం పూట వచ్చే ఆ మోగ్లీ కార్టూన్ అవే నా ప్రపంచం. మా నాన్న సెకండ్ హాండ్ సైకిల్ కొనివ్వటం, మా స్కూల్ను పక్కసందులో మార్చటం, మొదటి సారి షార్ట్ నోట్స్ నుండి లాంగ్ నోట్స్ కు రావటం అంతా ఒకసారి జరిగింది నా ఏడవ తరగతి లోనే. నేను పది రోజులు లేటుగా ఏడవ తరగతి మొదలపెట్టటం నాకు కొంచం భయంగానే ఉంది. నెమ్మిదిగా తరగతి గదిలో అడుగుపెట్టా.

"ఏంటే నిన్న మహేష్ బాబునిమ్మంటే పవన్ కళ్యాణిచ్చావ్? నీ వళ్ళ నేను హోమ్ వర్కు చెయ్యలేదు తెలుసా" అని సీత గీతతో అంటుంటే
"నా తబుని ఏమైందని నిన్న మాట్యూషన్ మాష్టారడిగార్రా గిరిగా , ఈ రోజన్నా నా తబుని నాకిచ్చెయ్ " అని సీను గిరితో అంటున్నాడు.
" నా సిమ్రాన్ కనపడటం లేదు ఎవరన్నా చూశారా ? " అంటూ అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని అడుగుతున్నాడు శ్రీకాంత్ గాడు,
"రేయ్ కాంతుగా ఏంటీగోల మహేష్ బాబేమిటి? పవన్ కళ్యాణ్ ఏంటి ? నీ సిమ్రాన్ కనపడకపోవటం ఏంట్రా ఇదంతా ? "
"రేయ్ అదా, నువ్వు రాలేదుగా ఇప్పటిదాకా మన బడెదుకుండా ఉన్న అంకుల్ కొట్టులో లాంగ్ నోట్స్ మీద హీరో హీరోయిన్ బొమ్మలున్న పుస్తకాలు తెచ్చార్రా, అదీ ఈ గొడవంతా.మహేష్ బాబంటే మాధ్స్ నోట్స్, పవన్ కల్యాణ్ అంటే పిజిక్స్ నోట్స్ , తబు అంటే తెలుగు నోట్స్ రా, నా సిమ్రాన్ అంటే నా సైన్స్ నోట్స్ రా ... "అని చెప్పి మళ్ళీ వెతుక్కోవటం మొదల పెట్టాడు.

ఏడవ తరగతి కామన్ పరిక్షలు పెట్టుకోని ఏ వినాకుడి నోట్స్ నో, షిర్డి సాయిబాబానో కావలనుకోకుండా ఈ హీరోయిన్ పిచ్చేంటో అనుకుని, నేను అంకుల్ కొట్టుకు వెళ్ళి "అంకుల్ సౌందర్య ఉందా ?", అనడిగా. ఓ 50 పుస్తకాలు నాకిచ్చి ఇంద్రజ మాత్రం ఈశ్వర్ తీసుకున్నాడు, మిగతావానిలో ఉందెమో చూసుకో అన్నాడు. ఒక్కోపుస్తకం తిప్పుతున్నా, అసలు అంతమంది హీరోయిన్స్ ని ఒకే చోట చూడటం అదే మొదటి సారి, ఈ విషయం మన ప్రొడ్యూసర్లుకు తెలిస్తే బొంబాయి బదులు ఇక్కడికే వచ్చి హీరోయిన్స్ ని చూసుకునే వాళ్ళు. కరక్టుగా పద్నాల్గవ పుస్తకం దగ్గర నేను, నా మనసు, ఒక్కసారిగా ఆగిపోయాయ్. మనసును చక్కిలిగింతలు పెట్టేటట్టుందామ్మాయి. ఆ అమ్మాయి రూపు రేఖలు చూస్తే ఇక్కడమ్మాయిలా లేదు, తను ఖచ్చితంగా అమెరికమ్మాయే. ఆ క్షణాన, నీకు తగిన జోడు ఆమె, జన్మ జన్మల మీ ప్రేమానుభూతే ఇది అని ఆకాశవాణి చెప్పింది. తనెలా ఉందో మీకు చెప్పలేదు కదా, తన జుట్టు నలుపు ముందు కాకి తెలుపు, తన తెలుపు చాయ ముందు పాలు నలుపు. గులాబీలు సైతం ఈర్ష పడేట్టంత యెర్రటి పెదాలు. మిలమిల మెరిసే డైమండ్ కళ్ళు. సొట్ట బుగ్గలు. అబ్బోహ్ కత్తి.

ఇంక ఆ రోజు బడికెళ్ళకుండా ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయా. వారానికి మూడురోజులు బడిడుమ్మా కొట్టి ఆ అమ్మాయి ఫొటోనే చూస్తూ ఉండేవాడిని, ఒక వేళ బడికెళ్ళినా ఏ పుస్తకాం మధ్యలొనో పెట్టుకుని ఆ ఫొటోనే చూస్తూ ఉండేవాడిని.

ఒక రోజు ఈ విషయం మా శ్రీకాంత్ కు తెలిసిపోయింది. వాడు "అస్సిగా అమ్మాయి చూస్తే అమెరికా అమ్మాయిలా ఉంది. వయసూ నీకన్నా కచ్చితంగా ఓ పదేళ్ళ పైనే ఉంది. ఫొటో కూడా పాస్ పోర్ట్ ఫొటోనే పేజీ అంతా ఉంది. నామాట విను నువ్వు ఆ అమ్మాయిని వెతకలేవు. మీ ఇంట్లోకనుక చెప్పినట్టైతే కచ్చితంగా ఆ అమ్మాయిని కలిసి నీకు కనీసం మన తొమ్మిదోతరగతి కల్లా పెళ్ళి చేస్తారు " అని ఓ సలహా ఇచ్చాడు.

నేను పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళా
"బామ్మా అమెక్కడుంది."
"లోపల గారెలేస్తుంది చూడు."
వంటింట్లోకి అడుగు పెట్టా. స్టవ్ మీద నూనె నా కాగుంది. అప్పుడే అమ్మ బాండీలో గారొదిలింది.
"అమ్మా నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను,అమ్మాయిది అమెరికా, నాకన్నా సుమారు ఓ పదేళ్ళు పెద్దది. కానీ నేను ప్రేమించాను. జన్మ జన్మల నుండి తనే నా భార్యట. దయచేసి మా ఇద్దరినీ విడదీయకుండా వాళ్ళింటికేళ్ళి తనను వొప్పిస్తావా ? " అనడిగా

ఏవండోయ్ వీడుచూడండి అంటూ మా అమ్మ బయటకు పరుగెత్తింది. కెమెరా బాండీలో ఉన్న గారే మీదకు మళ్ళింది.

<< 15 నిమిషాల తర్వాత >>

గారె రంగు మారింది (మాడిపోయింది). బాగ్రండ్ లో నా ఏడుపు " వద్దునాన్న, వద్దునాన్న", అని. కెమెరా మళ్ళీ నెమ్మిదిగా వంటింట్లో ఫోకస్ అయ్యింది. మా నాన్న లుంగీ పైకు కడుతూ "వెధవకు ఏడవ తరగి చదివి పాస్ అవ్వటం చాతకాదుకానీ పెళ్ళికావొల్సొచ్చిందంట, పెళ్ళి" అని నన్ను తిడుతూ వంటింట్లో నుండి బయటకు వెళ్ళారు. మా బామ్మ పరుగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మీద ఎప్పుడూ చెయ్యనివాడు అలాంటిది ఈ రోజు ఇంతకు తెగిస్తాడా, ముందే చెప్పాన్రా నాయినా ఇదంతా ఆ శని గాడి పనని జాగ్రత్తగా ఉండద్దూ అని నన్ను దగ్గరకు తీసుకుంది.


******

ఈ విషయంతో నా ప్రేమ మరీ బలపడింది. మా నాన్నగారితో మాట్లాడటం మానేశా. బడిలో, మాపేటలో కూడా అందరికీ తెలిసిపోయిందీ విషయం.అలా నా హాఫ్యియర్లీ పరిక్షలు దగ్గర పడుతున్న సమయం. మా ఇంటి ఎదురుకుండా లావణ్య వాళ్ళిళ్ళు. మేమిద్దరం ఒకటే తరగతి. మా ఇద్దరిమధ్య విపరీతమైన పోటీ. పోటీ అంటే అట్టంటిట్టాంటి పోటీకాదు రక్తసిక్తమైన పోటి. మా మధ్యనే కాదు మా అమ్మగారు వాళ్ళమ్మగారు మధ్యనకూడా. నిజం చెప్పాలంటే మా అమ్మ, వాళ్ళమ్మా ఆడే ఆటలో మేము కేవలం పావులమే. నా అదృష్టం ఏటంటే లావణ్య కూడా నాలానే అంతంతమాత్రమే నేను రెండు రెళ్ళు ఆరంటే తను కాదు ఐదనేది.

ఓ ఆదివారం సాయత్రం ఎప్పటిలాగానే మా అమ్మగారు E TV లోని ఘుమఘుమలు ప్రోగ్రామ్ చూస్తూ స్టవ్ వెలిగించారు. ఈ సారన్నా అమ్మ ఏమన్న చేస్తే బావుండు అని నేను నా ఫొటో రాణితో పక్కనే నిలబడ్డా. ఇంతలో లావణ్యా వాళ్ళమ్మగారు కళ్యాణి,కళ్యాణి అంటూ లోపలకొచ్చారు.

"ఏంటి కళ్యాణి ఈ మధ్య మీ అబ్బాయి ఎదో ఫొటో పట్టుకుని ప్రేమా ప్రేమా అని తిరుగుతున్నాడట. ఎవ్వరి మాటా వినట్లేదట. ఏమోనమ్మ మొన్న లావణ్య కోసం స్కూలుకెళితే వాళ్ళ టీచర్ చెప్పారు. ఏమాటకామాటే మా లావణ్య మాత్రం అలా కాదు. రెండు మార్కులు తక్కువొస్తాయన్న మాటేగానీ నా మాటకెన్నడూ ఎదురుచెప్పదు. ఏవోనమ్మా ఆ టీచర్ గారన్న మాటలే చెపుతున్నా. అయ్యో నా మతిమరపు మండా స్టౌ మీదాపాలు పెట్టా మల్లొస్తా" అని వెళ్ళిపోయింది. నాకీరోజు మూడిందని నేను నిశ్చయించుకున్నా. అమ్మ నెమ్మిదింగా లోపలకొచ్చి మొదట స్టవ్ ఆప్ చేసింది. తరవాత టివి ఆఫ్ చేసింది. ఈ సారి కెమేరా మా సందు చివరున్న చెరుకురసం వాడిదగ్గరకు మళ్ళింది. వాడు పెద్ద పెద్ద ఐస్ ముక్కలను ఓ రబ్బరు సంచి లో మడిచి ఆ కొనను ఎడం చెత్తో పట్టుకుని కుడి చేత్తో రోకలి బండతో ఆ ఐస్ ముక్కలను వీర బాదుడు బాదుడు.

<15నిమిషాల తర్వాత >

నా పాటికి నేను ఆ ఫొటో పట్టూకుని ఏడుస్తుంటే, మా బామ్మ పరుగెత్తుకుంటూ వచ్చి బిడ్డ మీద ఎప్పుడూ చెయ్యయ్యనిది అలాంటిది ఈ రోజు ఇంత పని చేస్తుందా ?,నేను ముందే చెప్పాన్రా నాయినా ఇదంతా ఆ శని గాడి పనని జాగ్రత్తగా ఉండద్దూ.ఎందుకు నాయినా అందరి చేత ఇలా దెబ్బలు తింటావ్? ఆ అమ్మాయి ఎక్కడున్నా నేను తెచ్చి నీతో పెళ్ళిచేస్తాలే. అంతవరకూ ఇలా అభాశుపాలుకాకురా అని నన్ను దగ్గరకు తీసుకునేది.నాకు ఆక్షణాన మా బామ్మ కే.ఆర్.విజయలా(దేవతలా) కనిపించింది.

**********

యన్యువల్లీ పరిక్షలు దగ్గరపడ్డాయ్, వీటి తరువాత ఇక కామన్ పరిక్షలే. ఒక్క ముక్క చదవలేదు. అందరూ నా ఏడవ తరగతి పోతుందని దృఢనిశ్చయంతో ఉన్నారు. ఎవరెంత చెప్పినా వినేవాడిని కాను. మా బామ్మ బతిమిలాడితే మాత్రం ఓ అరగంట అలా పుస్తకం పట్టుకున్నట్టు నటించేవాడిని. మా బామ్మ కూడా అప్పుడప్పుడు ఆ ఫొటో చూసి నా మనమరాలు బావుందిరా అని నన్ను ఇంకా ప్రోత్సహించేది. ఎప్పట్లానే నేను కూడా ఆ ఫొటో తోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేసేవాడిని.

ఓ రోజు శ్రీకాంత్ గాడు పరుగెత్తుకుంటూ ఇంటికి వచ్చి "రేయ్ మా మామయ్య అమెరికా నుండి మా ఇంటికి వచ్చార్రా. ఆ ఫొటో చూపిద్దాం, మా మామయ్య ఇప్పుడే అమెరికా నుండి నీకేం కావాలంటే చెప్పు నేను తీసుకొస్తానని అన్నారు. ఈ అమ్మాయిని చూపించి తీసుకుని రమ్మంటా అన్నాడు. ఫొటో తీసుకుని రోడెక్కాం. పనిలో ఉన్న పిల్లులన్నీ పని కట్టుకుని మరీ ఎదురొచ్చాయ్. ఎన్నాళ్ళనుండో నన్ను హింసిస్తున్న అనేక ప్రశ్నలు ఈ రోజు తీరబోతున్నాయి. అసలా అమ్మాయి ఎవరు ? తన పేరేంటి ? తనదేవూరు ? నన్ను తన భర్తగా ఒప్పుకుంటుందా ? మాది జన్మజన్మల ప్రేమ ని తనకు గుర్తుంటుందా ? ... ఇలాంటి నిరంతర ప్రశ్నలతో నేను శ్రీకాంత్ వాళ్ళు ఇంట్లోకడుగుపెట్టాం. కుశలప్రశ్నల తరవాత శ్రీకాంత్ గాడు

"మామయ్యా నేను చెప్పాకదా ఆ ఫొటో ఇదే" అని నా చేతిలోనుండి ఫొటో తీసుకుని వాళ్ళ మామయ్య చేతికిచ్చాడు.
ఫొటోతీసుకున్న వాళ్ళ మామయ్య రేయ్ "ఇది మైకెల్ జాక్సన్ రా ", అన్నాడు.
"చెప్పనారా మా మామయ్య ఆమెను కనిపెట్టేస్తాడని." అన్నాడు శ్రీకాంత్
" నీ బొంద ఆమెకాదు వాడు. మైకెల్ జాక్సన్ అన్నవాడు మగవాడు".

1. మగవాడు ( కుడి వైపు )

2. మగవడు (ఎడం వైపు )

3. మగవాడు (పైన )
ఆ మాటాలు నాకు మూడుసార్లు నల్దిక్కులా వినిపించాయి. నా ప్రపంచం ఒక్కసారిగా స్తంభించిపోయింది.ఇన్నాళ్ళు నా ఏడవ తరగతి పుస్తకాలపై కట్టిన మేడ ఆ క్షణాన కూలిపోయాయి. బాధ తట్టుకోలేక స్లో యాక్షన్ లో ఇంటికెళ్ళి జరిగినదంతా మా బామ్మకు చెప్పి బాధపడ్డా. మా బామ్మ నన్ను పరామర్శించకపోగా కాలికా అవతారమెత్తింది. " వెధవన్నార వెధవా పోయిపోయి ఓ మగవాడిని ప్రేమిస్తావా ? మన ఇంటా వంటా ఉందా ? మీ తాతాగారు ఆరోజుల్లోనే పెళ్ళైనా కూడా ఏడవ ఫారమ్ పాసయ్యారు తెలుసా, అయినా ఆ వెధవెవడో అచ్చం ఆడ ముండ లానే ఉన్నాడు అని దగ్గరలో ఉన్న చీపురుకట్ట తిరగేసింది. అంతే నేను ముందు మా బామ్మ వెనుకా మా పెటంతా రెండు రెండ్లు వేశాం. నాకైతే ఆయాసం వచ్చింది కానీ మా బామ్మ మాత్రం ఆగితే ఒట్టు.
" బామ్మా ఇదాంతా నా తప్పుకాదే నువ్వే చెప్పావ్ గా శని గాడు నా సైడ్ పాకెట్ లోకి ఎంటరయ్యాడని. " అన్నా

"శనిగాడు లేదు నీ పిండాకూడు లేదు", అని వీర ఉతుకుడొతికింది. చివరకు మా అమ్మ, నాన్న వళ్ళ కూడా కాలేదు మా బామ్మనాపటం.

ఆ రోజు నుండి మా బామ్మ చీపురుకట్ట పట్టుకుని నా ఏడవ తరగతి దాకా నా చూట్టూ తిరుగుతునే ఉంది. చివరి నెలలో పొద్దున తొమ్మిదింటి నుండి చెవులో చేతులు పెట్టుకుని ముందుకూ వెనక్కూ ఊగుతూ అంతా బట్టీ వేసేవాడిని. ఏ క్షణాన ఆగినా వెంటనే మా బామ్మ చీపుకట్ట పట్టుకుని వచ్చేది. చివరకు పరిక్షహాలుకు కూడా చీపురుకట్టపట్టుకునే వచ్చింది.

ఆ రోజు అందరి నోములు ఫలించిన రోజు మొత్తానికి 600 లకు 444 మార్కులతో ఏడవ తరగతి గట్టెక్కా. మా బామ్మ శాంతించింది.

***********

నా కిప్పటికీ చికాకే ఆటోగ్రాఫ్ పుస్తకాలలో first crush అని చూస్తే. మొన్నో రోజు నా పాతపుస్తకాలు సర్దుతుంటే ఈ పదాలు కనపడ్డాయి.

తన జుట్టు నలుపు ముందు కాకి తెలుపు, తన తెలుపు చాయ ముందు పాలు నలుపు. గులాబీలు సైతం ఈర్ష పడేట్టంత యెర్రటి పెదాలు. మిలమిల మెరిసే డైమండ్ కళ్ళు. సొట్ట బుగ్గలు. అబ్బోహ్ కత్తి.

84 comments :

 1. అబ్బోహ్ కత్తి (కుడివైపు, ఎడమవైపు, పైన). ☺ ☺ ☺.

  అశ్విన్ గారు, మీ బ్లాగు టైటిల్లో వున్న తెలుగు అక్షరాల ఫాంట్లు ఎక్కడ దొరుకుతాయి.

  ReplyDelete
 2. నల్లటి కురులు,తెల్లటి చాయ,సొట్ట బుగ్గ అంటే ప్రీతీజింతా అనుకున్నాను. మీ సెలక్షన్ సూపరు :)

  ReplyDelete
 3. Hillarious..
  రూపంతో పాటూ గొంతూ వింటే ఇంకా ఏమైపొయేవారో?
  By the way, have you gotten over the first crush yet? Any residual feelings still?

  ReplyDelete
 4. హ హ సూపరో సూపర్ బాగా నవ్వించావ్ అశ్విన్.

  ReplyDelete
 5. CRYING GAME twist ఇచ్చావుగా!
  హిలేరియస్.
  టెంప్లేటు బావుంది.

  ReplyDelete
 6. పొట్ట చెక్కలయ్యింది బూదరాజు గారబ్బాయో... ఎంచక్కా రాసారు.

  ReplyDelete
 7. బాగుంది. సరదాగా...అక్కడక్కడా నన్నునేను చూసుకోగలిగాను.

  ReplyDelete
 8. at your screaming BEST !!
  kEka aswin...

  ReplyDelete
 9. ‘తన జుట్టు నలుపు ముందు కాకి తెలుపు, తన తెలుపు చాయ ముందు పాలు నలుపు. గులాబీలు సైతం ఈర్ష పడేట్టంత యెర్రటి పెదాలు. మిలమిల మెరిసే డైమండ్ కళ్ళు. సొట్ట బుగ్గలు’ ఈ లక్షణాలు చూసి నిజంగా నేను కూడా ఈర్ష పడ్డాను..
  కానీ... ఇది చదివాక...
  " నీ బొంద ఆమెకాదు వాడు. మైకెల్ జాక్సన్ అన్నవాడు మగవాడు".
  1. మగవాడు ( కుడి వైపు )
  2. మగవడు (ఎడం వైపు )
  3. మగవాడు (పైన )
  ఆఫీసులో గట్టిగా నవ్వితే బాగోదని... నవ్వు ఆపుకోవాల్సి వచ్చింది.. మీ కధలో కెమెరా భలే బాగా తిరిగింది... hahahaha

  ReplyDelete
 10. అదుర్స్ బాసూ...!

  ReplyDelete
 11. టూ గుడ్. నేను కూడా ప్రీతి జింతానే అనుకున్నా..!సూపర్ రాసారు

  ReplyDelete
 12. హ్హహ్హహ్హ... చాలా బావుంది.. :))

  ReplyDelete
 13. అదిరిందండి మీ ప్రేమ కధ నవ్వలేక పోయా

  ReplyDelete
 14. కేకో కేకా కెవ్వూ కేకా

  ReplyDelete
 15. పెట్టుకోక పెట్టుకోక ఆయనగారితోనే పెట్టుకున్నావా సరిపోయింది జాగ్రత్త అశ్విన్.

  ReplyDelete
 16. :) :) అయ్యో పాపం!!!

  ReplyDelete
 17. ఈ సారి కెమేరా మా సందు చివరున్న చెరుకురసం వాడిదగ్గరకు మళ్ళింది. వాడు పెద్ద పెద్ద ఐస్ ముక్కలను ఓ రబ్బరు సంచి లో మడిచి ఆ కొనను ఎడం చెత్తో పట్టుకుని కుడి చేత్తో రోకలి బండతో ఆ ఐస్ ముక్కలను వీర బాదుడు బాదుడు... ohh.. whateh symbolic shots...very very good and nice. awaiting your next story of 10th class.

  ReplyDelete
 18. కేక పుట్టించారు. అదిరింది టపా :)

  ReplyDelete
 19. మామయ్య రేయ్ "ఇది మైకెల్ జాక్సన్ రా ", అన్నాడు.
  "చెప్పనారా మా మామయ్య ఆమెను కనిపెట్టేస్తాడని." అన్నాడు శ్రీకాంత్
  " నీ బొంద ఆమెకాదు వాడు. మైకెల్ జాక్సన్ అన్నవాడు మగవాడు".
  super.. !!

  ReplyDelete
 20. షైలాబాను, సులక్షణారెడ్డి తర్వాత ఈసారి అంతర్జాతీయ స్థాయిలో ఏ మోనికా లూయిన్స్కీనో పెట్టి వ్రాస్తారనుకున్నా. పోన్లేండి నా అంచనా సగం నిజం చేశారుకదా. ఇంకా నయం మీ కాదల్ విషయం ఆయనకు చెప్పారు గాదు. ఒప్పేసుకున్నా ఒప్పేసుకునేవాడు :)

  ReplyDelete
 21. అదుర్స్ మీ దానిలో కెమెరా అదిరింది. ఇష్టం వచ్చినట్టు తిప్పి తెగ నవ్వించారుగా, మగవాడు ఎడం వైపు , కుడివైపు కత్తి కేకంతే...

  ReplyDelete
 22. అందరికీ ధన్యవాదాలు.
  @ నాగప్రసాద్ :: అది బానర్ అండి

  @ బ్లాగాగ్ని :: మీరు నామీదే జోకు పేల్చారు గా, నేను భలే నవ్వుకున్నా చాలా సేపు నవ్వుకున్నా , మోనికా లూయిన్స్కీ ఈ పేరేదో భలే తమాషాగుందే ?

  ReplyDelete
 23. బాఉందబ్బాయ్ నీ ప్రేమ కథ..
  minu...

  ReplyDelete
 24. చాల చాలా బాగుంది అండి. బాగ నవ్వుకున్నా .నేను అసలు twist ఉహించలేక పోయా.. అదిరిపొయింది

  ReplyDelete
 25. This time your Camera rocks aswin. I enjoyed like any other thing when I see michel Jackson. Great Going. Say thanks to your grand mother he.

  Any way rock solid article.

  thanks to telugu blogs too. :-)

  ReplyDelete
 26. Super..
  నేను కూడా బ్లాగాగ్ని గారితో ఏకీభవిస్తున్నాను.

  ReplyDelete
 27. నూతన సంవత్సర శుభాకాంక్షలు :)


  -కిరణ్

  ReplyDelete
 28. మీ సినిమా సూపర్ !!! 100 డేస్ పక్కా !! 250 సెంటర్స్ 350 డేస్.

  ReplyDelete
 29. మీ సినిమా సూపర్ !!! 100 డేస్ పక్కా !! 250 సెంటర్స్ 350 డేస్.

  ReplyDelete
 30. meru keka selection chesukonnaru

  ReplyDelete
 31. adaragottav boss

  ReplyDelete
 32. kEkO keka Jackson twist adirindanna

  I commented once but it was not displayed Why

  Sasi kiran reddy

  ReplyDelete
 33. "తన జుట్టు నలుపు ముందు కాకి తెలుపు, తన తెలుపు చాయ ముందు పాలు నలుపు"
  పాల తెలుపేమో కదండీ?

  సూపర్ గా ఉంది మీ ప్రేమ కథ... హ హ్హ...
  మీ కెమెరా కూడా భలే తిరిగింది కథ మొత్తం :D

  ReplyDelete
 34. మీ బామ్మ ఇంకా చీపురు పట్టుకుని నీ వెనకాల వస్తుందా రా?

  ReplyDelete
 35. aswin garu, entandi bottigaa aapesaaru raayatam ? please oka kottha katha rayandi, mee lanti hasya rachaitalu rayatam apesthe, koodali bosipotondi !

  ReplyDelete
 36. chaalaa baaundandi. superb. inni rojulu nenu ela miss ayyanaa mee blog anipisthundi.
  -Sree

  ReplyDelete
 37. కెవ్వు కేక

  ReplyDelete
 38. Ayya baaboy ivanni meeru oohinchi rastunnara, lekunte nijangane mee jeevitham lo jarigaya, okka sari mee mobile number ivvandi sir, meeto matladali.

  ReplyDelete
 39. @Guruprasad B

  Thanks for your comments, :-)

  ReplyDelete
 40. చాల బాగుంది

  ReplyDelete
 41. *edo taragati premakatha, 17.06.12 aadivaaram andhrajyothi sanchikalo sankshipthanga prachuristhunna- editor, andhrajyothi daily

  ReplyDelete
 42. చాల చాల బాగుంది ఎంత స్వచ్చంగా వుందో మీ ప్రేమ

  ReplyDelete
 43. awesome aswin....ela vasthay miku e thoughts....

  ReplyDelete
 44. Aandhra jyotilo chusi ikkadiki vacha....chala baga unnai....paperlo ravadam valla visitors perigi meeku kotha post lu rayavalasina bhadyata perugutundi so....keep writing new post without missing that chammakk,chakkati telugu bhasha vindu andinchinanduku dhanyavadamulu.from kolkata.

  ReplyDelete
 45. chaalaa baagundi aswin garu...i read dis in aj book n den in ur blog..its simply soooperb.....keep going.....all d best

  ReplyDelete
 46. wow..this is amazing i read this one in Andhra Jyoti, I couldnt stop laughing hehehehe :D especially your grandmother's anger made me laugh :D is this your real life story ?

  ReplyDelete
 47. కధ వెరైటీగా వుంది

  ReplyDelete
 48. చాలా బావుంది.. చాలా రోజులు తర్వాత కడుపుబ్బా నవ్వాను...

  ReplyDelete
 49. chala bagundandi...

  ReplyDelete
 50. Chala Bagundi.

  ReplyDelete
 51. abbba pottta noppi vastundiandi navvi navvi

  ReplyDelete
 52. shailabhanu andhrajyothi lo chadivi ela ekkada me "bagotham" chudhamani ikkada velisanu ... bahundhandi ashwin gaaruu ...........

  ReplyDelete
 53. ఏంటే నిన్న మహేష్ బాబునిమ్మంటే పవన్ కళ్యాణిచ్చావ్?
  నీ వళ్ళ నేను హోమ్ వర్కు చెయ్యలేదు తెలుసా" అని సీత గీతతో అంటుంటే
  "నా తబుని ఏమైందని నిన్న మాట్యూషన్ మాష్టారడిగార్రా గిరిగా ,
  ఈ రోజన్నా నా తబుని నాకిచ్చెయ్ " అని సీను గిరితో అంటున్నాడు.
  " నా సిమ్రాన్ కనపడటం లేదు ఎవరన్నా చూశారా ? " అంటూ అందరి కాళ్ళు గడ్డాలు పట్టుకుని అడుగుతున్నాడు శ్రీకాంత్ గాడు,
  "రేయ్ కాంతుగా ఏంటీగోల మహేష్ బాబేమిటి? పవన్ కళ్యాణ్ ఏంటి ? నీ సిమ్రాన్ కనపడకపోవటం ఏంట్రా ఇదంతా ? "
  "రేయ్ అదా, నువ్వు రాలేదుగా ఇప్పటిదాకా మన బడెదుకుండా ఉన్న అంకుల్ కొట్టులో లాంగ్ నోట్స్ మీద హీరో హీరోయిన్ బొమ్మలున్న పుస్తకాలు తెచ్చార్రా, అదీ ఈ గొడవంతా.మహేష్ బాబంటే మాధ్స్ నోట్స్, పవన్ కల్యాణ్ అంటే పిజిక్స్ నోట్స్ , తబు అంటే తెలుగు నోట్స్ రా, నా సిమ్రాన్ అంటే నా సైన్స్ నోట్స్ రా ... "అని చెప్పి మళ్ళీ వెతుక్కోవటం మొదల పెట్టాడు.

  ReplyDelete