Thursday, August 21, 2008

నేను-సులక్షణ రెడ్డి ( ఓ సీమ ప్రేమ కధ).

అందరికీ ప్రేమ అమృతపాణి అరటి పండు నాకు మాత్రం కేవలం దాని తొక్క. ప్రతీ సారి నేను దాని మీద కాలెయ్యటం పడటం పళ్ళూడకొట్టుకోవటం అలవాటయ్యిపోయింది. జీవితంలో 1. షైలాభాను, 2. షాన్వాజ్. ఓ చెరగని ముద్ర వేశారు.

ఓ అమావాస్య రాత్రి, దరిద్రుడు దేవదాస్ రాసిన " ప్రేమలో సఫలం పొదందటం ఎలా ? ", అన్న పుస్తకాన్ని తలుపులేసుకుని కొవ్వొత్తి క్రీనీడలో నా కళ్ళజోడు సరి చేసుకుంటూ చదువుతున్నా. 92 వ పేజీలోకొచ్చా, చివరి ఛాప్టర్, పేరు "అదృష్టానికి ఆఖరి మెట్టు". అందులో ఒకంటికాలి పై నిలబడి చేతులు రెండూ పైకి జాపి జోడించి ఈ మళయాళీ మంత్రాన్ని మూడు సారు చదవాలి అని రాసుంది.

మంత్రం: എവഡി കര്‍റ്റകു എവഡു ഖര്‍മാ ( తెలుగనువాదం చివరిలో తెలుస్తుంది ). మూడవ సారి చదవబోతుంటే..."ప్రేమ ఎంత మధురం ప్రియురాళ్ళు ఎంత కఠినం ..." అంటూ నా ఫోన్ మ్రోగింది. రాత్రి 12 అవటంతో బయట నక్కలరుస్తున్నాయి. ఫోనెత్తా...

"హాయ్ మీనూ హాపీ బర్త్డే టూ యు.."-అని అవతల నుండీ వినపడంది.
నేను వెళ్ళి అద్దం లో చూసుకున్నా, అవును నేను నేను లానే ఉన్నాను కదా మరి ఫోన్ లో ఎవరు మీనూ అన్నారు. అనుకుని
నేను నా పాత కాల్ సెంటర్ బాషలో : "క్షేమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి. ఇచ్ఛట 'మీను' అను పేరు గలవారెవ్వరూ లేరు. దయచేసి మీ నెంబరు మరొక్క సారి చెక్ చేసుకుని కాల్ చెయ్యగలరని తెలియచేస్తున్నను. "- అన్నను.
అటు: "సారీ సార్ నా పేరు సులక్షణ రెడ్డి. ఈ రోజు మా ఫ్రండ్ మీన పుట్టిన రోజు, పొరపాటున వ్రాంగ్ నెంబర్ నొక్కాను. ...... మిమ్మల్ని డిస్ట్రబ్ చేశాను"
ఇటు: "ఛా ఛా సార్ ఎంటి ??? అశ్విన్ అను. అయినా ఏం పర్లేదులే నేను కోడి కూసేంత వరకూ నిద్రపోను. పొరపాట ఎవరికన్నా జరగచ్చు నోప్రాంబ్లెమ్, ఈ రోజు పొరపాటున నాకు నీదగ్గర నుండి కాల్ వచ్చింది. రేపు నీకు నా దగ్గర నుండీ రావచ్చేమో, నువ్వు దానికి ఫీల్ అవ్వకు ...."-అన్నా
అటు: "ఓహ్ అశ్విన్ ఆ, నైస్ నేమ్ ( ఇటువైపు నేను ఫ్లాటు ) ఒకే ధెన్ బాయ్."- అని ఫోన్ పెట్టేసింది.
ఆహా అదృష్టానికి ఆఖరి మెట్టు పని చేసింది ఆ మంత్రం చాలా గొప్పదిలా ఉంది అని ఆ పుస్తకాన్ని ఆ జాగ్రత్తగా కళ్ళకు దణ్ణం పెట్టుకోని షెల్ఫ్ లో దాచిపెట్టుకున్నా. రాత్రి మూడింటికి మెళుకువ వచ్చి ఆ నెంబర్ ను "౩.సులక్షణ రెడ్డి" అని సేవ్ చేసుకుని హాయిగా పడుకున్నా.

*******

రాత్రి సులక్షణ విషయం చెప్పటానికి మా వాళ్ళంనందరినీ కాలేజ్ మాన్పించా. జరిగినదంతా పూస గుచ్చినట్టు చెప్పా. అంతా విని మా శ్రీకాంతు గాడు. "రేయ్ నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా మన కాంటీన్ ఫుడ్ తింటున్నావా. అసలు ఈ రోజు మీనా B'day అన్నావ్ కదా పొద్దున నుండీ ఫోన్ చేశావా. పరిచయాలు పెంచుకోవాలిరా ఎప్పుడు నేర్చుకుంటావ్ చెప్పు. పనిలో పని నన్నూ పరిచయం చెయ్యి, ఎన్నాళ్ళని నేను మాత్రం నీ చూట్టు తిరగను చెప్పు వాళ్ళ ఫ్రండ్స్ ఉంటారుగా, ఏమంటావ్ "- అని నాకు సలహా ఇచ్చినట్టే ఇచ్చి ప్రాధేయపడ్డాడు.

శ్రీకాంత్ నాలాగే ఓ ప్రేమ ఖైది, ఓ ప్రేమ దొంగ, ఓ ప్రేమ ఫకీర్, ఓ ప్రేమ దరిద్రుడు.
"సరీ-గమా-పద-నిస్సా...అరె కరో కరో ఇక జల్సా...." అంటూ నా ఫోన్ మోగింది.
శ్రీకాంత్: ఏంట్రా రింగ్ టోన్ మార్ఛినట్టున్నవ్??
నేను: రాత్రి ఏదో మంచి కలొస్తే....
వాడు. నీకు తొందరెక్కువరా
నేను: నీకు కుళ్ళెక్కువకానీ మందా ఆ ఫోనెత్తు.
వాడు: "రేయ్ సులక్షణ రా ఉండు నేను మానేజ్ చేస్తా.." -అని ఫోనెత్తాడు
ఫోన్లో:: "హలో అశ్విన్ ఉన్నాడా ??"
శ్రీకాంత్:"హలో... అశ్విన్ ఆ, చదువుకుంటున్నాడండీ, వాడు కాలేజ్ టాపర్ కదా చదువుకుంటూ ఉంటాడు. మొన్న క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యాడు కానీ ఛదువే లోకం అనుకునే మనిషి అండీ వాడూ...( నిజం చెప్పాలంటే నేను నా Supplementary Exams కి స్లిప్పులు రాసుకుంటున్నాను). అసలు మావాడని చెప్పటం కాదుకానీ మావాడికి రానిదంటూ ఏమీ లేదు భరతనాట్యం, వెస్ట్రన్ డాన్సూ, వేణువు, కరాటి, కర్రాట, వంటొండటం, ముగ్గులేయటం, చివరికీ చెప్పులు కూడా అధ్బుతంగా కుడతాడు. ఇక ప్రోగ్రామింగ్ లోకొస్తే Java, Oracle, Html, Xml, Bsnl లో దిట్ట. ఉండండి వాడిని పిలుస్తాను అని . "రేయ్ అస్సిగా పొద్దున్నుండి చదువుతున్నవ్, ఓ ఐదు నిమిషాలు రిలాక్స్ అవ్వు సులక్షణ అంట, నీకు ఫోన్ ర్రా.."- అన్నాడు కొంచం గట్టిగా.
నేను తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా "ఏంటీ సులక్షణానా..." అని పరిగెడుతున్నట్టు చెప్పుల సౌండ్ చేసి, ఆయాస పడుతూ ఫోన్ తీసుకున్నా... అక్కడ నాకు 200/100 మార్కులు పడ్డయ్ మా శ్రీకాంత్ గాడి ప్లాన్ వల్ల.

***

ఇక అప్పటి నుండీ మొదలు, ఏమ్ మాట్లాడూకుంటామో ఏమో తెలియదు కానీ ప్రతీ రోజూ మాట్లాడుకుంటునే ఉండే వాళ్ళం. నెమ్మిదింగా సులక్షణ కాల్ చెయ్యటం మానేసి Missed calls మాత్రమే ఇచ్చేది. తను అలా మిస్డ్ కాల్ ఇవ్వగానే నేను చేసేవాడిని.కాదు చెయ్యాల్సొచ్చేది. కనీసం రోజు కు ఓ రెండు వందలయ్యేది, ఫోన్ ఖర్ఛు. ఏం మాట్లాడుకుంటామో తెలియదు కానీ గంటలు గంటలు గడిచిపోయేవి. ఏదో రోగం వచ్చినవాడిలా ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతునే వుండేవాడిని. అ చెవి నెప్పొస్తే ఈ చెవితో, ఆ చెయి నొప్పొస్తే ఈ చేతితో, రెండు చెవులూ నొప్పొస్తే Loud speaker పెట్టుకుని, రెండు చేతులూ నెప్పొస్తే బుజానికీ తలకూ మధ్యలో ఫోన్ పెట్టుకునీ మాట్లాడుతునే ఉండేవాడిని. మా కాలనీ వాళ్ళు "పిల్లోడు నిన్నటివరకూ బానే ఉండేవాడమ్మా ఏమైందో ఏమో "- అని కొందరు అనుకుంటుంటే మరి కొందరు "వీడెప్పుడో మాట్లాడుతునే పోతాడాని మరికొందరు అనుకునే వాళ్ళు.", ఎవరేమనుకున్నా గురి తప్పని అభినవ్ బింద్రా లా నేను చలరేగిపోయేవాడిని. నువ్వు నాకు నచ్చావ్, నిన్నే ప్రేమిస్తా వరకూ వచ్చింది మా కధ. అన్నీ బానే ఉండేవి ఆ ఒక్క ఫోను బిల్ తప్ప. నాకు అప్పటిలో Best Vodafone User of the Year అని అవార్డు ఇచ్చారు. చివరకు Congrats చెప్పటానికీ తను Missed కాలే ఇచ్చింది.

***

అసలు మా ప్రేమను ప్రేమ లేఖ సినిమాలా మేంటేన్ చెద్దామనుకున్నా. ఓ సారి తను "అశ్విన్ నీకు హాలీడేస్ యే గా మా ఊరు రావచ్చుగా అంది. వస్తాడు నా రాజు ఈ రోజు.... అంటూ వెయిట్ చేస్తా, మనది మామూలు ప్రేమ కాదు కృష్ణా- విజయనిర్మల ప్రేమ అంది,"-ఇక్కడ నేను ఫ్లాట్. నా ఉద్దేశంలో

ప్రేమికులంటే కృష్ణా- విజయనిర్మల,

జంట అంటే కృష్ణా- విజయనిర్మల,
భార్యా భర్తలంటే కృష్ణా- విజయనిర్మల.
తనూ కృష్ణా- విజయనిర్మల అనగానే కాదనలేకపోయా.
"ఇంతకీ నెన్నెక్కడికి రాను ?" అనిడిగా
అప్పుడు నాకటువైపు నుండీ వినపడిన శబ్దం "క-డ-ప"

****

శ్రీకాంత్ గాడే దగ్గరుండి నాకు కొబ్బరికాయతో దిష్టి తీసి కడపకు తన డబ్బులతోనే బస్సెక్కించాడు. మన తెలుగు సినిమాలలో లాగా కాకుండా పెద్ద పెద్ద ట్విస్టులేమి లేకుండా ఇద్దరం కలుసుకున్నాం. సులక్షణ అన్న పేరు వినగానే పేరుకు తగ్గట్టు ఉంటుందనుకున్నా, కానీ మన తెలంగాణా శకుంతల డిగ్రీ చదివేటప్పుడు ఎలా ఉండేదో అచ్చు అలానే ఉంది. అయినా గతి లేని వాడికి గంజేనమ్మ పానకం అన్నట్టు.అడ్జస్ట్ అవుతామ్ అందులో ఏముంది. అందందేముంది ?? మనసు, మనసు ముఖ్యం కదా.

Restaurant కు వెళ్ళాం, చాలా సేపు మాట్లాడూకున్నం, సాయంత్రం నాలుగయ్యింది. దగ్గరలో ఉన్న పార్కు కు వెళ్ళం. నాకు కడపలో అడుగుపెట్టినప్పటి నుండీ ఓ వింత అనుభవం ఎదురయ్యింది. మేమిదరం అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అందరూ నన్ను చూసి గుసగుసలాడటం గమనించాను. అందులో నన్నైతే ఏదో వింత జంతువును చూసినట్టు చూస్తున్నరు. సరే అని పార్కులో ఓ చోట కూర్చున్నాము. ఓ పది నిమిషాల నిశబ్దం తరువాత.

తను "మీ ఇంట్లో వాళ్ళు మన ప్రేమకు ఒప్పుకుంటారా ? "-అని అడిగింది.

నేనొప్పిస్తానుగా అన్నాను, తను దానికి "నీకో విషయం చెప్పాలి". ఆకాశం ఒక్కసారిగా మేఘామృతమయ్యింది. ఒక్కసారిగా ఓ పెద్ద శబ్దం, మెరుపులు.
తను: "నువ్వు సమరసింహారెడ్డి సినిమా చుశావా ????"
నేను: హహా బారులు తీరిన బాలకృష్ణ ఫానులలో ముందుండేది నేనే తెలుసా?
తను : " కామెడీ కాదు సీరియస్, ( తను ఎంతో ఆవేశంగా లేచి, నెమ్మిదిగా చెప్పటం మొదలు పెట్టింది) సమరసింహారెడ్డి , ఆ సినిమా బేస్ స్టోరీ మాదే. మా తాతల నుండీ మా శత్రువు. ఆ వీరరాఘవరెడ్డి. వాడి రక్తం నేను కళ్ళ చూడాలి, మా నాన్న గారు ఆదికేశవ రెడ్డి, వాళ్ళంటిమీద కాకి మా ఇంటి మీదవాలిందని కాకికి గురిపెడితే, ఆ కాకెగిరిపోవటంతో ఆ గుండు, గుండు వీరశంకర రెడ్డికి తగిలింది. మా నాన్నకు జీవిత ఖైదు పడింది, నాకు ఇద్దరన్నలు, పెద్దన్నయ్య చెన్నకేశవ రెడ్డి, ఆల్-ఖైదా తో అర్రగ్రేటం చేశాడు తాలీబాన్ కు పారిపోయాడు. మా రెండవ అన్నయ్య గోధారెడ్డి, నక్సలైట్ గా ఆరేళ్ళు చేసి మొన్ననే జల్సా సినిమా చూసి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. నా ప్రతీకారాన్ని, మా నాన్న ప్రతీకారాన్నీ తీర్చటానికి ఓ మోగాడు కావాలి. నన్ను నువ్వు చేసుకుని ఆ వీరరాఘవరెడ్డి తల మా ఊరి నడి బొడ్డున తెగ నరికి మా నాన్నకు క్యాసుల్కం గా ఇవ్వాలి. ఆ రక్తం తో నా నుదుటున మన కళ్యాణ తిలకం దిద్దూ .... చెప్పూ చంపుతావా వాడిని,నా పగా, మా నన్న పగా తీరుస్తావా?"- అనడిగింది.

వామ్మో...... వార్నాయినో ... ఈ చంపటమేమిటో ... ఆ రక్త మేమిటో...ఆ రక్తంతో బొట్టు పెట్టే ఆ Effect ఏమిటో .... నాలుగు ముక్కలు చదివి రెండు మూడు నెలలలో Soft గా మృదుపరికరణ నిపుణుడిగా ( Software Proffesional )జీవితం మొదలు పెడదాం అనుకుంటుంటే.... ఈ ప్రేమతో నా పాడె లేచేటట్టువుంది. నాకు కాళ్ళు తడిపోతున్నాయి. చెమటలు పట్టేస్తున్నాయి. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్ధితి.

ఇంతలో తను "చెప్పు ఛంపుతావా... నాపగ ఛల్లారుస్తావా ??" అంది. నాకు ఏం చెప్పలో అర్ధం అవ్వట్లేదు. ఛంపుతా అన్ననే అనుకో వాడెవడో వీరరాఘవ రెడ్డి అంటా వాడింటికి తీసుకేళుతుండేమో ???, చంపనూ అంటే నా పని ఇక్కడే అవుట్ దీని చేతిలో. ఇంతలో తనుకు ఫోనొచ్చింది. తను గట్టిగా "అలానా ???" అంది. నాకిక్కడ పిచ్చెక్కిపోతుంది.

తను "అశ్విన్ , మనం ఇక్కడున్నమని ఆ వీరరాఘవ రెడ్డి మనుషులకు తెలిసిపోయిందంటా. నిన్ను చంపటానికి వాళ్ళు వస్తున్నారు "-అంది. నాకు ఆ మాటకే గుండాగిపోయింది. చీమకు కూడా హాని చెయ్యని నన్నెందుకు చంపటం. అన్నెం పుణ్యం ఎరుగని నాలాంటి పసికందు మీదా వీళ్ళ ప్రతాపం.

"ఏంటి ఆలో చిస్తున్నావ్ ???? అశ్విన్ అర్జెంటుగా తొడకొట్టు "-అంది. నేను జాలిగా తన వంక చూశాను.

"ఏం పర్లేదులే... అని భూ ప్రపంఛం బద్దలయ్యేలా భూ-మా-రె-డ్డీ "-అని అరిచింది.


ఉన్న పేర్లే గుర్తుపెట్టుకోలేక చస్తుంటే మళ్ళీ వీడెవడా అనుకునే లోపే ఓ సుమో వచ్చింది. నన్ను లోపలకు ఓ నెట్టు నెట్టింది.


ఊపిరి కూడా సరిగా తీసుకోలేనటువంటి పరిస్ధితి నాది. నిజంగా నన్ను ఎవరన్నా చంపటానికి వస్తున్నారో ఏమో తెలియదు కానీ వీళ్ళ హడావిడి మాత్రం నన్ను నరకయాతనకు గురిచేస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. తీరా చూస్తే మా శ్రీకాంత్ గాడు.

" అస్సి గా పండా కాయా ?" అనిడిగాడు, "పండూ కాదు, కాయా కాదు, బాంబు రా, " అని గట్టిగా ఏడవబోతుంటే,సుమో ఆగింది. నా గుండా ఆగింది. బయటకు చూస్తే -రైవ్లే స్టేషన్. బయట నుండే ప్లాట్ ఫారమ్ మీద ఏదో ట్రైన్ నెమ్మిదిగా కదులుతూ కనపడింది.

రన్నింగ్ ట్రయింగ్ ఎక్కిస్తూ... "ఏం పర్లేదులే ఇక్కడ అంతా నేను చూసుకుంటా వాళ్ళు కనుక మళ్ళి ఎటాక్ చేస్తే ఈ బాంబు వెయ్యి "- అని తన హాండ్ బాగ్ లో నుండీ ఓ బాంబు తీసి నాకిచ్చింది. నాకన్నీ వొణికిపోయాయి. ఆ బాంబు నా చేతికిస్తూ నా ఆశలన్నీ నీ మీదే, I LUV U "-అంది.

"నాకు గట్టిగా ఏడవాలనిపించింది. ఆహా ఏం టైంమింగే నీది, నా జీవితం మీద ఆశలొదులుకో అన్ని ఎంత సింబాలిక్ గ్గ్గా చెప్పావే. దరిద్రపు మొహందానా, చిన్నప్పుడు సీమటపాకాయ పేల్చాలంటే అరమీటరు పాపరుతో వెలిగించి, అరకిలోమీటర్ దురం వెళ్ళి, చెవిలో చేతులు పెట్టుకుని నుంచుండే వాడిని. అలాంటిది బాంబు చేతిలో పెట్టావా? ఎందుకూ పనికి రాని చిల్లు పడిన బిందెలా ఆ మొహం చూడు."- అని మనసులో అనుకుని,నేను కూడా I 2 LUV U అన్నా.


ట్రైన్ స్పీడందుకుంది. టాటా చెప్పి. ఎడం చేతిలో బాంబు, కుడిచేతిలో టికెట్, జేబులో సెల్ పెట్టుకుని, మళ్ళీ ఎవడొస్తాడో,ఏ క్షణాణ ఏమౌతుందో అని, అని బాత్ రూమ్ లో దాక్కున్నా. కొన్ని గంటల తరువాత.....బయట శబ్దం వినపడితే తొంగి చూశా... ప్రకాశం బారేజ్.... హమయ్యా అనుకుని, ఆ బాంబు, నా Vodafone సిమ్ కృష్ణ లో పడేసి, తూర్పు తిరిగి ణ్ణం పెట్టా.

జరిగినదంతా మా శ్రీకాంత్ గాడికి చెప్పటానికి రెండు రోజులు పట్టింది. మీకు చెప్పటానికి ఈ టపా అయ్యింది. ఇంటికి రాగానే వారం రోజులు నన్ను ICU లో పెట్టారు, ఇంతకీ మళయాళీ మంత్రాం എവഡി കര്‍റ്റകു എവഡു ഖര്‍മാ అర్థమేమిటో మళయాళం తెలిసిన ఓ స్నేహితుడినడిగా వాడు దానికి "ఎవడి ఖర్మకు ఎవరలు కర్తలు "-అని సమాధానమిచ్చాడు.

60 comments :

 1. నవ్వలేక చచ్చాను. కామెడీ బాగుంది గానీ రాయలసీమ ఫాక్షన్ సినిమాలు చూసి ఇది రాసినట్టున్నారు. నాకు తెలిసినంతవరకు పులివెందులలో కథ ఇలా జరగదు. ఎందుకంటే ఆ ఊళ్ళో రైల్వే స్టేషన్ లేదు.

  ReplyDelete
 2. అశ్విన్ అదరగొట్టావ్. உனக்கு கல்யாணமே இந்த ஜென்மத்தில நடக்காது నీకు కల కాలం పెళ్ళి కాకుండా ఉండుగాక. అలాఅయితేనే నువ్వు ప్రేమలో పడి మాకు మంచి మంచి టపాలు అందిస్తావ్.

  ReplyDelete
 3. navvule navvulu chala bagundi

  ReplyDelete
 4. అశ్విన్,
  నీకు అశ్విని నాచప్ప గుర్తొచ్చి పరుగేత్తావేమో అనుకున్నాను. పోనిలే కాగల కార్యం బాంబులే తీర్చాయి. మొత్తానికి తెగ నవ్వించేసావు. చాలా బాగా రాసావు. ఇక ముందు - ఎవరో ప్రేమిస్తారని ఏదో (ఫోన్) చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా....!!

  ReplyDelete
 5. అశ్విన్ గారు నవ్వలేక చచ్చాను..ఏం రాసారండి బాబు..
  అయ్యో సులక్షన ప్రేమించింది మిమ్మల్నేనా.తను మీ కోసం వెతుకుతుంది.ఉండండి ఇప్పుడే తనకి కాల్ చేసి చెప్తాను.
  అశ్విన్ గారు చాలాఆఆఆఆఆలా బాఉంది.

  ReplyDelete
 6. కడుపుబ్బా నవ్వించారు.

  ReplyDelete
 7. hi aswin,

  Atleast this kind of stereo typical thinking about rayalaseema is not expected from bloggers like you.

  ReplyDelete
 8. >> ఓ ప్రేమ ఖైది, ఓ ప్రేమ దొంగ, ఓ ప్రేమ ఫకీర్, ఓ ప్రేమ దరిద్రుడు.
  >> చివరికీ చెప్పులు కూడా అధ్బుతంగా కుడతాడు.
  >> Html, Xml, Bsnl లో దిట్ట
  >> చివరకు Congrats చెప్పటానికీ తను Missed కాలే ఇచ్చింది
  >> గతి లేని వాడికి గంజేనమ్మ పానకం అన్నట్టు
  >> అరమీటరు పాపరుతో వెలిగించి, అరకిలోమీటర్ దురం వెళ్ళి,

  అదిరాయి చెణుకులు. బాబోయ్ :) పిచ్చ పిచ్చగా నవ్వించేశారండీ. ఈసారి కాస్త వెరైటీగా మీ జమజచ్చ షైలాబాను, షాన్వాజ్ లకి పూర్తి విరుద్ధమైన అమ్మాయిని వెతుక్కున్నారన్నమాట.

  ReplyDelete
 9. హమ్మో హమ్మో ఏం రాసారండి అసలు..!
  సూపరో సూపర్... భలే నవ్వించారు.

  ReplyDelete
 10. బావుంది. చదివి హాయిగా నవ్వుకొన్నాం. ఇంతకీ సులక్షణ అనే లక్షణమైన పేరున్న అమ్మాయి ఇప్పుడు హైదరాబాదులోనే ఉంది (చేతిలో మొబైల్ పట్టుకొని, అశ్విన్ కోసం వెతుకుతూనే ఉందంట) ఫోన్ చెయ్యమంటారా? :-) హహహా.

  ReplyDelete
 11. అశ్విన్ గారు ఆ సులక్షణ రెడ్డి ఎవరో కాదు..
  మా అత్త కూతురే...ఇన్ని రోజులూ నాకు చెప్తూ ఉండెది అశ్విన్ అనే అబ్బీనీ ప్రేమించాను అని.ఓహో అది మీరే అన్నమాట.ఇక అయిపోయారు మీరు.

  ReplyDelete
 12. చెప్పులు కూడా అద్భుతంగా కుడతాడు....! మొత్తానికి పవన్ కళ్యాన్ బాగానే పట్టాడు సుమా ! అశ్విన్, అసలే నాకు ఒంట్లో బాగాలేదు. నాలుగు బ్లాగు ముక్కలు చూద్దామని కూచుంటే నవ్వి నవ్వి ఇంకా నీరసం ఎక్కువైంది.ఇలా అయితే నీ మీద కేసు పెట్టేస్తానబ్బాయి!

  ReplyDelete
 13. నా చెల్లి సులక్షణ రెడ్డి కి ఐ లవ్ యు చెప్పి, నడి రైల్వే స్టేషన్ లో దిక్కు లేని దానిలా వదిలేసి వెళ్ళిపోతావా? తొడ గొట్టి చెప్తున్నా, నీ కాళ్ళు చేతులు విరగ గొట్టి, కొండా రెడ్డి బురుజు దగ్గర నీ పెళ్ళి జరిపించకపోతే నా పేరు బ్రహ్మి రెడ్డే కాదు.

  ReplyDelete
 14. అదుర్స్ అశ్విన్ :) :) :) "చివరికి చెప్పులు కూడా అద్భుతంగా కుడతాడు" దగ్గర మాత్రం burst అయిపోయా! TOO GOOD!

  ReplyDelete
 15. మీ ఫ్రెండు శ్రీకాంత్ గారు బాగా సపోర్ట్ ఇచ్చారు మీకు, BSNL అనే కొత్త ప్రోగ్రామింగు లాంగ్వేజ్ ని కనిపెట్టి.
  చాలా బాగా నవ్వించారు.

  ReplyDelete
 16. Hilarious!! Brilliant execution!!

  ReplyDelete
 17. వీర అశ్విన్‌ రెడ్డి గా రూపాంతరం చెందే బృహత్తర సన్నివేశం మిస్సయింది. ఛా.. మా సులక్షణ రెడ్డి టాలెంట్ పిసరంత తగ్గింది. లేకుంటే పులివెందుల నుండి పోటీ చేసే ఏకైక వ్యక్తి, వీర అశ్విన్‌ రెడ్డి చరిత్ర కృష్ణ బ్యారేజి లో కలిసి పోయింది. అలా ఆంధ్ర ప్రజానీకం కూడా అశ్విన్‌ దేవుడి పాలన కూడా మిస్సయిపోయింది.

  విధి ఎంతో బలీయమైంది కాబట్టి మీరు మళ్ళీ కలుసుకుని ఓ బుజ్జి వీర వెంకట అశ్వ సులక్షణ రెడ్డి ని కంటారు తధాస్తు.

  -- విహారి

  ReplyDelete
 18. లక్షణం గా సులక్షణను చేసుకోండి.అంత భయంకర సిట్యువేషన్ లో మిమ్మల్ని ఎంత బాగా కాపాడింది ఆ అమ్మాయి.అలాంటి వాళ్లని వదులుకోవద్దు.మళ్ళా ఎంత ప్రేమ చూపించింది.అంత కంగారులో కూడా లవ్ యు చెప్పడం మర్చిపోలేదు.పగ తీర్చెసి పెళ్ళి చేసేసుకోండి ...నేను చెపుతున్నాను కదా...చేసేసుకోండి.

  ReplyDelete
 19. ఈ సారి సీమ స్టోరీనా ?
  వచ్చే సారి మాకు ఆర్యనో, బద్రినో కావాలి :-)

  ReplyDelete
 20. సలహా ఇచ్చినట్టే ఇచ్చి ప్రాధేయపడ్డాడు, చెప్పులు కూడా అద్భుతంగా కుడతాడు, ప్రోగ్రామింగులోకొస్తే ఎక్సెమ్మెల్‌తో పాటు బీయస్సెన్నెల్, కంగ్రాట్స్ చెప్పడానికీ మిస్డ్‌కాలే ఇచ్చింది, "క-డ-ప" వరకూ హై క్వాలిటీ కామెడీ. నవ్వుతోనే సిక్స్ ప్యాక్ శరీరం తయారయ్యేలా వుంది. ఆ తరువాత ఫ్యాక్షన్ కామెడీ. ఆ పైన మలయాళమంత్రం! అదరహో! ఇంతకూ కడప నుంచి పులివెందులకు వెళ్లిపోయారు సరే, అక్కడ ఏ ప్రేమ Restaurantకు వెళ్లారు? :)


  సినిమాల్లో సీమ చిత్రణపై 'పొద్దు'లో ఒక మంచి వ్యాసమొచ్చింది. మీరది చదివారా?
  (లంకె: http://poddu.net/?p=454 )

  ReplyDelete
 21. "అందరికీ ప్రేమ అమృతపాణి అరటి పండు నాకు మాత్రం కేవలం దాని తొక్క" :-)
  కత్తి లాంటి డైలాగుతో మొదలెట్టి వేటకొడవలి లాంటి ముగింపిచ్చావు. కీపిట్ అప్.

  ReplyDelete
 22. Adirindi. Except the part where you scold SulakshnaReddy.

  ReplyDelete
 23. బాగుంది. మీరు చెప్పే పద్ధతి బాగా నవ్వించింది.

  ReplyDelete
 24. @సుగాత్రి:: ధన్యవాదాలండీ, నేను పులివెందుల అంటే కొంచం హడావిడిగా ఉంటుందనుకున్నాను రైల్వే స్టేషన్ గురించి ఆలోచించలేదు, వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు. పులివెందులను కడపగా మార్చాను. :-)

  మురళి:: கல்யாணமே இந்த ஜென்மத்தில நடக்காது -> ఇదే జీవిత రహస్యం, అది పిల్లైనా పెళ్ళై అయినా

  @వదరేవు :: నెనర్లు

  @విరజాజి :: విరజాజి గారు మీరు కొత్త బ్లాగర్ లా ఉన్నరే మీబ్లాగు చూశాను. బ్లాగు మొదల పెట్టీనందుకు ధన్యవాదాలు, మోసపోవద్దేమిటీ మోసాపోయానండీ మొత్తానికీ

  @ మీనాక్షి:: నీకోసంగతి తెలుసా ? మీ బుచ్చిబావా అక్క కొడుక్కి, చెల్లిలి కూతురిని మా సులక్షన రెడ్డి పెద్దైన్నయకిచ్చారు అలా మనం చుట్టాలం

  @ ప్రపుల్లా::: ప్రపుల్లా చంద్ర గారు ధన్యావాదాలండీ చదివినందుకు :-)

  @ హరి దేవన :: అయ్యో మీఋఏమీ అనుకోవద్దు హరి దేవన గారు నేను ఏదో సరదాగా రాశాను అంతే, మీకు ఎమన్న ఈ టపా ఇబ్బంది అలిగించినట్టైతే ఈ సారీ అందుకోండి.

  @ బ్లాగాగ్ని:: నేను వెతుక్కోవటమేమిటండి, వాళ్ళే దొరుకుతున్నారు. చాల చాలా థాంక్స్

  @ శ్రీవిద్య :: ధన్యవాదాలండీ శ్రీవిద్యాగారు

  @ ప్రతాప్ :: వద్దండీ వద్దు ఇప్పుడు నేను వేరే లవ్ స్టోరీ లో ఉన్నా

  @ సుజాత ::: చాల దాంక్స్ అండీ సుజాత గారు.

  @ బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ ::: అసలు మీ కామెంట్ చూసి నేను భలే నవ్వు కున్నం, బ్రహ్మీ గారు అయిథే మన సెకండ్ హాఫ్ లో మనిద్దరం శత్రువ్వులన్నమాట.

  @ నిషిగంధ :: ధన్యవాదాలు నిషిగంధి గారు

  @ Gireesh :: ధాంక్స్ అండి మీ సపోర్ట్కు

  @ కల :: మీ రన్నరని కాదు కానీ వాడలాంటివాడే

  @ ఫుర్నిమ : pUrNimaa నాకు అప్ప్పుడు భయమేసింది.

  @ విహారి: విహారీ గారు మీకు నేనే మీ సమాధానమివ్వలేను, ఎందుకంటే మీరు మీరే మీకు అందరికీ తేడా ఎమిటో చెప్పనా మీకు టపా రాసినా కామెంట్ రాసినా డిఫరెంట్ గా ఉంటుంది హ హ, కానీ నాకు తధాస్తూ అన్నరేంటి ???

  @ రాధిక :: రాధిక గారు పెళ్ళికి ముందే ఇంతుంటే తరవాత సంగతే భయంగా ఉందండి, లేకపొతే చెలరేగి పోయేవాడినే

  @ ప్రవీణ్ :: అంతేలే నిత్యం దేవదాసు బ్రతుకు నాది. నా కష్టాలు చెపితే నీకు సరదాగా ఉంది కదా

  @ రానారె ::: రానెరె గారు చాల ధాంక్స్. నేను ముందు పులివెందుల రాసుకున్నా తరువాత కడప గా మార్చాను, ప్రొద్దూ లో ఆర్టికిల్ చదువుతాను, సరదాగా రాసుకున్నానండీ అంతే, ఈ సారి మార్కులెయ్యలేదు మీరు

  @ వికటకవి::: ధన్యవాదాలు వికటకవి గారు రియల్లీ థాంక్స్

  @ కడప, :::: చలా ధాంక్సండీ
  @ స్రజ్చనద :::: చలా ధాంక్సండీ

  ReplyDelete
 25. అశ్విన్ గారూ, సెబాసో!
  మూడు లవ్వులూ, ఆరు కెవ్వులుగా మీ లవ్ లైఫూ, మూడు టపాలూ ఆరు నవ్వులుగా ఈ బ్లాగ్వనమూ ఇలానే పండాలని నా కోరిక!

  ReplyDelete
 26. మంచి స్పాంటేనివిటి

  ReplyDelete
 27. உனக்கு கல்யாணமே இந்த ஜென்மத்தில நடக்காது ఈ మళయ్యాళీ మంత్రం ఏమిటండోయ్ అశ్విన్ గారు అసలు నేను నవ్వలేక చచ్చాను. బాబోయ్ కత్తీ, ఇక నుండీ మీబ్లాగుకు వస్తూ వుంటాను. విహారి గారి కామెంట్ బావుంది. మీరు పక్కన పెట్టిన నా సరదా రాతలు ఒకదానికొకటి పోటీ పడు తున్నాయి. అఫీస్ లో నన్ను నవుతుంటే పిచ్చిదానిని చూసినట్టు చూస్తున్నారు.

  ReplyDelete
 28. :-)
  ;-)
  :-)
  బాగుంది
  నవ్వలేక చచ్చాను
  నువ్వు దిగులు పడకు వేరే అమ్మాయిని చూస్తాలే

  ReplyDelete
 29. @భైరవభట్ల కామేశ్వర రావు ,
  తెలుగు పద్యం వారు, చాలా ధాంక్సండీ, నా బ్లాగు చదువుతున్నందుకూ ::-))
  @రమ్య, Bhasker
  ధన్యవాదాలు
  @శ్రీకాంతు,
  మన గురించి రాస్తే అన్నిటి కన్నా చివర చదువుతావా ???

  ReplyDelete
 30. ఇదేంటీ ఇంకో రమ్యా? అశ్విన్ మీ కాంమెంట్ చూసి ఇటువైపు వచ్చా, ఇదేంటీ ఈ మధ్య నేను బ్ల్లగులు చదవనేలేదే కామెంట్ ఎప్పుడు పెట్టానబ్బా అనుకుంటూ.. ఐతే ఇంకోరమ్య కూడా ఉన్నారన్నమాట,
  @ రమ్య గారు త్వరగా బ్లాగు మొదలెట్టండి మీబ్లాగుపేరు మీపేరు ముందుచేర్చ్తే గుర్తుపట్టడం సులువు:)
  అన్నట్లు అశ్విన్ పోస్ట్ సూపర్ త్వరలో సినీరచయిత ఐపోతారు మీరు.

  ReplyDelete
 31. మీరూ నాలాగే రోజుకో అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటున్నారే...
  కాకపోతే మీకు చివర్లో తగిలితే, నాకు మొదట్లోనే తగుల్తున్నాయి.. జెల్లలు

  ReplyDelete
 32. అశ్విన్ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

  ReplyDelete
 33. అదిరింది. உனக்கு கல்யாணமே இந்த ஜென்மத்தில நடக்காது ఈ మళయాళీ మంత్రం ఏమిటి కేకంతే... నేను చదివిన మొదటి తెలుగు టపా కత్తీ కేక

  ReplyDelete
 34. అది మళయాళం కాదు తమిళం

  ReplyDelete
 35. @bolloju baba garu, నెనెర్లు
  @ramya, :-)
  @falling angel మీ పేరులోనే falling angel
  @sriram హమయ్యా మొదలెట్టావా
  @ కొత్తపాళీ గారు, కొత్తపాళీ గారు నేను మీ కామెంట్ చూసి భలే నవ్వుకున్నా, నేను చదివిన పుస్తకంలో మళయాళీ మంత్రం అనే ఇచ్చాడాండీ, ఓహో అది తమిళమా :-(, అయినా అర్థం కాని వాడికి యే బాషైతేనేంటండి :-)

  ReplyDelete
 36. హలో అశ్విన్ ....ఆ వీర రాగవరెడ్డి ని నేనే, నీ గురించే వెతుకుతున్నా. కధ బాగా రాసావ్...నచ్చింది. నిన్ను ఇంక ఏమీ చేయను....కడపకి వచ్చినప్పుడు కలుద్దాం. ఉంటా...బై.

  ReplyDelete
 37. :-) aToo iToo koncham EVV Comedy la undi ANY way I enjoyed

  ReplyDelete
 38. Super,
  Way of constructing U R charecters in U R blog are really ROCKING.

  U DONT MISS FLOW OF COMEDY. IT is continuous

  GREAT GOING

  ReplyDelete
 39. అయ్య బాంబోయ్ !! సీమ స్టోరీ అదిరింది అశ్విన్...చాలా బాగుంది, బాగా నవ్వించారు :-))

  ReplyDelete
 40. "అబూ " మీ పేలు కి దగ్గల కత్తిరింపు (షార్ట్ కట్ ) బాగుంది బాగుంది బల్లె balle
  మీకు నచ్చకుంటే చెప్పండి వేలే పేలు పెడదాం
  మీలు మీ సులక్షణ లేదది ఇలగదీసాలు
  బాగుంది మీ సీమ ప్లేమ కధ బహు బాగు
  నేను చూడటం ఇప్పులే చూచా లేట్ గా వచ్చిన వ్యాఖ్య మాత్రం వెంటనే ఇచ్చా :):):)
  అవును మీలు మీనక్కా దోస్తులు కదూ నన్ను కూడా చేర్చుకోరూ

  ReplyDelete
 41. నమస్కారం..
  నేను ఒక పోస్ట్ రాసాను..
  ప్లీజ్ ఒకసారి నా పోస్ట్ చదివి వీలుంటే మీకు నచ్చితే spread it..ప్లీజ్
  ధన్యవాదాలు..
  లింక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
  http://prakamyam.blogspot.com/2008/10/blog-post.html

  ReplyDelete
 42. మీకు దసరా శుభాకాంక్షలు.

  ReplyDelete
 43. SUPER..........

  NO ONE CAN'T STOP THEIR LAUGHING

  CHARACTERIZATION IS AMAZING

  ReplyDelete
 44. ఆధిరింది మీ తపా. మీ అభిమాని అయిపొయాను. - భాస్కర్

  ReplyDelete
 45. Humorous! But not acceptable as u focussed more on caste and region!

  ReplyDelete
 46. arey manapulihaara.blogspot.com ma room lodi,
  prati week memu ade cricket match details display kosam create chesamu.

  ReplyDelete
 47. ఈ టపా చదివే సరికి సమరసింహారెడ్డి దగ్గర నుంచి సీమ శాస్త్రి వరకు అన్ని రకాల ఫ్యాక్షన్ సినిమాలు వరుసగా గుర్తుకు వచ్చేసాయి అంటే నమ్మండి .... మొత్తానికి కామెడి బాగా రాయ గలిగారు.. ఒక్క మాట లో చెప్పాలంటే కేక .....పెట్టించారండి.

  ReplyDelete
 48. Hello aswin garu,

  Memu 5 NRIs planning 4 a movie,So I would like to touch base with you .Please give me your personal e-mail id.

  Inthakante comment akkaraledanukuntaa...chalaa bagaa raasharu..meeku devudichhina talent vundi..use it..keep it up..

  ReplyDelete
 49. aswin,

  chaaaaaaala baaga raasaru. mee chaturata chaala super gaa undi... meenakshi gaaru chepparu mee blog gurinchi.

  navva leka chacha..nenokkadine kaadu, inka naa collegues kooda.

  keep writing andi...
  -ramesh

  ReplyDelete
 50. very nice. relaxed by reading it

  ReplyDelete
 51. re dont vorry mama mana sreekanth gaditho cheppi manchi [neeku nache] ammaini choodamandam sare na .....

  nenu kooda help chesthanule ra papam 7th class nundi try chesthunnav okkati success kaledu elogola manage cheddam ra

  ReplyDelete
 52. hi aswin,i really enjoyed by reading ur posts...i felt very bad y i missed ur blog n stories til now...

  ReplyDelete
 53. Hi sir.... mari meeru rase blogs nenu ee 2 rojula nunchi chaduvutunnanu, tellugu lone blog rayalani meeku enduku anipinchindo naku teliyadu kani, naku matram telugulo inta manchi kavitalu chaduvutunte mma amma odilo padukuni hayiga maa tatayya cheppe kathalu vintunnanta anandam ga undi...... meeku dhanyavadalandi...... inta manchi hasya sahithyanni maaku andistunna meeku memu ennatiki runapadi untam....

  ReplyDelete
 54. ఇన్ని సంవత్సరాలు నేను మీ బ్లాగు ఎందుకు మిస్స్ అయ్యానా అని తెగ ఇది ఐపోయా... మీ పొస్టులు అన్ని చదువుతూ నా వర్క్ లోడ్ నుండి రిలాక్శ్ అవుతున్నా .....మీకు ఒకటి చెప్పాలి మాది మంగళగిరి ..

  ధన్యవాదాలు ...
  కిషొర్ బిట్రా.

  ReplyDelete