Wednesday, July 23, 2008

నేను-షాన్వాజ్ ( ఓ కాల్ సెంటర్ ప్రేమ కధ )
అది వర్షాకాలం. రాష్ట్రమంతా వర్షాలు బాగా పడుతున్నాయి. టివి9 లొ కృష్ణా నది పొంగిపొర్లుతుందని మొదటి ప్రమాద హెచ్చరిక ఇవ్వగానే నా ఫోను మ్రోగింది. భయపడుతూ పోనెత్తా మా శ్రీరామ్ గాడు,

"రే మామా ఆఖరి పోరాటం టికెట్లు దోరికాయిరా మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకుని వెళుతా" అన్నాడు. ఆఖరిపోతాటం అంటే కృష్ణ గారి సినిమా అనుకునేరు, కాదు కాదు, I am Legend తెలుగు డబ్బింగ్ సినిమా మా శ్రీరామ్ గాడు డబ్బింగ్ సినిమాలు తప్ప మామూలు సినిమాలు చూడడు. అందుకే వాడిని డబ్బింగ్ రాముడు అంటారు. తీరా వెళ్ళేలోపల టి.వి లో ఓ యాడ్ చూశా. అది Vodafone వాళ్ళ Chota credit యాడ్.

"ఓ అమ్మాయి పరిక్షరాస్తూ ఉంటుంది ఇంకు పెన్నుతో, పెన్నులో ఇంక్ అయిపోతుంది వెనుకాల ఓ కుర్రోడు ఏమ్ పర్లేదు ఖంగారు పడకు నేను నీకు ఇంకు ఇస్తాను అని తన పెన్నులో రెండు ఇంకు చుక్కలు తన బల్ల మీద చల్లుతాడు, ఆ రెండు ఇంకు చుక్కలు తీసుకుని తను పరిక్ష రాస్తుంది".

ఇది చూడగానే నేను ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళాను. అవి బ్లాక్ అండ్ వైట్ రోజును నేను తనూ మాత్రమే కలర్ లో ఉన్నము, అదే సీన్, డిటో, తనకూ ఇంకు అయ్యిపోయింది, నా వంక చూసింది, నేను అసలే చలరేగిపోయే టైపు వెంటనే పెన్ను విదిలించా ఇంకు పడలేదు, ఓ రెండు మూడు సార్లు గట్టిగా విదిలించా అంతే మొత్తం తన పాపర్ మీద, బట్టల మీద ఇంకు పడిపోయింది,
"చీ యెధవా " అని గట్టిగా నన్ను తిట్టి, చెంప మీద ఒకటిచ్చి వెళ్ళిపోయింది, అందరి ముందు వెధవన చేసింది కాదు చేతులారా యధవనైయ్యాను. I hurted, నేను hurt అయ్యాను. నాకీ చేదు జ్ఞపకాన్ని గుర్తు చేసినందుకు Vodafone మీద కొపంవచ్చింది, వెంటనే Vodafone కాల్ సెంటర్ నెంబర్ 111 కు ఫోను చేశా,

"నమస్కారం, Vodafone కి స్వాగతం మీరు prepaid వివరాలు తలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఒకటి నొక్కండి" అంటూ మొదలెట్టింది... అలా ఒకట, ఒకటి తర్వాత రెండూ ఇలా ఓ 99 దాకానొక్కించిన తరువాత దయచేసి ఓ అరగంట లైన్ లో ఉండండి, మా Customer care Executive వచ్చి మీతో సంప్రదిస్తారు అని చెప్పింది, అరగంటా...నేన విన్నది నిజమా కాదా అని అనుకునే లోపే మా డబ్బింగ్ గాడు వచ్చాడు నన్ను తీసుకుని వెళ్ళాడు.

సినిమా నుండీ తిరిగి రాగానే అలారమ్ పెడదామని ఫోను పట్టుకున్నాను, ఒక్క క్షణం ఏమీ అర్థంకాలేదు.
"అవును మీరు లైన్ లోనే ఉన్నరు, దయచేసి వేట్చేయండి ", అంటూ IVR,
ఇక నాకు తిక్క తాటిచెట్టిక్కింది, ఇంతలో ..
"నమస్తే నేను షాన్వాజ్ మీకు ఎలా సాయాం చెయ్యగలను ? "

ఆ గొంతు, ఆ గొంతులో ఆ షాన్వాజ్ అన్న పేరు వినగానే, నెమళ్ళు పరవసించి నాట్యమాడుతున్నట్టు, సముద్రపు అలలు పెద్దరాయిని డీ కొన్నట్టు, బాగ్రౌండ్లో, అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలోచ్చి ఎగిరిండీ అంటూ సాంగ్ ...

తను మళ్ళీ "దయచేసి మీపూర్తి పేరు మరియూ మెబైల్ నెంబర్ తెలియచేస్తారా ? "

"నా పేరు అశ్విన్ ఇక నుండీ "షాజహాన్ ", నీకు కానీ మీ ఇంట్లో వాళ్ళాకు కానీ caste ఫీలింగ్ ఏమన్నా ఉందా? అఁ ఏమీ లేదు నిన్ను పెళ్ళిచేసుకుందామనుకుంటున్నను " అన్నా

తను "క్షేమించాలి మీరు అలా మాట్లాడితే మీ కాల్ మా సుపీరియర్ కు ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది" అని అంది.

"మనకు కొడుకు పుడితే వేంకటేశ్వర రావ్ అని పెడదామా? లేక నయీం అని పెడదామా?"

తను మళ్ళీ "క్షేమించాలి మీరు అలా మాట్లాడితే మీ కాల్ మా సుపీరియర్ కు ట్రాన్స్ఫర్ చేయటం
జరుగుతుంది" అని అంది.

"అది సరే కానీ మనకు కూతురు పుడితే మా బామ్మ దుర్గమ్మ పేరు పెడితే నీకేమన్న అభ్యంతరమా ?"

తను "మీరు ఇలా మాట్లాడినందుకు ఈ కాల్ ను ట్రాన్స్ఫర్ కు చేయటం జరుగుతుంది." అని కాల్ ట్రాంఫర్ చేసింది. నేనూ వెంటనే కట్ చేశా.

*****
రాత్రి పడుకునే ముందు ఆంజనేయశ్వామికి దణ్ణం పెట్టుకుని పడుకోవటంనాకు అలవాటు , కలలో:: షాను vodafone యాడ్ లో ఆ అమ్మాయి లాగా టై మర్చిపోయి బస్ లో వెళుతున్నట్టు, నేను ఆ vodafone కుక్కలా నేను వెనుకాల పరిగెడుతున్నట్టు ఒకటే కలలు. ఉలికి పడి ఒక్కసారిగా లేచాను. చ్చా...పీఢ కల అమ్మో ఇంకేమన్న ఉందా ? ఓ గ్లాసు మంచుళ్ళు తాగి మా వెంకన్నకు దణ్ణం పెట్టి పడుకున్నను, ఈ సారి ’సౌందర్య లహరీ.. స్వప్న సుందరీ నువ్వే నా ఊపిరీ..." అంటూ నేను- షాను పాడుతున్నట్టు ఒకటే కలలు మర్చిపోయా కలలో డైరెక్టర్ కూడా మన రాఘవేంద్రరావే,

వేంకటేశ్వర శ్వామికి దణ్ణం పెట్టుకుని పడుకుంటే శ్రీకాంత్-దీప్తీభట్నాకర్ వస్తే, అదే కృష్ణుని దణ్ణం పెడితే యే హృతిక్కో కరీనానో వచ్చుండేవాళ్ళు ఛా , అనుకునే సమయంలో దీనికి నేనే సాక్షి అంటూ నా మొహాన పాపర్ విసిరేసి వెళ్ళాడు, సాక్షి లో దినిఫలాలు ఎలా ఉన్నాయో చుద్దామని పేజి తిప్పా, సాక్షి దినఫలాలకు నేనే సాక్షి, అందులో మేష రాసివారికి గురువు ఎక్కడుండకూడదో అక్కడే ఉన్నడు, శనికూడ ఎక్కడ ఉండకూడదో అక్కడే ఉంది, కాబట్టి మీరు కూడ ఎక్కడపడితే అక్కడ ఉండకండీ అని రాసుంది, ఇదేమిటబ్బా అనుకుని ఈనాడు చూశా, వాడు "సాక్షి లో రసినదంతా తప్పు" అని రాశాడు.

జరిగినదంతా మా డబ్బింగ్ గాడికి చెపితే మామా Vodafone కాల్ సెంటర్ ఎక్కడనుకున్నవ్ మనూర్లోనే రా నువ్వుకూడ వెళ్ళి జాయిన్ అవ్వొచ్చు మన ఇందిర కూడ చేస్తుంది, అదే ఈనాడు ఇందిర అంటూ ఓ డబ్బింగ్ డైలాగు చెప్పాడు, ఇందిరకూ నాకు అసలు పడదు తను ఈనాడు కు ఓటేస్తే నేను సాక్షి కి వోటేస్తా, అందుకనీ అయినా ఆ కాల్ సెంటర్ మన ఊరిలోనే అన్న వార్త వినగానే తెలియని ఆనందం. యాహూ అంటూ పుస్తాకాలు పైకెగరేసి ఎగిరేశా ...

***

సీన్ కట్ చేస్తే జాయిన అయ్యి, ట్రైనింగ్ అవ్వటం జరిగింది. ఫ్లోర్ లోకి వచ్చా, ఇన్నాళ్ళు కాల్ చెంటర్ అంటే ఏమిటో అనుకున్నాను ఇప్పుడు తెలిసింది కాల్ సెంటెర్ అంటే కాకి గోల, మాట్లాడుతునే ఉన్నారు/ఉంటారు. ఇకా నా చాన్స్ దేవునికి దణ్ణం పెట్టుకుని మొదటి కాల్ ఎత్తా, వాడెవడో బండి మీద వెళుతుంటే Vodafone నుండీ ఫోనొచ్చిందంట సినిమా పాటనన్నీ వినిపిస్తూ, ఈ కాలర్ ట్యున్ కావలంటే ఒకటి నొక్కండీ, దీనికైతే రెండు నొక్కండీ అని... ఇంతలో ట్రాఫిచ్ పోలీస్ ఆపి బండి నడిపేటప్పుడు మోబైల్ మాట్లాడుతునందుకు ఓ 300 ఫైన్ వేశాడంటా. ఇక వీడు నాతో ఇక్కడ అందుకున్నడు... వాడి తిట్లకు నా చెవులు చిల్లు లు పాడుతున్నయి...ఇంతలో నన్ను చూసి పరిగెత్తు కుంటూ వచ్చింది ఇందిర ,

"ఏమైంది customer irrated గా ఉన్నాడా, హాండిల్ చెయ్యగలవా ? ",అందీ.
ఏంటే నువ్వు నాకు హెల్ప్ చేశేది నాలుగు పేజిల నువ్వెక్కడ ? నలభై పేజీల నేనెక్కడ. అవతలుకు ఫో ... అన్నా
కానీ ఆ customer నన్ను ఆడేసుకున్నడూ. ఆ ఒక్కటే కాదు అలా మొదలు పెట్టి కాల్స్ హాండిల్ చెయ్యలేకా నేను నానా చంకలు నాకాల్సి వచ్చింది. నాలుగు వరకూ కాలేజ్, ఐదు నుండీ రాత్రి తొమ్మిది వరకు Vodafone, మళ్ళీ పొద్దున్న తొమ్మిది కళ్ళా కాలేజ్, 2౦ రోజులైంది, తను, నా షాన్వాజ్ ఒక్కసారి కూడ కనపడలేదు. ప్రేమకోసమై వలలో పడినే పాపం పసివాడు అని పాట పాడుకోటానికీ ఓపికా టైం లేదు, ఇంకా మా customers కి నేనొక బలిపశువు,

***

అది 21వ రోజు, నేను ఎప్పుడూ లాగే కాల్స్ లో తిట్లుతింటూ ఉన్నను , ఓ కొత్త కస్టమర్,
"సారు నాపేరప్పలకొండ మాది తెనాలి దగ్గర నందెలుగు, మొన్న వర్సాలాకు మీ టవరు కూలి మా మేక పై పడింది, దానికి మా మేక సచ్చూర్కుంది....."

నేను: "క్షమించాలి అప్పలకొండ గారు, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నము, నేను మీకు ఇప్పుడు ఎలా సహాయహం చెయ్యగలను ?"

"ఆ సెపుతున్నా, సెపుతున్న, అదే సెపుతున్నా నా మేక పై మీ టవరు కూలి పడింది కదా నా మేకను నాకు తెచ్చీయ్..." అంటూ గొడవేసుకున్నాడు
ఈ వెధవ ఆపట్లేదు, అటు చూస్తే ఆ ఈనాడిందిర నావంకే చూస్తుంది. ఇక్కడ వీడేమో తిడుతున్నడు అక్కడ అదేమొ నవ్వుతుంది. గజేంద్ర మోక్షం లో ఏనుగు అరిచినట్టు ఒక్కసారిగా అరిచా ......

ఇంతలో ఖంగారుగా ఓ అమ్మాయి నా పక్కనకొచ్చి కూర్చుంది, లేత పాల మీగడ వంటి తెలుపు చాయ తో, ఎఱ్ఱ ని మట్టి గాజులతో, అదే ఎఱుపు ముక్కుపుడకతో, సన్నని గజ్జెల చప్పుడుతో, నల్లని కాటుకల కళ్ళతో, జడ నడుమును దటుతూ, కను రెప్పళ్ళో భయంతో రెపరెప లాడిస్తూ TL వచ్చాడా అని ఆడిగింది,

ఇంతలో మా యధవ "ఏం సార్ మాట్లాడరు మేకనిస్తార పోలిస్ కంప్లీంట్ ఇయ్యమంటారా ??" నాపక్కన అమ్మాయికి రాలేదని సైగ చేసి నేను యధవతో మాట్లాడుతుండంగా .. తను "నేను షాన్వాజ్ మీకెలా సాహాయము చెయగలను??" అంటూ తన కాల్ మొదలు పెట్టింది. ఆ పేరు వినగానే ఆ క్షణం లో నాలో తెలియని ఉత్సాహం పొంగి పొర్లి కట్టలు దాటి వరదలై ప్రవహించింది. ఒక్కసారిగా ఈ ప్రపంచం అంతా ఆగిపోయింది, ఆ క్షణం లో చివరకు పాట కూడ గుర్తుకురాలేదు, హీరో కృష్ణా గారు గుర్తుకొచ్చారు, ఆకాశంలో ఒక తారా నాకోసమొచ్చింది ఈ వేళ అంటూ నేను కృస్ణా గారి స్టెప్పులేసుకుంటున్న..ఝుమ్ ఝుమ్ ఝుమ్ , అంటూ కోరస్ కూడా...

ఇంతలో మా యధవ "ఏం సార్ మాట్లాడరు మేకనిస్తార కోర్టుకెళ్ళి మీపేరుపైన కేసయ్యమంటారా ??"

"రేయ్ యధవా!!! నువ్వు GOAT అని capital letters లో type చేసి 111 కి SMS చెయ్యి నీ మేక అప్పల కొండా, అప్పల కొండా అంటూ అరుస్తూ నీ దగ్గరకు వస్తుంది" అని ఫోను పెట్టేసా, పక్కన చూస్తే తనతో పాటు ఎవరూ లేరు గార్డ్ నడిగితే బ్రేకెళ్ళరు అన్నారు, ఛీ వీళ్ళకు పని తక్కువా బ్రేకులెక్కువ, అయినా నా షానును కూడా తీసుకెళ్ళటం ఎందుకు ??? "వస్తున్నా నేనే వస్తున్నా..." అంటూ కాంటీన్ లో కి పరిగెత్తా... కాంటీన్ లో చూడగానే ఈనాడిందిర కూడ షాన్వాజ్ ప్రక్కన ఉంది, మొదట కొంచం భయమేసినా సాక్షి ఎందుకు భయపడాలి ? అన్నీ పేజీలు రంగులే కదా !!! టీ తీసుకుని "ఏం ఇందిర బావున్నావా ?" అంటూ వాళ్ళ టేబుల్ దగ్గర సెటియ్ అయ్యా. టీ కప్పు ఎత్తి దించేలోపల డేటా అంటా హాక్ చేసా,

పేరు: సయ్యద్ షాన్వాజ్,
నాన్న: చిన్నప్పుడే చనిపోయారు
అమ్మ: టీచర్,
చదువు: B.A (ECO)
హాబీ: నడవటం
మొగుడు : త్వరలో అశ్విన్( అబ్బ నేనే ).

తన బయోడేటా చూస్తే నాకు ఇక అదృష్టం ఆమడ దూరంలోనే ఉందని పిచ్చింది, తరువాత తెలిసింది అదృష్టం ఆమడ దూరంలో ఉంటే శని గాడు సైడ్ పాకెట్ లోనే ఉన్నాడని,

***

పరిచయాలు బాపెరిగిపోయాయి నేను ఈనాడు ఇందిరా , షాను సినిమాలకూ రెస్టారెంట్లకు, కొండపల్లి ఖిల్లాలకు, అబ్బో, జీతం రావటం రెచ్చిపోవటం, ఈనాడిందిరకు కధర్ధమైయింది, నీకు సాక్షి ఇష్టమా, ఈనాడిష్టమా అని ఇందిరనడితే, తను TV9 అనేది...చాలా బా ఎంజాయ్ చేసావాళ్ళం, షాన్వాజ్ తో ఒకటే చిక్కు తనకు నడవటం హాబీ అంటే ఏమిటో అనుకున్నాను , చూపులు కలిసిన శుభవేళ సినిమాలో సుత్తి వీరభద్రరావు లా కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తుంది, ఇందిర నడవలేక పారిపోయేది , ప్రేమించి పారిపోవలేక నేను నడిచేవాడిని. వాళ్ళింట్లో వాళ్ళందరూ బా పరిచయం అయ్యారు, మా అత్త గారు మా బాబాయ్ గారు.

ఇలా నడుస్తున్న రోజుల్లో నా పుట్టిన రోజొచ్చింది, మా ఇంట్లో కేక్ కట్ చేయటమంటే ఏవరో పీక కట్ చేస్తున్నరని ఫీల్ అవుతారు నేను ఎప్పుడూ కేక చెయ్యలేదు నా 21 ఏళ్ళ తరువాత మొదటి సారి ... షాను , ఇందిరా నా చేత కేక కట్ చేయించారు. ఇందిర ఈనాడు వీక్లీ ఇచ్చింది బహుమతి గా పైగా బహుమతీ గా ఇచ్చినవాటిని పరెయ్యకూడదు అని రాసిమరీ ఇచ్చింది. షాను ఓ ర్రీటింగ్ ఇచ్చింది, అందులో

"U'R my one of my best friend, నేనెప్పుడూ నా జీవితంలో ఇంత హాపీగా ఉండలేదు I thank Allah for giving a good friend అని రాసింది."

***

ఆ మరుసటి రోజు రంజాన్, నన్ను కీర్ కు వాళ్ళింటికి రమ్మని పిలిచింది, ఈ రోజు నా మనసులోని విషయం చెప్పేయమని ఆ ముందు రాత్రే ఇందిర ఫోన్ చేసి చెప్పంది. నేను ఈ సారి, మొదట ఈనాడు చుసాను, అందులో "నీ గ్రహాలు ఎక్కడెక్కడుండాలో అక్కడక్కడే ఉన్నాయి" అని రాసుంది, వెంటనే సాక్షి తీసి చూశా "ఈనాడు వాడు రాసినది నిజమే అని రాసుంది." ఇక నేను చలేరేగిపోవటం ఖాయమని దృఢ నిశ్చయముతో వాళ్ళింటికెళ్ళాను.

వాళ్ళమ్మగారు తలుపు తీశారు , షాను పైన బట్టలు ఆరేస్తుంది రా బాబు లోపలికి కూర్చో అంటూ కుర్చీ వేశారు, ఇల్లంతా హడావిడిగా ఉంది చుట్టాలతో, ఇంతలో వాళ్ళమ్మగారు ఓ ఫోటో ఇచ్చి ఇతనే బాబు షాన్వాజ్ చేసుకోబోయేవాడు, ఎలా ఉన్నాడు? అనడిగారు. నాకు ఒక్క నిమిషం ఏమ్ మాట్లాడాలో అర్ధమ్ కాలేదు. అప్పుడే కిందకు వచ్చినా షాన్వాజ్ నన్నూ, నాచేతిలో ఆ ఫోటో ను చూసి సిగ్గుపడింది, నేను వెంటనే సూపర్ ఉన్నాడండీ షాను వాళ్ళ మేనమామేగా. అంటూ ఏవో మాటలు కలిపా ... ...... కానీ ఏం మాట్లాడానో అర్థం కాలేదు. అక్కడ నిమిషం కూడా ఉండలేక పోయా...

"సరే నేను వెళుతున్నాను నాకు చిన్న పని ఉంది", అంటూ అక్కడ నుండీ కదిలా, నేను వెళుతానని చెప్పగానే నేనూ వస్తా అంటూ తను కూడా సందు చివర దాకా వచ్చింది.

"అశ్విన్ నేను రేపటి నుండీ ఆఫీస్ కు రాలేనేమో...." అంది.

"నేను కూడా" అన్నాను, నేను బండి స్టార్ట్ చేశాను .

తను Take care of u'r life It is precious Bye షాజహాన్ అంది
షాజహాన్ .....ఈపేరు వినాగనే ఇక నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను.
బండి గేర్ మార్చాను .
ఆ రోజు నేను చాల బాధపడ్డాను, తనకు నేనేఫోన్ చేసానని ఇన్నాళ్ళూ తెలియదనుకున్నాను. కానీ తనకు తెలిసిందన్న విషయం నాకు తెలియాగానే చుట్టూ చీకటైందీ, ఓ ఆడది తన మనసులో ఓ విషయాని దాచినట్టు మగవాడు దాచలేడు

*******


ఆ మరుసటి రోజు నేను చేసిన మొదటి పని సాక్షి ని ఈనాడును మానిపించటం.

"కళ్ళలోన కలలు అన్నీ కధలుగానే మిగిలినే...
కనులు దాటి రాను అంటూ కరిగిపొయెలే....."

ఆరు నెలల తరువాత మా డబ్బింగ్ రాముడు ఫోన్ చేసాడు సుఖ-సంతోషాలు కు టికెట్లు దొరికాయిరా ( అంటే The pursuit of Happiness తెలుగు డబ్బింగ్ ) రెడీ అవ్వు. తీరా రెడీ అయ్యి వెళ్ళే సమాయానికి టి.వి లో ఓ యాడ్ ఇది Airtel వాళ్ళది, నేను మళ్ళీ Hurt అయ్యా, Airtel కాల్ సెంటర్ 121 కి కాల్ చేశా ...

మళ్ళీ నా ప్రేమ పోరాటం "Learn swimming through postal " లా తయారయ్యింది.

49 comments :

 1. మీ ప్రేమ కథ బాగుంది.

  ReplyDelete
 2. :) సూపర్ ఎక్కడా పట్టు పోకుండా రాశారు. స్వాతీ కామెడీ కథలకు పంపవచ్చు.

  ReplyDelete
 3. కడుపుబ్బ నవ్వించారు, "GOAT అని capital letters లో type చేసి 111 కి SMS.... " సూపర్!!!!

  ReplyDelete
 4. హ హ బాగా నవ్వించారు అశ్విన్, GOAT SMS super.

  ReplyDelete
 5. ఈనాడు చూశా, వాడు "సాక్షి లో రసినదంతా తప్పు" అని రాశాడు.................. సూపర్.కడుపుబ్బ నవ్వించారు,

  ReplyDelete
 6. aswin garu........

  sooooooooooooooooper..sTory..
  ayyo ayyo ayyo...shyla bhanu,ippudu shanvaj....iddaru dakkaleda miku..

  ReplyDelete
 7. ఎక్కడ బిగి తగ్గకుండా రాసారు. చాలా బాగా నవ్వించారు. అలానే చివర కూడా ఏడిపించారు. keep it up.

  ReplyDelete
 8. Aswin, hala bagunayi, nii kadalu....

  ReplyDelete
 9. బాగా రాసారు. ఏదన్నా కథల పోటికి పంపొచ్చు. కాకపొతే కామెడీ కథల పోటికి అయితే చివర కొద్దిగా మార్చాలి. ప్రయత్నించండి.

  ReplyDelete
 10. @raj @వేణు @ ప్రపుల్లా
  నెనెర్లు
  @1234
  అయ్యో అంత లేదండీ ఎదో సరదాగా రాసుకున్నాను. కొంచం పెద్దదైంది అనిపించింది అయినా ఓపికగాఅ చదివినందుకు ధన్యావాదాలు
  @ రధిక గారు, మీనాక్షి
  ధన్యావాదాలు
  @ కలలో.. కన్నీటి అలలో
  నమస్తే అండీ, జీవితం లో సుఖాలు ఉండాలి కష్టాలూ ఉండాలి, అంతెందుకు మీ టైటిల్ చూడండీ ... సంతోషమైన కల- కన్నీటి అలలు, ఏదో సరదాగా రసుకున్నను చదివినందుకు అభినందనలు
  @ కామేష్, ప్రతాప్
  ధన్యావాదాలు

  ReplyDelete
 11. కేక, చాలాబాగుంది
  ఈ సారి తొందరపడి airtel లో చేరకండి

  ReplyDelete
 12. చాలాబాగుంది

  ReplyDelete
 13. భలే.
  ఐనా మీకీ బురఖాల ఆకర్షణ ఏవిటి? అసలే ఈ మధ్యన మన మధ్యన ఒక నిజం బయల్దేరింది, నిజం నిప్పులాంటిది గదా, ముట్టుకున్నవాళ్ళని కాల్చేస్తోంది .. జాగ్రత్త!

  ReplyDelete
 14. Hi... chala goppaga undhi mee rachana,,,, chala baga rasaru... ilantive marenno mee nunchi asisthu selavu....

  ReplyDelete
 15. చాలా బాగుంది. మీ కధకి గురువు గారు సిరివెన్నెల గారి పాట సరిపోతుంది.

  ఎవ్వరినెప్పుడు తన వలలో భందిస్తుందో ఈ ప్రేమ
  ఏ మది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ
  అర్ధం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ
  జీవిత పరమార్ధం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ.

  ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ
  ప్రతి ఇద్దరి తో ఈ గాధే మొదలంటుంది ఈ ప్రేమ
  కలవని జంటల మంటలలో కనబడతుంది ఈ ప్రేమ
  కలిసిన వెంటనె ఏమవునో చెప్పదు పాపం ఈ ప్రేమ.

  ReplyDelete
 16. GOAT SMS...chala baga raasaru...naaku talchukuntene navvu vastundi....
  And eenadu...sakshi...gurinchi kooda chala baagundi...

  ReplyDelete
 17. 11/10. టపా అదిరిపోయింది. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చమక్కులు చాలా వున్నాయిందులో. పొద్దునే బాగా నవ్వించినందుకు మీకు చాలా థాంకులు.అవునూ ... ఆతరువాత మీ సందులోకి ఐశ్వర్య రాలేదా?

  ReplyDelete
 18. చాలా బావుంది. "తరువాత తెలిసింది అదృష్టం ఆమడ దూరంలో ఉంటే శని గాడు సైడ్ పాకెట్ లోనే ఉన్నాడని," too good. GOAT జోక్ కూడా సూపర్.

  ReplyDelete
 19. కత్తి లాంటి టపా. అదరిపోయింది. మంచి పట్టు వుంది.
  సెభాషో...

  -- విహారి

  ReplyDelete
 20. @ కొత్తపాళీగారు, రానెరె , శంకర్, మా కాంతుగాడు, SHREYUS,MURALI,రానెరె, విహారి, వాసవి, తెరిసా, పూర్నిమా, శ్రీవిద్యా, గార్లకందరికీ పేరు పేరు నా నా ధన్యావాదాలు

  ReplyDelete
 21. వామ్మో కేక పుట్టించారు!
  కత్తి టపా... నాకనుమానం ఇందులో ఎంతో కొంత నిజముందని ;)

  ReplyDelete
 22. hey ento anukunna gani neeku chala talent vundhi.sarele kaanai enty anni love stories enaaa babu rasedhi.shanu na sulochana na?????????

  ReplyDelete
 23. @ఫ్రవీణ్
  నిజమా...అయ్యో భలేవారే
  @ కనుమూరి గారు
  ధన్యావాదాలండీ మీ యొక్క అభిప్రాయానికి, కానీ మన బ్లాగులోకానికన్నా మంచి ప్రదేశముందా
  @ నీలూ
  మీరెవరో నాకు తట్టలేదు సుమండీ, సులోచన పేరు బావుంది. నా తరువాత కధలకు వాడుకుంటాను

  ReplyDelete
 24. బాగా రాసారు. :)

  ReplyDelete
 25. haiii aswin......sry for troubling u before....but ur creativity is very good...avunu ...asalu hutch thought ela vachindii....and that too shanu name idea......good...chala bagundii..comedy vunna kani next series anto anna curiosity tho comedy ni pakkana petta...if u try hard..u can do many more things like this...all the best...

  ReplyDelete
 26. its really good keep it up

  ReplyDelete
 27. hello sir
  I am phani's frd , sir em rasaru sir nigamga osam hatsoff to u for u r sense of humour and for u r creativity okka sariga mana telugu comedy liric writters gurthocharuuu.navi navi kadupu chekallayindi.

  ReplyDelete
 28. ఎంత బగుందొ చెపటానికి నా దగర మటలెవు. కొలిగ్ పిలుస్తునా వినపడనంతగా లినం అయిపొయా మీ ప్రెమకతలొ

  ReplyDelete
 29. goat scene bagundi ra

  ReplyDelete
 30. Aswin,
  ee madhya mee blog chudaTam lEdu chAlaa miss ayyaanu annamATa...

  mee stories chAlA baagunnaayi
  kEka... kevvu kEka...

  ReplyDelete
 31. orey aswin this is jayanth.. http://www.fortevast.com

  can you publish naalo pongenu narmada song lyrics
  from surya s/o krishnan movie

  Thankyou

  ReplyDelete
 32. hi ra aswin this is jayanth
  i too started blogging yar
  check out me at http://jayanth.fortevast.com
  http://jayjaz.blogspot.com/

  ReplyDelete
 33. Chala kadupabba navinchav :), kani chivarilo badha anipinchindi!!

  ReplyDelete
 34. Reallyy Sooooooooo Cool Comedy Here

  ReplyDelete
 35. అశ్విన్ గారు మీ కామిడీ కథల గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు..సూపర్. ఇక " ఈనాడు " పత్రిక విషయానికొస్తే..అందులో ఎప్పుడు కూడా రాశి పలాలు " రాయరు, వేయరు. ఈనాడు పత్రికలో ఉన్న కమిట్ మెంట్ అది..వారు స్వయం కృషినే నమ్ముతారు.కాని నమ్మకాల రాశిపలాలు గురించి అసలు ప్రచురణే ఉండదు..మీరొక సారి గమనించండి...! కమల్.

  ReplyDelete
 36. aswin garooo...chala baga rastunnaru..na frnd okaru mea blog ea roje introduce chesaru...nenu konchem mood off ga unte,tanu cheppadu,okkkasri ea blog chudu...okadani tarvata okati posts chadutune unna...na badha anta eto egiripoyindi...navvutune unna manasara..anyway chala thanx andi...mea ea story ending konchem kallallo neallu teppinchindi...superb narration..manchi kathanam...bagundi...mea blog na favrites lo add chesesa...now onwards m a regular visitor to u...kompadeesi mearu s fm aswin kadu kada

  ReplyDelete
 37. koutilya choudaryNov 23, 2009, 7:31:00 AM

  aswin garoo....pls check ur blog ones...its full of phishing r virus things....lot attackd my computer...even its irresistsble to see ur blog....pls twaraga choodandi...

  ReplyDelete
 38. మీ కథ చాలా బాగుంది. అందరూ చెప్పారు మీరు కామెడీ ఇరగాదీస్తారని, కానీ కామెడీ కంటే సెంటిమెంట్ ఫీల్ ఇంకా బాగా హేండిల్ చేసారు.ఓ ఆడది తన మనసులో ఓ విషయాని దాచినట్టు మగవాడు దాచలేడు.ఈ వాక్యం కేక. నాకైతే కొద్దిసేపు నా నోటి వెంట మాట రాలేదు.

  ReplyDelete
 39. Hi Aswin,

  I am not getting Telugu font. Can you help me, how to get Telugu font.?

  Suresh

  ReplyDelete
 40. Ha ha ha ..! Learn Swimming by post......?

  ReplyDelete
 41. mee kadalu anni cinema based ga unna super...!!!

  ReplyDelete
 42. chala bagundi.... good luck...

  ReplyDelete
 43. Hi Ashwin alias Shajahan...!

  Sory is awesome, ur GOAT message idea is really good.

  ReplyDelete
 44. మీ నుంచి మరిన్ని కథలు ఆశిస్తున్నాము. Play store నుంచి download చేసి చదివాము. చాలా బాగున్నాయి. మరిన్ని కథలు పొందడం ఎలానో తెలుపగలరు.

  ReplyDelete