
నాకు ఈ రోజు వరకూ తెలియదు దశావతార కు కధ సమకొర్చినది కూడా కమల్ హాసన్ యేనని. ఈ మధ్యన నేను చూసిన సినిమాలకు టికెట్ల రూపంలో డబ్బు ఖర్చు పెట్టీ పెట్టీ చివరకు ఈ సినిమాతో నా దాహం కొంచం తీరిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో నాకు నచ్చిన/ నేను గమనించిన కొన్ని అంశాలు.
1. సినిమా మొదటి అరగంట చాలా బావుంది. ఇక్కడ కమల్ 12వ శతాబ్దపు కధ చెప్పే పద్దతి బావుంటుంది. "రాయిని మాత్రం కంటే ..." పాట హైలైట్.
2. సినిమా మొదళ్ళో బ్రాహ్మణ వేషధారి రంగరాజన్ నంబి నీటిలో మునిగి చనిపోతాడు, సినిమా చివరిలో దళిత నాయకుడు వింసెంట్ పుణ్యకోటి కూడా అంతే. జీవితమంతా దైవమే అని నమ్ముకున్నడు రంగరాజన్, మట్టే దైవం అని పోరాడాదు వింసెంట్ పుణ్య కోటి.
3. రంగరాజన్ అడ్డుకున్నా 12వ శతాబ్డం లో విష్ణువాలయంలో పెకిలించపడ్డ విష్ణు విగ్రహముండే అదే చోట 20వ శతాబ్దంలో గోవిందరాజు Bio-chip ఉన్న విగ్రహాన్ని పాతి పెట్టటం, పాతి పెట్టే ముందు ఆసిన్ సుప్రభాతాన్ని వల్లెంచటం, చాలా బావుంది.
4.12వ శతాబ్దంలో ఆసిన్ తన మంగళ సూత్రాన్ని శైవ రాజు పై విసిరికొట్టినప్పుడు, ఆమంగళ సూత్రం వెళ్ళి చోళ మండపం ద్వారపాలకుల దగ్గర ఉన్న సింహం పై పడుతుంది, అదే సింహం 20వ శతాబ్దం లో ఆసిన్ కాళ్ళకు తగులుతుంది.
5.12వ శతాబ్దంలో రంగరాజన్ బొట్టు చెరిపి రాయితో కొట్టినప్పుడు అది నిలువు నామ రూపంలో తగిలి ఆ రక్తమే ఎరుపు రంగు లో తిలకంలా నిలుస్తుంది. 20వ శతాబ్దలో కూడ గోవింద రాజుకు తలకు దెబ్బ తగిలినప్పుడు ముందు ప్లాశ్టర్ + ఆకారంలో వేసినా, తరువాత సినిమా అంతా అది నిలువు నామంరూపంలో చూపించాడు.
6. ఇక పుణ్య కోటి ఎంట్రన్సె, ఆసిన్ పై అత్యాచార యత్నం జరుగుతున్నప్పుడు "నారాయణా" అని అరుస్తుంది. అప్పుడు దళిత నాయకుడు విన్సెంట్ పుణ్య కోటి వస్తాడు.
7. పుణ్యకోటి అంటాడు "12వ శతాబ్దపు చోళ మండపానికీ గౌరవమూ లేదు, ఆ ప్రక్కనున్న శ్మశాన వాటికకూ విలువ లేదు", అన్న డైలాగ్ నాకు ఎందుకో బా నచ్చింది.
8.బామ్మ పుణ్యకోటిని తన గుండెలకు హత్తుకుని వీడేరా నా కొడుకు దశావతారం అని ఏడ్చిన సీన్ కు నా కళ్ళూ కొంచం తడిశాయ్.
9.నాకు ఈ సినిమా నచ్చటానికి మరో కారణం, శౄంగార, వైలెన్స్ పాళ్ళూ తక్కువుగా ఉండటం.
10. ఒకే కధలో పది క్యారెక్టర్ల నూ కూర్చి కధ రాసి, స్చ్క్రీన్ ప్లే కూడా చూసుకుంటూ, పది క్యరెక్టర్లకు చేసి కమల్ న్యాయం చేశాడనే అనిపించింది.
నేను కొన్న సినిమ టికెట్ కు నిజం గానే హాపీ ఫీల్ అయ్య.
బాగా రాసారు అస్విన్.నరుడే నారాయణుడు అని పుణ్యకోటి పాత్ర చాలా బాగుంది ఒక్క మేకప్ తప్ప.పిచ్చి పట్టిన బామ్మ పుణ్యకోటిని నా కొడుకు అనడం గుండెలకు హత్తుకుంటుంది.
ReplyDeleteనేను ఇంతవరకు సినిమా చూడలేదు మీ సమీక్ష చూసిన తర్వాత చూడాలని అనిపిస్తోంది.
ReplyDeleteనేను తమిళంలో సినిమా చూడడంతో నాకు 12వ శతబ్దానికి ప్రస్తుతానికి సంభంధం అర్ధం కాలేదు.
ReplyDeleteమీరు రాసిన రివ్యూ బాగుంది.
ఈ సినిమా చూసాక, సీతాకోకచిలుక ఎఫక్టు అనే విషయం తెలిసింది. మీరు దాని గురించి కూడా రాసుంటే బాగుండేది.
ఇక, నా అభిప్రాయం...
దర్శకత్వ విభాగం పూర్తిగా విఫలమయ్యింది. ముఖ్యంగా సీతాకోక చిలుక ఎఫక్టుని వివరించడంలో ( ఒక సైన్స్ లాబ్ నుంచి మందుని ఎత్తుకు రావడమంటే సామాన్యమైన విషయం కాదు, అలాగే ఒక వ్యక్తిని జల సమాధి చేయడమైనా. కేవలం ఆసిన్ కమల్ తో రావడమే ఆ ఎఫక్టుని సూచిస్తున్నా కధలో ఆమె పాత్రకు పెద్ద అవసరం లేదు.)
పది పాత్రలు ఉన్నా, కొన్ని పాత్రలు అనవసరమైనవే
(జార్జ్ బుష్షు, కరీమ్ , బామ్మ చివర్లో సెంటిమెంటు కోసమే పెట్టినట్టుంది)
మాటలు బాగా రాసాడు కమల్ హాసన్ (తమిళ సినిమాకి)
రెండవ అర్ధ భాగం నిడివి ఎక్కువయ్యింది.
ప్రధమ అర్ధ భాగంలో అమెరికాలో ఉన్న కమల్ FBI కి ఫోన్ చెయ్యమంటాడు. 911 కి ఫోన్ చేస్తే సరిపోయేదానికి. (Home Alone Part 3 లో ఒక చిన్నపిల్లాడు 911 కి ఫోన్ చేసి FBI కి తెలియబరుస్తాడు). ఆస్కార్ కోసం తీసేడప్పుడు ఇలాంటి విషయాలపై బుర్ర పెట్టాలి.
ఇంకా, సింహం తల ఆసిన్ కాళ్ళకు తగలడం, చివరలో విష్ణు విగ్రహం సునామీకి కొట్టుకు రావడం కొంచెం చవకబారు యత్నాలే.
ఏమయినా ఎన్ని లోపాలున్నా, నాకు కూడా నచ్చింది.
బాగా రాసారండీ అశ్విన్ గారు. ఈ సినిమా నాకు తప్ప ఎవరికీ నచ్చలేదు అనుకున్నా.. మీరున్నారని ఇప్పుడే తెలిసింది. :-)
ReplyDeleteఅర్ధం చేసుకుంటే ఈ సినిమాలో బోలెడు ఆనందం ఉంది.
మీకెవరికీ తెలియని రహస్యమొకటుంది. నిజానికి కమల్ ఈ సినిమాలో పద్దెనిమిది వేషాలేశాడు. ఆ రకంగా ఇది 'అష్టాదశావతారం'. మేకప్పు ఛండాలంగా ఉనడటం వల్ల పది పాత్రలని మీరు గుర్తు పట్టేశారు. మిగతా ఎనిమిదింటికీ మేకప్పదిరిపోయింది - ఎవరూ గుర్తు పట్టలేదు. అవేంటంటే:
ReplyDelete1. మల్లికా షెరావత్
2. సంతాన భారతి
3. కె. ఆర్. విజయ
4. నగేష్
5. నెపోలియన్
6. అసిన్
7. జయప్రద
8. పెరుమాళ్లు విగ్రహం
అయ్యో అబ్రకదబ్ర గారు మీకు నచ్చలేదా ఏమిటి సినిమా ???
ReplyDeleteనాకు ఈ సినిమాలో కమల్ ఓ 10 వేషాలేసినందుకు నచ్చలేదండీ... నాకు కధ బా నచ్చింది, అదీ కమలే రాశాడంటే ఆశ్చర్యం వేసింది, అందుకే నేను సినిమా కధ అందులో నాకు నచ్చిన విషయాల గురించి రాశాను, ఈ మధ్యన వచ్చిన తెలుగు సినిమాలన్నింటిలో ఈ సినిమా వెయ్యిరెట్లు నయమని నా ఉద్దేశం... ఏది ఏమైనా మీరు రాసిన వేషాలలో పెరుమాళ్ళ విగ్రహం రోల్ నవ్వు తెప్పించింది. పేరుకు తగ్గటు మీరు మహ చమత్కారులు.
నాకు నచ్చలేదని ఎందుకనుకున్నారు? కమల్ సినిమాలు చెత్తగా ఉన్నా నచ్చుతాయి నాకు. దశావతారం ఐతే విపరీతంగా నచ్చింది (నిజంగానే బాగుంది). ఐతే, నచ్చుడు నచ్చుడే - జోకు జోకే. దేన్దోవ దాన్దే :-)
ReplyDeletek
ReplyDelete