నూరుగు కౌరవులు వారి పేర్లు
1.ధుర్యోధనుడు
2. దుశ్శాసనుడు
3. దుర్దర్షుడు
4. దుర్ముఖుడు
5. జలసంధుడు
6. సహుడు
7. సముడు
8. విందుడు
9. అనువిందుడు
10. దుర్భహుడు
12. దుష్ట్రదర్పణుడు
13. ధర్మదుడు
14. చిత్రయోధి
15. దుష్కర్ణుడు
16. కర్ణుడు ( ఈ కర్ణుడూ వేరు )
17. వివింశతి
18. వికర్ణుడు
19. జయసంధి
20. సులోచనుడూ
21. చిత్రుడు
22. ఉపచిత్రుడు
23. చిత్రాక్షుడు
24. చారువుత్రూడు
25. శతాననుడు
26. దుర్మర్షణుడు
27. దుర్దర్షణుడు
28. వివిర్సుడు
29. కటుడు
30. శముడు
31. ఊర్ణనాభుడు
32. సునాధుడు
33. నందకుడు
34. ఉపనందకుడు
35. సేనాపతి
36. నుషేణుడు
37. కుండో
38. మహోధరుడు
39. చిత్రద్వజుడు
40. చిత్రరధుడు
41. చిత్రభానుడు
42. అమిత్రజిత్
43. చిత్రభాణుడు
44. చిత్రవర్ముడు
45. సువర్ముడు
46. దుర్వియోచనుడు
47. చిత్రసేనుడు
48. విక్రాంతకుడు
49. సుచిత్రుడు
50. చిత్రవర్మబృత్
51. అపరాజుతిడు
52. పండితుడు
53. శాలాక్షుడు
54. దురావరాజితుడు
55. జయంతుడు
56. జయత్సేనుడు
57. దుర్జయుడు
58. ధృడహస్తుడు
59. సుహాస్తుడు
60. వాతవేగుడు
61. సువర్చనుడు
62. ఆదిత్య్డు
63. కేతువు
64. బహ్వంశి
65. నాగదంతుడు
66. ఉగ్రశాయి
67. కవచి
68. నషంగి
69. చాపి
70. దండదారుడు
71. ధనుర్గహుడు
72. ఉగ్రుడు
73. భీముడు
74. రధభీముడు
75. భీమభాహుడు
76. ఆలోపుడు
77. భీమకర్ముడు
78. సుబాహుడు
79. భీమవిక్రాంతుడు
80. అభయుడు
81. రౌద్రకర్ముడు
82. దృఢరధుడు
83. అనానృదృడు
84. కుండభేది
85. విరావి
86. దీర్ఘలోచనుడు
87. దీర్ఘద్వజుడు
88. దీర్ఘభుజుడు
89. అదీర్ఘుడు
90. దీర్ఘుడు
91. దీర్ఘబాహుడు
92. మహాబాహుడు
93. వ్యూడోరుడు
94. కనకధ్వజుడు
95. మహాకుండుడు
96. కుండుడు
97. కుండుజుడు
98. చిత్రజాసనుడు
99. చిత్రకుడు
100. కవి
101. దుస్సల అను చివరి కూతురు
నాకు వీరి పేర్లు టైపు చేసేటప్పుడు ఓ సందేహం వచ్చింది
అన్నదమ్ములందరూ ఆడుకునే టప్పుడొ మరెప్పుడో ఒకర్నొకరు పిలుచుకోవాలంటే గుర్తు పెట్టుకోలేక ఎంతిబ్బంది పడుంటారో, అయినా ఆ వంద మందికి ఆ పేర్లాలోచించి, పేర్లు పెట్టి,, వాళ్ళ ను ఆ పేరుతోనే గుర్తుపెట్టుకోవటం అంత మామూలు విషయం కాదు
మీరు భలే వారే !!! గుర్తు పెట్టుకోవటమా, పాడా ... ఇప్పుడు మనం చూస్తున్న క్రికెట్, NBA, NFL, Baseball ల్లో చొక్కాల మీద పేర్లు, అంకెలు మరి ఎక్కడ నుంచి వచ్చినియ్యి అంటారు .. సింపుల్ గా, ఒరేయ్ 36, ఏరా 93 అంటమే ... మన రాష్ట్ర/దేశ రాజకీయాలలోని కండువాలు, చొక్కాలు, టోపీలే, జట్లు గా వారు ఎలా ఆడుకునేవారో అనేదానికి సమాధానం ... అలాగే హర్భజన్ vs శ్రీశాంత్ గొడవ చూసిన తరువాత IPL కూడా ఒక మంచి ఉదాహరణే ...
ReplyDeleteఅన్నిటికన్నా మనం ఆలోచించవలసింది, పాపం దుస్సల గురించి .. ఇంత మందికి వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, బఠాణీలు, శనగపప్పు-బెల్లం అందిచటం మొదలగునవి
వారి భార్య పిల్లల పేర్లుకూడా సంపాదించారా ఏమి...??
ReplyDeleteఅయినా మీకు ఈ నామధేయాలు అన్ని ఎక్కడ దొరికాయండి బాబు.... నెనర్లు
చంద్రమౌళీ గారు మళ్ళీ ఇదోఆలోచన ఆ బుర్రలోకి ఎక్కించారు, నాకు తెలిసి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు, పిల్లల గురించి మన భారతంలో ఎక్కడా చెప్పినట్టు లేరు, అయినా ఓ సారి కనుకుంటాను
ReplyDeleteనాకు భలే నవ్వోచిందంది మీరు చెప్పిన పద్దతి వింటే..@తెలుగువాడిని
ఆ నూరు మందికి పెళ్ళయుంటే దుస్సల కు ఆడ పడుచు లాంచనాల కింద ఎన్ని ఏనుగులు, గుర్రాలు, ఓంటెలు, రథాలు, వజ్రాలు వచ్చుండేటివో...
ReplyDeleteఉప్చ్... పెళ్ళికాక పోయుంటే చాలా బ్యాడ్.
-- విహారి
ఈ వంద పేర్లు బట్టీ పట్టి, అప్పచెబితే (ఏ క్రమంలో ఐనా) ఏదైనా బహుమతి ఉంటే చెప్పండ.ి :)
ReplyDeleteదాచుకోవాల్సిందే! ఏ గడి నుడిలోనో ఎనభై మూడో కౌరవుడి పేరు 16 నిలువులోనో, 32 అడ్డంలోనో ఇస్తే..చూసి రాసుకోవచ్చు.
ReplyDeleteతెలుగు పౌరాణిక సినిమాల్లో ఒకే ఒక్క సినిమాలో దుశ్శల పాత్ర కనిపిస్తుంది. బాల భారతం అనే సినిమాలో దుశ్శలగా అప్పటి బాల నటి శ్రీదేవి నటించింది. ' అన్నియ్యా అన్నియ్యా ' అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ బలే ఉంటుంది.
ఆ దుస్సలభర్త సైందవుడు అభిమన్యుడి చావుకు కారణమయ్యాడు. అందుకే శ్రీకృష్ణుడి కపటోపాయముతో అర్జునుడు అతడిని సూర్యాస్తమయంలోగా చంపేసాడు.
ReplyDeleteజ్యోతిగారు... నన్ను చాలా రోజులనుంచి వేదిస్తున్నా ప్రశ్నకు అనుకోకుండా భలే చెప్పారు సమాధానం...
ReplyDeleteఅస్సలు...ఈ సైంధవుడికి భారతంలో సడెన్ గా అంత స్తానం ఎలా వచ్చిందా అనుకునే వాడిని(ప్రతివాడికి ఎక్కడోక్కడ లింక్ ఉంటుంది అని).... దుస్స్లల భర్త అని నాకు ఇప్పటి వరకు తెలీదు... నెనర్లు....
నాకు మాత్రం ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అసలు భారతం అంతా highly dramatic, most interllectual concepts of using persons in situatuations అని
ReplyDelete( చా పదాలు బావున్నాయని వాడేశా )
వామ్మో....చాలా కష్టపడి రాసినట్టున్నారు.తెలుగువాడిని గారి కామెంటు అదుర్స్.ఈ పేర్లు చదువుతూ వుంటే వాళ్ల లక్షణాలను బట్టి కొంత మందికి ఆ పేర్లు పెట్టినట్టు అనిపించింది.
ReplyDeleteనూటొక్కరని చదవటమే గానీ ఏనాడూ ఈ పేర్లు చూడలేదు. బాగా శ్రమ పడ్డారు. మంచి రెఫరెన్సు.
ReplyDeleteవిహారి చూపే చూపు. :)
ReplyDeleteఉపయోగపడే సమాచారం.మీ సేకరణకి, ఓపికగా టైపు చేసి అందరికి తెలియ చేసినందుకు అభినందనలు...వాసు.బి
ReplyDeleteఈ నూరుగురు కాకుండా ధృతరాష్ట్రుడికి ఇంకో కొడుకు ఉన్నాడు. మహాభారత యుద్ధం తర్వాత మిగిలిన కౌరవుడు అతనొక్కడే. అతను ఒక దాసికో, వేశ్యకో పుట్టాడని అంటారు. విదురుడిలా మంచివాడు.
ReplyDeleteఅతనే యుయుత్సుడు. యుద్ధం మొదలయ్యే ముందు ఎవరైనా ఇటునుంచి అటుగానీ, అటునుంచి ఇటుగానీ జట్టు మారదల్చుకుంటే నిరభ్యంతరంగా మారండి అని ఒక అనౌన్సుమెంటు ఇస్తారు. అప్పుడు, ఆఖరి క్షణంలో యుయుత్సుడు పాండవుల పక్షంలోకి వస్తాడు.
ReplyDeleteఈ నూరుగుర్నీ భీముడే చంపాడు. వీళ్ళందరిలోనూ వికర్ణుడు ఒక్కడు మాత్రం ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు నోరు తెరిచి జరుగుతున్నది తప్పు అని చెప్తాడు.
bagundandi mee post & andari commens. manm class lo andarinee ela gurtuncukuntaamo alaage vallu:)
ReplyDeleteనెనర్లు. ఎక్కడ నుంచి సంపాదించారో కానీ పేర్లు బావున్నాయి.
ReplyDeleteఒక్క అనుమానం. వీళ్ళ పేర్లు కొంతమందివి "దు" సొంతమందివి "సు" తో మొదలవుతున్నాయేంటి?
అంటే దుర్యొధనుడి పేరు అస్సలు సుయోధనుడు కదా?
పోయిపొయి ఎవరైనా చెడు అర్ధం వచ్చే పేర్లు పెడతారా అని.
"పండితుడు" , "కవి" ఇవి కౌరవుల పేర్లు అని తెలిస్తే ఎవ్వరూ అవి బిరుదులు కింద వాడేవాళ్ళు కారేమో హీ హీ హీ.. ;)
రవికిరణ్ గారికి వచ్చిన సందేహమే నాకూ వచ్చింది. పాత నాటకాలలో విలన్లకు పాత్రోచితంగా పేర్లు పెట్టే వారు. (భుజంగరావు రావు వంటివి .) మరీ లెక్కన 100 లో దుర్ తో మొదలైనవారు చెడ్డ వారు గాను, సు తో మొదలైన వారు మంచి వారుగా అనుకోవాలా? ఏమైనా ఆధారాలున్నాయా?
ReplyDeleteసుయోధనుడు అనేది ఎన్టీఆర్ గారి కల్పన కాదా?
ఈ సందేహాలకు జవాబిస్తారని ఆశిస్తాను.
బొల్లోజు బాబా
ఈ పేర్లన్నీ వెతికి పట్టుకు రాయడమే పెద్ద సాహసం. దీనికి అభినందనలతో పాటూ నెనర్లు.
ReplyDelete'సుయోధనుడు' అనేది అతని తల్లిదండ్రులు పెట్టిన పేరే - అన్నగారో, కొండవీటి వెంకట కవో పెట్టింది కాదు. మంచి యోధుడు/పరాక్రమశాలి అని దానర్ధం.
ReplyDeleteసైంధవుడి విషయంలో కొద్దిగా గందరగోళం ఉంది. కొన్ని భాషల భారతాల్లో అతడి పేరు జయద్రతుడు అని ఉంటుంది. కొందరేమో రెండూ ఒక వ్యక్తి పేరే అంటారు. మరి కొందరు ఆ ఎపిసోడ్ లో అర్జునుడు కృష్ణుడి సాయంతో వధించింది జయద్రతుడిని (ఇతడే దుస్సల భర్త), సైంధవుడు కురుక్షేత్రానంతరం మరో యుద్ధంలో అర్జునుడి చేతిలోనే అంతమయ్యాడు అని చెబుతాయి.
జయద్రధుడు , సైందవుడు ఒకే వ్యక్తి పేర్లు. పద్మవ్యూహంలో అభిమన్యున్ని అందరు చుట్టుముట్టి ఉండగా,,, మిగతా పాండవుల్ని లోపలికి వెళ్ళకుండా ఈ సైంధవుడు అడ్డుకున్నాడు. అందుకే పెద్దలు అంటారు వీడొకడు సైందవుడిలా అడ్దుపడ్డాడు. అని. తర్వాతి రోజు అర్జునుడు ఈ విషయం తెలిసి అర్జునుడు శ్రీకృష్ణుడి మాయోపాయముతో చంపేసాడు.
ReplyDeleteఇంత మంచి స్పందన ఇచ్చి నందుకు అందైకీ పేరు పేరు నా ధన్యవాదాలు. నాక్కూడా అదే సందేహం వచ్చింది. కౌరవులలోని వార్ల పేర్లు చూస్తుంటే అవేవో చెడు/తప్పు అర్ధం వచ్చేటట్టు అనిపిస్తున్నయి, నేను కూడా మరెక్కడన్నా విషయం తెలుసుని చెపుతాను, మీరు కనుక ఈ విషయము పై ఏమన్నా వివరాలు తెలిస్తే ఇచ్చట వ్రాయగలరని మనవి
ReplyDeleteధన్యావదములు
బూదరాజు అశ్విన్
సంవత్సరానికి ఒకరి చొప్పున పుట్టారు అనుకుంటే ఆది తప్పేమో కానీ.. ట్విన్స్ ట్రిప్‌లెట్స్ అయ్‌నా కానీ 40 నుంచి 50 సంవత్సరాలు కనడానికే టైమ్ పట్టింది అనుకుంట... నేయా ఈ డౌట్ ని క్లియర్ చేయ గలరు !!
ReplyDeletevallantha...matti kundalo puttaru kada...!!
ReplyDelete40 years ela paduthundi?
Please clarify..?