Thursday, September 27, 2007

నేను - జమజచ్చ - షైలా భాను

నాకు ప్రేమన్నా పాకిస్ధాన్ అన్నా ఒకేల వినపడుతుంది. అమ్మయిలన్నా ఈటీవి లో అన్వేషితా సీరియల్ అన్నా చిన్నపటినుండి చచ్చేంత భయం. అందుకనే నేమొ నన్ను బడిలో అందరూ భజగోవిందం అని పిలిచేవారు. అశ్విన్ అనగానే అడ్డబొట్టు, పారగాన్ చెప్పులు గుర్తుకోస్తాయి అమ్మాయిలందరికీ. నేను ఎప్పటికప్పుడు మారుదామన్నా మా బామ్మ ఒప్పుకునేది కాదు. పైగా చెవిలొ పూవ్వు పెట్టుకునే అబ్బాయిలంటే అమ్మయిలకు చాల ఇష్టం రా వెధవాయ్ అని నాకు ఖాళీ ఉన్న చెవిలో కూడా పువ్వు పెట్టేది.
ఇలా నా జీవితంలో ఇంటర్ దాక గడిచించింది, తర్వాత బామ్మ గతించింది.

అమ్మాయిలు ఆలఖైదా నా జీవితం లో లేకపోవటం తో 10వ తరగతి, ఇంటర్ లో 90 శాతం తో ఇంజినీరింగ్ లో అడుగుపెట్టా...ఇలా ఉంటె గుర్తింపు ఉండదని వేషం, భాషా, తీరు అంతా మార్చేసా
చెవిలో పువ్వు తీసి జేబులో పర్సు పెట్టా. నాకు అప్పుడే తెలిసింది లైనేయటానికి స్కేలు, పెన్సిలే వాడనవ్సరం లేదని. లైనేయటమ్, సైటు కొట్టటం తెలియకు అమ్మయిల ముందు సర్కస్ ఫీట్లు చేసేవాడిని, నేను వాళ్ళకు లైనేస్తున్ననని తెలిస్తే పాపం వచ్చి మాట్లాడేవాళ్ళే కాని, పాపం వాళ్ళకు అర్థం కవొద్దూ...

'సీనియర్' అని బిరుదు రాగానే సెల్ కొన్నా, అందరూ నా దానినుండె ఫోను చేసేవారు కానీ యెవరూ నాకు చేసేవారు కారు.

అది వర్షాకాలం. రాష్ట్రమంతా వర్షాలు బాగా పడుతున్నాయి. టివి9 లొ కృష్ణా నది పొంగిపొర్లుతుందని మొదటి ప్రమాద హెచ్చరిక ఇవ్వగానే నా ఫోను మొగింది.కొన్న మూడు నెలలకు నా ఫోను మొగటం అదే మొదటి సారి.
ఫొనెత్తా...

"నా పేరు షైలాభాను నేను మీ జునియర్, మీరంటే నాకిష్టం మీకు నేనంటే మీకిష్ట మైతే రేపు 5 గంటలకు కృష్ణ లో కి రండి " అని టకటకా మంట్లాడే సి టపామని ఫోను పెట్టేసింది.బహుశ కృష్ణ నది మీద ఉన్న బ్యారేజ్ మీదకు అయ్యుంటుందని అనుకున్నా. దాహం తో ఉన్న దరిద్రునికి సానియా మీర్జ sprite ఇచ్చినట్లు, నాకు ఫోను వచ్చింది. అంతలోపే ఒక వేళ రాంగ్ నెంబెర్ ఏమొ అని అనుమానం వచ్చింది.సరే ఓ రాయేద్దమని మరుసటి రోజు ప్రకాసమ్ బ్యరేజ్ మీదకు వెళ్ళా, ఆవేశపడి 2 గంటలముందే చేరుకున్నా, మూడూ గంటల తర్వాత బుర్ఖా లొ ఉన్న ఎవరో
"అశ్విన్ " అని పిలిచారు.
"ఎవరు ?"
"నేను షైలా భాను"
ఆ పేరు వినగానే గుండెల్లో బొంబాయి సినిమాలోA.R. Rehman బీటే
రాంగ్ నంబర్ కాదని తేలిపోయింది.
కొంచం సేపు నిశబ్దం తరువాత...
"నేనంటే నీకిష్టమేనా " అడిగింది.
నా కధ కదుల్తుంది కదా అనుకుం టే పరిగెడుటొంది.
అయినా ఇప్పటికప్పుదు కష్టం అనుకుని, ఓ వారం రోజులు అలోచించి చెపుదామనుకున్నా మళ్ళీ తన మనసు మారిపోతుందని నేనే ఇంటికెళ్ళి ఫోను చేసిచెపుతా అన్నా
"నువ్వు ఒప్పుకుంటావని ఆశిస్తున్నా, నీకోసమ్ నేను చావటానికైనా సిద్దం గా ఉన్నా..." అంది
ఈ అఖండ భూప్రపంచం లొ నా కోసం చనిపోయేవాళ్ళుంటే ఇంకేం కావాలి ? అని ఆలోచించి, ఫోనుచేసి సరే అన్నా.

88888888888

తనది మంగళగిరి, నాది విజయవాడ,
"నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని... " అని పాటలు పాడుకుంటూ ప్రతి రోజు అక్కడ కలిసేవాళ్ళం.
ఓ సారి షైలాభాను మన కులాలు, మతాలు వేరే కదా మీ ఇంట్లొ ఒప్పుకుంటారా అని అడిగితే
వెంటనే దాన వీర సూర కర్ణ లో ఎన్.టి.యోరు గుర్తుకొచ్చారు .
"ఏ మంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతునికి ....."
అన్నా లెవెల్ లొ ఓ డైలాగ్ చెప్పా. అంతా సర్దుబాటైంది.పకపకా నవ్వేసింది. ఇంకేం కావలి చెప్పండి.

సరే అంతా బానే ఉంది, రెడ్ లైట్ కి గ్రీన్ లైట్ మధ్యలో యెల్లో లైట్ లా నాకు షైలా భాను కి మధ్యలో ఈ జమజచ్చ ఏంటి అనుకుంటున్నారా???
ఓ సారి నేను భాను కులమతాలకతీతంగా అందరిని ఎదిరించి ఆదర్శవివాహం చెసుకుని రాష్ట్రపతి నుండీ అవార్డు వచ్చినట్లు కల వచ్చింది.
వెంటనే ప్రకాశం బ్యారేజి మీదున్న భుర్ఖా భామతో ఇస్టమ్ వచ్చినట్లు మాట్లాడేశా, తరువాత తెలిసింది ఆ భామ నా భాను కాదని . ఇలా అయితే తిప్పలు తప్పవని మా ఇద్దరి మధ్య కోడ్ “జమజచ్చాను” కేంద్రం ఆమొదంతో ప్రేవేశపెట్టడం జరిగింది .
ఇలా మా జీవితమ్ మూడు సినిమాలు, ఆరు రెస్టారెంట్లు గా గదిచిపోతుంది. Central లో power మారినా, thumps up add కి మహేష్ బాబు వచ్చినా, Hutch Vodafone గా మారినా, కరుణానిధి రాముడు లేడన్నా, India 20-20 గెలిచినా, నేను బ్లాగు రాసినా రాయకపోయినా మా ప్రేమ మీద ఏ ప్రభావము చూపించలేదు.

ఇలా ఓ సంవత్సరం గడిచింది. విజయవాడ లొ ఎండలు మండిపోతున్నాయ్.2-2 పరిక్షలకు ఈ సారి ఎంత బా చదివుంటానో నేను ప్రత్యేకించి చెప్పనవసరమ్ లేదు మీకు. ఏమ్ చేయాలో అర్థం కాలేదు. బాధలో ఉన్న అర్జునుడు కృష్ణుడి ని ఆశ్రయించినట్లు నేను మా శ్రీరామ్ ని ఆశ్రయించా. వాడు

"పార్దా, పరిక్ష హాలులో కనుపడే మూడు పాపర్లు Question paper, Hall Ticket, Answer sheet అయితే కనిపించని ఆ నాల్గవ పాపరేరా స్లిప్పు, స్లిప్పు , స్లిప్పు , అని గీతోపదేశం చేశాడు. అలా నేను పరిక్షలతో యుద్ధం చేసి, ఓ రెండు Subjects తరవాత రాద్దామని అట్టేపేట్టా కూడ.


పరిక్షలు అయిపోవటం తో ఎప్పటిలాగే 2గంటలు ముందే మేము కలుసుకునే ప్రకాశం బ్యారేజ్ మీదకు వెళ్ళా కాని అప్పటికే నా కోసం వేచిచూస్తున్న భుర్ఖా లోని భాను ని చూసి ఆశ్చర్యం వేసింది.మళ్ళీ అనుమానం వచ్చి మా కోడ్ ఇచ్చా, యాక్టివేట్ అయ్యింది, హమ్మయ్యా షైలా భానునే ...

నన్ను చూడగానే తన బ్యాగ్ లొనుండి ఓ కార్డ్ తీసి నా చేతిలో పెట్టింది .సూర్యుని కిరణాలు నీటిపై పడి తన ముందున్న తెరలొనుండితన కళ్ళపై పడటం తో తన కళ్ళలోని నీరు నాకు స్పష్టంగా కనపడింది.
ఇక ఏం మాట్లాడకుండా ఆటొ ఎక్కి వెళ్ళిపోయింది తను. ఎన్నో సినిమాలు చూసిన మీకు ప్రత్యేకించి అది తన పెళ్ళి కార్డ్ అని చెప్పనవసరం లేదు.

"కళ్ళలోన కలలు అన్నీ కధలుగానే మిగిలినే...
కనులు దాటి రాను అంటూ కరిగిపొయెలే....."

ఓ సారి గడిచిపోయిన జీవితాన్ని చూసి చాల బాధ వేసింది. మతాలు వేరైనా మా ఇద్దరి మనస్తత్వాలు చాల దగ్గరైనాయి.జమజచ్చ అన్న పదం విన్నగానే నాకు ఇప్పటికి తనే గుర్తోస్తుంది.

**********

6 నెలల తర్వాత

వర్షాకాలం. రాష్ట్రమంతా వర్షాలు బాగా పడుతున్నాయి. టివి9 లొ కృష్ణా నది పొంగిపొర్లుతుందని మొదటి ప్రమాద హెచ్చరిక ఇవ్వగానే నా ఫోను మళ్ళీ మొగింది…

41 comments :

 1. జభజజజగోజవింజదం గారు,

  -అమ్మాయిలు ఆలఖైదా
  - దాహం తో ఉన్న దరిద్రునికి సానియా మీర్జ sprite ఇచ్చినట్లు
  -నాల్గవ పాపరేరా స్లిప్పు
  చాలా బాగున్నాయ్ :)

  అన్న గారి ముఖచిత్రం అదుర్స్....:)

  -నేనుసైతం

  ReplyDelete
 2. మీ రచనా శైలి చాలా బాగుంది.

  ReplyDelete
 3. బాగా వ్రాసినారు.

  ReplyDelete
 4. అందరూ నా దానినుండె ఫోను చేసేవారు కానీ యెవరూ నాకు చేసేవారు కారు...నవ్వులే నవ్వులు! మరో రెండు రెళ్లా?

  ReplyDelete
 5. చాలా బాగా రాసారు. చదువుతుంటే నవ్వొస్తున్నా ఎక్కడో కొంచం బాధా కూడా . మాకు బాధపెట్టటమే కాదు బాధపడటం కూడా తెలుసండొయ్.

  ReplyDelete
 6. రెండు రెళ్ళు ఎనిమిది!!

  well done.

  ReplyDelete
 7. మీరు చాలా బాగా రాసారండి , మీ ఫాను అయ్యనండి నేను , నా కడుపు పగిలి పోయిందండి నవ్వలక మీ లొ మంచి రచనా సంపద ఉంధి ,keep it up

  ReplyDelete
 8. అంత భాదని ఇంత కామెడీగా ఎలా చెప్పగలిగారండి బాబూ!! అవును మీరు సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజినా? నేను ఆ కాలేజీనే. మీది ఏ బ్యాచ్..

  ReplyDelete
 9. ఆ తర్వాత మీ ఏరియాలోకి ఐశ్వర్యవొచ్చుండాలే!!? :-))
  బ్రహ్మాండం! మీరు రెండుగంటల ముందే వెళ్తే ఆమె మూడుగంటల తరువాత కలవడం చాలా నవ్వు తెప్పించింది. ఇందులో చాలా చమక్కులున్నాయ్. ఇది నిజమైనా కథైపోయినా మంచి హాస్య రచన. మీకు అభినందనలు.

  ReplyDelete
 10. suuuper andi,well done

  ReplyDelete
 11. orey rikshaw songs ikkada vinandi.

  http://www.dishant.com/album/Orey-Rikshaw.html

  ReplyDelete
 12. వీడు సామాన్యుడు కాడు. అశ్విన్! చేసి చూపించావ్! ఈ రోజుల్లో చెత్త వ్యాసాలు, కడుపులో దేవినట్టుండే కామెడీని రాసేవాళ్లకి మంచి స్ట్రోక్ ఇచ్చావ్. చిలకమర్తి, గురజాడ రచనలు చదివితే ఎంత ఆహ్లాదంగా అనిపించిందో ( లేక కొత్తగా చెప్పాలంటే, రాజేంద్రప్రసాద్ సినిమాలా, విజయభాస్కర్ కామెడీలా )చాలా రోజులతరువాత హాయిగా పూర్తిగా చదివిన రచన మీది. May be I become a regular visitor of ur site , do update regularly.

  ReplyDelete
 13. మీ రచనా శైలి ఆహ్లాదంగా చాలా బాగుంది.

  ReplyDelete
 14. nee rachana ki mechinamu ilage munduku naduvu ee software kalamlo teluguhasya toranamtho kaliugamlo from u find me

  ReplyDelete
 15. చాలా కామెడీ గా వుంది.అదేమిటో బ్లాగరునయ్యాకా ఒకరి విషాదాన్ని చూసి నవ్వడం అలవాటయిపోయింది.అయినా మీకు రేడియోవాళ్ళు సూచన ఇచ్చాకా కూడా అలా ఎలా వెళ్ళారు.ఈ సారి వెళ్ళకండి.

  ReplyDelete
 16. మీరు బాగా రాసారు...మీరు చిన్నవారేకద మరి మంచి శ్రుంగార కధలు రాయండి. నాకు తెలిసి మీరు రయగలరు

  ReplyDelete
 17. మీ టపా చదివి నాకు చాలా బాధ వేసింది.
  ఇది నిజంగా జరగలేదని చెప్పండి, లేక పోతే నాకు రాత్రి నిద్ర పట్టదు.

  ReplyDelete
 18. ఇంతకీ జమజచ్చ అంటే ఏంటి?

  ReplyDelete
 19. రాకేశ్వరము...లేడీస్‌టైలర్‌ సినిమా చూడలేదా...అవమానం అవమానం...

  జమజచ్చ అంటే జ-భాషలో మచ్చ అని అర్థం.
  జ‌అజర్థజమైంజదా?

  ReplyDelete
 20. చాన్నాళ్ళ తర్వాత చూసాను ఈ టపాను..నిజమైనా..కథైనా బాధగా ఉంది.

  ReplyDelete
 21. endhuko ee oju anukokunda ee post chadivanu......chala baga rasaru... hasyam mamidi pandu pandinattu pandindhi

  ReplyDelete
 22. Hilarious!!

  Great start for my weekend!! :-)

  ReplyDelete
 23. chari garu champesaruga producer ni vethukuthanandi manam mathram compulsory allari naresh tho cinema thiddam mee storytho itlu mee rao garu

  ReplyDelete
 24. దాహం తో ఉన్న దరిద్రునికి సానియా మీర్జ sprite ఇచ్చినట్లు, నాకు ఫోను వచ్చింది.- కేక

  ReplyDelete
 25. Superb and really ur a very funny guy. Keep it up.

  ReplyDelete
 26. నాకు ప్రేమన్నా పాకిస్ధాన్ అన్నా ఒకేల వినపడుతుంది. అమ్మయిలన్నా ఈటీవి లో అన్వేషితా సీరియల్ అన్నా చిన్నపటినుండి చచ్చేంత భయం.


  em raasinav mama

  ReplyDelete
 27. చాలా బాగా రాసారు .ఒక్క విషయం చెప్పండి ఇది నిజం స్టొరీ నా?

  ReplyDelete
 28. JAvJAeJArJAy JAfJAuJAnJAnJAy JAsJAtJAoJArJAy.

  ReplyDelete
 29. Hi sir, Will i publish your posts with your name in my blog?

  please reply me : at saicharan095@gmail.com

  ReplyDelete
 30. sir, ee articel nu andhra jyothi sunday book (2.3.14) issue lo prachuristunnaam.
  - sunday incharge

  ReplyDelete
 31. sir, ee articel nu andhra jyothi sunday book (2.3.14) issue lo prachuristunnaam.
  - sunday incharge

  ReplyDelete
 32. sir, ee articel nu andhra jyothi sunday book (2.3.14) issue lo prachuristunnaam.
  - sunday incharge

  ReplyDelete
 33. sir, ee articel nu andhra jyothi sunday book (2.3.14) issue lo prachuristunnaam.
  - sunday incharge

  ReplyDelete
 34. ur awesome.good to see this type of story. very humourous. from now i am ur fan

  ReplyDelete